11, నవంబర్ 2022, శుక్రవారం

నమ్మకం…(కథ)

 

                                                                                             నమ్మకం                                                                                                                                                                                        (కథ)

నీపై నీకు నమ్మకం నీకు బలం.. నీపై  నీకు అపనమ్మకం అవతలి వారికి బలం!

అవును.. నువ్వు ఏదైనా సాధించాలి అంటే నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీకు నీపై ఉండాలి. అప్పుడే నువ్వు విజయం సాధించగలవు.

నీపై నీకు నమ్మకం లేకపోతే నువ్వే నష్టపోతావు.

నువ్వు ఏదైనా సాధించాలి అంటే దైర్యం ఉండాలి.. నమ్మకం ఉండాలి.. అప్పుడే విజయం సాధించగలవు. నీపై నీకు నమ్మకం లేకపోతే విజయం సాధించలేవు. ఏదైనా నేను చెయ్యగలను.. నాకు శక్తి ఉంది.

పని నేను చెయ్యగలను అని నువ్వు నమ్మితే ఖచ్చితంగా విజయం సాధించగలవు.

మేదస్సు అనే నమ్మకాన్ని మనసులోకి బీజంగా నెట్టి, దానికీ రోజూ  శ్రమ అనే నీటిని పోస్తే నువ్వు ఏదైనా సాధించగలవు....ఈ ఆంశంతో రాసినదే ఈ కథ.

                                                                                        ********

సురేష్ మరియు విగ్నేష్ సముద్ర తీరం మట్టిలో కష్టపడి నడిచి వెడుతున్నారు.

సముద్ర తీరంలో బండ్ల మీద అమ్ముతున్న ఎండు చేపల వాసనను విగ్నేష్ భరించలేకపోయాడు. ముక్కు మూసుకుని, ఊపిరి బిగపెట్టి, చీదరింపు ముఖంతో తన ఎత్తైన పొట్టతోనూ, బరువైన శరీరంతోనూ నడవలేక అవస్తపడుతున్న విగ్నేష్ ను చూసి మనసులోనే నవ్వుకుంటూ అతని వెనకే నడిచాడు సురేష్.

దూరంగా మొదలవుతున్న సముద్రంలోని అలలు ఎగిసి పడుతూ వేగంగా తీర ప్రాంతాన్ని తాకుతున్నాయి. అలా వేగంగా వస్తున్న అలలను సైతం గమనించకుండా మాటల్లో మునిగిపోయిన ప్రేమ జంటలను దాటుకుంటూ నడుస్తున్నారు ఇద్దరూ.

"ఒక రోజైనా ఏనుగు తలతో రాకుడదు" సముద్రపు గాలికి చెదిరిపోతున్న జుట్టును సరిచేసుకుంటూ విగ్నేష్ ని అడిగాడు సురెష్.

"నువ్వు నా స్నేహితుడివి. మనిషైన నీతో సన్నిహితంగా మాట్లాడాలంటే మనిషి రూపమే సరైనది. నా నిజమైన రూపంతో వచ్చి, ఒక విప్లవం ఏర్పరచి, జనాన్ని నా పక్కకు తిప్పుకోవటం నాకు ఇష్టం లేదు" చెప్పాడు విగ్నేష్.

"అదీ కరక్టే! మానవ రూపంలో వచ్చావు కాబట్టే నీతో సరిసమానంగా మాట్లాడగలుగుతున్నాను"

"ఇక నడవలేను. ఇక్కడ కూర్చుందాం" చెప్పాడు విగ్నేష్. ఇద్దరూ అక్కడ మట్టిలో కూర్చున్నారు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నమ్మకం…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి