29, నవంబర్ 2022, మంగళవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-9)

 

                                                                        ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                         (PART-9)

గౌతం, కళాశాల ఆవరణలోని లైబ్రరీ బయట అశోక చెట్టు క్రింద ఉన్న సిమెంటు బెంచి ఒక దానిపై కూర్చోని ఉన్నాడు.

హలో... -- కోయిల లాంటి స్వర పిలుపుతో దగ్గరకు వెళ్ళింది జయశ్రీ.

గౌతంకి మంచు పొదలో చిక్కుకున్నట్టు ఒక ఆశ్చర్యం. ఆమెను నవ్వుతూ చూసాడు.

ఏమిటి విషయం జయశ్రీ?” అన్నాడు.   

మీరు నందకుమార్ దగ్గర పందెం కట్టింది నాకెందుకో సరి అనిపించటం లేదు! అతను కూడా దాన్ని ఇష్టపడటం లేదు. మాటలు పెంచకుండా దాన్ని డ్రాప్చేసేయండి...

నేను చేసేసేనే!

గౌతం నుండి చటుక్కున వచ్చింది జవాబు. 

ఎప్పుడు?”

ఇప్పుడే. అవునూ, నువ్వెందుకు జయశ్రీ అది అడిగుతున్నావు?”

ఏమైనా మనం అందరం ఒక గ్రూప్ కదా! మనలోనే పందెం -- గొడవలూ బాగుండవు...అందుకే

అందుకనే నేను దాన్ని పెద్దగా తీసుకోకుండా వాపస్ తీసుకున్నాను

అలాగైతే చాలా సంతోషం. అవును, మీరు నిజంగానే ఎవరినైనా లవ్చేస్తున్నారా?”

--- జయశ్రీ వేసిన ఆ ప్రశ్నకు అతను చాలా సేపు మౌనంగా ఉన్నాడు.

నా ప్రేమికురాలివి నువ్వే కదా జయశ్రీ? నువ్వా ఇలా అడిగేది? ఇలా అడగటం కూడా మంచికే! ఒంటరిగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఐ లవ్ యూఅని చెప్పే అవసరం నువ్వే ఇప్పుడే ఇక్కడే కలిగించావే...!

----ఆలోచించి చూసిన అతను అవును జయశ్రీ. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నాడు చాలా నెమ్మదిగా.

ఎవరా అదృష్టవంతురాలు?”

చెబితే కోపగించుకోవుగా?”

లేదు...లేదు. మీకు సహాయం చేయటానికే నేను వచ్చాను

"నా ప్రేమికురాలే నాకు సహాయం చేయటానికి వచ్చిందీ అంటే నేను అదృష్టం చేసుకోనుండాలి".......

---అది విన్న వెంటనే ఆకాశం అప్పడం లాగా విరిగి నేల మీద పడినట్టు అదిరిపడింది.

గౌతం, ఏం చెబుతున్నారు?”

“‘ఐ లవ్ యూజయశ్రీ. నేను ప్రేమించేది నిన్నే నని చెబుతున్నా

కానీ, నేను నిన్ను ప్రేమించటం లేదే!

జయశ్రీ సమాధానంతో గౌతంకి అతిపెద్ద షాక్. చాలా సేపు ఆ షాక్ యొక్క తరంగాల విస్తరింపు. దగ్గరున్న లైబ్రరీ లోకి వెళ్తున్నవారు - వస్తున్నవారు నడుస్తున్న శబ్ధం కూడా వినబడని నిశ్శబ్దం. 

అశోక చెట్టు మీద తోక ఆడించే పిచ్చుక ఒకటి వచ్చి కూర్చుని కింద నిలబడ్డ ఇద్దరినీ చూస్తోంది.

అది పరవాలేదు జయశ్రీ. కానీ, నేను నిన్ను ప్రేమిస్తున్నది నిజం. ఇప్పుడు మాత్రమే కాదు. ఎప్పుడూ...

----ఒక విధంగా శక్తిని కూడదీసుకుని పుస్తకాన్ని తిరగాసాడు గౌతం.

తప్పైన నిర్ణయం గౌతం. నేను నిన్ను ప్రేమించటం లేదు. నందకుమార్ ని ప్రేమిస్తున్నాను. అతని లాంటి ఒక జెంటిల్ మ్యాన్ను చూడలేము. దయచేసి మీ ఆలొచననీ, నిర్ణయాన్నీ మార్చుకోండి. ప్రేమంటేనే కామం అనే పార్టీలో చేరిన వాళ్ళని నా వల్ల ఏ రోజూ ప్రేమించటం కుదరదు గౌతం

గబ గబా మాట్లాడిన జయశ్రీ నడవటం మొదలు పెట్టింది. 

వెళ్ళే అవసరంలో జయశ్రీ చేతిలో తీసుకు వచ్చిన పుస్తకాన్ని ఆ సిమెంటు బెంచీ మీదే పెట్టేసి మరచిపోయి వెళ్ళిపోయిందని తరువాతే చూసాడు గౌతం.

ఆ పుస్తకాన్ని చేతుల్లో తీసుకున్నాడు. జయశ్రీఅన్న ఆమె పేరు తెలుగులో రాయబడి ఉంది. వాటి మీద గౌతం కళ్ళళ్ళోంచి రెండు బొట్లు నీరు పడి  అక్షరాలను చెరిపింది. అప్పుడు అతని మనసు ఆమె ప్రేమకి అభినందనలను తెలిపే పక్వతని, నాగరీకాన్నీ జ్ఞాపకానికి తీసుకు వచ్చింది. చేతిలో పుస్తకంతో జయశ్రీను వెతుక్కుంటూ నడవటం మొదలు పెట్టాడు.   

వెళ్ళిన వేగంతో వెనక్కి తిరిగిన జయశ్రీని ఆదుర్దాగా స్వాగతించాడు నందకుమార్.

జయశ్రీ, వెళ్ళిన పని విజయవంతమే కదా? గౌతం ప్రేమికురాలు ఎవరు...?” -- అతని ఆదుర్దాకు వేగంగా జయశ్రీ దగ్గర నుండి జవాబు రాలేదు. మారుగా ఆమె మొహంలో వేడి తగిలి ఆగినట్లు ఒక శోకం.  

అమె మౌనం నందకుమార్ దగ్గర చిరాకు ఏర్పరచింది.

అడుగుతున్నాను కదా... నందకుమార్ దగ్గర చిరాకు.

సారీ నందకుమార్. నేను ఎందుకు వెళ్ళానా అని అనిపించింది. ఆ పిచ్చిమాలోకం నన్నే లవ్చేస్తున్నాడు...

---- జయశ్రీ అలా చెప్పటంతో అధిరిపడ్డాడు నందకుమార్. కొంచం సేపటికి ముందు ఏర్పడిన ఆందొళన, జ్వరం అలాగే వెర్రిగా రూపం మారి – గౌతం ఉన్న దిక్కు వైపుకు తిరుగుతున్నట్టు ఒక సంతోషం.

నీ ప్రేమికురాలేనా నా ప్రేమికురాలు?’

ఎగతాలి లాంటి ప్రశ్న లోలోపల.

ఇక నా ప్రేమికురాలుని పెట్టుకునే నీకు పాఠం నేర్పిస్తాను...దెబ్బ కొడతాను...! నీ ప్రేమ శపధాన్ని పిప్పి చేస్తాను...! మనసులో లెక్కకు పైన లెక్క వేయటం మొదలు పెట్టాడు నందకుమార్.

ఏమిటి నందకుమార్! షాకయ్యారా. జయశ్రీ నువ్వు గౌతంనే లవ్ చేయి అని గొప్ప మనసుతో చెప్పి నన్ను ఏడిపించకండి...

ఆమె మాటలు నందకుమార్ ని నవ్వించాయి.

తన అప్రోచ్ చే ఈమెను ఎంతగానో మొసగించింది! రేయ్ నందకుమార్! నువ్వు గొప్ప నటుడివిరాఅని తనకు తానే ప్రసంసించు కున్నాడు.

మనసులో ఒక ఉత్సాహం. దానికి తోడు జయశ్రీ తళతళమని మెరుస్తున్న చీరలో నందకుమార్ ని ఆకర్షిస్తోంది. ఆమె, ఆమె నడుము అందాన్ని బొడ్డుతో పాటూ చూపించి అతనిలోని ఆశను రేకెత్తించింది. 

ఆమె ఎద వేగమైన ఉచ్వాశ నిశ్వాసలతో ఊగుతున్నది. నందకుమార్ లో కామ ఊయల ఊగటం మొదలు పెట్టింది.

జయశ్రీ! మనం కొంచం సేపు మనసు విప్పి మాట్లాడుకుందామా?” అంటూ ఆమెను చూసాడు.

మనం ఇండోర్ స్టేడియంలోకి వెళ్దామా?”

జయశ్రీనే అలా అడగటం నందకుమార్ కొంచం కూడా ఎదురు చూడలేదు. ఆ కాలేజీ ఇండోర్ ఆడిటోరియంప్రేమికులకు కరక్ట్ అయిన దాక్కునే చోటు. లైట్లు లేకపోతే ఎవరూ ఎవరినీ చూసుకోలేని కారు చీకటికి సొంతమైన చోటు.

పాఠాలకు సంబంధించిన చదువు గురించిన చిత్రాలు, స్లైడ్లు, కొన్ని సమయాలలో మామూలు సినిమాలు అని పలు విషయాలకు ఉపయోగపడుతుంది.

చాలా వరకు ఆడిటోరియం మూసే ఉంటుంది. సెక్యూరిటీ ఉంటాడు. పది రూపాయలు ఇస్తే ఆ ఆడిటోరియాన్నే రాసిచ్చేస్తాడు.

పది రూపాయలకు బదులు యాభై ఇస్తే లోపల ఫస్ట్ నైటే జరుపుకోనిస్తాడు. అంత సులభమైన వ్యక్తి.

అందులోకి నందకుమార్, జయశ్రీ ఇద్దరూ దూరారు. తలకు పైన చిన్న కాంతితో వెలుగుతున్న లైట్ల కాంతికి కింద ఉన్న కుషన్ కుర్చీలోకి జారారు.

మాటల్లో తమని తామే మరిచిపోయారు.

బయట గౌతం సెక్యూరిటీ గార్డును బ్రతిమిలాడుతూ అడిగాడు. జయశ్రీ, నందకుమార్ ఇటు పక్కగా వచ్చినట్టు చెప్పారు. లోపల ఉన్నారా?”  

ఏం...వాళ్ళు ఆనందంగా ఉండటాన్ని చూడటానికి నీకు ఆశగా ఉందా?” అన్నాడు వెక్కిరింతగా.

ఏయ్. మాటలు తిన్నగా రానీ. ఈ పుస్తకం ఆమెది. ఇచ్చి వెళ్దామని వచ్చాను

బయటకు వచ్చిన తరువాత ఇవ్వు. లోపలకు ఎవరినీ పంపవద్దు అని నందకుమార్ చెప్పాడు. పాపం ఆ అమ్మాయి...

సెక్యూరిటీ గార్డు చెప్పిన జవాబుతో గౌతం మొహంలో ఆసిడ్ పోసిన మంట. మనసులో ఆందోళన. జయశ్రీ ఇంత త్వరగా ఇలా నడుచుకోవటం ప్రారంభించేవే...!బాధతో తల మీద కొట్టుకున్నాడు. 

సెక్యూరిటీ గార్డును తొసేసి లోపలకు దూరినప్పుడు, చిరు కాంతిలో ఇద్దరూ కనబడ్డారు. అనుకోకుండా వెనక్కి తిరిగిన నందకుమార్ కు... గౌతం రావటం కనబడింది.

-- మనసులో కోపంతో లేచి నిలబడ్డాడు.

జయశ్రీ! గౌతం వస్తున్నాడు?” అని జయశ్రీతో చెప్పాడు. అది విన్న జయశ్రీలో చిన్న ఆందోళన.

క్లియర్ గా చెప్పినా కూడా నన్ను వదలనంటున్నాడు...! రానీ, వాడ్ని నాలుగు వాయిస్తాను అని జయశ్రీ కూడా లేచింది.

సరే...నువ్వు మాట్లాడేటప్పుడు, నేను పక్కన ఉండటం మంచిది కాదు. నేను బయటకు వెడతాను. వాడితో మాట్లాడి పంపించేయి అని జయశ్రీతో చెప్పి బయటకు వెళ్ళటం మొదలు పెట్టాడు.

గౌతం, ఆమె కూర్చున్న సీటు దగ్గరకు వెళ్ళాడు. పుస్తకాన్ని ఆమె ముందు జాపాడు.

మీ ప్రేమకు నా కంగ్రాట్స్... అన్నాడు విరక్తిగా.

ఏం దీన్ని రేపో...ఎల్లుండో చెప్ప కూడదా?”

జయశ్రీ దగ్గర కోపం ప్రారంభమయ్యింది.

జయశ్రీ, నువ్వు ఇలా ఈ చోట నందకుమార్ ని కలుసుకోవటం కొంచం కూడా మంచిది కాదు. వాడు మంచివాడు కాదు...జాగ్రత్త

గౌతం యొక్క హెచ్చరిక, జయశ్రీకి నవ్వు తెప్పించింది. 

మీ ఉపదేశానికి థ్యాంక్స్. మీరు వెళ్ళొచ్చు అన్నది కోపంగా.

అదే సమయానికి చిన్నగా వెలుగుతున్న లైట్లు ఆరిపోయినై. చుట్టూ కారు చీకటి.

జయశ్రీ నిలబడటానికి లేచినప్పుడు, ఆమెపై రెండు చేతులు పడినై. అది చెంపలు -- గొంతు అంటూ సాగి ఎదపైన పడ్డది. జయశ్రీ వెంటనే అరవటం మొదలు పెట్టింది.

రేయ్ గౌతం, వదలరా నన్ను...వదిలేయ్ నన్ను...

--చేతులు ఇంకా కిందకు వెళ్ళి నడుం చుట్టూ బిగిసి, ఆమెను దగ్గరకు లాక్కున్నాయి. జయశ్రీ గొంతు చించుకుని అరిచింది.

అయ్యో! నన్ను వదిలేయి...నన్ను వదిలేయి…

ఆ చేతులు ఆమెను మరింత హింసకు గురిచేసినై.

జయశ్రీ ఆ  చీకటిలో బలమంతా కూడబెట్టుకుని ఆ చేతులకు సొంతమైన మనిషిని పట్టుకుని తోసింది. కుషన్ సీట్ల మీద ఎక్కి వేగంగ కాలుకు దెబ్బ తగిలేటట్టు పరిగెత్తటం మొదలు పెట్టింది.

గబుక్కున ఆడిటోరియం మొత్తం కళ్ళు చురుక్కు మనే కాంతి. ఒక సీటుపై జయశ్రీ పిచ్చిదానిలాగా నిలబడ, చీర నలిగిపోయి ఉండగా, దగ్గరగా దయ్యం కొట్టినట్టు ఉన్న గౌతం. 

ఏమైంది జయశ్రీ! ఏమైంది?” -- అంటూ ఆందోళన పడుతూ వాకిటి తలుపు వైపు నుండి నందకుమార్ వస్తున్నాడు.  

నందూ! ఈ రాస్కల్ చీకట్లో నన్ను రేప్చేయాలని చూసాడు అంటూ గౌతంని చేతితో చూపించింది.

గౌతం దగ్గర అన్ని నాడులూ విరిగిపోయినై.

నో...

ఆడిటోరియంవిరిగి పడిపోయేంత గట్టిగా అరిచాడు గౌతం.

                                                                                                                      Continued...PART-10

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి