21, నవంబర్ 2022, సోమవారం

జోద్ పూర్ శబ్ధతరంగం ....(మిస్టరీ)

 

                                                                               జోద్ పూర్ శబ్ధతరంగం                                                                                                                                                                           (మిస్టరీ)

జోద్ పూర్ ని 'సన్ సిటీ' లేదా 'సూర్య నగరి అని పిలుస్తారు. ఎందుకంటే నగరంలో సూర్యుడు ఎక్కువ గంటలు, ఎక్కువ రోజులు ప్రకాశిస్తాడు.

అలాంటి నగరంలో డిసెంబర్ 18, 2012 ఆకస్మికంగా ఉరుము వంటి శబ్ధం అక్కడి ప్రజలను భయపెట్టింది. ఇళ్ళల్లో నుండి భయటకు వచ్చిన ప్రజలకు చెవులు చిల్లులు పడే శబ్ధం ఎక్కడి నుండి వస్తోందో తెలియలేదు. మొదటగా ఆకాశం వైపు చూశారు, ఏదైనా సూపర్ సోనిక్ విమానం వెళ్ళుంటుందా? అని ఒకరికొకరు మాట్లాడుకున్నారు. ఫోన్లలో అడిగారు. నగర వాసులందరికీ శబ్ధం వినబడింది. కానీ అది ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకోలేకపోయారు.

అతి పెద్ద బాంబు పేలిందేమోనని వాకబు చేసుకున్నారు. అటువంటిది ఏమీ జరగలేదని తెలుసుకున్నారు. మరి   భయంకరమైన శబ్ధం ఎక్కడ నుండి వచ్చింది? నగరంలోని ప్రభుత్వ రంగానికి శబ్ధం వినబడింది. టైములో నగరంపై విమానాలు వెళ్ళలేదని నిర్ధారించుకున్నారు. బాంబు కూడా పేలలేదని తేల్చుకున్నారు. విషయాన్ని ప్రజలకు తెలియజేశారు. మరి భయంకరమైన ఉరుము వంటి చెవులు చిల్లులు పడే శబ్ధం ఎక్కడ నుండి వచ్చింది అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.

జోద్ పూర్ శబ్ధతరంగం ఒక అతి పెద్ద మిస్టరీగా మిగిలిపోవడానికి ఇదొక్కటే కారణం కాదు. మరో అతిపెద్ద కారణం ఉంది. అదేమిటంటే అదే నెల అంటే డిసెంబర్-2012 ఇలాంటి శబ్ధతరంగాలు ప్రపంచంలోని అనేక చోట్ల చిన్నగా వినిపించినా జోద్ పూర్ లో వినిపించినట్లుగానే (చెవులు చిల్లులుపడేలా) అమెరికా మరియు బ్రిటన్ దేశాలలో పలుచోట్ల వినిపించాయట. శబ్ధతరంగం నెలలో కొన్ని వారాలపాటూ, కొన్ని సార్లు పచ్చ రంగు వెలుతురుతో కనిపించిందట

శబ్ధం ప్రొద్దున నుండి మధ్యహ్నం వరకు అప్పుడప్పుడు వినిపిస్తూ మనుష్యులను భయకంపితులను చేస్తూ, మిగిలిన ప్రాణులను (జంతువులను) దాక్కునేలా చేసిందట. కొన్ని ప్రదేశాలలో ఇళ్ళు కదలటం లాంటివి జరిగినాయట. మొదట్లో ప్రభుత్వ అధికారులతో సహా అందరూ తమతమ ఊర్లలోనే ఇలా జరిగిందని అనుకున్నారు. కానీ, తరువాత ప్రపంచంలోని చాలా చోట్లలో ఇలాగే జరిగిందని తెలుసుకున్నారు.

ఎక్కడ ఏది జరిగినా అమెరికా జియోలాజికల్ శాఖను అడిగి తెలుసుకుంటారు. అలాగే విషయాన్ని కూడా అడిగారు. కానీ వారి రాడార్సులలో ఎటువంటి యాక్టివిటీ చూపించలేదని తెలిపారు. వీరికి మొదట్లో అంటే 2012 డిసెంబర్ 6 తారీఖున అమెరికాలోని ఓక్లహామా నగరం నుండి ఫోన్లు వచ్చాయి. డిసెంబర్ 7 టెక్సాస్ నగరం నుండి, డిసెంబర్ 9 ఇంగ్లాండ్ లోని లిసెస్టర్ నుండి, డిసెంబర్ 18 ఇండియాలోని జోద్ పూర్ నుండి, డిసెంబర్ 20 అమెరికాలోని సౌత్ కరోలీనా నుండి ఇదే విషయం మీద ఫోన్లు రావటంతో అమెరికన్ జియోలాజికల్ శాఖ వారే కొంచం ఆందోళన చేందారు. కానీ, వారి విచారణలో ఎటివంటి వివరమూ వారికి దొరకలేదు.

కొద్ది రోజుల తరువాత అమెరికా జియోలాజికల్ శాఖ వారు డిసెంబర్ 20 అమెరికన్ సెంట్రల్ కోస్టులో ఏర్పడిన భూమి యొక్క కదలికలు భూకంపం వలన కాదు, సోనిక్ శబ్ధ తరంగాల వలనేనని KSBY అనే న్యూస్ ఛానెల్ వారికి చెప్పినట్లు KSBY న్యూస్ ఛానల్ తెలిపింది.

ఎడ్వర్డ్ ఏర్ఫోర్స్ బేస్ అధికారులు సెంట్రల్ కోస్టులో వినిపించిన శబ్ధ తరంగం ఎఫ్ -22 యుద్ధ విమాన పరీక్ష పరిశోధన అని తెలిపారు. అయితే మిగిలిన చోట్లలో ఏర్పదిన శబ్ధ తరంగాలు దేనికి సంభందించినవి అని అడిగినప్పుడు వారి దగ్గర సమాధానం లేదు.

'భూకంపానికి ముందు రాడార్స్ లో 'p' తరంగాలు కనబడతాయి. కానీ, సంఘటనలో మొదట 'p' తరంగాలు కనబడ్డా తరువాత ఎటువంటి తరంగాలూ కనబడలేదని, కాబట్టి 'ఇది వేరే ఏదో' నని తెలిపారు కాంబ్రియా జియోఫిసిస్ట్ Lou Blanck.

ఇప్పటిదాకా శబ్ధతరంగాలు దేనికి సంబంధించినవో తెలుసుకోలేకపోయారు. తెలుసుకున్నా ప్రజలకు తెలపటం లేదా? ఒకే సమయంలో పలు ప్రదేశాలలో జరిగిన అనుకోని సంఘటనా? లేదు ఒకదానికొకటి సంబంధం ఉందా?.....బహుశా ఒకరోజు ఇదేమిటో మనం తెలుసుకోవచ్చు.

Images Credit: To those who took the original photos.

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి