19, నవంబర్ 2022, శనివారం

ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)...(PART-6)

 

                                                                       ప్రేమ అనే ఇంద్రధనుస్సు...(సీరియల్)                                                                                                                                                           (PART-6)

ఆ రోజు

ప్రామిస్ గా ప్రేమ -- కామమే

చర్మ ఆకలికి ఇలాంటి పవిత్ర పేరా?

ప్రేమను అనురాగము అంటోంది చరిత్ర!

అనురాగమనేది అందరికీ ఒకటే కదా?

ఆడపిల్లలను ప్రేమించే వాళ్ళు ఎందుకు కాకులనూ-పిచ్చుకలనూ ప్రేమించటం లేదు!

కన్యలను వసపరుచుకోవటానికి తహతహలాడేవారు కన్యాత్వాన్ని దాటిన వారిని ఎందుకు వసపరుచుకోవటం లేదు?

ప్రేమను నిష్పాక్షికంగా ఉంచండి! అనురాగంగా ఉండే అందరినీ, అన్నిటినీ ప్రేమించండి...

చర్మాన్ని స్నేహించటం ప్రేమ అవదు...ఇప్పుడంతా ప్రామిస్ గా ప్రేమ-కామమే!

గౌతం రాజ్.

కళాశాల కవితల పోటీలలో మొదటి బహుమతి గెలుచుకున్న ఆ కవిత, నోటీస్ బోర్డులో ప్రకటనగా ఉండి అందరితోనూ విమర్శించ బడింది.

గౌతం యొక్క కవితను నేను ఆమోదిస్తున్నాను అని మొదలు పెట్టింది ధారణి.

నేను మనిషిని చూసి కవితను తూకం వేయటానికి ఇష్టపడటం లేదు. కవితలో ఉన్న అభిప్రాయాన్ని చూసి చెబుతున్నాను

అలా అంత గొప్ప అభిప్రాయం ఏముంది ఆ కవితలో?”

ఇప్పుడంతా ప్రేమంటే కామమేనే! నాకు ఎటువంటి అనుమానమూ లేదు

అందరూ అలాంటి వాళ్ళు కాదు

లేదు. అందరూ అలాంటి వాళ్ళే!

ఒప్పుకోను! మన కాలేజీలో ఎంతోమంది జెంటిల్ మ్యాన్లు ఉన్నారు. ఉదాహరణకు మన నందకుమార్ ని తీసుకో

ఒకత్తి నందకుమార్ పేరును ఆ చర్చలోకి లాగగా, అక్కడే ఆలొచనలలో మునిగిన జయశ్రీ గబుక్కున తల ఎత్తింది. అప్పుడే అతను ఆమె మనసును ఆక్రమించిన ప్రారంభ ప్రేమ దశ.

నందకుమార్ అయినా సరే, ఈ కవితను రాసిన గౌతం రాజ్ అయినా సరే...ఆడవారి విషయంలో, ‘సెక్స్లో జెంటిల్ మ్యాన్ గా నడుచుకోరు. నడుచుకోలేరు...

ఏం చూసి అలా చెబుతున్నావు?”

ఇప్పటి కాలఘట్టాన్ని బట్టి

ఏ కాల ఘట్టంలో నైనా మంచిదీ ఉంది, చెడ్డదీ ఉంది. సతీ సావిత్రీ జీవించిన కాలంలో కూడా ఈ రెండూ లేవా ఏం?”

నువ్వు సంబంధమే లేకుండా ఎక్కడికో వెడుతున్నావు! ఇప్పుడు ప్రేమంటే కామమే. నా అనుభవంలో నేను చెబుతున్నాను. నన్ను ఒకతను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నువ్వు లేకుండా నేను జీవించలేనుఅన్నాడు. ఏం?’ అని అడిగాను. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. నీ ఆలొచన నన్ను చంపుతోంది అన్నాడు.

అదే ఎందుకుఅని అడిగాను. నాకు నీమీద ప్రేమ అన్నాడు’. అలాగంటే ఏమిటని అడిగాను. అభిమానం అన్నాడు. ఈ ప్రపంచంలో అందరూ అందరిపైనా అభిమానం చూపించాలి. చీమా, దోమలపై కూడా ఆప్యాయత, అభిమానం చూపించాలి. అందువల్ల అందులో ఏమీ తప్పు లేదు. కానీ, అలా అభిమానం చూపడానికీ, నన్ను చూడకుండా ఉండలేపోతున్నానూ అనడానికీ సంబంధం లేదే?” అన్నాను.

ఆ అభిమానం వేరు, ఈ అభిమానం వేరుఅన్నాడు.

అభిమానంలో కూడా రెండు వేషాలా?’ అని అడిగాను.

అవును! ఇది యవ్వన అభిమానం, అంటే ప్రేమఅన్నాడు.

అలాగైతే నాలాంటి అందరి అమ్మాయలపైనా ప్రేమేనా?’ అని అడిగాను. లేదు, నాకు ఎవరు అందంగా అనిపిస్తారో వాళ్ళ మీదేఅని చెప్పాడు.

 అందం...శరీరానికి సంబంధించింది కదా?’ అన్నాను. అవును...నువ్వు ఎల్లోరా ఆర్ట్. అజంతా శిల్పంఅన్నాడు. ఆ తరువాత వెన్నల, పువ్వు, కోకిల, ప్రేమ కోతిఅని ఒకటే పిచ్చి వాగుడు! నా పర్శనాలిటీ నాకు తెలిదా? అయినా కానీ, నా  లోపల అతను నన్ను వర్ణించిన తీరు నాలో మత్తు ఎక్కించింది. మా ఇంట్లో నన్ను తెలివి తక్కువ దానా అని తిడతారు.

అతనేమో నన్ను శ్రీదేవీ అన్నాడు. సినిమాకు పిలిచాడు. వెళ్ళేను. మొదట్లో చెయ్యి తాకేడు, భుజాల మీద చెయ్యి వేసాడు. మెల్లగా చెయ్యి నడుము దగ్గరకు తీసుకు వెళ్ళాడు. ఏయ్, ఇదంతా పెళ్ళి తరువాతే అని చెప్పాను’.  పరవాలేదు...ఇప్పుడు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి నన్ను చాలా బాధలు పెట్టాడు. చాలు చాలూ అనిపించింది. అయ్యా సామీ...నా కడుపు నింపి, విషం తాగేటట్టు చేయకు...! నేను, నువ్వనుకునే రకం కాదుఅని చెప్పాను. ఏమీ అవదు. గర్భం రాకుండా ఎంజాయ్ చేయటానికి ఎన్నో వసతులు వచ్చేసినై...ఎలా ఉంది కథ? ఇదేనే ఈ కాలం ప్రేమ...

ఏయ్, వింటున్నాం కదా అని ఒకేసారి పెద్ద కథ చెప్పకు...ఇది వెతుకుతున్న కరువు ఎద్దు. కావాలంటే అలా నడుచుకోనుండవచ్చు. నేను కూడా ఒకతన్ని ప్రేమిస్తున్నాను. నన్ను అతను ముట్టుకోనే లేదు

తరువాత ఒకేసారి అన్నీ ముగించుకుందామని అనుకుంటున్నాడో, ఏమో?”

పెళ్ళి అయిన తరువాత నువ్వు ఏమైనా చేసుకో అన్నాను. అంతకు ముందు చేస్తేనే కదా తప్పు...?”

దాని కోసం ప్రేమించటం -- పెళ్ళి చేసుకోవటం. అన్నీ తప్పే

అప్పుడైతే పెద్దలు చూసి చేసిన పెళ్ళిళ్ళలో ఇది లేదా? మొదటి రాత్రి అని ఎందుకు పెడుతున్నారు?”

ఇదిగో చూడూ సెక్స్తప్పు కాదు. కామం ఒక అగ్ని. దాన్ని స్టవ్వు వెలిగించుకుని వంట చేసేలాగా అందంగా వాడుకోవటానికే పెళ్ళి. అలా లేదంటే సన్యాసినిగా వెళ్ళి పోవటం మంచిది

బాగా చెప్పావే! ఆ అగ్నిని ని  అందంగా కాల్చాలి. సినిమా హాలూ, పార్కు, పబ్లిక్ ప్లేసు అంటూ దొరికిన చోట్లో కాల్చకూడదు. అలా కాల్చేది జీవితమే కాదు

ఇప్పుడు ముగింపుగా ఏం చెబుతున్నారు? గౌతం రాసిన కవిత్వం కరెక్టా-తప్పా?”

అది ఒక కరెక్ట్ అయిన తప్పు

ఇదేంటి కొత్త రకం విమర్శ?”

అవును...ఆ కవితను తప్పు అని చూస్తే తప్పు. కరెక్ట్ అని చూస్తే కరెక్ట్. యవ్వున ప్రాయంలో ఒక త్రిల్ కోసం అటూ ఇటూగా ఉండటంలో తప్పు లేదు. ఈ కాలంలో సన్యాసం సాధ్యం కాదు.

ఇంట్లోంచి బయటకు బయలుదేరితే కళ్ళల్లో పడే దృశ్యాలన్నీ సెక్స్ను ప్రేరేపించేవిగానే ఉన్నాయి. మనం వేసుకునే సగం సగం దుస్తులు, గోడల మీద అతికిస్తున్న సినిమా పోస్టర్లు, కొన్ని పుస్తకాలలో వచ్చే బ్లో ఆఫ్చిత్రాలు, కథల్లో వచ్చే సంభవాలు, చూసే సినిమాలలోనూ గ్లామర్ సీన్లు మన మనసులను, దాంతో పాటూ మన పట్టుదలను పరీక్షించే కాలం ఇది...! ఇక్కడ మనం తింటున్న భోజనం లోనూ ఉప్పూ-కారం ఎక్కువ. అలాంటప్పుడు శరీరం ఎలా మట్టి తిన్న పాములా చుట్టుకుని ఉండగలదు? అది బుస కొట్టే తీరుతుంది.

మాట్లాడకుండా అమెరికాలోలాగా ఓపన్ సెక్స్లో మనల్ని వదిలేయొచ్చు. మూసి, మూసి పెట్టి ఎమి సాధించాము? ప్రేమ, కామం ఎక్కువ అయ్యిందే తప్ప

గౌతం యొక్క కవిత పైన బలమైన వివాద చర్చ జరుగుతున్నప్పుడు అతనే అక్కడికి వచ్చాడు. అందరూ అతన్ని అదొలా చూశారు.

హలో గౌతం, మీ కవితే వీళ్ళ నోళ్ళళ్ళో రోలులో పిండి నలుగుతున్నట్టు నలుగుతోంది... అన్నది ధారణి.

కవిత అంటేనే విమర్శలు ఉంటాయి. విమర్శలే కదా మనిషి ప్రతిభను పెంచుతుంది!

--- గౌతం యొక్క ఆ జవాబుతో ఆశ్చర్యపోయింది ధారణి.

కొన్ని విమర్శలు మన ప్రతిభను పెంచదు. నీరస పరిచేస్తుంది గౌతం. అవునూ,  ప్రేమ గురించి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఆలొచిస్తున్నారే...ఎందుకని?”

ఎవరు చెప్పారు? నేను ప్రేమ గురించి వ్యతిరేకంగా ఆలొచించటం లేదు! కరెక్టుగా ఆలొచిస్తున్నాను

ప్రేమ అంటే కామం అనేది కరెక్ట్ అయిన ఆలొచనా?”

ఇప్పుడు ఇదే కదా నిజం?”

ఏం, కామం లేని ప్రేమే లేదనేది మీ నిర్ణయమా?”

అక్కడొకటీ -- ఇక్కడొకటీ కరెక్టు కాకపోవచ్చు

అప్పుడు అది మెచ్చుకుని ఎందుకు కవిత రాయకూడదు?”

ఎప్పుడూ ఎక్కువ మందిని బాధించే దాని గురించే రాయాలి

సరే, విషయానికి వస్తాను. మీ వలన కామం కలుపకుండా ప్రేమించటం కుదురుతుందా?”

కుదురుతుంది. నేనూ ప్రేమిస్తూనే ఉన్నాను

గౌతం యొక్క ఆ సమాధానంతో ధారణి అధిరి పడ్డది.

ఈ మొహానికి ప్రేమా? ఈ మనిషి యొక్క హృదయం కూడా ప్రేమించ గలిగేదా?’

---ఆశ్చర్యం, స్వతంత్ర దినం రోజు జెండా పైకి వెళ్ళినట్టు ధారణిలో పైకి వెళ్ళింది.

ఎవరని తెలుసుకోవచ్చా?”

సారీ...అది సస్పెన్స్

అతని సమాధానం పక్కనున్న జయశ్రీని కూడా ఆశ్చర్య పరచింది. ఆమె కూడా అతని వైపు ఎవరన్నట్టు చూసింది.

గౌతం ఆమె చూపులను గమనించాడు. మెల్లగా నవ్వుకున్నాడు. నా ప్రేమికురాలివి నువ్వే కదా?’ అనే లాగా చూసాడు.

కానీ, ఆమె వలన అతని చూపులలోని అర్ధాన్ని అర్ధం చేసుకోలేకపోయింది!

ఏమిటి పెద్ద సస్పెన్స్’? సరదాగా చెప్పండి గౌతం... ధారణి వదిలిపెట్టేట్టట్టు కనబడలేదు.

సారీ...నాది వన్ వే ప్రేమ. నేను మాత్రమే ప్రేమిస్తున్నాను. ఆమె నన్ను ఇంకా ప్రేమించటం లేదు. ఆమె కూడా నన్ను ప్రేమించటం మొదలు పెట్టనివ్వండి. తరువాత చెబుతాను

అవును, ఆమెకు తెలిస్తేనే కదా ఆమె ప్రేమించేది?”

ఆమెకు మాత్రం తెలియ పరుస్తాను

ఆమె కాదంటే...?”

నేనొక మంచి ప్రేమికుడిగా, ఇంకో అమ్మాయిని తలుచుకోవటం, చూడటం చేయకుండా కాచుకోనుంటాను ధారణి

ఎందుకు కాచుకోవాలి...ఆమె నిన్ను ప్రేమించటం లేదే...?”

ఒకవేల తరువాత ప్రేమించ వచ్చు కదా?”

ఎప్పుడు...ముసలితనం వచ్చిన తరువాతా?”

ఏం? అప్పుడు ప్రేమ రాదా ధారణి....?”

యవ్వనం పోయిన తరువాత ప్రేమించటంలో అర్ధమే లేదు గౌతం...

నేను సెక్స్కోసం ప్రేమిస్తే మీరు చెప్పేది కరెక్టే...నేను ప్రేమించేది ఆమె మనసును!

మనసును ప్రేమించటానికి ప్రేమికుడిగా ఉండనవసరం లేదే...! ఒక అన్నయ్యగా అనుకుంటే కూడా అభిమానం చూపించ వచ్చే...?”

ధారణి యొక్క క్లిష్టమైన ప్రశ్నకు ముందు కొంచం తడబడిపోయాడు గౌతం.

వాస్తవమే కదా? శరీర కాంక్ష లేనప్పుడు మనం చూపించే అభిమానం సహోదరత్వంతో కుదిరేదీ పవిత్రమైన ఒకటే కదా? కానీ, ఆ మాటను ఆలొచించి చూడటానికే మనసులో తడబాటు నిండింది.

జయశ్రీ అనే ఆమె నాకు మాత్రమే సొంతమైనదిగా ఉండాలిఅనేలాగా అతన్ని ఆలొచింప చేసింది.

సహోదర అభిమానాన్ని ఎవరైనా చూపించవచ్చు. కానీ, తన అభిమానం దానికంటే వేరుగా ఉంది. అందుకోసం అది కామంతో కూడినదని చెప్పలేము!

ఆలొచనలతో గౌతం సతమవుతుండగా, అతన్ని అలా చిక్కులో చిక్కుకునేలా చేసిన ప్రశ్న అడిగిన ధారణి గర్వ పడింది!

జయశ్రీ కూడా క్షుణ్ణంగా గమనిస్తూనే ఉంది. గౌతం అతని మనసుపై చేస్తున్న పోరాటం చూడ చూడ ఆమెకూ ఆశ్చర్యం. 

ఇతని ప్రేమికురాలు ఎవరై ఉంటారు?’

జయశ్రీ మదిలోని ఈ ప్రశ్న ఊయల కట్టుకుని ఆడుతున్నప్పుడు, నందకుమార్ వచ్చాడు.

హాయ్...ఏమిటి అందరూ సీరియస్ గా ఏదో ఆలొచిస్తున్నట్టు తెలుస్తోంది...?” అతని దగ్గర ప్రశ్న.

రండి నందకుమార్! ఈ రోజు మిస్టర్ గౌతం వలన ప్రేమ గురించి ఒక హీటడ్ ఆర్గ్యూమెంట్... ధారణి చెప్పింది.

గౌతం రాసిన కవిత గురించా?”

ఎలా అంత కరెక్టుగా చెబుతున్నారు?”

అంతా ఒక యూహమే! నాకే అతని కవిత విషయంలో చాలా అభిప్రాయ భేదం. ప్రేమంటేనే కామం అనేది అతని అభిప్రాయం. అతను కావాలంటే ప్రేమను కామం అనుకోనీ. కానీ నేను నా ప్రేమను  కామంతో సంబంధ పరిచి ఆలొచించనే లేదే

నందకుమార్ యొక్క అభిప్రాయంతో జయశ్రీ మొహంలో కాకర పువ్వొత్తులు వెలిగినంత ప్రకాశం. వారే వా...ఇంత స్పష్టత ఉన్న హృదయమా నీకు’! అనే ఆశ్చర్య చూపు.

పక్కన నిలబడ్డ గౌతంకి నందకుమార్ కి సమాధానం చెప్పటంలో ఇష్టం లేనట్టు ఒక చూపు. నందకుమార్ కీ అది అర్ధమయ్యింది. అతని ఆ నిర్లక్ష్యం, చిన్నగా అతన్ని కలత చెందేటట్టు చేసింది. 

మనుష్యుల మనసులకు పలు సమయాలలో డబ్బు, వసతులు కంటే పట్టించుకోకపోవటం అనేది ఒక జీవిత ఫైల్యూర్ విషయం.

గౌతం యొక్క ఆ నిర్లక్ష్యం, నందకుమార్ లో వేరే విధంగా అతన్ని గుచ్చి తోసింది. దాన్ని మాటలలో ఒలకబోసాడు.

ఎప్పుడు ఇలాగంతా రాస్తున్నారో, వాళ్ళ దగ్గర మాటకూ, చేష్టకూ సంబంధమే ఉండదు. ప్రేమంటే...కామమే నని కలత చెందేవారు, వాళ్ళ ప్రేమ విషయంలో కామం లేకుండా ఉండలేరు

లేదు. నేను నీలాగా కాదు. నా ప్రేమలో కామం లేదు సమాధానంగా గౌతం అరిచాడు.

మొదట నీకు ప్రేమికురాలే లేదు. ఆ తరువాతే కదా నీకు కామం ఉందా...లేదా అనేది చూడగలం...

--- గౌతం అది విని మండిపడ్డాడు.

నేనూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది! పెళ్ళి చేసుకుంటే ఆమెనే పెళ్ళి చేసుకుంటా. శరీరం నాకు ముఖ్యం కాదు. అలా గనుక ఆమెనే పెళ్ళి చేసుకోలేకపోతే నేను సన్యాసిగా ఉండిపోతాను

ఏయ్, ఈ సినిమా కథంతా మాకు చెప్పకు...! విధి చాలా పెద్దది తమ్ముడూ. నీ ఛాలెంజ్ లో నువ్వు ఓడిపోతావు...

ఓడిపోను. నా మనో దృఢం నాకు తెలుసు

అలాగైతే నువ్వు ఇక జీవితాంతం సన్యాసివే! నేను దానికి గ్యారంటీ ఇస్తాను

నన్ను ఎవరూ ప్రేమించరనే కదా అలా చెబుతున్నావు...?”

అవును...కావాలంటే చూడు?”

చూద్దాం

---ఇద్దరూ బొటను వేలు ఎత్తి పందెం గుర్రాలు లాగా మారిపోవటాన్ని చుట్టూ నిలబడి చూసిన వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు.

అవసరం లేని పందెం. ఒక కవిత చర్చా వివాదం ఇలా వేడెక్కనవసరం లేదు అని అనుకున్నారు.

జయశ్రీ మాత్రం, ‘సరైన పోటీ!అని మనసులో చెప్పుకుంది.

                                                                                                                                  Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి