16, మే 2022, సోమవారం

ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)....PART-13

 

                                                                          ప్రేమ ఎంత కఠినమో!...(సీరియల్)                                                                                                                                                               PART-13

సాయంత్రం అత్తయ్య, అల్లుడుగా ఇల్లు చేరుకున్న సమయంలో " విశాల్! నీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి" అన్నది గౌరి.

"ఏమిటత్తయ్యా! పిడి బలంగా ఉంది. విషయం చాలా సీరియసా ఏమిటి?"

లత గురించి నువ్వేమనుకుంటున్నావు?"

సడన్ గా ఆమె అలా అడిగేసరికి వెనక్కి తిరిగిన అతను "ఎందుకు సడన్ గా ఇలాంటి ఒక ప్రశ్న ?" అన్నాడు.

"నువ్వు మొదట సమాధానం చెప్పు"

కారును పక్కగా ఆపాడు అతను.

"మనింటి అమ్మాయి గురించి నేనేం చెప్పను?"

"చాలా ధ్యాంక్స్ రా. నీ గుణం నాకు తెలుసు. ఆ గీతా ఎంత ధైర్యంగా చెప్పింది...?"

"ఎవరు? ఆ ప్రొఫసర్ భార్యనా?"

"అవును. ఆస్తి కోసం నువ్వు లతను అసహ్యగించు కుంటావని...అంటూ ఇంకా ఏవేవో చెప్పింది"

"నువ్వు భయపడ్డావ్...అంతేనా!"

ప్రేమ ఎక్కువైనప్పుడు విశాల్ ఆమెను నువ్వూ అని సంభోదిస్తాడు.

"లేదురా"

"నేను పెరిగింది నీ దగ్గర. నాకు ఈ ఆస్తి, డబ్బూ ఏదీ వద్దు. నువ్వు మాత్రం చాలు. అందువల్ల ఎవరేం చెప్పినా మనసును పాడుచేసుకోకు. తెలిసిందా? ఇప్పుడు చెప్పు, ఎందుకు లత గురించి అడిగావు...నా తల మీద కట్టేద్దం అని ఆశగా ఉందా?" సరదాగా, అత్రుతతో అడిగాడు విశాల్.  

"పోరా. నీకూ దాన్ని చూస్తేనే పడదు. లతకూ అంతే. మీ ఇద్దర్నీ చేర్చిపెట్టి ఏమిటి లాభం? నేను చెప్పబోయేది వేరే విషయం" అన్న గౌరి -- చిన్న పిల్ల కుతూహలంతో - "మేజర్ మనవడు వరుణ్ లేడు...అతనికీ, లతకు ఈడుజోడు ఎలా ఉంటుందిఆ రోజు విందులో మనమిద్దరం భోజనం చేస్తున్నప్పుడు కలిసి నిలబడ్డాడు చూడు అతనే. మనసు, కడుపు నిండిపోయింది తెలుసా? ఇంకా ఒక నెల వాడు మేజర్ ఇంట్లోనే ఉంటాడు. సంబంధం ఎస్ అనుకుంటే వెంటనే పెళ్ళిపెట్టుకోవాలని ఆంటీ చెబుతోంది. లత కూడా వాళ్ళతో బాగా కలిసిపోతోంది. ఇద్దరికీ నచ్చాలి. నువ్వేమంటావ్?" అన్నది.  

విశాల్ హృదయం బలంగా ఊగిపోగా "ఇప్పుడు ఏమిటి అవసరం? ఇంకో రెండు సంవత్సరాలు పోనీ" అన్నాడు.

ఇప్పుడే ఇరవై రెండు జరుగుతోంది. దానికి ఒక మంచి జీవితం కుదిర్చిపెడితే మనం ప్రశాంతంగా ఉండొచ్చు"

"చూద్దాం కానీ"

"ఎందుకురా అలా అతికీ అతకనట్టు మాట్లాడుతావు?"

గౌరి యొక్క విపరీత ఆసక్తి అతన్ని నీరస పరిచింది.

"అత్తయ్యా...దానికని ఒక సమయం వస్తుంది. అప్పుడు మంచిగా చేద్దాం"

"ఈ పెళ్ళి జరిగేంత వరకు నువ్వు నా దగ్గరే ఉంటావుగా?"

"మరి? మనింటి పెళ్ళికి నేను లేకుండా ఏట్లా?" అన్నవాడు, అంతకంటే దాని గురించి ఎక్కువ మాట్లాడటం ఇష్టం లేక బండి తీసాడు.

తన ప్రేమ కన్యను ఇంకెవరితోనో జతచేసి చూడటం ఇష్టం లేక మనసు కొట్టుకుంది -- ఆ బాధతోనే ఇళ్ళు జేరేడు.

తోటలోని గడ్డి తివాచి మీద కూర్చుని కిరణ్ తో నవ్వుతూ మాట్లాడుతూ నిలబడింది లత.

కారు దగ్గరకు రావటం చూసిన ఇద్దరూ, కారు దగ్గరకు రాగా, పలకరింపు తరువాత -- గౌరి లోపలకు వెళ్ళింది. టీ రెడీ చేయటానికి వెళ్ళిన లతతో పాటూ కిరణ్ వెళ్ళటం విశాల్ కు కోపం తెప్పించింది.

" లతా! నీ బాయ్ ఫ్రెండ్ కళ్ళు చూశావా? వాటిలో ఎంత ఈర్ష్య సెగ ఉందో. నన్ను అలాగే కాల్చిపారేసేలాగా. దాన్ని బట్టే తెలియటం లేదు...అతని మనసు నిండుగా నువ్వే ఉన్నావని" అన్నాడు కిరణ్.

"అబద్దంగా మాట్లాడకండి. ఆ మనిషికి దయ, జాలి, కరుణ, ప్రేమ, బంధం ఏదీ లేదు. ప్రేమంటే ఏమిటని అడిగే జాతి. అతను మాట్లాడే ఒక్కొక్క మాటా తేలు కుట్టినట్టు ఉంటుంది. ఆయనకు నా మీద ప్రేమ రావటమేమిటి? ఒక వేల అతన్ని ప్రేమించాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది అనుకోండి, నేను ఆత్మహత్య చేసుకుంటాను. ప్రేమ రావటానికి ఒక ముఖం కావాలి?"

లత వేళాకోళంగా, నవ్వుతూ చెప్పగా -----

"అంటే నిజంగానే నీకు అతను నచ్చలేదా?"

"చచ! మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు. అతన్ని తలచుకుంటేనే విరక్తి పుడుతోంది. పేర్లలోనే విశాల్ అనే పేరునే నేను ఈ ప్రపంచంలో ఎక్కువగా చీదరించుకునేది" అన్నది, విసుగ్గా.

అనుకోకుండా అక్కడకొచ్చిన విశాల్ చెవులకు అన్నీ వినపడటంతో -- ఫీలింగ్స్ లోనూ, మనసులోనూ బలమైన దెబ్బ తిన్నాడు.

టీ కప్పుతో వచ్చిన లత, కారులో కూర్చున్న విశాల్ దగ్గర ట్రే ను జాపింది.

చదువుతున్న పత్రికలో నుండి కళ్ళను తిప్పకుండా శ్రద్దగా చదువుతున్న కుర్రాడిలా ఫోజు పెట్టాడు విశాల్. 

"టీ"

"వద్దు"

"రోజూ తాగుతారు కదా!".

వద్దంటే అర్ధం కాలేదా..." కోపంగా అరవడంతో.

'ఎందుకింత కోపం' అనేది అర్ధం కాకా ఒక్క క్షణం ఆశ్చర్యపోయి నిలబడ్డ ఆమె, విశాల్ వెనకాల నిలబడున్న కిరణ్ తో,

చూశావా వాడి నిర్లక్ష్యం' అంటూ నవ్వుతూ కళ్ళతో సైగ చేసింది.

ఏదో స్వారస్యమైన విషయం జరగబోతోందని ఎదురు చూసిన కిరణ్ -- 'ఛ!' అని విసుక్కోని నిలబడ్డడు. అతని నిలబడ్డ  దోరణి చూసి పగలబడి నవ్వబోయిన లత, నవ్వును ఆపుకోవటానికి గబుక్కున నోరు నొక్కు కుంది.

ఆపుకోలేని నవ్వుతో నిలబడున్న లతను ఓరకంటితో చూసిన విశాల్ 'నన్ను చూస్తే నీకు వేళాకోళంగా ఉందా? ఉండు. నాకూ ఒక సమయం వస్తుంది. అప్పుడు నీ పని పడతా' అని మనసులొనే  ఆమెను హెచ్చరించాడు అతను.

అరగంట తరువాత కిరణ్ తిరిగి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఉత్సాహంగా తనలో తానే పాటలు పాడుకుంటూ తోటలోకి అడుగుపెట్టిన లత ముందు విలన్ లాగా వచ్చి నిలబడ్డాడు విశాల్.  

అతన్ని నిర్లక్ష్యంగా చూసి, గబుక్కున వెనక్కు తిరిగిన ఆమెను చూసి "పరవాలేదే. ఊరు వదిలి ఊరు వచ్చినా కూడా నీ వలలో మగ జింకలు ఈజీగా పడుతున్నాయే" అన్నాడు.

అతని గుణమూ, ఈటెలు లాగా గుచ్చుకునే అతని మాటలూ గురించి తెలిసిన లత -- 'ఓ.కే'...అంటూ నవ్వుతూ అతని దగ్గర నుండి జరగటానికి ప్రయత్నించింది.

'నీ మీద ఒకడు రాయి విసిరితే, అతని మీద నువ్వు రోజా పువ్వును విసురు అని చదివింది గుర్తుకు వచ్చింది.

ఆమె యొక్క నిర్లక్ష్య వైకరి అతన్ని కవ్వించింది. ఆమెను అలాగే వదలటానికి అతనికి మనసురాలేదు.

"ఈ కుటుంబానికని ఒక మర్యాద ఉంది" అన్నాడు.

"ఓ"

"నీ వలన అది చెడిపోవటం నేను అనుమతించలేను"

అతను మళ్ళీ ఆమె మీద రాయి వెయ్యగా -- గాయపడ్డ మనసులో ఏర్పడ్డ కోపాన్ని అనుచుకుని, నవ్వు అనే రోజా పువ్వును చూపింది.

మేజర్ కుటుంబానికి నీ పాత జీవితం, అందులో నువ్వు నడిపిన నాటకాలూ తెలిసే ఛాన్స్ లేదు"

మళ్ళీ మళ్ళీ దెబ్బతిన్న నొప్పిని భరించలేని ఆమె హృదయం, కన్నీటి చుక్కలను కళ్ల చివరుకు తోయగా, ఆ కన్నీటిని తుడుచుకుని ----

"ఇప్పుడేమంటారు?" అని అడిగింది.  

"నీలాంటి ఒకత్తి వలన ఈ ఇల్లు, కుటుంబం, దాని గౌరవం దెబ్బతింటున్నాయని నేను అనుకుంటున్నా. నీ ప్రవర్తన మంచి కుటుంబ ఆడవాళ్ళ..."

అతను మాట్లాడుతుంటే నొక్కి పెట్టుకున్న ఓర్పుతో--

"అంటే నేను చెడిపోయిన దానిని అని చెబుతున్నారా?"

"అది నేను వేరుగా చెప్పాలా? మీ ఊర్లో అడిగి చూడు. నీ పేరుకున్న గొప్పతనం తెలుస్తుంది" అన్నాడు.

ఇకపైన ఓర్పుగా ఉండలేకపోయింది. 'మళ్ళీ మళ్ళీ రాయి విసురుతున్న అతని మీద రోజా తొట్టెను విసురు. చావనీ...'-- చదివిన లైన్లు చెవుల్లో గింగుర్లు తిరుగగా, అతని వైపు ధైర్యంగా తిరిగింది.

అతని కళ్ళల్లోకి తధేకంగా చూసింది "బైబుల్ లో ఒక మాట ఉంది తెలుసా?" అని అడిగిన ఆమె, తన ముఖ బావాలలో ఒక మెట్టు దిగిన అతని మనో బావాన్ని అర్ధం చేసుకోకుండా "తన కంటి చూపును అడ్డుకుంటున్న మురికిని పట్టించుకోకుండా, ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఉన్న దుమ్మును తీసేయటానికి ప్రయత్నిస్తున్న అతన్ని 'అత్యంత మూర్కుడు అంటారు అని అందులో క్లియర్ గా రాసుంది. దానికి అర్ధమేమిటో నేను విడమర్చి చెప్పాలా ఏమిటి?" అన్నది నిర్లక్ష్యంగా.

ఆమె చూపే నిర్లక్ష్యం, దోరణి కొత్తగా ఉండటంతో ----

"ఏమిటి...ఏం చెప్పటానికి ప్రయత్నిస్తున్నావు?" అన్నాడు.

"అర్ధం కాలేదా?" --వెళాకోళాన్ని సాగదీసిన ఆమె "ఎందుకు అంత వింతగా చూస్తున్నావు? నీ పుటుక...దానికి సంబంధించిన సంఘటనలు అన్నీ మర్చి పోయావా ఏమిటి?" అన్నది.  

అధిరిపడ్డాడు విశాల్.

అతని మనసులో పూడుకుపోయిన అవమానాలను గుంట తవ్వి బయటకు తీసి దీపం వెలుతురులోకి తీసుకు వచ్చిన ఆమెను షాక్ తగిలినవాడిలాగా చూశాడు.

"నేను ఒకడ్నే ప్రేమించాను. మీ అమ్మలాగా కన్నబిడ్డనూ, కట్టుకున్న మొగుడ్ని వదిలేసి ఇంకొకడితో పారిపోలేదు. మీ మీద ఇంత మురికి పెట్టుకుని..." విసుగు, కోపం తలకు ఎక్కగా, ఏం మాట్లాడుతున్నామో తెలియక, అనాగరీకంగా ఆమె మాట్లాడుతుంటే ---

" లతా!"  అని అరిచినతను, ఫడేల్ మని లత  చెంప మీద ఒకటిచ్చాడు. 

"ఏయ్!" అని అహంకారంతో, దెబ్బ తగిలిన షాక్ నుండి తేరుకోలేక నిలబడ్డ లత గొంతు పట్టుకుని -- "ఇంకోసారి ఆమె గురించి మాట్లాడావో, నిన్ని చంపేస్తాను" అన్నాడు.

కోపం ఎక్కువ అయ్యి, కృరంగా కనబడ్డ అతని మొహం ఆమెలో భయం పుట్టించ ---

"సారీ..." అన్నది. గుండె దఢ తగ్గకుండానే.

"వెళ్ళిపో...నా ముందర నిలబడకు" అంటూ గుమ్మం వైపు చెయ్యి చూపించాడు.

ఆమె కోపము, గొంతును గట్టిగా పట్టుకున్నందువలన ఏర్పడిన నొప్పి, దెబ్బ తిన్న అవమానం ఒక్కసారిగా ఆమెను తాకగా ---

వెక్కి వెక్కి ఏడుస్తూ తన గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి మంచం పైన పడింది.

                                                                                                                Continued...PART-14

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి