8, మే 2022, ఆదివారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-9

 

                                                                           ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                             PART-9

షాపుకు రోజూ ఒక మెస్ నుండి భోజనం రావటం తెలుసుకుని "నేను భోజనం వండి తీసుకు వస్తాను పిన్ని" అని రకరకాల వంటలుచేసి పంపించేది.

ఆ రోజు, ఆదివారం, షాపుకు సెలవు రోజు. పిన్నితో మార్కెట్టుకు వెళ్ళిన సమయంలో, తాను హైదరాబాద్ తిరిగి వెల్తున్నట్టు చెప్పింది లత.

కొన్ని క్షణాలు ఆమెను లోతుగా చూసిన గౌరి నన్నూ ఇక్కడ అనాధగా వదిలిపెట్టి, నువ్వూ అక్కడ ఎవరూ లేకుండా ఏం సాధిస్తావు?" అని అడిగింది.

లేదు పిన్నీ. అప్పుడప్పుడు సెలవు రోజుల్లో వచ్చి చూసి వెడతాను"

"అప్పుడప్పుడు వచ్చి వెల్తావా? ఈ ఆస్తి, నేను సంపాదిస్తున్న డబ్బు ఇదంతా ఎవరికి? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? నా ఒకే ఒక వారసురాలివి నువ్వే కదా?"

పిన్నిని ఆశ్చర్యంగా చూసింది లత.

నేను ఆస్తి కోసం వచ్చిన దానిని అని ఆ విశాల్ అనుకుంటున్నది పిన్ని నిజం చేస్తోందే!

"లేదు పిన్నీ...నేను ఆస్తికోసం రాలేదు. నాకు మీరు మాత్రం చాలు"

"ఉన్న ఆస్తిని సరిసగం పంచేసి, ఒక భాగం విశాల్ కు, ఒక భాగం నాకూ రాసారు...అందులో పది శాతం దానాలకు ఉపయోగించాలని రాసారు. నువ్వు ఆ రోజు వెళ్లేనని చెప్పావే ఆ చర్చ్ కు ఎదురుగా ఉన్న ప్రయాణీకుల విడిది మనదే. దాన్ని చర్చ్ కు ఇచ్చాశాము. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మన కుటుంబానికి ఉన్న వారసురాలివి నువ్వు ఒక్క దానివే. నాకు నువ్వూ, నీకు నేనూ అని ఉండటాన్ని వదిలి ఎందుకు విడిపోవాలి? నువ్వు ఈ పిన్నిని పూర్తిగా ప్రేమించటం లేదా" అని అడిగింది గౌరి.  

"పిన్నీ...! నా జీవితానికి ఒక అర్ధం వచ్చింది మిమ్మల్ని చూసిన తరువాతే"

మరైతే ఎందుకు నన్ను వదిలి వెళ్ళాలని ఆరాటపడుతున్నావు? నా ప్రశాంతతను తీసుకుని వెళ్ళాలంటే వెళ్ళు"

పిన్ని యొక్క ఆవేదన, తపన లతకు అర్ధంకాక కాదు.

కానీ....ఆ విశాల్.

నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడే.

కానీ, పిన్ని నేను లేకుండా ఉండలేదు!

దగ్గర కూర్చున్న పిన్నిని కౌగలించుకుని "నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్లను" అన్నది లత.

సుమారుగా రెండు వారాల తరువాత ఒక రోజు ఆమె మధ్యాహ్నం భోజనం తీసుకుని షాపుకు వెళ్ళటానికి రెడీ అవుతున్న సమయం...టెలిఫోన్ మోగింది.

అవతల వైపు "మిస్ లత?" అంటూ ఒక గొంతు.

"అవును...మీరు?"

"నేను కిరణ్. గ్రీన్ ఆపిల్ ఎస్టేట్ నుండి"

"ఓ! తాతయ్యా, అమ్మమ్మా ఎలా ఉన్నారు. చర్చ్ లో చూసాను. మోకాళ్ళ నొప్పులని అమ్మమ్మ చెప్పింది"

"అవును...మీ దగ్గర ఒక సహాయం. గౌరి ఆంటీ మొబైల్ కు ట్రై చేశాను. లైను దొరకలేదు"

"చెప్పండి"

"బామ్మకు బాగోలేదు"

"అయ్యో! ఏమైంది?"

ఎక్కువగా భయపడకండి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైనై. డాక్టర్ దగ్గరకు వెళ్ళాలట. కావాలని మొండికేస్తున్నారు. మీరు వస్తే...సహాయంగా ఉంటుంది"

"వెంటనే వస్తాను...ఇంతకీ...మీరెవరో...?"

"ఇప్పుడైనా అడిగారే! ఆవిడ మనవుడ్ని. ఢిల్లీలో..."

"తెలుసు. ప్రసిద్ది చెందిన పైలట్" నవ్వుతూ చెప్పింది.

ఇరవయ్యవ నిమిషంలో అమ్మమ్మ దగ్గర ఉన్నది లత.

"తాతయ్యా, మనవుడు కలిసి ఎక్కువ బిల్డ్ అప్ చేస్తున్నారమ్మా. పాపం నిన్ను కష్ట పెడుతున్నారు చూడు"

"నాకే కష్టమూ లేదు అమ్మమ్మా. పిన్నికి డ్రైవర్ తో భోజనం ఇచ్చి పంపించాను. వివరాలు ఈ పాటికి వెళ్ళుంటాయి. మనం నెమ్మదిగా డాక్టర్ను చూసి వద్దాం" అన్నది లత.

బామ్మను కిరణే చూసుకునే వాడు.

" లతా! మిమ్మల్ని చూసిన తరువాతే బామ్మ బాగా మాట్లాడుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి 'అయ్యో! అమ్మా! నావల్ల కావటం లేదు ఇది తప్ప వేరే మాటే లేదు"

డాక్టర్ ఇచ్చిన మందులను తీసి పెట్టింది లత. టీ కప్పుతో వచ్చి తాతయ్యను చూసి "ఇంకానా మీ మంగమ్మ రాలేదు?" అన్నది.

"అది అదృష్టం చేసుకుంది. మీ అమ్మమ్మ యొక్క సనుగుడు భరించలేక పారిపోయింది. నేనూ యాబై సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నాను. గుమ్మం కూడా దాట లేక పోతున్నానే" అన్నారు శోకంగా.

"ఆయన చెప్పేది నమ్మకమ్మా. కిరణ్ కొత్త చోటు కొన్న వెంటనే, నాతో ఒక వారం రోజులు ఉండి వెళ్ళు తాతయ్యా అని తీసుకు వెళ్ళాడు. ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని నేనూ వెళ్ళమన్నాను " అని చెప్పిన అమ్మమ్మ, తాతయ్యను చూసి వెక్కిరింపుగా నవ్వింది.

"ఏమైంది అమ్మమ్మా? మరునాడే తాతయ్య వచ్చేసారా?" అని లత అడగటంతో...

"మరునాడా? మరుసటి విమానాంలోనే వచ్చేసారమ్మా"

"నిజమే నమ్మా...అమ్మమ్మ లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను" అన్నారు తాతయ్య బొంగురు కఠంతో.

తాతయ్యా, అమ్మమ్మల ప్రేమ చూసి లత కళ్ళల్లో నీళ్ళు పొంగినై.

తన తల్లీ-తండ్రీ ప్రాణాలతో ఉండుంటే వీళ్ళలాగే ఇలాగే పరశ్పర అభిమానాన్ని పంచుకోనుంటారో!

అమ్మ మీద ఎంత ప్రేముంటే తండ్రి మరో పెళ్ళికి నిరాకరించాడు

"ఏమ్మా...మౌనం అయిపోయావు?"

"ఏమీ లేదు అమ్మమ్మా"

వచ్చే పదిహేనో తేదీ తాతయ్య డెబ్బై ఐదవ పుట్టిన రోజు పండుగ. దాన్ని గ్రాండుగా జరపాలని కిరణ్ చెబుతున్నాడు. కుటుంబ శభ్యులందరూ ఒకటిగా కలుసుకోవటానికి ఇది ఒక సంధర్భంగా ఉంటుందని మేము కూడా సరేనని చెప్పాము"

రెండు నెలలకు ముందే కిరణ్ నాన్నకూ, బాబాయికీ, అన్నయ్యా, తమ్ముళ్ళకూ సమాచారం వెళ్ళింది. వచ్చేవారం అందరూ కువైత్ నుండి వచ్చేస్తారు" అన్నది అమ్మమ్మ.

"మీకు ఎంతమంది పిల్లలు అమ్మమ్మా?"

నాకు ముగ్గురు మగ పిల్లలు. వాళ్ళకు ఇద్దరిద్దరు మగ పిల్లలు. వీడు నా రెండో వాడి కొడుకు. మా ఇంట్లో ఆడపిల్లలే లేరమ్మా. ఆ తపన నిన్ను చూడంగానే ఎక్కువ  అయ్యింది. ముగ్గురు కొడుకులూ కువైత్ లో వ్యాపారం చేస్తున్నారు. కోడళ్ళు, ఇప్పుడొచ్చిన మనవళ్ళూ మాతో కలవరు. వీడే మా మీద ప్రాణం పెట్టుకున్నాడు. ఒక్క నెల కూడా మానేయకుండా మమ్మల్ని చూడటానికి వస్తాడు. ఢిల్లీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు తాతయ్య పుట్టిన రోజును గ్రాండుగా జరపటానికి అన్ని పనులూ చూస్తున్నాడు"

వాళ్ళతో కుటుంబ విషయాలు మాట్లాడుతూ సాయంత్రం స్నాక్స్ చేసింది లత.

చీకటి పడటంతో " కిరణ్! పిల్లను తీసుకు వెళ్ళి దింపి రారా" అన్నది బామ్మా. 

"ఏ పిల్లను?" అంటూ అటూ ఇటూ వెతికేడు కిరణ్.

మనవడు అటూ ఇటూ చూడటం చూసి "ఏమిట్రా వెతుకుతున్నావు? కారు కీసేనే? ఇదిగో ఇక్కడుంది" అన్నది బామ్మ.

అది కాదు బామ్మా "ఏదో పిల్ల అని చెప్పావే! ఆ పిల్లనే వెతుకుతున్నా?" అన్నాడు కిరణ్.

ఓవర్ గా ఆక్టింగ్ చేయకురా...చూడలేకపోతున్నా" అన్న తాతయ్య లతను చూసి విందుకు పిలవటానికి రేపు మీ ఇంటికి వస్తామమ్మా"

"సరే తాతయ్యా"

అదే ఉత్సాహంతో కారులో ప్రయాణం చేసిన ఆమె, కిరణ్ ను లోపలకు రమ్మని ఆహ్వానించింది -- చురుకుగా మాట్లాడుతూ ఇంట్లోకి వెళ్ళాడు.

హాలులో కూర్చున్న విశాల్ కు లత కిరణ్ తొ  మాట్లాడిన ఆ మాటలు, ఆ నవ్వు అతనిలోని కోపాన్ని రెచ్చగొట్టింది.

'నన్ను చూసిన వెంటనే పగవాడిని చూసినట్టు ఎగిసిపడింది. లేకపోతే -- ఎవరో ఇతను? అని నన్ను చిన్న చూపు చూస్తుందా? కానీ, తెలియని ఒకతని దగ్గర సంతోషంగా మాట్లాడుతోందే!'

అతని మనసు వేడెక్కింది.

నాగరికతను గుర్తుకు తెచ్చుకుని మాట వరసకి విశాల్ వైపు చూడకుండానే "హాయ్" అంటూ అతన్ని పలకరించింది.

లోపలకు వచ్చిన లత, " కిరణ్! వేడిగా ఒక టీ?" అని అడగంగానే "అయ్యో...నన్ను వదిలేయమ్మా నువ్వు ఇందాక మా ఇంట్లో ఇచ్చిన 'అరిస గొంతులోనే ఉంది. విశాల్! మీరు లత వంట రుచి చూసే ఉంటారే! నిజంగానే మీరు అదృష్టవంతులు" అన్నాడు కిరణ్. 

"నిజమే. నాలిక...రుచికి కట్టుబడి ఉన్నందువలన, 'జిమ్' లో కూడా ఒక గంటసేపు  ఎక్ససైజ్ చేయాల్సి వస్తోంది. అప్పుడు అదృష్టం నాకా? 'జిమ్' మాస్టర్ కా?" అని అడిగి విశాల్ నవ్వగా, కిరణ్ కూడా నవ్వాడు.

విశాల్ మొహం వికసించి వికసించి అతని మొహంలోని సహజ అందం బయట పడింది. అది చూసి ఒక్క క్షణం మైమరిచిపోయింది లత.  కిరణ్ యొక్క వెక్కిరింత, వేళాకోలం ఆమె అమయకత్వానికి తెరవేయడంతో -- విశాల్ తింటున్న ఆహారం గొంతులో ఇరుక్కుని పొలమారింది. అతనికి ఎక్కిళ్ళు వచ్చినై.  

ఇన్ని రోజులు లేని ఒక తేజస్సు లత వదనంలో వ్యాపించి ఉండటాన్ని చూశాడు విశాల్. ఎవరో మరొకరి వలన ఏర్పడిన తేజస్సు అది అని అనుకున్నప్పుడు అతను తట్టుకోలేకపోయాడు. అది కోపంగా మారింది.

ఆ కోపం అతని సొంత బుద్దిని అనగదొక్కి, అతనిలోని కృర గుణాన్ని మెల్లగా పెంచింది. లతను దెబ్బతీయటానికి సమయంకోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సందర్భం -- అప్పుడే...ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే దొరికింది అతనికి.

లతను చూస్తుంటే అతనికి తెలియకుండానే అతనిలో ఒక సంతోష ఊట ఏర్పడుతోంది. ఏ అమ్మాయి దగ్గర లేని ఒక శక్తి ఆమెలో ఉండటం గమనించాడు. కానీ, ఆమె గురించి విన్న విషయాలు రాతి గోడలాగా పైకి లేచి అతని భావల ఊటకు అడ్డుపడుతున్నాయి.

                                                                                                                  Continued...PART-10

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి