12, నవంబర్ 2022, శనివారం

ఎందుకింత వేగం…(కథ)


                                                                                   ఎందుకింత వేగం                                                                                                                                                                    (కథ) 

సుమిత్రా నిన్ను నువ్వు కించపరుచుకోకు. పాపం చేసిన వాళ్ళూపుణ్యం  చేసిన వాళ్ళూ అని మనుష్యులే మనుష్యులను గణించలేరు... దేవుడి దయకు ముందు, దేవుడు చేసే తీర్మానానికి ముందు నీ గురించి తీర్మానించటానికి మనుష్యులకు హక్కు లేదు. దేవుడు నిన్ను అర్ధం చేసుకున్నాడు కాబట్టే నీకు, అంటే నువ్వు బ్రతకటనికీ, పూర్తి జీవితం జీవించటానికి, నీ సర్జరీకి మా మూలంగా డబ్బు ఏర్పాటు చేసాడు

సుమిత్రా కి ఎందుకీ హితబోధ? అంతగా సుమిత్రా జీవితం ఎమంత కష్టంలో ఉంది? సుమిత్రా నిజంగానే పాపం చేసిందా?....తెలుసుకోవటానికి కథ చదవండి:

***************************************************************************************************

ఒక మూట విడిచిన బట్టలు.

నాన్న, అమ్మ, పెద్దన్నయ్య, చిన్న అన్నయ్య, వదిన అందరూ ప్రొద్దుటి స్నానం తరువాత విడిచిపెట్టిన మాసిన గుడ్డలు అందులో ఉన్నాయి.

సోపు పొడి వేసి రెండు ఇనుప బకెట్లలో ఆ గుడ్డలు నానబెట్టి, ఇల్లు శుబ్రం చేసి, తుడిచి, అందరికీ మధ్యాహ్న లంచ్ తయారు చేసేసి--బావి దగ్గర బట్టలు ఉతకటానికి వెళ్ళినామె... బట్టలను ఉతికిన తరువాత వాటిని తోటలో ఉన్న వేప చెట్లకు మధ్య కట్టబడి ఉంచిన హాంగర్లుపైన ఆరేసి లోపలకు వచ్చే లోపల ప్రొద్దు మిట్ట మధ్యాహ్నం అయ్యింది. దాహంతో ఆమె నాలిక పిడచకట్టుకు పోయింది.

బరువైన బకెట్లను ఎత్తినందువలనో ఏమో ఆమెకు మామూలుగా వచ్చే గుండె నొప్పి రోజు కొంచం ఎక్కువగానే వచ్చింది. డాక్టర్ గుండె నొప్పికని ఇచ్చిన మాత్రలలో ఒక దాన్ని తీసుకుంది.

మూలలో ఉంచబడ్డ మట్టి కుండలో నుండి చెంబుతో మంచి నీళ్ళు తీసుకుని...నోట్లో పోసుకుని మొదట మాత్రను మింగింది. తరువాత దాహం తీరటానికి, తీరేంత వరకు చెంబులో ఉన్న మిగిలిన నీళ్ళు తాగింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

ఎందుకింత వేగం…(కథ) @ కథా కాలక్షేపం-1  

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి