9, నవంబర్ 2022, బుధవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-2)

 

                                                                     ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                            (PART-2)

ఆరోజు

                                               'ప్రేమనేది గంగ కాదు...

                                                గంగ ఈ రోజు పవిత్రం కాదు!

                                                ప్రేమ అనేది అడవి సరస్సు

                                                మెత్తని మనసును పొడిచే డేగ '

కాలేజీ వార్షీక జ్ఞాపకార్థ పుస్తకంలో గౌతంరాజ్ అనే ఎం.ఎస్.సి. చివరి సంవత్సరం చదువుతున్న స్టూడెంట్ రాసిన కవిత్వం పైనే జయశ్రీ చూపులు కళ్ళార్పకుండా చూస్తున్నాయి. పక్కన ఆమె స్నేహితురాలు దీపా.

దీపా, ఎవరే ఈ గౌతంరాజ్?”

ఎం.ఎస్.సి కెమిస్ట్రీ స్టూడెంట్. నువ్వు కూడా చూసుంటావే. అమితాబ్ లాగా బాగా ఎత్తుగా ఉంటాడు...

ఈ కాలేజీలో అమితాబ్ లకూ, ధర్మేంద్రాలకూ తక్కువా? సరిగ్గా చెప్పవే...

సరిగ్గా చెప్పాలంటే ఈ అమితాబ్ ఒక సరైన జుబ్బా పిచ్చాడు. మాటి మాటికీ జుబ్బా వేసుకుని కాలేజీకి వచ్చే ఒక వ్యక్తి. సైంటిస్ట్ లాంటి ఒక గడ్డం ఇతనిలో ఉన్న మరో ఇంటరెస్టింగ్ అంశం

ఆ...జ్ఞాపకానికి వచ్చాడు. అవునూ...ఇతనికి ప్రేమంటే గిట్టదే?”

ప్రేమ మాత్రమే కాదే...ప్రేమించే వాళ్ళన్నా గిట్టదు

ఏం కారణమో?”

ఎవరికి తెలుసు. కానీ ఒక వ్యత్యాసమైన రకం. అది మాత్రం తెలుసు?”

ఇలాంటి వ్యక్తులతోనేనే మనం స్నేహంగా ఉండాలి

నీకెందుకే ఈ విపరీత ఆశ?”

విపరీత ఆశ కాదు. ఏ మగాడిని చూడూ, చూపులతోనే మనల్ని మానభంగం చేసేస్తున్నారు. బాగా జీవించిన ముసలోడు కూడా నాలిక బయటకు చూపి నీరు కారుస్తున్నాడు. ఇంత చెడిపోయిన ఈ కాలంలో ఇలాంటి ఒక వ్యక్తి...కచ్చితంగా అతన్ని కలుసుకోవాలి దీపా

అదేలాగానే అతన్ని కలుసుకున్నారు. ఒక గోడను ఆనుకుని పుస్తకం చదువుతున్న సాయం సమయం ఐదు గంటల సమయంలో.

హలో...

జయశ్రీ యొక్క తియ్యటి స్వరంతో గౌతంరాజ్ అనే గౌతం తల ఎత్తాడు.

నేను జయశ్రీ. బి.ఎస్.సి బయాలజీ ఫైనల్ ఇయర్. ఈమె నా స్నేహితురాలు దీపా. ఈమె కూడా నా క్లాసే 

అతను గౌరవంగా దాన్ని అంగీకరించినట్లు మిల్లీ గ్రాములో నవ్వి, ఏమిటి విషయం అన్న ప్రశ్న చూపుతో జయశ్రీని చూసాడు! నిన్ను నాకూ, నా మనసుకూ చాలా రోజులుగా తెలుసే!అన్న భావము కల్పించే అతని కళ్ళ చూపులు చెబుతున్నాయి.

మీ కవితను కాలేజీ వార్షీక పుస్తకంలో చూసాను. డిఫరంట్ గా ఉంది. అందుకనే మీకు అభినందనలు చెప్పి వెళ్దామని వచ్చాను

ఆమె పొగడ్తను చిన్నగా తీసుకుని థ్యాంక్స్ అన్నాడు.

కొంతసేపు ఆమెనే చూసి, మళ్ళీ పుస్తకంలో ముఖం పెట్టి చదవుకోవటం మొదలు పెట్టాడు.

ఏమిటి సార్...నోరు తెరిచి, ఇంకేమీ మాట్లాడరా?”

జయశ్రీ వదిలేటట్టు కనబడలేదు.

మాట్లాడటానికి ఏముంది?”

ఏమీ లేదా? మీరు మంచి కవి. నేను మీ అభిమానిని. ఒకటి అనుభూతి, ఇంకొకటి అభిరుచి. రెండూ చేరితే అదే కదా సరైన మిక్సింగ్’”

మీరు ఏం చెబుతున్నారు?”--- గౌతం కొంచం ఆశ్చర్యపోతూ అడిగాడు.

ఏమీ లేదు...మీరు ఆందోళన చెందకండి. రెండూ చేరితేఅని చెప్పిన వెంటనే నేనూ, మీరూ చేరటం అని అర్ధం కాదు. మన జీవితాల కలయిక, ఐ మీన్ మన ఇద్దరి ఆలొచనా విధానం ఒక కవి- ఒక సాహిత్య అభిమాని చేరిక గురించి చెప్పాను

మన ఆలొచనా వేవ్ లెంగ్తులు ఒకటిగా ఉన్నందున ఎవరికి ఏం జరగుతుంది? పంట పండిపోతుందా?”

గౌతం వేసిన ఆ ప్రశ్న జయశ్రీలో కోపాగ్నిని చెలరేగించింది.

దీపా గొణిగింది.

ఏమే! వీడు మగాడే కాదే... అన్నది చెవి దగ్గరగా వచ్చి.

అది అతని చెవికీ వినిపించింది. చెవులు పెద్దవై, కళ్ళు ఎర్రబడి, ఒళ్ళు వణికేంత కోపంతో ఉరిమేడు అతను.

ఏయ్, నువ్వేం చెప్పావు అని కోపంగా అడిగాడు.

సొరకాయ పప్పులో ఉప్పులేదు, చిట్టెలుకకు తోకలేదు అన్నానుదీపా కూడా గట్టి స్వరంతో సమాధానం ఇచ్చింది.

మీరు మంచి ఆలొచనతో నన్ను చూడటానికి వచ్చినట్లు లేదే

అతను మాట్లాడింది చాలుఅన్నట్టు అక్కడి నుండి నడవటం మొదలు పెట్టాడు.

నిలబడండి సార్...ఎందుకు పారిపోతున్నారు? నేనేం తప్పుగా అడిగాను? ఆడవాళ్ళను చూసి భయపడుతున్నారే...?”

--- జయశ్రీ చేయి అడ్డుపెట్టి అతన్ని ఆపి అడిగింది.

క్షమించాలి...నాకు నీతో మాట్లాడటానికి ఇష్టం లేదు

అదే ఎందుకు?”

పనికిరాని మాటలు మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు

ఏది పనికిరాని మాటలు?”

మీరు ఇప్పుడు మాట్లాడారే

మీ కవిత మాత్రం చాలా పనికొస్తుందా?”

అందులో మీకేంటి సందేహం?”

అదేంటి సార్...ప్రేమంటే మీకెందుకంత హేళన?”

కామమే ఇప్పటి ప్రేమ...నా వల్ల కామాన్ని ఇష్టపడటం కుదరదు

కామం ఇష్టపడే విషయం కాదు సార్. అది మనలో వెలుగుతున్న ఒక అగ్ని.  కట్టుబాటులో ఉంచుకోవలసిన విషయం అది...

అగ్ని,గిగ్ని అని కథలు చెప్పకండి. నాకు అలాంటి అగ్ని ఏదీ లేదు

అలాగైతే దీపా చెప్పింది కరెక్టే. మీరు నిజమైన మగాడు కాదు

అలాగే అనుకోండి. మీరు వెళ్ళొచ్చు

అతను మాట్లాడి వెళ్ళిపోయాడు. జయశ్రీ, దీపా తలపైన చేతులు పెట్టుకున్నారు.

దీపా, ఈ మనిషి సరైన మగాడులా లేడు... విసుగ్గా చెప్పింది జయశ్రీ.

అప్పుడు ఎక్కడి నుంచో నలుగురు కలిసి ఒకటిగా నవ్వుతున్న శబ్ధం.

కొంచం దూరం తరువాత డబ్బుగల వారు పెంచిన పన్నీరు వృక్షం. వృక్షం కొమ్మలలో పసుపురంగు పిచ్చుకలు. చెట్టు కింద కాలేజీ యుక్త వయసు గుంపు. అక్కడి నుండే ఆ నవ్వు శబ్ధం.

ఆ గుంపులో నుండి ఒకడు జారి వచ్చి జయశ్రీ ఎదురుగా ధైర్యంగా నిలబడి మాట్లాడాలనుకునే మమ్మల్ని పట్టించుకోరు. ఇలా ఎవడైనా పనికిరాని మగాడు చిక్కితే వాడిని మాటలతోనే ఆట ఆడిస్తారు. మీ ఆలొచనే మాకు అర్ధం కావటం లేదే 

జయశ్రీ అతన్ని కోపంగా చూసింది.

కోపంగా చూడకు జయశ్రీ...నీకు కళ్ళు చిన్నగా ఉంటేనే అందం. వాటిని పెద్దవి చేసుకుని నీ అందాన్ని పోగొట్టుకోకు 

దీపాకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఆమె యద పైకీ కిందకూ ఊగింది....

ఏమ్మా దీపా, గొంతుకు కింద ఇంత కొవ్వు పెట్టుకున్నావే... దానికోసం వేరుగా ఏమైనా తింటున్నావా?” -- అతని పిచ్చి వాగుడు వాళ్ళను తీవ్రంగా గాయపరిచింది.    

అప్పుడు ఎవరో అతని భుజాన్ని తట్టి తిప్పగా, అతని మొహం వెయ్యి వంకర్లు తిరిగింది.

నాయకా, మీరా...సారీ నాయకా! సారీ! వెరి వెరి సారీ... అన్నాడు.

నాకు చెప్పే వెరి సారీ అంతా తరువాత. ముందు వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగు

సరే నాయకా... క్షమించు దీపా... -- చెప్పేసి అతను బెదిరిపోయి పరిగెత్త, మిగిలిన గుంపును ఖండించి తరిమిన వ్యక్తి మొహంలో గెలుపు నవ్వు.

నేను నందకుమార్. ఎం.ఎస్.సి కెమిస్ట్రీ -- అతని సింపుల్ పరిచయంలో జయశ్రీ కరిగిపోయింది.

అతను మాట్లాడటం కంటిన్యూ చేసాడు.

నిజంగానే కాలేజీ విధ్యార్ధులు అందరూ చాలా మంచి వాళ్ళు. సక్రమంగా కాలేజీకి వచ్చి వెళుతున్నవారే. మన రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళూ వీళ్ళని ఇలా మార్చేసారు. ఏ సినిమాలో అయినా స్టూడెంట్స్ ను మంచి వాళ్ళుగా చూపించారా? ప్రేమ, అల్లరి అంటూ తిరిగే వాళ్ళుగా కథలు రాసి, రాసి స్టూడెంట్స్ అది కాపీ కొట్టడం మొదలు పెట్టారు! మీరంతా దీన్ని ఆటగా తీసుకోండి... అన్నాడు మిక్కిలి శాంతంగా.

అతని ఆ పక్వమైన మాటలు, ఇద్దరికీ బాగా నచ్చింది. అతన్ని గౌరవంగా చూసారు.

ఇక నేను బయలుదేరుతాను... అంటూ బయలుదేరాడు.

జయశ్రీ, దీపా ఇద్దరూ ఆశ్చర్యంగా అతన్నే చూసారు.

జయశ్రీ...మన కాలేజీలో కూడా ఇలాంటి మంచి పర్సనాలిటీ మనిషా?”

దీపా నోరెళ్ళ బెట్టింది.

చాలా స్వారస్యమైన మనిషి...అన్నది జయశ్రీ.

----ఇద్దరూ మాట్లాడుకుంటూ నడవటం మొదలుపెట్టారు.

మన కాలేజీ సరైన ఒక జూదీపా. ఇక్కడ ఎన్ని రకాల మృగాలు...వీళ్ళ మధ్య కొంతమంది మనుషులు కూడా ఉన్నారు -- అన్నది ఆశ్చర్యంగా.

అప్పుడు అక్కడ ఎదురొచ్చాడు గౌతంరాజ్. పుస్తకం చదువుతూ మధ్యలో ఒక కోపమైన చూపు చూసాడు.

హలో జెంటిల్ మ్యాన్... అంటూ జయశ్రీ అతన్ని వెక్కిరించి నడవటం మొదలు పెట్టింది. 

పన్నీరు చెట్టు నీడలో కుతూహలంగా ఉన్న ఫ్రెండ్ సర్కిల్లో ఇప్పుడు నందకుమార్ కూడా చేరాడు.

బలమైన పరిచయ శంకుస్థాపన ముగిసింది మామల్లారా? కరెక్టుగా నలభై ఎనిమిది రోజుల్లో ఆమె కన్యాత్వం పోగొట్టి చూపించకపోతే నేను నందకుమార్ కానే కాను... అన్నాడు అతను.

అదేమిటి నలభై ఎనిమిది రోజులు...?”

వ్రతం ఉండేవాళ్ళు నలభై ఎనిమిది రోజులు కదా ఉంటారు...? నాకు జయశ్రీని అనుభవించాలనే ఆశ ఒక వ్రతం లాగానే

నందకుమార్ ని అందరూ ఈర్ష్యగా చూశారు.

నీకేం బాబూ...నిన్ను అడిగే వాళ్ళు లేరు. జడ ఉన్న మహారాజువి. ఎలాగైనా బుట్టలో వేసుకుంటావు... అన్నాడు ఒకడు.

"నువ్వు కూడా వసపరుచుకో...మనసు పెడితే జరుగుతుంది. అనుభవించటానికే జీవితం...అనుభవించటానికే యుక్త వయసు...అనుభవించటానికే ఆడది...

గట్టిగా మాట్లాడకు నందూ. ఎవరైనా వింటే మన మీద రాళ్ళు ఎగరేస్తారు

గెలీలియోని కూడా రాళ్ళేసి కొట్టారు. అందుకని ఆయన అబద్దమా చెప్పారు?”

అలాగైతే నువ్వు చెప్పేదే జీవిత సిద్దాంతమా?”

ఖచ్చితంగా! అనుభవించాలి. రకరకాలుగా అనుభవించాలి. యుక్త వయసు పోయే లోపల అనిభవించ గలిగినంత అనుభవించాలి. దానికోసం ఏదైనా చెయ్యచ్చు. తప్పు లేదు

----అతని విపరీత కాలుష్యమైన సిద్దాంతానికి పన్నీరు చెట్టు మీద కూర్చున్న కాకి అతన్ని ఖండించే విధంగా అతనిపై రెట్ట వేసింది. కోపంగా పైకి చూసాడు నందూ.

ఏయ్ ఛీ...పో!

                                                                                               Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి