ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్) (PART-7)
ఈ రోజు.
“రండి
సార్...రండి...”
వాకిటి వైపు నిలబడున్న గౌతంను మోహన శర్మ లోపలకు
స్వాగతించారు.
జయశ్రీకేమో అతన్ని చూడటానికే ఇష్టం లేని
వేదన.
‘హఠాత్తుగా
వచ్చి నిలబడ్డాడే...!’
‘ప్రేమకు
తాత్పర్యం చెప్పినతను -- ప్రేమించిన దానినే పెళ్ళి చేసుకుంటాను...లేకపోతే
జీవితాంతం సన్యాసిగానే ఉండిపోతాను అని సవాలు చేసాడు -- మధ్యలోనే ప్రేమ, కామం
ఒకటే అనేలాగా చీకట్లో నన్ను కౌగిలించుకుని మానభంగం చేయాలని చూసిన పరమ కిరాతకుడు, చండాలుడు...ఈ
రోజు ఎందుకు వచ్చాడు?’
---మనసులో
అలల లాగా
గుద్దుకుంటున్న భావముతో ఆమె వంచుకున్న తల ఎత్తలేదు.
లోపలకు వచ్చినతను, మోహన
శర్మ ను గౌరవంగా చూసాడు. ఆయన నోరు
తెరిచారు.
“మీ
గురించి జయశ్రీ చాలా చెప్పింది...?”
అన్నారు.
“మంచిగానా...చెడుగానా?”
---అతను
అలా అడుగుతాడని ఆయన కొంచం కూడా ఎదురు చూడలేదు.
“జెనెరల్
గా చెప్పింది. తప్పుగా మాట్లాడటానికి ఏమైనా ఉందా ఏమిటి?”
“చాలా
ఉంది సార్...”
“పోనివ్వండి.
ప్రొద్దున్నే మిమ్మల్ని కోర్టు వాకిట్లో చూసాను. ఇప్పుడు ఇంటికే వచ్చారు. మీకు ఏం
కావాలి?”
“జయశ్రీకి
సంతోషమైన జీవితం ఏర్పడాలి అనేదే నా ఆశ”
“చాలా
సంతోషం! ఆమె సంతోషంగా ఉండాలని మీరు అనుకోవడానికి కారణం?”
“నేను
ఆమెను అభిమానించే ఒకడ్ని”
“ఈమె
ఇంకొకరి భార్య సార్...”
“నేను
కాదనటం లేదు. అవతలి మనిషి భార్య బాగుండాలి అనుకోవటం తప్పా సార్?”
“అందరూ
బాగుండాలని అనుకుంటే అది మంచి ఆలొచన. ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క భార్య
బాగుండాలనుకోవడం...”
“మీరు
అడగాలనుకుంటున్నది ఏమిటో నాకు అర్ధమయ్యింది సార్. నేను జయశ్రీని ఒక టైములో మనసారా
ప్రేమించినతన్ని. ప్రేమంటే పవిత్రమైనది అనేది నా అభిప్రాయం. కానీ లోకం దానిని
కామంగా మారుస్తూ వస్తోంది. నా అభిప్రాయానికి బలమైన
పరీక్ష వచ్చింది. జయశ్రీని నేను అన్యాయంగా పోగొట్టుకున్నాను. దాని గురించి కూడా
నాకు ఎక్కువ బాధ లేదు. ఆమె నందకుమార్ అనే నక్క దగ్గర చిక్కు కున్నదే పెద్ద బాధ.
అయినా కానీ ఆమె బాగుంటుందని నమ్మాను. కానీ ఆమె జీవితం ఎంత బాధాకరంగా ఉందో నేను
మీకు చెప్పక్కర్లేదు”
“అన్నీ
సరే... జయశ్రీ జీవితం ఇలా
అయ్యి,
ఆమె విషయం కోర్టు వరకు వెళ్ళటం మీకు ఎలా తెలిసింది?”
----మోహన
శర్మ యొక్క ఆ ప్రశ్నకు గౌతం ఒక ఉత్తరాన్ని తీసి జాపాడు.
ఉత్తరాన్ని మడతలు విప్పిన ఆయనకు
ఆశ్చర్యం కాచుకోనున్నది. ఆ ఉత్తరం రాసింది నందకుమారే.
“గౌతంకి!
ఛాలంజ్ లో నా దగ్గర ఓడిపోయిన వాడా...ఎలా
ఉన్నావు? నా
దగ్గర ఛాలెంజ్ చేసినట్టే సన్యాసిగానే కదా? నువ్వు సన్యాసిగా ఉండటం మాత్రమే
కాదు...నువ్వు ఎక్కువ ఆశ పడిన జయశ్రీ నా దగ్గర సంతోషంగా ఉంటే, అది
చూసి ఈర్ష్య పడే సరాసరి మనిషివి కాదు
నువ్వు.
జయశ్రీ నా దగ్గర కష్టపడటం నువ్వు
చూడాలి. అప్పుడే నీ బాధ ఎక్కువ అవుతుంది. ఆ బాధను తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య
చేసుకోవాలి. అప్పుడే నాకు సంతోషం...రా...రేపు కోర్టుకు వచ్చి చూడు. నేను జయశ్రీని
పెట్టిన కష్టాల గురించి కొంచమైనా తెలుసుకోవచ్చు నువ్వు.
నువ్వు ప్రేమించిన ఆమె ఇక ‘పూటకో
గండం’ అని
వేదన చెందేలా చెయ్యబోతాను. అది మాత్రమే కాదు...ఆమె నాకు విడాకులు ఇవ్వబోతోందట.
నేను నలిపి పారేసిన ఆ పువ్వును ఒక్క
మూర్ఖుడు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోడు. నువ్వూ చేసుకోలేవు. నీ యోగ్యత ఏమిటో ఆమెకు
తెలుసే!
మీరిద్దరూ ఒకరినొకరు చూసుకుని కృంగి కృషించి
చచ్చిపోవాలి. అదే ఇక నాకు కావలసింది”
ఇట్లు,
నందకుమార్.
----ఉత్తరాన్ని చదివి ముగించిన మోహన
శర్మ, గౌతంను
నీరు నిండిన కళ్ళతో తలెత్తి చూసాడు.
“నేను
ఇప్పుడు రాజమండ్రిలో ఉన్నాను. ఆల్మోస్ట్ సన్యాసి లాగానే ఉన్నాననే పెట్టుకోండి.
హఠాత్తుగా ఈ ఉత్తరం నిన్న వచ్చి చేరింది. నాకు ఒకటే ఆశ్చర్యం. నందకుమార్, జయశ్రీ...వీళ్ళను
ఆల్మోస్ట్ నేను మరిచిపోయున్న సమయంలో ఇలాంటి ఒక ఉత్తరం. నేను రాజమండ్రీలో ఉన్నది
తెలుసుకుని, ఎలాగో
అడ్రస్సు కనుక్కుని, నందకుమార్
ఈ ఉత్తరం రాసాడు...గాయాన్ని కెలికినట్లు హీనమైన పని ఇది...”
----- గౌతం
యొక్క వివరణను విన్న జయశ్రీ గబుక్కున తండ్రి చేతిలో ఉన్న ఉత్తరాన్ని లాక్కుని
చదివింది.
కొంచంసేపు అలాగే నిలబడిన తరువాత నెత్తి
మీద చెయ్యి పెట్టుకుని కొంచం దూరం జరిగి వెళ్ళి కూర్చుండిపోయింది.
“నాన్నా, ఎందుకు
నాన్నా ఈయన ఇలా నడుచుకుంటున్నారు?
నేనేం తప్పు చేసాను? ఈయన
ఎంతో మంది అమ్మాయలతో కాంటాక్ట్ పెట్టుకున్నారని తెలిసి, జానకీ
ఆత్మహత్య చేసుకున్నా...ఈయన్ని వదలకుండా ప్రేమించేనే, దానికి
ఇదేనా నాకు బహుమతి?”
ఆమె కళ్ళల్లో నుండి నీరు జలపాతంలో
పడుతోంది.
“అతను
ఏ రోజూ మంచివాడుగా ఉన్నది లేదు జయశ్రీ. కాలేజీ జీవితంలో అతను ఒక నటుడు. నువ్వు
ఆలస్యంగా కూడా అర్ధం చేసుకోలేదు. వాడు మనిషే కాదు”
గౌతం దగ్గర నుండి వచ్చిన సమాధానాన్ని
ఆమె విసుగుతో విన్నది.
“మనిషి
పుట్టుకలో ఎన్నో విచిత్రాలు. కొంతమందికి రూపం కృరం... నందకుమార్
లాంటి వాళ్ళకు మనసు కృరం. నన్ను ఏం చెయ్యమంటావమ్మా? మేము
ఏదైనా మాట్లాడితే, ఉపదేశం
అని చెప్పి తోసేసే నాగరీక మనుషులే మీరు...”
అంత దుఃఖం లోనూ మోహన శర్మ తన కూతుర్ని
గుచ్చకుండా గుచ్చాడు.
“నిజమే
నాన్నా...! మా జనరేషన్ కి ఎందులోనూ లోతైన ఆలొచనలేదు. నాకు ఇది చాలదు నాన్నా. ఇంకా
పడాలి”
-----మొహాన్ని చేతులతో మూసుకుని ఏడవటం
మొదలు పెట్టిన ఆమెను నీరసంతో చూసాడు గౌతం.
“ఏడవకు
జయశ్రీ...జరిగిపోయిన దాని గురించి ఏడవటం కంటే -- జరగబోయే దాని గురించి ఆలొచించటమే
ధైర్యమైన యువ వయసుకు అందం...”
“నేను
ఏడుస్తాను...నవ్వుతాను...మీరు దాని గురించి బాధపడకండి మిస్టర్. కాసేపు నన్ను
ఒంటరిగా వదలండి”
అన్నది. అతన్ని చూస్తూ.
మోహన శర్మ ను జయశ్రీ మాటలు ఏదో చేసింది.
“జయశ్రీ.
ఇలా మొండి పట్టుదల పట్టకు! నీ కోసం బాధపడి రాజమండ్రీ నుండి వచ్చిన వ్యక్తి ఆయన”
“ఎక్కడ్నుంచి
వచ్చినా బాధ లేదు నాన్నా. ఇతను ఒక వేషగాడు”
“ఉండనీ.
అందుకని నువ్వు ఇలా నడుచుకోవచ్చా?
ఈ దేశంలో వేషం వేయని వారు ఎవరమ్మా? ఏడుస్తూ, నవ్వుతున్నట్టు
వేషం వేస్తున్నాను నేను...కష్టాల్లో ఉన్నా, సుఖంగా ఉన్నట్టు వేషం వేస్తారు
కొందరు...ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క వేషం వేయకుండా లేరు జయశ్రీ”
“నాకు
ఏ వివరణ వద్దు. ఈయన్ని బయటకు వెళ్ళమని చెప్పు...”
---- జయశ్రీ యొక్క మొండితనం చూసి గౌతమే
మెల్లగా వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు.
“సారీ
జయశ్రీ...నేనే వెళ్ళిపోతాను! నేనే వెళ్ళిపోతాను సార్...”
అంటూ వెనక్కి తిరిగి నడిచాడు.
అతన్ని వెంబడించాడు మోహన శర్మ. వాకిలి
దాటి మెట్లు దిగి కాంపౌండ్ గోడ దగ్గరున్న బాదాం చెట్టు నీడను దాటి వీధిని ఎక్కిన
అతన్ని వెంబడించి నడిచారు.
“మిస్టర్
గౌతం! ఒక్క నిమిషం...”
అంటూనే అతని భుజం పట్టుకుని ఆపారు.
అతను కలతతో ఆయన్ని చూసాడు.
“రండి, నడుస్తూ
మాట్లాడుకుందాం. అవునూ, మీ
మీద జయశ్రీకి ఎందుకు అంత విరక్తి?
మిమ్మల్ని చూస్తే తప్పు చేసే వ్యక్తిలా
తెలియటం లేదే. అందుకనే అడుగుతున్నాను”
-----నడుచుకుంటూనే ప్రశ్న అడిగిన ఆయన్ని
విరక్తిగా చూసి చిన్నగా నవ్వాడు.
“పరవాలేదు
సార్. మీరైనా నన్ను అర్ధం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారే!”
అన్నాడు.
“అదంతా
తరువాత. మీ మీద జయశ్రీకి ఎందుకు అంత విరక్తి? కారణం ఏమిటి?”
“అది
ఆ రోజు జరిగిన దర్మ సంకటమైన సంభవం సార్”
“అదే.
ఏమిటా సంభవం?”
Continued...PART-8
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి