7, నవంబర్ 2022, సోమవారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-1)

 

                                                                        ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                          (PART-1)

ఈరోజు

జయశ్రీ... జయశ్రీ... జయశ్రీ....

మూడుసార్లు ఆ అందమైన పేరును కోర్టు 'బంట్రౌతు' పిలిచి ముగించగానే టేకు చెక్కతో చదురంగా చేసిన బోనులో ఆ పేరుకు సొంతమైన ఆమె ఎక్కి నిలబడింది.

ఇరవై ఐదేళ్ళ దేహం, వంగిన తల, చెదిరిపోయిన జుట్టు మధ్యలో పెద్దగా పెరిగిన జడ, చీర కట్టుకున్న తీరు--ఈ కాలం తీరును అచ్చు గుద్దినట్టు చూపుతోంది.

మీరేనా జయశ్రీ?”

న్యాయమూర్తి ప్రశ్నతో ఆమె తల పైకి లేచింది. చిన్న చూపు--బలమైన తల ఊపు. విజిటర్స్ వరుసలో ఒక చిన్న కలకలం...  

అందులో అతను కనబడ్డాడు.

చిరుతపులిలా కనబడుతోంది అతని మొహం.

మీ పేరేమిటని కోర్టు అడుగుతోంది...తల ఊపితే సరిపోదు...మాట్లాడాలి...చెప్పండి

---ప్రభుత్వ తరఫు లాయర్ ఆమె ఏకాగ్రతను పరీక్షించాడు.

నా పేరా... జయశ్రీ! ఎస్. జయశ్రీ! లేదు...లేదు...జి. జయశ్రీ. మోహన శర్మ గారి కూతుర్ని!

ఆమె చిన్న తడబాటులో ఎన్నో సంగతులు.

అది న్యాయమూర్తి క్షుణ్ణంగా గమనించారు.

మీరు ఎస్. జయశ్రీ యా, లేక...జి. జయశ్రీ యా అనేది వేరే విషయం.  జయశ్రీ యేనా అనేది మొదటి విషయం

అవును

మీ భర్త మిమ్మల్ని చంపబొయేరని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంటుకు ఏదైనా ఆధారం ఉందా?”

పక్కింటి పార్వతమ్మ ఉన్నారు...ఆవిడ్ని అడగండి...

ఆమె యొక్క సమాధానం తరువాత పార్వతమ్మ పిలువబడింది.

పార్వతమ్మ బోనులోకి వచ్చింది.

జయశ్రీని ఆమె భర్త నందకుమార్ మేడ మీద నుండి కిందకు తోసి చంపటానికి ప్రయత్నించాడు. నేను బట్టలు ఆరేయటానికి నా ఇంటి మేడ మీదకు వచ్చినప్పుడు అది చూసేసాను. నన్ను చూసిన వెంటనే, ఆమెను తోసేయటం ఆపి కొట్టటం మొదలు పెట్టాడు....

ఆమె సాక్ష్యాన్ని ఇంపార్టంట్ గా న్యాయమూర్తి నోట్ చేసుకున్నారు.

పార్వతమ్మ అబద్ధం చెబుతోంది. నేను నా భార్యను కొట్టింది నిజం. కానీ చంపాలనుకోలేదు -- మేడ మీద నుండి తొసే ప్రయత్నం చేయలేదు

గుంపులో నుండి హఠాత్తుగా లేచి ఆవేశంగా అరవటం మొదలుపెట్టాడు నందకుమార్ అనే జయశ్రీ భర్త.

కోర్టు హాలులో మళ్ళీ కొంత కలకలం.

మీకు సందర్భం ఇచ్చినప్పుడు బోనులోకి ఎక్కి మాట్లాడితే చాలు. ఇలా అరవకూడదు...

న్యాయమూర్తి హెచ్చరించారు.

అది విని అతను కలవర పడ్డాడు. తన తల జుట్టు వెనుక పొడుగ్గా ఉన్న జుట్టును చేతి వెళ్ళతో కెలుక్కున్నాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. ప్యాంటు, షర్టు, చెవికి పెద్ద కడియం, బంక్ స్టైలుతో తల జుట్టు అలంకారం అంటూ విదేశీయ జిప్సీ లాంటి రూపం.

అతని ముఖాన ఒక విధమైన కృరం. అతని ముక్కునూ, కళ్ళనూ పీకి ఒక పులికి పెడితే తేడానే తెలియదు అనుకునేలాగా ఒక విధమైన మొహం. చూసేవాళ్ళందరికీ అతనిపై ద్వేషం కలుగుతుంది.

ఈ మొహాన్ని ఆ అమ్మాయి ప్రేమించి పెళ్ళి చేసుకుంది అంటే నమ్ముతారా?”

---ఒకరు ఇంకొకరిని అడిగారు. ఆ ఇంకొకరి మొహంలో ఒక దయ్యం దగ్గర దెబ్బతిన్న మార్పు.

---చూసి చూసి చేస్తున్న పెళ్ళిళ్ళే ఈ రోజుల్లో సుఖంగా లేవు. ఇందులో ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇలాగే ఉంటుంది...

అప్పుడే... నందకుమార్ అనే అతను పిలవబడ్డాడు. అతన్ని ఖైదుచేసి, కేసు రిజిస్టర్ చేసిన ఇన్‌స్పెక్టర్ చురుకయ్యాడు.

అతని తరఫున వాదించటానికి వచ్చిన లాయర్ తన నల్లకోటును సరిచేసుకుంటున్నాడు. నందకుమార్ బోనులోకి ఎక్కి నిలబడ్డాడు.

చండాలుడు, వీడు వంద హత్యలు కూడా చేస్తాడు అని ఎవరైనా సులభంగా నమ్మగలిగే వాలకం. న్యాయవాది యొక్క లోతైన మనసులో కూడా అదే ఆలొచన ఉన్నట్టే తెలుస్తోంది.

నేనే నందకుమార్. నేను మాట్లాడబోయేదంతా సత్యం. జయశ్రీ నా భార్య. నా ప్రాణం. మాది ప్రేమ వివాహం. మా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు అవి పోట్లాటగానూ, చేతులతో కలగజేసుకోవడం గానూ మారుతుంటాయి.

నాకు హత్య చేయాలనే ఆలొచన లేదు. నేనొక జెంటిల్ మ్యాన్. హత్యంతా చేయను. నాకు అదంతా చెయ్యటం చేత కాదు

---అతను మాట్లాడుతుంటే, ఆశ్చర్యంతో అది వింటున్నారు న్యాయమూర్తి.

ఒక రోజు మా ఇంటికి వచ్చిన నా మామగారు, వూరికే ఉండక, మా పోట్లాట చూసి భయపడిపోయి, పోలీసు కేసు పెట్టి, ఇలా నన్ను కోర్టుకు ఈడ్చి అవమాన పరచాలనుకుంటున్నారు. పాపం జయశ్రీ! ఆమెకు ఈ విషయంలో ఖచ్చితంగా ఇష్టం లేదు

నందకుమార్ మాట్లాడిన తరువాత న్యాయమూర్తి చూపులు జయశ్రీ వైపు తిరిగింది.

ఆమె తల వంచుకుని మౌనం సాధించింది.

అతను చెప్పేది నిజమా?’

---అందరూ జయశ్రీ చూసి, ఆ అభిప్రాయాన్ని పెంచుకునే లోపు ఆమె లాయర్ అడ్డుపడ్డాడు.

“’యువర్ ఆనార్’...మిస్టర్ నందకుమార్ చాలా తెలివిగా మాట్లాడుతున్నట్టు అనుకుని మీలో ఉన్న అభిప్రాయాలను, భార్యను కొట్టినట్టు ఈ కోర్టు ముందు ఒప్పుకున్నారు. అతను జయశ్రీని, ఐ మీన్ అతని భార్యను చంపటానికి ప్రయత్నం చేసినట్టు ప్రత్యక్ష సాక్ష్యం నిరూపించింది. ఇవన్నీ చేసిన తరువాత కూడా తన చేష్టల వలన జయశ్రీ అనే అతని భార్య బాధించ పడలేదు అనేది అబద్దం.

నందకుమార్ ఒక సాడిస్టు. మగ వర్గం యొక్క నీచమైన ప్రతినిధి. మహిళా స్వతంత్రం, మహిళా విడుదల గురించి ఎక్కువగా మాట్లాడుతున్న -- ఆచరణలో ఉన్న ఈ కాల ఘట్టంలో ఇతనిలాంటి వ్యక్తులు మహిళా వర్గానికే విరోధులు. వీళ్ళను కఠినంగా శిక్షిస్తేనే మిగిలిన వాళ్ళకు అది ఒక పాఠంగా -- హెచ్చరికగా ఉంటుంది. దీనితో పాటూ ఇప్పుడే జయశ్రీకీ, మిస్టర్ నందకుమార్ కూ విడాకుల మంజూరు స్పేషల్ గా ఇవ్వాలని భవ్యంగా అడుగుతున్నాను

లాయర్ వాదనను విన్న న్యాయమూర్తి మొహంలో ఏదో నిర్ణయానికి వచ్చిన రేఖలు. దీర్ఘ ఆలొచన. తరువాత ఆయన లోతైన మాటల ప్రారంభం.

మిస్టర్ నందకుమార్ తన నోటితోనే పోట్లాడుకోవటం, దెబ్బలాడుకోవడం,  కొట్టటం, అభిప్రాయ భేదాలు ఉండటం ఒప్పుకున్నందువలన ఒక పవిత్రమైన దాంపత్యం తమ వరకు పవిత్రంగా లేదనేది ఒప్పుకున్నారు. అతను హత్య చేయటానికి ప్రయత్నించినట్టు నిరూపణ అయ్యింది. నందకుమార్ కఠినంగా శిక్షించబడాలి. ఎంతటి అభిప్రాయ భేదం ఉన్నా అందులో దౌర్జన్యం,హింస తలెత్త కూడదు. అది అనుమతించలేము. 

ప్రేమించి పెళ్ళి చేసుకున్న నందకుమార్ ఇలా నడుచుకున్నందుకు ప్రేమకూ -- పెళ్ళికీ -- పవిత్రమైన ఆడ-మగ బంధుత్వానికీ...అంతెందుకు అన్నిటికీ సిగ్గుచేటు.

అతని నేరాలను విడమరిచి చూసి అతనికి ఆరు నెలలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను.

చట్ట పూర్వక పద్దతిలో పిటీషను పెట్టుకుని జయశ్రీ విడాకుల కోరికను కోరుకో వచ్చు. ఇక్కడే, ఇప్పుడే ఆమెకు విడాకులు మంజూరు చేయటానికి చట్టంలో చోటులేదు.

జైలు శిక్ష తరువాత అయినా నందకుమార్ మనిషిగా మారి భార్యతో కలిసి ఆనందంగా జీవించాలని, దాన్నే ఈ న్యాయస్థానం నొక్కి  చెబుతోంది

న్యాయమూర్తి తన తీర్పును క్లుప్తంగా చెప్పి ముగించారు.

ఆరు నెలలా...నాకా? చాలా బాగుంది. ఏయ్ న్యాయమూర్తీ, నువ్వు బ్రతికిపోతావు...మహిళలకు ఆదరణగా డప్పు వాయించే నువ్వు బ్రతికిపోతావు...

కాస్త గట్టిగా మాట్లాడి, పోలీసులతో నడిచాడు నందకుమార్. నందకుమార్ మొహమంతా కోపంతో ఎరుపెక్కింది.

తిరిగి తిరిగి చూస్తూ నడిచాడు...శొకంగా నిలబడున్న జయశ్రీని చూసి పళ్ళు కొరుక్కుంటూ చూసాడు.

అతన్ని కన్నీటితో చూసింది జయశ్రీ.

ఇతనికోసం ఎందుకమ్మా ఇంకా ఏడుస్తున్నావు...? మొదట విడాకులకు దరఖాస్తు చేయండి. కరెక్టుగా ఇరవై ఐదు రోజుల్లో ఈ అడవి మనిషిని విడిపించుకుని హాయిగా మిగిలిన పనులు చూసుకోవచ్చు

---పక్కన నిలబడ్డ ఆమె లాయర్ ఆమెను సమాధానపరిచాడు.

జయశ్రీ దగ్గర నుండి సమాధానమే లేదు. మౌనం...మౌనం...ఇదే కదా భారతీయ స్త్రీల యొక్క అర్ధం కాని భాష!

జయశ్రీ యొక్క ఈ మౌనం, శోక మౌనమా...లేక, లాయర్ ఇచ్చిన సలహా అర్ధమయిందని చెప్పే మౌనమా? అర్ధం కాలేదు!

కానీ, ఒకతనికి మాత్రం అది బాగా అర్ధమయ్యింది.

కోర్టుకు బయట ఉన్న రావి చెట్టు నీడలో అరిగిపోయిన సోపు ముక్క లాంటి గడ్డంతో పైజామా—జుబ్బాలో నిలబడున్న అతను మాత్రం జయశ్రీని అర్ధం చేసుకున్నట్టు ఒక చూపు చూసాడు.

ఆమె, అతన్ని దాటి వెడుతుంటే పిలిచాడు.

జయశ్రీ...

నిలబడి అతన్ని చూసిన ఆమెకు కళ్ళళ్ళో ముల్లు గుచ్చుకున్నట్లు ఉన్నది.

అతను గౌతం... గౌతం...

                                                                                            Continued...PART-2

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి