ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్) (PART-5)
ఈ రోజు
శోకమైన ఆ ఇంటి హాలు మధ్యలో నరకబడ్డ చెట్టులాగా
పడుంది జయశ్రీ.
పెరిగిన గడ్డాన్ని తడుముకుంటూ ఆమె పక్కనే
తండ్రి మోహన్ శర్మ.
గడియారం మాత్రం ఫలితం ఎదురు చూడకుండా తన
పనిలో ‘టక్...టక్...టక్’ మంటూ
మూడు గంటలు కొట్టింది. ఆకలి మరచి, దాహం
దూరమై, ఎంతసేపు ఇలాగే ఉండటం?
“ఏమ్మా...ఇలాగే
కూర్చోనుంటే ఎలా?” -- ఆయనే
ప్రారంభించాడు.
“ఏం
చేయమంటావు నాన్నా! మాట్లాడకుండా చచ్చిపోదామా?”
ఆయన దగ్గర ఆశ్చర్యం.
“ఏం
మనిషివమ్మా నువ్వు...ఇప్పుడు చావటానికి ఏమిటంత ముఖ్యం?”
“జీవించటంలో
ఏమర్ధముంది నాన్నా? ఈ మనిషి ఇలా జైలుకు
వెళ్ళకుండా తప్పించుకుని, మనల్నే
బెదిరించటం మొదలు పెట్టేడే...?”
“ఓ...అదా నీ బాధ? అతను
ఒకసారి బెదిరిస్తే, నువ్వు అతన్ని రెండు
రెట్లు బెదిరించు...?”
“నాకు అలాంటి
బెదిరింపు మాటలు రావు నాన్నా…”
“రావాలి...ఖచ్చితంగా
రావాలి. వస్తేనే జీవితం!”
“దెబ్బకు
దెబ్బ, కత్తికి కత్తి. ఎలా
సరి అవుతుంది?”
“మనుషులకు సరి అవదు.
కానీ, మృగాలకు అదే సరి…”
“నాకు
అలా ఆలొచించటానికే నచ్చలేదు నాన్నా...”
“అలాగైతే
నచ్చేదే ఆలొచించు...”
“నాకిప్పుడు
ఒంటరి తనమే నచ్చింది”
“లేదు...ఒంటరి
తనం నిన్ను కన్ ఫ్యూజ్ చేస్తుంది. నువ్వు ఇప్పుడే గుంపుతో ఉండాలి”
ఆమె చాలా సేపు మౌనం వహించింది. తరువాత
కొంత బాధపడింది.
‘ఇలా అయిపోయిందే?’ అని
తలుచుకుని, తలుచుకుని ఏడ్చింది.
గంధర్వుడు, సౌందర్యుడు, వసీకరుడు, లక్షణమైనవాడు, మన్మధుడు, అని
అనుకుని తననే రాసిచ్చిన ఆమెకు పెళ్ళి అయ్యి ఆరు నెలల వరకు ప్రేమ వర్షం
కురిపించినతను, జానకీ విషయంతోనే
మొదటిసారిగా బయటపడ్డాడు.
“అక్కా...”
-- జానకీ యొక్క పిలుపు విన్నప్పుడు, వంటగదిలో
వంటలో లీనమై ఉన్నది జయశ్రీ.
“రా... జానూ! ఏమిటి విషయం?”
--అడిగి ముగించే లోపు, అక్కడే
కడుపులో తిప్పటంతో వాంతి చేసుకుంది జానకీ.
“ఏమైంది
జానకీ...ఒంట్లో బాగుండలేదా?”
----ఆందోళన
చెందింది జయశ్రీ.
“ఒంట్లోపల
ఒళ్ళు అక్కా! అదే ఈ కష్టం...”
-- జానకీ దగ్గర కన్నీటి సమాధానం.
“ఏమంటున్నావు
జానకీ?” -- ఆశ్చర్యంగా చూస్తూ
అడిగింది.
“అక్కా!
నేనిప్పుడు తల్లి స్థానంలో ఉన్నాను”
“ఏమిటి
జానకీ చెబుతున్నావు...?”
“నాలో ఇంకో ప్రాణం
పెరుగుతోంది!”
జయశ్రీ దగ్గర ఆశ్చర్యం. కళ్ళు
పెద్దవైనై.
“ఏమిటి
జానకీ చెబుతున్నావు నువ్వు?”
“అవునక్కా! నేనిప్పుడు
మూడు నెలలుగా గర్భంగా ఉన్నాను...”
“ఒసేయ్
పాపి...ఎవరే కారణం?”
“అది తెలుసుకుని
నువ్వేం చెయ్యబోతావు? నువ్వైనా
బాగుండు”
“ఏమిటే
వాగుతున్నావు?”
“ఏమీలేదక్కా...నాకు ఎవరి
దగ్గరైనా నోరు తెరిచి ఏడవాలనిపించింది...అందుకే వచ్చాను”
“ఏమిటే...ఏమిటేమిటో
వాగుతున్నావు! ఏమైందే నీకు? అది
ఎవరో చెప్పు. నేను నీకు పెళ్ళి చేస్తాను”
“నీవల్ల
కాదక్కా...”
అంటూనే వాష్ బేసిన్ దగ్గరకు జరిగి మళ్ళీ
వాంతీ చేసుకుని చేతులూ, మొహమూ
కడుక్కుంది.
“ఎందుకు
కాదు జానకీ...?”
“కాదంటే
కాదక్కా...నువ్వు ఆ మాట వదిలేయ్. అవును...నీ భర్త నీతో ఎలా ఉంటున్నారు?”
“ఆయనకేం తక్కువ.
బాగానే ఉంటున్నారు?”
“బాగానే అంటే ఎలా
అక్కా?”
“ఎందుకు అవన్నీ
అడుగుతున్నావు?”
“కారణం ఉందక్కా”
“నాకేమీ
లోటు లేదు...”
“బాగా
ఆలొచించి చెప్పక్కా. నాకు నిజం తెలిస్తే అవమానం అనుకుని ఏదీ దాచకు...!”
“జానకీ, నీ
మాటలు పెద్ద పజిల్ లాగా ఉందే. నిజంగా చెబుతున్నా, నందకుమార్
నన్ను సంతోషంగానే పెట్టుకున్నాడు...కానీ, అప్పుడప్పుడు
అతనితో కలిసి నన్ను మందు కొట్టు అంటున్నాడు...”
“ఎప్పుడూ
మీరు ఇలాగే ఉండగలరనే నమ్మకం ఉందా?”
“జానకీ...తిన్నగా
విషయానికి రా...”
జయశ్రీ స్వరంలో మెల్లగా ఆందోళన
వ్యాపించటం మొదలయ్యింది.
“అక్కా...నేను
మోసపోయేనక్కా. రాముడు, లక్ష్మణుడు
అని నమ్మి, నీ భర్తను నీకు ముందే
ప్రేమించి మోసపోయి, ఇప్పుడు గర్భమై
నిలబడ్డాను...”
జానకీ అలా చెప్పినప్పుడు, జయశ్రీకి
కళ్ళల్లో ముల్లు గుచ్చుకున్నట్టు అయ్యింది.
ఇంటర్ ఫైనల్ చదువుకుంటున్నఅమ్మాయి యొక్క
మాటలతో హృదయం నూనె బానీలో పడి వేగుతున్నట్టు ఒక ధఢ.
“జానకీ!
నిజంగానే చెబుతున్నావా...?”
“ప్రామిస్
అక్కా! నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇది చెబుతున్నాను. నీ జీవితంలోకి అడ్డు
వస్తానేమోనని భయపడకు అక్కా. నేను ఎవరి జీవితంలోనూ అడ్డు రాదలుచుకోలేదు.
‘సెక్స్’ చాలా
మందిని చావకుండా చంపే విషయమక్కా. ఆ విషయమే నా జీవితంలోనూ ఆడుకుంది. వయసుకు మించిన
నా చేష్ట నాకు యముడిగా అయ్యింది.
కొన్ని పుస్తకాలూ, సినిమాలూ, నా
లాంటి అమ్మాయల లోపల వెలుగుతున్న కామ దీపానికి మరింత నూనె పోసే రకమక్కా. ఆ మంటలోనే
చలి కాచు కోవాలనుకునే వాళ్ళు ఈ దేశంలో ఎంతమంది...ఎంతమంది?
ఒక శవం దగ్గర ఒకమ్మాయి నగ్నంగా నిలబడితే
చాలు...అది కూడా కామంతో లేచి నిలబడుతుందక్కా. అంత మోసంగా ఉందక్కా ఇప్పుడున్న కాలం!
నందకుమార్ ని అనడం తప్పు అక్కా.
అన్నిటికీ కారణం నేనే. నాకు కట్టుబాటు లేదు. నా దగ్గర స్పష్టత లేదు. తప్పు--సరి
అర్ధం చేసుకునే తెలివి లేదు. నేను నన్ను పోగొట్టుకున్నాను. నన్ను
పోగొట్టుకున్నానక్కా...”
-----వెక్కి, వెక్కి
ఏడుస్తున్న జానకీని దగ్గరకు తీసుకుంది జయశ్రీ. అదే సమయంలో వాకిటి వైపు మోటార్
సైకిల్ ఆగే శబ్ధం.
నందకుమార్ దిగి వచ్చాడు. లోపలున్న ఇద్దర్నీ
చూసి చిన్నగా నవ్వాడు.
జానకీ తలెత్తి అతన్ని చూసేసి, తల
దించుకుంది.
జయశ్రీ చూపుల్లో అగ్ని
కణాలు...సాక్షాత్తు ఆ రాముడే అనుకున్న అతను ఇప్పుడు కృష్ణలీల గోపాలుడుగా
అయిపోయేడే...అంటే ఇంతకాలం మనమీద చూపిన అభిమానం, ప్రేమ
అబద్దమా?
ఆవేదన వలన చెవుల వెనుకనుండి చెమట. తల
వెంట్రుకలలోని కొన్ని కళ్ళ ముందు పడి చిన్నగా ఆడటం చేస్తుంటే, జానకీ
అక్కడి నుండి జారుకోవటం ప్రారంభించింది.
“నిన్ను
నేను డాక్టర్ను చూడమన్నానే,
చూడలేదా?”
---జారుకోవటం
ప్రారంభించిన జానకీని చూసి అడిగాడు. అతని స్వరంలో కొంచం కూడా ఆందోళన లేదు.
ఆమె ఆగి అతన్ని కోపంగా చూసింది.
అది విన్న జయశ్రీ దగ్గర షాక్.
జానకీ ఏమీ మాట్లాడకుండా కోపంగా నడవటం
మొదలు పెట్టింది.
“ఏయ్...త్వరగా
వెళ్ళి కడుపును కడుక్కో. లేదంటే నాకేమీ నష్టం లేదు. నాకు ఏమీ తెలియదని ప్రామిస్
చేయడానికి కూడా నేను వెనుకాడను”
-----అతని జవాబు... జానకీ చెవిలో
పడలేదు.
కానీ, జయశ్రీ
చెవిలో బాగానే వినబడింది.
“నందూ...”
అన్నది వణుకుతున్న స్వరంతో --
“ఇలా
చూడు జయశ్రీ...మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలుసు. నువ్వు అనవసరంగా కలుగజేసుకోకు!
ఎప్పుడూ నువ్వే నా భార్యవి. ఇంకెవరినీ నేను భార్యగా చేసుకోను. భయపడకు...”
అతని మాటలతో ఆమెలో గ్రద్ద తిరుగుడు.
“నందూ.
మీరా ఇలా నడుచుకున్నది? మీరా
ఇలా మాట్లాడేది?”
“ఇలా
చూడు జయశ్రీ...ఈ దేశంలో వందకి తొంభై మంది నాలాంటి వాళ్ళే! అంతెందుకు, నీ
లాంటి ఆడపిల్లలూ మాత్రం ఏం?
వాళ్ళూ మనలాగానే”
“మనలాగా
అంటే?”
జయశ్రీ స్వరంలో అగ్ని జ్వాల.
“మనలాగా
అంటే...’జీవితం
జీవించటానికే’ అనే
రకం”
“అలాగంటే?”
“ఏయ్!
ఏమిటి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నావు?
ఒక మగాడు, ఆడది
ఇష్ట పడితే జాలీగా ఉండటంలో తప్పే లేదు జయశ్రీ...”
“అయితే
‘మొరాలిటీకి’ ఏమిటి
అర్ధం నందూ?”
---బొంగురు
కంఠంతో అరిచినట్లు అడిగింది.
“‘మోరాలిటీ’ నా? అలా
అంటే ఏమిటి జయశ్రీ? నాకు
తెలిసి క్లారిటీ, పర్శనాలిటీ, క్వాలిటీ...ఇవన్నీనే
ఉన్నాయి”
“‘వల్గారిటీ’ అనేది
ఒకటుంది. అది తెలుసా మీకు...”
“సరే, దానికేమిటిప్పుడు?”
“మీ
దగ్గర అది ఎక్కువ ఉంది”
“ఉంటే
ఉండనీ...నీకెందుకు కోపం?”
“నాకు
నా భర్త రాముడిగా ఉండాలి”
“అది
జరగనే జరగదు జయశ్రీ. ఈ రాముడు,
కృష్ణుడు కథ అంతా అబద్దం. మనది డార్విన్
సిద్దాంతమే...మృగాలకు పాతివ్రత్యం లేదు. అవన్నీ నీ మాటలు వింటే ఇంతే సంగతులు?
‘సెక్స్’ అనేది
జీవితంలో ఒక భాగం అమ్మా. ఒంట్లో ఓపిక ఉండే కాలంలో విధవిధంగా -- రకరకాలుగా
అనుభవించటంలో తప్పేలేదు”
“అలాగైతే
నేను ఎవరి దగ్గర కావలంటే...?”
“అది
పెళ్ళికి ముందైతే తప్పులేదు! పెళ్ళి తరువాత అంటే నేను నిన్ను తృప్తి పరచటం లేదు
అంటే ఆలొచించుకోవచ్చు. నేను నిన్ను రోజూ తృప్తి...”
“పాపాత్ముడా!
ఎంత వికారంగా మాట్లాడుతున్నావు...నువ్వు బాగుపడతావా?”
“ఖచ్చితంగా...నేనే
‘సూపర్’ గా
ఉంటాను”
----- నందకుమార్
అలా చెప్పినప్పుడు, పక్కింట్లో
పెద్దగా అరుపులు.
ఏమిటిది అనేది పరిగెత్తుకుని వెళ్ళి
చూసినప్పుడు, జానకీ
ఉరి వేసుకుని వేలాడుతోంది.
మొహం కడుక్కుని, నుదిటి
మీద విభూది గీతలు వేసుకుని వచ్చిన మోహన్ శర్మ శిలలాగా కూర్చుని, లోకాన్నే
మరిచిపోయున్న జయశ్రీని చూసి బాధపడ్డాడు.
“జయశ్రీ
ఏమిటిది...? ఎలుక
చెత్త కుప్పను పొడుచుకుని దాంట్లోకి దూరినట్టు, నీ
మనసును పాత జ్ఞాపకాలతో తిప్పి,
తిప్పి...నీరస పోతున్నావే! నీకు ఏర్పడిన శోకం, ఈ
లోకంలోని సమస్యలతో పోల్చి చూస్తే ఆవగింజ అంత. మనసును దృఢం చేసుకుని ‘మంచి
జీవితం ఉంది’ అని
నమ్మి పనులను మొదలుపెట్టు...”
--ఆమెను
ఉత్సాహ పరిచారు.
జయశ్రీ తల ఎత్తింది.
“జానకీ
జ్ఞాపకం వచ్చింది నాన్నా...”
అన్నది.
అది వినగా...ఆయన ముఖంలో ఆసిడ్ పోసినట్టు
చేదు.
“హు.
పాపం ఆ అమ్మాయి...”
అని పెదాలు గొణిగినై.
“ఆమె
మాత్రమా నాన్నా...?”
“అవునమ్మా...నిన్ను
చూసి జాలిపడను. ఆమె లోకం వదిలే వెళ్ళిపోయింది. నువ్వో జీవించబోయేదానివి. నిన్ను
చూసి నేను జాలిపడకూడదు. అది నీకు మంచిది కాదు”
“ఇంకా
కొత్తగా చెడు ఏం జరగాలి నాన్నా?”
“కొంచం
నోరు మూస్తావా? నోరు
తెరిస్తే విరక్తి మాటలేనా? ఎండిపోయిన
చెట్టు కూడా చిగురించే కాలమమ్మా ఇది. మనోశక్తి గురించి నీకేం తెలుసు...?”
“మనసే
లేదు...శక్తికి ఎక్కడికి వెళ్లను?”
“ఇదిగో
చూడు జయశ్రీ, పాత
చెత్తను కెలక కూడదు. నువ్వు బాగానే జీవిస్తావు...జీవించబోతావు. నేను చూడబోతాను. నీ
మనసును దానికి తయారుచేసుకో”
-----అప్పుడు వాకిటి వైపు ఎవరిదో నీడ
లాగా కనబడ, మోహన్
శర్మ చూపులు అటువైపు మల్లినై.
వాకిటి వైపు గౌతం!
‘జయశ్రీ...
జయశ్రీ...’ అంటూ
పిచ్చివాడిలా తిరిగి -- జయశ్రీతోనే ఒక తెగిపోయిన చెప్పులా విసిరివేయబడ్డ అదే గౌతం.
అదొక అన్యాయమైన శోక కథ!
Continued...PART-6
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి