ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్) (PART-4)
ఆ రోజు
నందకుమార్
యొక్క స్టైలు చూస్తే ఎవరికైనా మత్తు వస్తుంది. జయశ్రీకి రావటంలో ఏమీ ఆశ్చర్యం
లేదు!
నందకుమార్
అంత దృఢమైన శరీరంతో ఉన్నాడు. డైరెక్టర్ విశ్వనాధ్ గారి లాంటి వాళ్ళు చూస్తే, అక్కడే అతన్ని కథా నాయకుడిగా ఒప్పందం
చేసుకునే వసీకరం, మణిరత్నం కనిపెట్టిన అరవింద్ స్వామికి
పోటీ పడే శరీరం అందం.
ఇలాగే
కాలేజీలో మాట్లాడుకున్నారు. కొంతమంది అమ్మాయులు, వృద్దులను కూడా ఊరించేంత అందంగా
ఉంటారు. యదలోనూ, నడుం లోనూ మనుషుల గుంపును లాగే బలం వాళ్ళకు
ఉంది.
ఎలాంటి
సన్యాసులకైనా మనసు సంచలనానికి వస్తుంది. అలాంటి అందంతో మగవారూ, ఆడపిల్లలూ కళ్ళకు కనబడటం అనేది ఆ రోజు
కాలేజీలో నిరూపణ అవుతున్నది.
స్టైలుగా
మోటార్ సైకిలులో వచ్చి దిగిన నందకుమార్ నుదుటి మీద చిన్నగా కుంకుమ గీత.
“ఏమిటిది...ఆశ్చర్యంగా నుదుటి మీద కుంకుమ
అదీ?”
--- జయశ్రీ
అడిగింది.
“అందరూ ఆశ్చర్యపడటం కోసం కాదు...అవసరంతోనే, కావాలనే! నేను మన ఊరు రాజగణపతి
భక్తుడ్ని. ఆయన ఆశీర్వాదం వలనే జీవితంలో ఇంత దూరం ముందుకు ఎదిగాను...”
“వింటేనే ఆశ్చర్యంగా ఉంది. మీకు ఇంత దైవ
భక్తా?”
“నా భక్తి వేషం కాదు జయశ్రీ. ఇది నిజం.
అవునూ, ఈ రోజు మీకు క్లాసులు లేవా?”
“మా ప్రొఫసర్ ఈ రోజు సెలవు. అందువలన
అందరం బయలుదేరాం”
“ఎక్కడికి...?”
“ఇంటికే...”
“మా ఇంటికి రండి”
“ఏమిటి విషయం?”
“సరదాగా ఒక ‘గెట్ టు గెదర్’ జయశ్రీ. మీరందరూ వస్తే ఎంత బాగుంటుందో
తెలుసా? అందులోనూ నేను ఇప్పుడు దసరా బొమ్మల
కొలువు పెట్టాను”
“ఏమిటీ...మీరు బొమ్మల కొలువు పెట్టారా?”
“అవును
జయశ్రీ. బ్రహ్మచారి, బొమ్మలు
పెట్టకూడదా ఏం? ఫుట్
బాల్ గ్రౌండ్
అంత ఇల్లు.
అమ్మ ఉన్న
రోజుళ్ళో ఇల్లు
గుడిలాగా ఉండేది.
ఎప్పుడూ పూజలూ, పునస్కారాలూ...ఇప్పుడు
అవేమీ లేకుండా
ఉండటం నాకు
నచ్చలా...”
“ఏం, మీ
అమ్మ ఇప్పుడు
ఏమైంది?”
ఆమె ప్రశ్నకు, ముందు
అతను చాలా
సేపు ఒక
దొంగ ఏడుపు
మౌనం వహించాడు.
తరువాత అందులో
నుండి కన్నీరనే
బొట్లను కళ్ళ
నుండి బయటకు
పంపాడు. తరువాత
నిదానంగా నోరు
తెరిచాడు.
“అమ్మ
ఇప్పుడు లేదు...దేవుడి
దగ్గరకు వెళ్ళిపోయింది.
సడన్ హార్ట్
అటాక్!”
“మై
గాడ్...అప్పుడు
ఇల్లు ఎవరు
చూసుకుంటున్నారు...?”
“నేనే...ఇక
నాకు రాబోయే
భార్య”
“బాధపడకండి.
మీకు మంచి
భార్య దొరుకుతుంది.
మీ మనసు
పువ్వులాగా మెత్తనిది.
మీకు రాబోయే
భార్య కూడా
పూవు లాంటి
మెత్తని మనసు
గలదే వస్తుంది”
“మీ
లాంటిదని చెప్పండి
జయశ్రీ”
జయశ్రీకి అతను
అలా చెప్పటంతో, పంచదార
పాకంలో బోర్ల
పడినట్లు ఒక
భ్రమ.
ఆ తరువాత
మాట్లాడటానికి
మాటలు రాలేదు.
మనసులో ఎదురు
చూడని ట్రాఫిక్
జామ్.
“సరే, వస్తారా?”-- నందకుమార్బండి
స్టార్ట్ చేస్తూ
అడిగాడు.
“ఖచ్చితంగా
వస్తాను” -- జయశ్రీ
నుండి వాగ్ధానం.
“అయితే
బండి ఎక్కండి...”
“లేదు...లేదు!
నేనూ, ధరణీ, పార్వతీ, దీపా
అందరం కలిసి
వస్తాం”
“చాలా
థ్యాంక్స్. నేను
వెళ్ళి మా
పక్కింటి ఆంటీ
గారితో టిఫిన్
అదీ రెడీ
చేస్తాను”
“ఓ... నందకుమార్! అదంతా
వద్దు. ప్లీజ్...”
“లేదు
జయశ్రీ...మంచి
రోజున నా
ఇంటికి దేవతలు
రాబోతున్నారు. వాళ్ళను
ఉత్త చేతులతో
పంపనా?”
మాట్లాడేసి జవాబుకోసం
కాచుకోకుండా మోటార్
సైకిల్ను వేగంగా
పోనిచ్చాడు.
జయశ్రీలో కొత్త
ఉత్సాహం. నందకుమార్
జ్ఞాపకాలు మనసులో
నుండి పొంగి
బయటకు వస్తున్నాయి.
నందకుమార్ వెళ్ళిన
వైపే చాలాసేపు
చూస్తూ ఉన్న
జయశ్రీ, యధార్ధంగా
వెనక్కి తిరిగినప్పుడు
అక్కడ గౌతం రాజ్!
ఆడదంటే దయ్యం
అనే నిర్ణయానికే
వచ్చేసిన వాడిలాగా
ఉన్న అదే
గౌతం. జయశ్రీనే
గౌతంను చూసింది.
కానీ, అతను
ఆమెను చూడకుండా
పుస్తకంలోనే చూస్తూ
ఉన్నాడు.
“సరైన
అభిరుచిలేని జన్మ” అని నోరారా
అతన్ని శపించింది
జయశ్రీ.
అది అతనికి వినబడక పోలేదు. అతని
గుండెల్లో నొప్పి ఏర్పరచ కుండానూ లేదు.
ఖాలీగా ఉన్న పెద్ద ఇల్లు.
కాంపౌండ్ గోడను పూర్తిగా ఆక్రమించిన
చెట్లు. బెంగళూరు లో పూచే పూవులన్నీ తొట్టెల్లో పెరిగి అ ఇంటికి అందాన్ని ఇచ్చాయి.
చల్లని వాతావరణం. లోపల విస్తీర్ణమైన హాలులో తొమ్మిది మెట్లతో బొమ్మల కొలువు.
బొమ్మల ముందు ఐదు ముఖాల దీపం. హాలు మొత్తం సువాసన. పక్కింటి ఆంటీ వంటగదిలో కేసరి
చేస్తోంది.
“ఏమయ్యా
నందూ...నీకెందుకయ్యా బొమ్మల కొలువు, పూజలూ? ఇవన్నీ
నీ పెళ్ళి తరువాత చేసుకోవచ్చుగా?”
ఆమె స్వరం-హాలును అతుక్కుని ఉన్న గదిలో
ఆంటీ గారి ఒకే కూతురు జానకిను కౌగలించుకుని ఉన్న నందకుమార్ చెవిలో పడినప్పుడు అతని
దగ్గర నవ్వు.
“మీ
అమ్మ చెప్పింది విన్నావా?”
అతను జానకిను చూస్తూ అడిగాడు.
ఆమె కామంలో కరిగిపోయి ఉంది.
అతని కౌగిలిలో ఆమె యద నలిగి అతన్ని కెలుకుతున్నది.
అతనికి సమాధానం చెప్పటం కంటే, అతన్ని
ఇంకా ఎక్కువగా, ఒత్తుగా
కౌగలించుకోవటంలో ఆసక్తి చూపింది.
వసతిగా తలుపు గొళ్లెం పెట్టబడి ఉంది.
“నందూ...ఎన్ని
రోజులు ఇలాగే, త్వరగా పారిపోయి...”
అతను వెంటనే ఆమె నోరు నొక్కాడు.
“యుక్త
వయసులో చిలిపి పనులు చాలా చెయ్యాలి. వయసు దాటిన తరువాత వాటిని ఆలోచించి
కూడా చూడలేము. వచ్చే జన్మలో నువ్వు ఇదే జానకిగా, నేను
నందూ గా పుట్టే అవకాసమూ లేదు. కాబట్టి, ‘పెళ్ళి’ అని
అదీ ఇదీ చెప్పకుండా అనుభవించాలి, అనుభవిస్తూనే
ఉండాలి...”
“అప్పుడు
పెళ్ళి?”
ఆమె హడలిపోయి అడిగింది.
“తొందరపడకు...మెల్లగా
చేసుకుందాం. పెళ్ళి అంటే ఏమిటి? కామ
ఆటలకు సంఘం ఇచ్చే అనుమతే కదా? అనుమతితో
ఆడుకునే దాంట్లో ‘త్రిల్’ లే
లేదు జానకీ...”
“మీ
మాటలు నాకు నచ్చలేదు. ఒక పక్క చూస్తే మీరు వివేకానందుడు. ఇంకో పక్క చూస్తే సరైన
మధన కామ రాజు. మిమ్మల్ని అర్ధం చేసుకోవటమే కష్టంగా ఉంది...”
అతను అంతకంటే ఆమెను మాట్లాడనివ్వకుండా
ఆమె పెదాలను తన పెదాలతో మూసాడు. మరింత గట్టిగా కౌగిలిలో బిగించి మెల్లగా చేతులు
ఆమె నడుము దగ్గరకు దింపాడు.
ఆమె నిప్పంటుకున్నట్టు ఫీలైయ్యింది.
అతని భుజాలను గట్టిగా నొక్కింది. ఆడవారు ఇలా కొవ్వొత్తి లాంటి కరిగిపోయే
స్వభావాన్ని కట్టుదిట్టంతో ఉంచటానికే ఎన్నో కట్టుబాట్లు సంఘం విధించి ఉన్నా, దాన్ని
మీరి కరిగిపోతున్న అమ్మాయిని, ఆ
గదిలోని ఒక బొమ్మ వేడుక చూసింది. బొమ్మ మొహంలో చెరిగిపోని నవ్వు.
ఇలాంటి పద్దతులు లేకుండా అంటుకునే మంటల
వలనే ఎన్నో కన్యాత్వాలు కరిగిపోతున్నాయి.
ఇద్దరూ నరాల వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న
సమయంలో మొదట కేసరి యొక్క అద్భుతమైన వాసన మూసున్న తలుపుల సంధుల్లో నుండి దూరి --
వాళ్ళ ఆలోచనలనూ పట్టుకు లాగింది.
తరువాతది వాకిట్లో వచ్చి ఆగిన ఆటో!
ఆటోలో నుండి జయశ్రీ, ధరణి, పార్వతి
అంటూ ఒక కాలేజీ గుంపే దిగింది. ముసలి ఆటో డ్రైవర్ యుక్త వయసు మానసిక స్థితిలో
కిక్కుతో కనబడ్డాడు.
శబ్ధం విని ఇద్దరి బిగింపులూ సడలినై.
జానకీ కదిలిపోయున్న స్టిక్కర్ బొట్టును
సరిదిద్దుకుని, జాకెట్టు హూక్స్
తగిలించుకుని -- ఓణీని సరిచేసుకుని తప్పించుకోవటానికి చూసింది.
నందకుమార్ వెంటనే మామూలు లోకానికి
వచ్చాడు. తలుపులు తెరుచుకుని ‘హలో’ అంటూనే
వాళ్ళని స్వాగతించాడు.
వచ్చిన వాళ్ళు బొమ్మలను చూసి, ఇంటిని
చూసి, ఆంటీని చూసారు.
ఆంటీ...ఒక ప్లేటులో తీసుకు వచ్చిన కేసరిని తిని, నోరు
తెరుచుకుని ' నందకుమార్
మనల్ని ప్రేమించడా?' అనే ఆశ పడి, నిట్టూర్పు
వదిలి, మొహాల్లో కాంతి
తెచ్చుకున్న సమయం ---
జానకీ చిరు నవ్వుతో గది నుండి బయటకు
వచ్చింది. నందకుమార్ యొక్క స్నేహితులను చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది.
ఆంటీకి ఆశ్చర్యం. “నువ్వెలా
ఇక్కడికి వచ్చావే?”
“ఇప్పుడే వచ్చాను...వీళ్ళందరూ
రావటం చూసి...”
జానకీ దగ్గర ప్రేమ కోసం గజకర్న అబద్దం.
ధరణికి అది ఖచ్చితంగా అబద్దమని
అర్ధమయ్యింది. ‘మనం ఇంటికి వచ్చిన
మరు క్షణం నుండి ఎవరూ ఇంటి వాకిటి గుండా లోపలకు రాలేదే...?’
ధరణి చూపులు జానకీను అంచనా వేయటం మొదలు
పెట్టినై. జానకీ నందకుమార్ వైపు చూస్తూ...’వెళ్ళి
రానా’ అనేటట్టు కళ్ళతోనే
అడిగింది.
“జానకీ
నువ్వు కేశరి తిన్నావా?" -- అతను
అడిగాడు.
‘గదిలో నువ్వు
అందించిన తియ్యదనం
కంటే కేశరి తియ్యగానా ఉంటుంది
ప్రేమికుడా...?’ ఆమె మనసులో ఆనంద
జవాబు.
కానీ, పెదాలతో
చెప్పే ధైర్యంలేని కొంచంగా మార్పు ఉన్న ముఖ భావం.
“వెళ్ళవే...వెళ్ళు.
వెళ్ళి చదువుకోవటానికి దారి చూడు. గొప్పగా లెక్కల సబ్జెక్టును ఆశగా తీసుకుంటే చాలా? చదవటం
వదిలేసి నీకు ఇక్కడేం పని...?”
ఆంటీ దగ్గర కాఠిన్యము.
నందకుమార్ అడ్డుపడ్డాడు.
“ఆంటీ!
జానకిని తిట్టకండి. నాకు ఇక్కడ ఒక చెల్లి ఉంటే ఎలాగో, అలాగే
జానకీ నూ...”
నందకుమార్ మాటలతో జానకిలో పిడుగుపడిన
షాక్.
ఆంటీ సంతోష పడింది.
“ఒక్కత్తే
అమ్మాయి...అబ్బాయే లేడని మాటి మాటికీ రోజుకు ఒకసారైనా చెబుతారు మా వారు. నువ్వు
వచ్చావురా బాబూ, పెద్ద కొడుకుగా...”
అంటూ అతనికి దిష్టి తీసింది.
జయశ్రీ దగ్గర ఆశ్చర్యమో...ఆశ్చర్యం. ‘ఈ
నందకుమార్ ఎంతో విచిత్రమైన మానవత్వం ఉన్న మనిషి?’
‘అబ్బో...నిమిషానికి
నిమిషం మనుష్యులను ఆకర్షించటం ఇతని వల్ల ఎలా కుదురుతోందో?’-- జయశ్రీ
నందకుమార్ మత్తులోకి దిగింది.
కానీ, జానకి
ఒక గుక్క ఆసిడ్ తాగిన ముఖం పెట్టింది. వేగంగా ఆ ఇంటి నుండి వెళ్ళిపోయింది.
ధరణి దగ్గర పెద్ద కన్ ఫ్యూజన్. ‘ఇక్కడ
ఏం జరుగుతోంది? ఏదో మర్మం దాగుంది!’
ఒక విధంగా అందరూ మాట్లాడుకుని
బయలుదేరటానికి రెడీ అవుతుండగా -- తాంబూలం, పట్టు
జాకెట్టు గుడ్డలతో, ఒక స్టైన్ లెస్
స్టీలు డబ్బాతోనూ, అందరికీ కుంకుమ
బోట్టు పెట్టి ఆంటీతో ఇప్పించాడు సంతోష్.
పార్వతి గాలిలో తేలడం మొదలుపెట్టింది.
“నందకుమార్...మిమ్మల్ని
పెళ్ళి చేసుకోబోయే పిల్ల చాలా పెట్టి పుట్టుంటుంది. ఇప్పుడే ఇన్ని కార్యాలు
చేస్తున్నారే...! ఇదంతా మా పని”
“పనులలో
మొగవాళ్ళ పని, ఆడవాళ్లపని అని
ఉన్నదా ఏమిటి...? నా వరకు అందరూ, అన్ని
పనులూ చేయగలరు. చేయాలి...”
--- నందకుమార్ యొక్క నిష్పక్షపాతమైన
మాటలతో వాళ్ళ మొహాలు కాకరపువ్వొత్తుల్లాగా వెలిగినై. ఆంటీ దూరింది.
“నందూ...అయితే
నువ్వొక బిడ్డను కనివ్వు చూద్దాం”
అందరూ అదివిని నవ్వుతూ సెలవు
తీసుకున్నారు.
ఆటో తిరుగు ప్రయాణానికి రెడీ అయ్యింది.
నాలుగు రెండ్ల ఎనిమిది అమ్మాయల గాజుల చేతుల ‘టాటా’ తో
ఆటో తిరిగి వెళ్తున్నది చూస్తూ నిలబడ్డాడు నందకుమార్.
ఆంటీ చీర కొంగుతో చేతులు తుడుచుకుంటూ, “నేను
ఇక బయలుదేరతాను...పాలు కాచి ఉంచాను. రాత్రి మరిచిపోకుండా తాగేసి పడుకో...”
అన్నది.
నందకుమార్ ఉత్సాహంగా అది వినితల ఊపాడు.
ఆంటీ బయలుదేరింది.
లోపలకు వచి తలుపులు కూడా మూయకుండా ఈల
వేసుకుంటూ రెండడుగులు ముందుకు వేసిన నందకుమార్ కు వాకిటి తలుపులు ‘దభేల్’ మని
మూసుకున్న శబ్ధం వినబడింది.
వెనక్కి తిరిగి చూసాడు... జానకి.
ఆమె కళ్ళల్లో నీటి సరస్సు....
“ఏయ్...ఏమిటిది, ఇప్పుడే
వెళ్ళావు...ఇంతలో?”.........ఈల
మోత ఆగి అతని పెదాల మీద ప్రశ్న.
“అవును...నేను
మీకు చెల్లెలు లాగానా?” -- ప్రారంభమే
ఆ ప్రశ్న అడిగింది.
నందకుమార్ దగ్గర చిన్న బెదురు.
“ఏయ్!
అదొచ్చి, అదొచ్చి...వూరికే
ఆటగా చెప్పింది”
సమర్ధించుకోవటానికి ప్రయత్నించాడు.
“చెల్లెలు
అంటే అర్ధం ఏమిటో తెలుసా నందకుమార్...?” టపాకాయలాగా
పేలింది జానకి.
“నిప్పు
అంటే నోరు కాలిపోతుందా జానకీ...ఆ టైములో నా నోట్లో అలా వచ్చేసింది”
నందకుమార్ దగ్గర నిర్లక్ష్యం.
“మూర్ఖుడా.
నిప్పు అంటే నోరు కాలదు
అని నాకూ తెలుసు. కానీ కొన్ని మాటలు
జీవితాన్నే కాల్చేస్తాయి
అని నీకు తెలుసా?
మీరెలా అలా చెప్పొచ్చు...?”
“చుట్టూ అందరూ
ఉన్నారు. అందుకనే అలా చెప్పాను”
“ఎవరుంటే
మీకేంటి? మీరు నన్ను
ప్రేమిస్తున్నారు. సంధర్భం దొరికినప్పుడు ధైర్యంగా దాన్ని బయటకు చెప్పటానికి
మీకెందుకు భయం?”
“నువ్వు చదువుకుంటున్న
అమ్మాయివి. నేను కాలేజీ స్టూడెంటును. అది మనల్ని బాధిస్తుంది...”
“స్టూడెంట్
అయితే మనం ప్రేమించేది మాత్రం కరెక్టా?”
“అది వేరు జానకీ...యౌవ్వనం
యొక్క ఒక భాగం అది?”
“అప్పుడు పెళ్ళి?”
“అది ఉద్యోగం దొరికిన
తరువాత”
“ఖచ్చితంగా
జరుగుతుంది కదా?”
“ఖచ్చితంగా...!”
-- మాట్లాడుతూనే ఆ చేదైన సమయంలో కూడా ఆమెను కౌగలించుకున్నాడు.
ఆమె వదిలించుకోవటం మొదలుపెట్టింది. ఆశను అనుచుకోవటం
ప్రారంభించింది.
‘దేవుడా...దేవుడా’ అంటూ
లోతైన మనసులో నమ్మకం పాటను పాడుకుంది.
‘రేపు
ఇతను రాక్షసుడుగా మారే అతను’
అనే కనువిప్పో, లెక్కో ఏదో ఒకటి ఆమె
మదిలో మెదిలింది.
ఆడతనం అనే సున్నితానికి ఇలాంటి కనువిప్పు నమ్మకం
ఉంటూనే మంచిది!
ఆటోలొ నుండి అందరూ దిగారు. చివరగా జయశ్రీ
దిగింది. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏకాంత భావం.
అది చూడంగానే తండ్రి మోహన్ శర్మ దగ్గర
ఖచ్చితమైన లెక్క.
“ఎక్కడకమ్మా
వెళ్ళొస్తున్నావు?”
“నా స్నేహితుడి
ఇంటికి...”
“నుదిటి
మీద ఇప్పుడే పెట్టినట్టు ఉన్న కుంకుమ...”
“అవును
నాన్నా...బొమ్మలు పెట్టారు, అందుకే!”
“మంచిది...బాగా
సంతోషంగా ఉన్నట్టు కనబడుతున్నావే?”
“అవును
నాన్నా...కొంతమంది మగవాళ్ళు, అంటే
మా కాలేజీలో ఒకతను నన్ను బాగా ఆశ్చర్యపెడుతున్నాడు. ‘వాట్
ఏ గ్రేట్ పర్సనాలిటీ’...?”
“ఏంటమ్మా ఆ గ్రేట్
పర్సనాలిటీ?”
“రామాయణంలోని రాముడే
నాన్నా...”
“రాముడా!
ఈ,
కలియుగ కాలంలో ఎవరూ అలా ఉండలేరమ్మా...”
“ఏం
నాన్నా...మీరు లేరా?”
“ఎవరూ ఉండలేరు అంటే
నేను కూడా నమ్మా...”
“ఏమిటి
నాన్నా...నెత్తి మీద బాంబు వేస్తున్నారు మీరు...?”
“నేను బాంబు వేయటం
లేదు. నువ్వే వేస్తున్నావు! ఈ రోజు అబ్బాయలను రాముడూ, కృష్ణుడూ
అని నమ్మి మోసపోకు...”
ఆయన అన్న మాటలను గోడ గడియారం గంటల మోతతో
అవునన్నట్టు తెలిపింది.
Continued...PART-5
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి