ఆంగ్రీ బెర్డ్స్---కోపముగా ఉన్న పక్షులు (ఆసక్తి)
పగబట్టిన కాకులు...బయపడిపోతున్న వ్యక్తులు
కాకులకు గొప్ప
జ్ఞాపకశక్తి
ఉన్నదని, అవి
తమకు
అన్యాయం
చేసిన
వారిని
ఎప్పటికీ
మరచిపోవని
ఒక
భారతీయ
ట్రాక్టర్
డ్రైవర్
చెప్పాడు.
ఒక
సంవత్సరంన్నర
క్రితం, కాకులు
పెట్తిన
గుడ్లలో
కొన్నింటిని
నేను
తీయడం
చూసినప్పటి
నుండి
కాకులు
నిరంతరం
నా
మీద
దాడి
చేస్తున్నాయని
చెబుతున్నాడు.

ట్రాక్టర్ డ్రైవర్ ఇటీవల భారతీయ వార్తాపత్రిక మాథ్రుభూమితో మాట్లాడుతూ, బస్ స్టేషన్ చుట్టూ ఉన్న చెట్లలో కాకులు గూడు కట్టుకున్నాయని. అతను ఆ చెట్లను దాటుతున్నప్పుడు అవీతన్ని పొడుస్తూ ఉండేవట. అతను ఒక వారం పాటు ఆ స్థలం నుండి దూరంగా ఉండటానికి కూడా ప్రయత్నించాడు. అలా చేస్తే అవి తనని మరిచిపోతాయి, నన్ను పట్టించుకోవు అని అనుకున్నాడు. అతను తిరిగి వారం రోజుల తరువాత వచ్చినప్పుడు కాకులు అతని కోసం వేచి ఉన్నాయి. అతనిపై దాడి చేశాయి. అందుకని ఇప్పుడు అతను తన రక్షణ కోసం గొడుగు, కర్రను ఉపయోగిస్తాడు మరియు కాకులను దృష్టి మరల్చడానికి కొంత ఆహారాన్ని విసురుతాడు.
“నేను నా భోజనం నుండి కాకులకు వాటా ఇస్తాను. అవి తినడం ముగించిన తర్వాత, అవి నామీద మళ్ళీ దాడి చేయటం ప్రారంభిస్తాయి”అని మోహనన్ నవ్వుతూ చెప్పాడు. తను బట్టలు మార్చుకోవడం మరియు మారువేషంలో ఉండటానికి కూడా ప్రయత్నించాడట. అవి కూడా పని చేయలేదు.
మోహానన్ పట్ల కాకుల శత్రుత్వం అంబాలవాయల్ ప్రజలలో బాగా ప్రసిద్ది చెందింది. చాలా మంది దీనిని సరదాగా చూస్తుండగా, ట్రాక్టర్ డ్రైవర్ చెప్పాడు పక్షులు చాలా క్రూరంగా ఉంటాయి. వాస్తవానికి కొన్ని నెలల క్రితం అవి నా గొడుగును పొడిచి చింపేసేయి.
ఆసక్తికరంగా, ఇలాంటి
కథను
మధ్యప్రదేశ్కు
చెందిన
శివ
కెవాట్
అనే
కార్మికుడు
చెప్పాడు.
వీధిలో
కాకి
గుడ్డును
తీసేనని గత మూడేళ్లుగా
తనపై
కాకుల దాడి
జరిగిందని
చెప్పాడు.
అవి(కాకులు)
నిజంగా
ప్రతీకార
జీవులు
అని
నేను
ఊహిస్తున్నాను.
కాకులలో కూడా ఐక్యత ఉంటుంది, మనషులలో మాత్రం కష్టమే. పొరపాటున ఒక కాకికి ఏదన్నా ప్రమాదం జరిగితే కాకులన్నీ ఏకమవుతాయి. కావు కావు మంటూ అరుస్తూ...తమ సంఘీభావాన్ని తెలుపుతాయి. మనషులు తెలిసో తెలీకో కాకికి హాని చేస్తే వారిపై ఏకథాటిగా దాడిచేస్తాయి. పొడిచి పొడిచి వేధిస్తాయి.....పై రెండు కథలలో వ్యక్తులను పొరపాటుగా అర్ధం చేసుకున్న, కాకుల తమ పగ గుణాన్ని తెలుపుతున్నాయి.
Images Credit: To those who took the original photos.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి