11, నవంబర్ 2022, శుక్రవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-3 )

 

                                                                     ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                          (PART-3 )

ఈ రోజు

గౌతం... గౌతం...

ఆమె వరకు జీవితంలో ఇక జ్ఞాపకం తెచ్చుకో కూడదనుకున్నఒక పేరు...ఉచ్చరించనే కూడదని విదిలించి పారేసిన పేరు...ఇదిగో ఆ పేరుకు సొంతమైన మనిషి ఎదురుగా...

జయశ్రీకి అతన్ని చూసిన వెంటనే మొహంలో ఒక విధమైన అవస్థ, హృదయంలో సరిగ్గాలేని పంపింగ్, మొహాన చుక్కలు చుక్కలుగా చెమటలు.

ప్రేమ అంటేనే ఆముదంలాగా ఫీలయ్యి దూర దూరంగా పారిపోయే అతను. ఒక సంధర్భంలో జయశ్రీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ ఆమె వెనుక పిచ్చివాడిలాగా తిరగటాన్ని ఏమని చెప్పాలి?   

ప్రేమ ఏదైనా చేస్తుందో...?

ఎవరు, దేనిని, ఎప్పుడు, ఎలా చేస్తారు? అనేది మనుషుల వరకు తీర్మానించుకోవటమే శ్రమ!

ఆ రోజు జయశ్రీకి ఐ లవ్ యూచెప్పి, ఐ హేట్ యూఅన్న జవాబును జయశ్రీ దగ్గర నుండి అనిపించుకున్న అతను ఈ రోజు దేనికోసం వచ్చాడు?

నా ప్రేమ జీవితం నరకంగా మారిందని ఇతనికి ఎలా తెలుసు...? చెప్పి ఉంచినట్లు వచ్చాడే? దేనికి...దేనికి?’ -- జయశ్రీకి అర్ధం కాక అయోమయంతో నడిచింది.

గౌతం చాలాసేపు దూరంగా ఉండే ఆమె నడవటం గమనించాడు.

దగ్గర కొచ్చి బాగున్నావాఅని ఒక మాట ఆమె అడుగుంటే ఎంత బాగుండేది?’ -- ఆలొచించి చూసాడు. అపేక్ష వదిలే గాలిలో కాలుతోంది. కళ్ళల్లో పాలితిన్ లాగా కన్నీటి తెర.

జుబ్బా జేబులోకి చెయ్యి పెట్టాడు. ఆ చేతికి తగిలింది ఫిల్టర్ సిగిరెట్టు పెట్టె. బయటకు తీసి, ఒక సిగిరెట్టు తీసి వెలిగించి పొగ బయటకు వదిలాడు. ఏదో ఒకటి ఎక్కడో సుఖం అవుతున్న భావం. మనుషులపై సిగిరెట్టు అధికారం చెలాయించటానికి కారణమే ఈ మర్మమైన సుఖ భావమే నన్న మళ్ళీ ఒక భావం.

చాలా దూరం వెళ్ళిపోయిన జయశ్రీ, ఆటో ఒకటి ఎక్కి కూర్చుంది. ఆమె పక్కనే ఆమె తండ్రి.

తిరిగి చూడకూడదు...తిరిగి చూడకూడదు. చూడనే కూడదు అని మనసులో మంత్రంగా చెప్పుకుంటోంది. ఇలా చెప్పుకుంటే ఎప్పుడూ భావం ఆపోజిట్టుగానే ఉంటుంది?

మెడను మెల్లగా తిప్పింది. ఆటో బయలుదేరి వలయంలా తిరగటంతో బాగానే చూడ గలిగింది.

సిగిరెట్టుతో కనబడుతున్న అతన్ని చూడటానికి ఆశ్చర్యమేసింది. వక్కపొడి కూడా వేసుకోను అన్న వ్యక్తే ఇతను.

---ప్రశ్న తలెత్తటంతో ఆనవసరమైన వేదన.

జ్ఞాపకాలలో మరిచిపోవలసిన అతన్ని -- మరిచిపోయిన అతన్ని మళ్ళీ ఎందుకు తిరిగి జ్ఞాపకం తెచ్చుకుని హక్కుతో వేదన పడటం? మనిషి యొక్క విచిత్రమైన నేచర్ అదేనా?

జీవితంలో చాలా సమయాలలో మనల్ని మనమే తెలుసుకోవటం లేదు.

ఆమె ఆ నిజాన్ని తలచుకుని ఆశ్చర్య పడుతుంటే  తండ్రి అడిగారు:

ఎవరమ్మా ఆ వ్యక్తి?”

జయశ్రీ దగ్గర ఆశ్చర్యం. తండ్రి ఇంత క్షుణ్ణంగా గమనించారే?’

నేను కాలేజీలో చదువుకుంటున్నప్పుడు స్నేహితుడు. పేరు గౌతం రాజ్... అన్నది చాలా చిన్నగా.

నీ కేసు విషయం ఇతనికెలా తెలిసింది?”

అదే నాకూ తెలియటం లేదు

వచ్చిన వ్యక్తి దగ్గర నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదేమ్మా?”

అతను అంత మంచి వ్యక్తి కాదు నాన్నా...

అతన్ని చూస్తే అలా కనబడటం లేదే?”

చూస్తే అది తెలియదు నాన్నా. స్నేహం చేస్తే తెలుస్తుంది. హృదయం నిండిపోయే జ్ఞాపకాలతో స్నేహం చేయాలి. అప్పుడే తెలుస్తుంది. కొన్ని సమయాలలో ఈ కాలం మొగవాళ్ళను అప్పుడు కూడా అర్ధం చేసుకోలేము. ఇక్కడ ఎవడు రాముడు, ఎవడు రావణుడు తెలియటం లేదు

చెప్పేటప్పుడే కృంగిపోయింది. కళ్ళల్లో నీటి ప్రవాహం.

అది సరే, ఇక ఏం చెయ్యబోతావు?”

ఏం చెయ్యబోతానా? అంటే?”

వాట్ డూ యూ తింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తు గురించి ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతున్నా

భవిష్యత్తు అంటే ఏమిటి నానా?”

రేపటి పొద్దమ్మా. ఎందుకని అంత విరక్తిగా మాట్లాడటం మొదలు పెట్టావు...?”

సంతోషంగా మాట్లాడటానికి నేనేమన్నా ఇప్పుడు కుతూహల రాజకుమారినా...? నేను తప్పు చేయకపోయినా పువ్వులూ-బొట్టూ కూడా ఇప్పుడు నేను రేషన్ గానే పెట్టుకోవాలి. లేకపోతే, మొగుడు వదిలేసిన దానికి ఎంత స్టైలో చూడు అని ఎగతాలి చేస్తారు నాన్నా...

దయచేసి నువ్వు నీకొసం జీవించాలి. ఇలా అనవసరంగా ఊరి గురించి బాధపడకూడదు

ఊర్లో ఉంటూ, ఊరిని నమ్ముకుని బ్రతుకుతూ, ఊరి గురించి బాధపడకూడదు అంటే ఏమిటి నాన్నా అర్ధం?”

వితండవాదం చెయ్యకు జయశ్రీ! నీ వయసు అమ్మాయలకు క్లారిటీ చాలదు. కలలు...కలలుఇదే మీరు. ఎప్పుడు చూడు కలలు. ఎందులోనూ యధార్థం లేదు. నిజం లేదు. అందువలన మీకు చిన్న సమస్య కూడా, కొండ విరిగిపోయినట్టు విరక్తి చెందుతున్నారు

భర్త నరకం చూపించటం, మంటలతో కాల్చటం, తాగ మనటం, చంపటానికి ప్రయత్నించటం చిన్న సమస్యా నాన్నా?”

తండ్రి హృదయం గాయపడాలనే ఈ ప్రశ్న అడిగింది జయశ్రీ.

దీనికి ఎవరు కారణం? నువ్వు కారణం...నీ ప్రేమ కారణం. ఎంత చెప్పినా వినకుండా పరిగెత్తుకు వెళ్ళి నందకుమార్ దగ్గర గొంతు చాచటం కారణం. వాడిని పెద్ద మన్మధుడు అని నువ్వు ఊహించుకున్నది కారణం. నీ అజ్ఞానం కారణం...తొందర కారణం. అన్నీ నువ్వు చేసేసి ఇప్పుడు తప్పు నీది కాదనట్టు మాట్లాడుతున్నావు?”

----ఆయన ఆవేశంగా మాట్లాడాడు.

ఆటో డ్రైవర్ కే ఏదోలాగ అయిపోయింది. కావాలనే దగ్గి, ఒక మూడో మనిషిగా తానున్నానంటూ తెలిపాడు....

ఆమె ఏడుస్తునే ఉంది. తండ్రి చెప్పింది నిజమే కదా అన్నట్టు ఏడ్చింది.

యుక్త వయసుకు అందం మాత్రమే ఉంది. లోతైన ఆలొచన లేదుఅనేది బాగా అర్ధమైనదానిలాగా ఏడ్చింది.

ఇదంతా తలరాతా? ఎందుకు విధి ఇలా మత్తులో మైమరచిపోయింది?

ప్రశ్నకు జవాబు దొరకక ఏడ్చింది.

ఏడ్చింది చాలు...ఏడవటం చేతకాని వాళ్ళు తీసుకునే చివరి ఆయుధం. ఏడవటం ఆపు. జీవితం గురించి ఆలొచించి మాట్లాడు...

-----ఆయన ఎత్తి చూపారు.

మీరు చెప్పినట్టు వింటాను అన్నది జయశ్రీ.

అలాగైతే విడాకులకు వెంటనే ఏర్పాటు చేస్తాను. మళ్ళీ పెళ్ళికి నిన్ను నువ్వు తయారు చేసుకో...

నాన్నా... గొంతుకలో ఏదో అడ్డుపడ్డట్టు బెదిరిపోయి ఆయన్ని చూసింది.

నాకు మళ్ళీ పెళ్ళా?”

అవును...అదే నీకు సరైన తీర్పు

వద్దు నాన్నా. నాకూ, పెళ్ళికి రాసి లేదు. ఒకసారి పడ్డ కష్టాలు చాలు...

పిచ్చిదానా...ఇది చెడిపోయున్న కాలం. మగవాడి తోడు లేకుండా జీవించాలనుకోవడం, ఆత్మహత్య చేసుకోవటం ఒకటే

మీరున్నారు కదా నాన్నా...?”

నేను వయసైన వాడిని. ఇంకా  ఎన్ని సంవత్సరాలు ప్రాణాలతో ఉంటానో, ఎవరికి తెలుసు...?”

అన్నయ్య చూసుకోడా?”

"వాడికి కుటుంబం --పెళ్ళాం--తల్లి-తండ్రులు ఉన్నారు. అతను వాళ్ళను చూసుకుంటాడా, లేక నిన్ను గమనిస్తాడా?”

నేనూ వాడి కుటుంబంలో ఒకత్తిగా అయిపోతే?”

కష్టం...చాలా కష్టం. సహజ జీవితానికి సాధ్యం కాని మాట ఇది. నువ్వు చెప్పేది కొన్ని రోజులకే సాధ్యం. జీవితం మొత్తం సాధ్యం కాదు. మనుషుల మనసు గురించి నీకు తెలియదు...

మళ్ళీ పెళ్ళిని నావల్ల అనుకోవటం కుదరటం లేదే!

ఇప్పటి నీ పరిస్థినీ నేను అనుకోవటం కుదరటం లేదే!

------ఇంతలో ఆటో ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆగింది.

ఇల్లు తెరిచి ఉంది. ఇద్దరికీ ఆశ్చర్యం. అంతకంటే ఆశ్చర్యం ఇంటి చుట్టూ విపరీతమైన గుంపు.

మోహన్ శర్మ బెంబేలెత్తిపోయి గుంపులోని ఒకరిని అడిగారు.

ఏమైంది...ఎందుకు ఇంతమంది జనం ఉన్నారు?”

మీకు ఇంకా విషయం తెలియదా సార్? మీ అల్లుడు, పోలీసుల దగ్గర నుండి తప్పించుకున్నాడు. ఇక్కడకొచ్చి తాళం పగలగొట్టి లోపలకు దూరి...దొరికింది తీసుకుని పారిపోయాడు. పోలీసులు చాలా మంది వచ్చి ఇప్పుడే తిరిగి వెళ్తున్నారు

అప్పుడు అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చాడు.

తెరిచి ఉంచబడ్డ ఇంటికి నేనేసార్ కాపలా. ఆరు నెలల శిక్షను కూడా అంగీకరించలేక తప్పించుకు పారిపోయి ఆరు సంవత్సరాలు ఇక జైళ్ళోనే ఉండబోతాడు...మీ ఇల్లుడు. విధి ఎవర్ని వదిలింది? అంతా తలరాత... అంటూ విసుకున్నాడు అతను.

జయశ్రీ వేగంగా లోపలకు వెళ్ళింది. అలమరా తెరిచింది. నగలు కనిపించలేదు. బ్యాంకులో డ్రా చేసుకుని తీసుకు వచ్చిన డబ్బు కూడా కనిపించలేదు.

ఆమెలో ఆందోళన పెరిగింది.

అప్పుడు ఆ కాగితం కళ్ళకు కనిపించింది.

అతనే రాసి పెట్టున్నాడు.

దగ్గరకు వెళ్ళి ఆ కాగితాన్ని చేతిలోకి తీసుకుంది.

జయశ్రీ...ఇక నువ్వు ప్రతి రోజూ చచ్చి బ్రతుకుతావు. నన్ను వదిలేసి నీ వల్ల బ్రతకటం కుదరదు. నీకు దానికి కావలసిన ధైర్యం ఆవగింజంత కూడా లేదు. ఈ దేశంలో నా వరకు ఆడవాళ్ళు బానిసలుగానే ఉండాలి. వాళ్ళు మగవారికి అనిగిమనిగి వెళ్ళకపోతే వాళ్ళను ఏమైనా చేయొచ్చు.

నిన్నూ నేను ఏమైనా చేస్తాను. ఎప్పుడైనా వస్తాను

ఇట్లు

నీ ప్రేమ భర్త.

నందూ అలైస్ నందకుమార్.

చదివిన జయశ్రీకి మొదట భయం వచ్చింది...తరువాత మైకం వచ్చింది.

                                                                                                             Continued....PART-4

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి