18, నవంబర్ 2022, శుక్రవారం

చంద్రుడు లేకుంటే?!... (ఆసక్తి)


                                                                                   చంద్రుడు లేకుంటే?!                                                                                                                                                                         (ఆసక్తి) 

చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు). ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. గ్యానిమీడ్, టైటన్, క్యాలిస్టో, ఐఓ అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.

చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్లు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షమూ మంచూ అసలు కురవనే కురవవు.” తరతరాలుగా భూమ్మీది ప్రజలు వాతావరణంలో వచ్చే మార్పుల గురించి చంద్రుని వంక చూస్తూనే ఉన్నారు. నిజమే, భూమి మీది వాతావరణాన్ని చంద్రుడు చాలా సున్నితంగా ప్రభావితం చేస్తాడు. భూ వాతావరణ వ్యవస్థల్లో కూడా చంద్రుని ప్రభావం ఉంటుంది.

చంద్రుడు భూమి నుండి సుమారు 3 లక్షల 84 వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. చీకట్లో వెన్నెల రూపంలో భూమికి కాంతిని ప్రసరింపజేసే చందమామ రూపం చూడముచ్చటగా ఉంటుందనేది తెలిసిందే. అయితే, అందమైన చందమామ లేకపోతే భూమి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? చందమామ లేకపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రపు ఆటుపోట్ల ద్వారా భూమిపై చంద్రుడు కలిగించే ప్రభావాన్ని మనం చూడొచ్చు. భూమి ప్రతిరోజూ తన చుట్టు తాను తిరుగుతున్నప్పుడు చంద్రుని గురుత్వాకర్షణ ప్రభావం వల్ల సముద్రాలలోని నీరు సమీపంలోని నేల వైపుకు ఆకర్షితమవుతుంది. ఫలితంగా నీరు ఉవ్వెత్తుగా లేస్తుంది. అదే సమయంలో భూభ్రమణం కారణంగా ఏర్పడ్డ అపకేంద్ర బలంతో నీరు నేల నుంచి సముద్రం లోపలి వైపుకు కూడా అంతే ఎత్తుతో వెళ్తుంది. అలల కింద భూమి తిరుగుతూ ఉంటుంది. అందుకే సముద్రంలో ప్రతిరోజూ రెండు చొప్పున అధిక, అల్ప ఆటుపోట్లు ఏర్పడతాయి.  

భూమి నుంచి చంద్రుడు కనిపించకుండా ఒక రోజు 6 నుంచి 12 గంటలు మాత్రమే ఉంటుంది. విధంగా, సంవత్సరంలో వెయ్యి రోజులకు పైగా ఉండవచ్చు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి యొక్క భ్రమణం నియంత్రణలో ఉంటుంది. అంటే ఒక రోజు పూర్తి కావడానికి 24 గంటల సమయం పడుతుంది. అదే చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి లేకపోతే, భూమి వేగంగా తిరుగుతుంది. ఫలితంగా ఒక రోజు అత్యంత వేగంగా గడిచిపోతుంది.

చంద్రుడు లేకపోతే.. చంద్రగ్రహణం, సూర్యగ్రహణాలు ఏర్పడవు. చంద్రుడు లేనప్పుడు, సూర్యుడిని అడ్డగించే మరో గ్రహం ఉండదు కాబట్టి.. సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం జరగదు.

చంద్రుడు లేకుంటే.. భూమి యొక్క అక్షం వాలు కాలక్రమేణా మారుతుంది. కారణంగా, భూమిపై ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రస్తుతం, చంద్రుని కారణంగా మన భూమి 23.5 డిగ్రీల వద్ద వంగి ఉంటుంది. కానీ చంద్రుడు లేకుంటే భూమి ఎక్కువ అక్షం వాలు కలిగి ఉంటుంది. ఫలితంగా వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి.

వాతావరణ మార్పుల కారణంగానే సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెబుతోంది. దీనికి తోడులూనార్ నోడల్ సైకిల్కూడా ప్రభావం చూపిస్తే 2030 నాటికి అధిక ఆటుపోట్లతో కూడిన వరదలు గణనీయంగా పెరుగుతాయని వెల్లడించింది. సహజ సిద్ధంగా, మానవ చర్యల ఫలితంగా సముద్ర మట్టాలు ఎలా స్పందిస్తాయి. వాటివల్ల తీర ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఎలాంటి ప్రభావాలు కలుగుతాయో అనే అంశంపైనాసా సీ లెవల్ చేంజ్ సైన్స్ టీమ్లీడ్, పరిశోధక శాస్త్రవేత్త బెంజమిన్ హామ్లింగ్టన్ ఆసక్తి చూపుతున్నారు. హామ్లింగ్టన్ కాలిఫోర్నియాకు వెళ్లకముందు వరద ప్రభావిత ప్రాంతమైన కోస్టల్ వర్జీనియాలో నివసించేవారు.

తీర ప్రాంత సమాజాలపై వరదలు విస్తృతమైన ప్రభావాన్ని చూపుతాయి. ఉద్యోగ అవకాశాలను, వ్యాపార నిర్వహణను కష్టతరం చేస్తాయి. ప్రస్తుతం ఇది ఇబ్బందికర అంశంగా ఉంది. కానీ రానున్న కాలంలో దీన్ని మర్చిపోవడం కష్టమే. దీంతో బతకడం కూడా కష్టమే అవుతుందిఅని ఆయన అన్నారు.

చంద్రుడి విశేషాలు:

ద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 29.5 భూమి యొక్క రోజులు పడుతుంది. అనగా చంద్రుడిపై ఒక్క రోజు, భూమిపై ఒక నెలకు సమానం. చంద్రుడు భూమిని ఒక్కసారి చుట్టిరావడానికి 27.3 రోజులు పడుతుంది. భూమి-చంద్రుడు-సూర్యుడు మధ్య వ్యవస్థాపక మార్పుల వల్ల ఒక చంద్రమాసానికి 29.5 రోజులు పడుతుంది. దీనినే చంద్రమాసము అంటారు. చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికీ భూమి చుట్టూ తిరగడానికీ ఒకే సమయం పడుతుంది. కారణం వల్ల భూ వాసులకు చంద్రుడి ఒకే ముఖం కనబడుతుంది. భూ వాసులు, చంద్రుడి ఆవలి వైపు ఎప్పటికీ కనబడదు. దీన్ని టైడల్ లాకింగు అంటారు. చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. ద్రుడి సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు. చంద్రుడి గరిష్ఠ ఉష్ణోగ్రత 127 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత -173 డిగ్రీల సెల్సియస్.1959 సెప్టెంబర్ 14 రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది. చంద్రుడి పై ఇప్పటి దాకా నడిచిన వ్యోమగాములు 12 మంది. ఇప్పటి దాకా 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు వ్యోమగాములు.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి