మూగ ప్రేమ (కథ)
గాడాంధకారం
అలముకున్నా.. నిరాశా నిస్పృహలు చుట్టుముట్టినా.. భరించలేని కష్టం బాధపెట్టినా..నీ
కోసం నేనున్నానంటూ వెన్ను తట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం.. నిజమైన స్నేహం జీవితం
చివరి వరకు తోడుటుంది.. ఒంటరిలోను, ఓటమిలోనూ తోడై నడుస్తుంది. కన్నీరు తుడుస్తుంది,
కష్టాల్లో ధైర్యం చెబుతుంది.. అలాంటి మైత్రి లోని మాధుర్యం
చెప్పడానికి మాటలు చాలవు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే
స్నేహితుడు.
కానీ
స్కూలు వయసులో, స్కూలు స్నేహాలు ఎలా ఉంటాయి. ఊహించుకోవటం కష్టమే.
వాటిని కనుక్కోవటం కూడా కష్టమే. ఎందుకంటే అక్కడ ఈర్ష్యలు ఉండవు, బేధాలు ఉండవు. ఏమీ తెలియని వయసులో ఇద్దరు స్కూల్ స్నేహితుల మధ్య ఏర్పడిన
నిజమైన స్నేహం ఎలా ఉంటుంది....ఈ కథ చదివి అర్ధం చేసుకోవటనికి ప్రయత్నిద్దాం.
రెండు నిండు ప్లాస్టిక్ కవర్లతో బయటకు వెళ్ళిన రఘు ఇంటికి తిరిగి వస్తునప్పుడు ఒక నిండు కవరుతో వచ్చాడు.
ఇంటి బయట తన పాత చెప్పులను వదిలిపెడుతూ ఇంటి తలుపుపై "శేఖర్...టైలర్" అని రాసున్న పాత చెక్క పలకను చూసి చిన్నగా నవ్వుకుని ఇంట్లోకి వెళ్ళాడు రఘు.
కొడుకు ఇంట్లోకి రావడం చూసిన శేఖర్ బట్టలు కుడుతున్న టైలరింగ్ మిషెన్ ఆపి "ఏరా రఘూ... యూనీఫాం బట్టలు ఇచ్చేసావా?" అని అడిగేడు.
"శంకరంగారింట్లో ఇచ్చేసాను...సూర్యంగారిళ్ళు తాళం వేసుంది. ఇదిగో వాళ్ళ బట్టలు" చేతిలో ఉన్న ప్లాస్టిక్ కవరును పక్కనున్న టేబుల్ మీద పెట్టి వెనక్కి తిరిగేడు రఘు.
"రఘూ...ఈ చొక్కాకి బొత్తాలు కుడతావా. ఈ బట్టలు ఈ రోజు డెలివరీ ఇస్తానని మాటిచ్చాను" శేఖర్ కొడుకుని అడిగేడు.
తండ్రి మాటలకు వెనక్కి తిరిగిన రఘు "స్నానం చేసొచ్చి కుడతాను" అని చెప్పి పక్క గదిలోకి వెళ్ళిపోయేడు.
వంటింట్లో తల్లి పెట్టిన టిఫెన్ తింటూ ఏదో ఆలొచిస్తున్నాడు రఘు.
కొడుక్కు మంచినీళ్ళ గ్లాసు అందిస్తూ "త్వరగా తినరా...నాన్నగారు ఏదో పనిచెప్పారుగా" చెప్పింది తల్లి వేణి.
"త్వరగానే తింటున్నాను" చెప్పాడు రఘు.
అతని మాటలలో కోపం గ్రహించిన వేణి కొడుకును ఇంకేమి అనలేక వంటింట్లో సామాన్లు సద్దడంలో మనసు మళ్ళించింది.
"అమ్మా" అన్న రఘు పిలుపు విని వెనక్కి తిరగకుండానే "ఏవిట్రా" అన్నది వేణి.
“ఈ సంవత్సరం స్కూల్ కి కొత్త యూనీఫాం వేసుకుని వెళ్ళాలని ఆశగా ఉందమ్మా...నాన్నకి చెప్పి నాకు కొత్త యూనీఫాం కుట్టివ్వమని చెప్పవా" రఘు ఆశగా అడిగేడు తల్లిని.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
మూగ ప్రేమ…(కథ)@ కథా కాలక్షేపం-1
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి