26, నవంబర్ 2022, శనివారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-8)

 

                                                                          ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                          (PART-8)

ఆ రోజు.

కాలేజీ ఆవరణ కళకళ లాడుతున్న ప్రొద్దుటి సమయం. టైకట్టుకున్న ప్రొఫసర్ల గర్వమైన నడక. ప్రొద్దుటి బద్దకంతో స్టూడెంట్స్ దేహాల గుంపు. క్లాసు బెంచీల మీద తాళం వేస్తూ కథలు చెప్పుకుంటున్నకొందరు. జయశ్రీ మాత్రం మామూలు కంటే ఎక్కువ మౌనంతో ఉంది.

మనసులో స్లో మోషన్లోరాజకుమారుడి దుస్తుల్లో నందకుమార్ డూయెట్పాట మొదలుపెట్టి – రా జయశ్రీ! కలిసి పాడు...అని పిలుస్తున్నట్టు బ్రమ.

పక్కన కూర్చున్న ధారణి అది అర్ధం చేసుకునట్టు నవ్వింది.

ఇప్పుడంతా కాలేజీలో సర్టిఫికేట్కంటే సులభంగా ప్రేమ దొరుకుతోంది. డిగ్రీకంటే సులభంగా మొగుడు దొరికేస్తున్నాడు... అన్నది, కొంచం వేళాకోళంగా.

ఎవర్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు?”

----పార్వతి దగ్గర నుండి ఎదురు ప్రశ్న.

అంతా మన జయశ్రీని తలుచుకునే. నందకుమార్ ని తలుచుకుని జయశ్రీ మంచు గడ్డలాగా కరిగిపోతోంది అన్నది.

అదెలా నీకు తెలుసు?”

నాకు ఎలా తెలుసు అని అడుగుతున్నావా? నేను పాఠాలు చదవటంలో వీక్ గా ఉండొచ్చు. కానీ, కాలేజీలో ఎవరు, ఎవరిని సైటు కొడుతున్నారు...ఎవరు ఎవరితో సినిమాకు వెడుతున్నారు...కౌగలించుకుని డూయట్ పాడుతున్నారు అనేది లెక్క తీయటంలో ఇక్కడ ఒక నిపుణుల గుంపే ఉంది. నేను దాంట్లో మెంబర్...

అది సరే... నందకుమార్ జయశ్రీ ని లవ్ చేస్తున్నాడా?”

అవును...చీమకు బెల్లం చేదా ఏమిటి?”

మనమందరం కూడా బెల్లమే

ఉండొచ్చు. కానీ, తెల్ల బెల్లానికీ -- నల్ల బెల్లానికీ తేడా ఉందిగా?”

అంటే మనమందరం నల్ల బెల్లమా?”

ఏదో ఒకటి. ఇప్పుడు అమ్మడు అతన్ని చూసి కరగటం మొదలుపెట్టింది. అతను వచ్చే సమయం... అని ధారణి చెప్పి నప్పుడు...

కాలేజీ తారు రోడ్డు మీద నందకుమార్ యొక్క సంతోషమైన వాహన సవారి!

నీలి రంగు చొక్కా, నీలి రంగు ప్యాంటూ, ఆకాశం రంగును చూపిస్తున్నట్టు బైకు నుండి స్టైలుగా దిగిన అతన్ని బోలెడు నలుపు, తెలుపు బెల్లాలు చూస్తున్నాయి.

అతనో తన సైన్యం కబుర్లు చెప్పుకుంటున్న పన్నీర్ చెట్టు నీడ దగ్గరకు వెళ్ళి చేరాడు.

రా మావా రా...ఏమిటీ నీలి రంగు దుస్తుల్లో అదరగొట్టే గ్లామర్ తో వచ్చావు?”

మన లెక్షరర్ రేణుకాకి బ్లూ రంగుఅంటే చాలా ఇష్టం కదా?”

ఓరి వెధవల్లారా! ఆడ స్టూడెంట్స్ ని టీజ్ చేస్తూ, చివరకు పాఠాలు చెప్పే లెక్షరర్ల దాకా వచ్చారా?”

ఏది సూటవుతుందో...దాన్ని దక్కించుకోవాలి మావా…

అవునూ, జయశ్రీకి ఏమైంది? నలభై ఎనిమిది రోజుల వ్రతంలో ఏదైనా పురోగతి ఉన్నదా?”
ఇప్పుడు నన్ను తలుచుకుని డూయెట్ పాడటం మొదలుపెట్టింది. ఒక వారం పోనీ. ఆమెగానే లెటర్ రాసి పంపిస్తుంది చూడు

అదెలా మామా ప్రేమ చరిత్రలో అంత ఖచ్చితంగా నువ్వు లెక్క వేస్తున్నావు?”

అదంతా పూర్వ జన్మ పుణ్యం భక్తా

జయశ్రీతో ప్రేమ మాత్రమేనా...పెళ్ళి కూడానా

మన చరిత్రలో ఎవరినీ పెళ్ళి చేసుకునే ఆలొచనే లేదు. అదీ దాటి పెళ్ళి చేసుకున్నా...సినిమా నటీమణులలో ఎవరినైనా చేసుకుంటే చేసుకోవచ్చు

అవును నాయకా! నువ్వు కనపడలేదని వాళ్ళూ బెంగగా ఉన్నారు...

రేయ్! నాయకుడి పుట్టు మచ్చ గురించి నీకేం తెలుసు? అది రంభా, ఊర్వశీలనే  దక్కించుకునే మచ్చరా. అయినా కానీ జయశ్రీని ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారని...

మాటకు మాట పెరుగుతూ పోతున్నప్పుడు గౌతం ఆ గుంపులోకి దూరాడు.

అతన్ని చూసిన వెంటనే మాటలన్నీ వేరే టాపిక్ గా మారినై.

మామా...ఈ కవి కూడా ఎవరినో లవ్చేస్తున్నట్టు చెప్పేడే, ఎవరై ఉంటారు?”

ఉత్తుత్త కబుర్లు మామా. వీడి మాసిపోయిన జుబ్బా వాసనకి బిచ్చగత్తే భయపడి పారిపోతుంది. వీడిని ఒకత్తి లవ్చేస్తుంది అనుకుంటున్నావా?”

“‘ఒన్ వేప్రేమ అని చెప్పాసాడే. ఆ తరువాత మన కాలేజీ మహారాణుల గురించి ఎందుకు అనవసరమైన మాటలు? వీడు లవ్చేస్తున్న ఆ దేవతను మీకెవరికైనా తెలుసా? తెలుసుకుని వచ్చినతనికి బహుమతి...ఏం నందకుమార్, కనిపెట్టటం కుదురుతుందా? నువ్వు ఆడపిల్లలను మాత్రమే వంచ గలవు. వీడి లాంటి మనుష్యులను పరిశోధించి విషయం తెలుసుకోవటం కుదురుతుందా? నీకు కుదిరితే వెయ్యి రూపాయలు ఇస్తాను

ఒకడు నందకుమార్ ని పెద్దగా గిల్లాడు. నందకుమార్ ని కాదని ఏ మగాడ్నీ చూసి కుదురుతుందా, సాధ్యమా అని అడగ కూడదు.

కుదరదు అని ముందే తెలిసినా, ప్రయత్నం చేసి చూడటం యవ్వనం యొక్క విచిత్రమైన స్వభావం. నందకుమార్ ను కూడా ఆ స్వభావం ఒక ఊపు ఊపటం మొదలుపెట్టింది.

ఈ గౌతం ఏమైనా పెద్ద వాల్మీకా? ఇతన్ని అర్ధం చేసుకునేదీ, అతని మనసులో ఉన్నది తెలుసుకోవటం పెద్ద విషయమా ఏమిటి?” 

ఇదిగో చూడు, నువ్వు పందెం వేసిన పార్టీ ఏమీ తెలివి తక్కువ వాడు కాదు. మేమేమీ కారణం లేకుండా వెయ్యి రూపాయలు పందెం కట్టలేదు

----ఆ జవాబు విన్న నందకుమార్ వెంటనే గౌతం దగ్గరగా వెళ్ళాడు.

హలో కవిగారూ... అంటూ గౌతం భుజం మీద చేతులు వేసాడు.

గౌతం కి అది నచ్చకపోయినా, నందకుమార్ చేతిని తీసేయకుండా జవాబుగా  నవ్వాడు.

పందెం వేసుకుని ఇద్దరం పోటీలోకి దిగేశాము. ప్రేమ గెలవబోతుందా, లేక...కామం గెలవబోతుందా అని కాలేజీ మొత్తం మాటలే. ప్రిన్సిపాల్ చెవులకు కూడా విషయం వెళ్ళి జేరింది

నందకుమార్ మాటలు విన్న గౌతం దగ్గర ఒక విజయోత్సాహ నవ్వు.

ఎవరి చెవులకు వెళ్ళినా, వెళ్ళకపోయినా, నేనే గెలుస్తాను అన్నాడు గౌతం.

మొదట ప్రేమించాలి...ఆ తరువాత విజయం-ఓటమి గురించి మాట్లాడాలి...?”

అది నా అవస్త, నువ్వెందుకు బాధ పడతావు

ఏయ్, ఇదేంటి పిచ్చి మాటలు? మొదట ఒకత్తికి ధైర్యంగా ఐ లవ్ యూచెప్పి, ఆమె దగ్గర నుండి చెప్పించుకో. నేను ఆ వెంటనే పందెం నుండి తప్పు కుంటాను. నువ్వు గెలిచినట్టు ప్రకటిస్తాను

దానికి సమయం -- కాలం ఉన్నది. ఇప్పుడు మనం చదువుకోవటానికి వచ్చాము. వెళ్ళి చదివే పద్దతి చూడు...

అదే కదా చూసాను...నీ కేమిటి, ప్రేమ రావటమేమిటి? ఏదో భావోద్వేగం వేగంతో పందెం-గ్రంధం అని దిగాసావు! నీకు సరిసమంగా నేనూ పందెంలో దిగాను చూడు...నన్ను అనాలి

ఎగతాలి చేస్తున్నట్టు నందకుమార్ దగ్గర నుండి వచ్చిన మాటలు, గౌతంను రెచ్చగొట్టాయి. లోతైన అతని మనసులో సేకరించబడి ఉన్న ప్రేమ భావాలు, ఇష్టాలూ వెంటనే నాలుక వైపు పరిగెత్తి రావటం మొదలు పెట్టినై.

నీ మనసులో కల్పనలో వెయ్యిమందిని కూడా ప్రేమించవచ్చు. నేను కూడా ఒక నటిని నా కల్పనలో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇవన్నీ ప్రేమ అవుతాయా? వాస్తవానికి రా...

పాపం ఆ నటి...! నేను నీలాగా కాదు నందకుమార్.  నా ప్రేమికురాలు అత్యంత తెలివిగల ఒక అమ్మాయి. శరీర అందం మాత్రమే కాదు...మనసు అందం కూడా కలిగినది…

అలాగైతే ఆమె ఎవరో చెప్పు...

నీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు

పందెం కట్టిన వాడి దగ్గర చెప్పకుండా, ఇంకెవరి దగ్గర చెప్ప బోతావు? నాకే కదా తెలియాలి. మొదట నువ్వు ప్రేమిస్తున్నది ఎవరనేది తెలియాలి. ఆ తరువాత నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్నదా అనేది తెలియాలి. ఆ తరువాతే కదా నువ్వు పందెంలో గెలుస్తావా, ఓడిపోతావా అని తెలుస్తుంది

అది విన్న గౌతం చాలాసేపు మాట్లాడలేదు. ఏదో భావోద్వేగంలో నందకుమార్ దగ్గర చిక్కు కున్నట్టు ఒక భావం అతనిలో మెదలింది. 

ప్రేమిస్తున్న అమ్మాయి పేరు వీడి దగ్గర చెప్పటంలో తప్పు లేదు. కానీ, వీడు దాన్ని కాలేజీ అంతా డోలు వాయించి దండోరా వేసి చెబుతాడు. మనల్ని ఇంకా ప్రేమించని ఆ అమ్మాయికీ అది అవమానం అయిపోతుంది. కార్యమూ చెడిపోతుంది!

నిర్ణయాత్మకంగా నోరు మెదపను అనే నిర్ణయానికి వచ్చిన గౌతం, ఏదీ మాట్లాడకుండా అక్కడ్నుంచి నడవటం మొదలుపెట్టాడు. నందకుమార్ కి అతని నడవడిక చిర్రెత్తించింది.

ఏయ్...ఏమిటీ! మాట్లాడుతున్నప్పుడే వెళ్ళిపోతున్నావు...?”

----నేను నిన్ను విడిచి పెట్ట దలుచుకోలేదూ అనే విధంగా అతని ముందు ప్రశ్నతో వెళ్ళి నిలబడ్డాడు.

నువ్వు నాకు నమ్మకమైన మనిషివి కాదు. నీ దగ్గర నా ప్రేమికురాలి పేరు చెప్పలేను. ఆమె కూడా నన్ను ప్రేమించటం ఖచ్చితమవనీ. అప్పుడు ఇద్దరం కలిసి వచ్చి చెబుతాము. ఇప్పుడు నన్ను వెళ్ళనీ...--అన్నాడు గౌతం.

ఆమె ఎప్పుడు నిన్ను ప్రేమించేది...అది ఎప్పుడు నాకు తెలిసేది?  అంతవరకు పందెం ఏమయ్యేది?” -- అన్నాడు నందకుమార్. 

పెద్ద పందెం. కావాలంటే పందాన్ని నేను ఇప్పుడే వాపస్ తీసుకుంటాను. నీ దగ్గర పందెం కట్టిన నా భావొద్వేగానికి నేను చాలా విచారిస్తున్నాను. దానికంటే వాపస్ తీసుకున్నందు వల్ల పెద్ద బాధ ఏర్పడదు. పందెంలో నువ్వే గెలిచినట్టు ఉండనీ. నన్ను వదిలిపెట్టు...

----మాట్లాడేసి వెళ్ళిపోయాడు గౌతం.

నందకుమార్ కి అతని మొదటి ప్రయత్నంలోనే మొదటి ఓటమి. ఆ పులి మొహంలోని కళ్ళల్లో అసాధ్యమైన కసి. చుట్టూ నిలబడ్డ ఫ్రండ్స్ అతన్ని ఎగతాలిగా చూస్తున్నట్టు బ్రమ. కాలేజీ క్యాంపస్ లో అతని గంభీరానికి అవమానం ఏర్పడినట్టు ఫీలింగ్. 

గోళ్ళను పళ్ళతో కొరకటం మొదలు పెట్టాడు.

చాలా సేపు. ఎక్కువ సేపు...దగ్గరగా జరుగుతున్న కెమిస్ట్రీ క్లాసులో ఆమ్లలాల గురించి వివరిస్తున్న వివరణ మెల్లగా చెవిలో వినిపించింది.

దూరంగా ఉన్న క్యాంటీన్ నుండి వస్తున్న ఉల్లిపాయ, కొత్తి మీరతో చేస్తున్న వంటకం యొక్క వాసన గాలిలో ఎగురుతూ వచ్చింది.

భుజాలపైన కొందరి స్నేహితుల చేతులు పడ్డాయి.

ఏమైంది మామా... గౌతం నీ దగ్గర చిక్కాడా, లేదు నువ్వు గౌతం దగ్గర చిక్కావా?”

అతను శొకంగా ఉండటం చూస్తే వెయ్యి రూపాయలు మనకు మిగిలేటట్టు ఉంది. నేను అప్పుడే చెప్పానే! నీ ట్రిక్కులన్నీ ఆడవాళ్ళ దగ్గర మాత్రమే, వాడి దగ్గర చెల్లుబడి అవదని

స్నేహితులు మాట్లాడుతుంటే -- నందకుమార్ లో మొదటి సారిగా ఓటమి జ్వరం పొగరెక్కి -- రక్తంలో వేగంగా వెడుతూ నెత్తుటి కణాలను కాల్చివేస్తున్నట్టు ఒక ఫీలింగ్. 

అరిగిపోయిన చేతి వెళ్ళ గొరు ముక్కలను పళ్ళతో వెతకటం మొదలు పెట్టాడు.

ఓడిపోవడం అనేది నా చరిత్రలోనే లేదు అన్నాడు కటోరంగా.

అతని కటోరాన్ని చెరిపే లాగా జయశ్రీ వస్తూ ఉన్నది.

అందమైన జడ అలంకారంతో -- అందమైన చీరలో అందాల పోటీ వేదికపై వయ్యారంగా నడుస్తున్న విధంగా ఆమె రావటాన్ని చూసిన తరువాత నందకుమార్ లోపల జ్వరమూ, బ్రమ మెల్లగా కిందకు జారటం మొదలుపెట్టినై.

సరి, సరి! జరుగుదాం. జయశ్రీ వస్తున్నది... అంటూ స్నేహితులు వెనక్కి  తిరిగారు

దగ్గరగా వచ్చింది జయశ్రీ. హలో చెప్పి,“ఎందుకు అదొలా ఉన్నారు?” అని మొదలు పెట్టింది.

అతనికి ఆమె స్నేహం వెంటనే కావల్సి వచ్చింది. ఒక వారం, పది రోజులు తరువాత ఆమె దగ్గరకు చేరుదాం అనే అతనిలో అంతకు ముందు ఏర్పడిన అభిప్రాయాన్ని తీసి చెత్త కుండీలో విసిరేసి అప్పుడే ఆమె దరకి చేరటం ప్రారంభించాడు.

మనసే బాగుండలేదు... అన్నాడు.

ఏం? ఏమైంది?”

ఆ గౌతం దగ్గర పందెం కట్టటాన్ని తలుచుకునే...

పందెంలో మీరే గెలుస్తారు. అందులో మీకు సందేహమేంటీ?”

నేను గెలవకూడదు జయశ్రీ. పాపం... గౌతం! మనసు విరిగి పోతాడు...

నందకుమార్ యొక్క ఆ కొత్త వ్యూహం ఉచ్చులో ఇరుక్కున్న జయశ్రీ ఆశ్చర్యపోయింది.  

మీరు ఒక జెంటిల్ మ్యాన్ అన్నది.

పొగడ్త ఎందుకు జయశ్రీ? వాడి దగ్గర పందెం ఏమీ వద్దూ అని చెబుదామనుకుంటున్నా. నా నోటితో అది చెప్పాలంటే నా స్వీయ గౌరవం అడ్డుపడుతోంది...

కావాలంటే నేను వెళ్ళి చెప్పనా?”

నిజంగానా...? అలాగే గౌతం ఎవర్ని ప్రేమిస్తున్నాడో తెలుసుకుంటే వసతిగా ఉంటుంది

అది మనకెందుకు?”

అలా కాదు జయశ్రీ. ఏది ఏమైనా వాడు మన గ్రూపులోని ఒకడు. ఒన్ సైడు ప్రేమతోనలిగిపోకూడదు. వాడు ప్రేమించే అమ్మాయి ఎవరనేది తెలిస్తే మనమే ఆ అమ్మాయిని చూసి, గౌతం గురించి మంచి విధంగా చెప్పి, అతని ప్రేమను ఎంకరేజ్చేయచ్చు కదా?” 

---- నందకుమార్ మాట్లాడుతుంటే జయశ్రీ యొక్కపెద్ద కళ్ళు పొంగి పొర్లి ఆ తరువాత మామూలై, “నందకుమార్! మీ క్యారక్టర్ నన్ను ఆశ్చర్య పరుస్తోంది... అని చెప్పింది.

నన్ను చూసి ఆశ్చర్య పడటానికి ఏముంది జయశ్రీ. అందరూ ప్రేమించుకుంటున్న ఈ ప్రపంచంలో నన్ను ప్రేమించటానికే ఎవరూ లేరు అన్నాడు చాలా నీరసంగా.  

జయశ్రీకి అతని మాటలు చురుక్కున గుచ్చుకున్నాయి.

నేనున్నాను నందకుమార్... అన్నది అతి వేగంగా.

నిజంగానా జయశ్రీ?”

దేవుని సాక్షిగా

జయశ్రీ...నేను చాలా అదృష్టవంతుడ్ని...

నేను కూడా!

అప్పుడు గౌతం విషయాన్ని కొంచం త్వరగా ముగించు. మన ప్రేమ సంతోషాన్ని మనం మన కాలేజీ ఆడిటోరియం సినిమాహాలులో ఉంచి ఎంజాయ్ చేద్దాం...

ఖచ్చితంగా…

----అతన్ని చూసి నవ్వుతూ మాట్లాడిన జయశ్రీ, గౌతంను వెతుక్కుంటూ వెళ్ళింది.

                                                                                                                        Continued...PART-9

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి