1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

రెండు ధృవాలు…(సీరియల్)...(PART-6)

 

                                                                             రెండు ధృవాలు…(సీరియల్)                                                                                                                                                                  (PART-6)

మొదటి నాలుగు మాటలు.

వినోద్! నేను నాన్నను మాట్లాడుతున్నారా

ఒక విరామం.

అమ్మ దగ్గర ఫోను ఇవ్వరా! నేను ఇప్పుడే మాట్లాడాలి

చార్జ్ లేని ఫోను కట్ అయిపోయింది.

ఛఛ! భవానీ దగ్గర మాట్లాడే సమయంలోనా చార్జ్ అయిపోవాలి

చెప్పుకుంటూ ఆయన లోపలకు రాగా...ఆయన్నే చూస్తూ నిలబడ్డ మనోజ్ కుమార్ ఎదురుపడ్డాడు. ఆయన మొహం మారిపోయింది.

అతను ఏమీ అడగలేదు. కానీ చూపులు మాత్రం ఆయనపైనే ఉన్నాయి.

నాలుగు అడుగులు నడిచినాయన వెనక్కి తిరిగారు.

లోపల టవర్ లాగలేదు...అందుకే బయటకు వచ్చి మాట్లాడాను. పెళ్ళికి ఇంకా  మూడు రోజులేగా ఉంది? పిల్లను కని నేను ఏమీ చేయకుండా ఉన్నాను! ఆరొగ్యం బాగలేదు. అవతలి వారి నెత్తిన పెడుతున్నాను. మనసు ఒకలాగా వేధిస్తోంది. అందుకే వినోద్ కు ఫోను చేసి అడిగాను. పరిస్థితిల్లో నేనేం చేయగలను

మాట్లాడుతూ లోపలకు వచ్చాశారు.

చెమటలు కారిపోయినై. గుండె దఢతో ఒళ్లంతా ఒకలాగా ఊగింది. పడుకోలేకపోయాడు.

గుండె పట్టేసినట్టు ఉంది.

కూడదు! నేను ఏమోషనల్ అయ్యి విపరీతమూ రాకూడదు. పెళ్ళి జరిగి ముగిసేంతవరకూ నేను బాగుండాలి

పడుకున్న ఆయనకు ఉత్సాహమే రాలేదు.

మధ్య రాత్రి నిదానంగా నిద్రలోకి జారారు.

ప్రొద్దున్నే మనోజ్ త్వరగా లేచి, స్నానం చేసి, పెద్ద చెల్లెలు కల్యాణీని పిలుచుకు రావటానికి రైల్వే స్టేషన్ కు బయలుదేరి వెళ్ళాడు.

రైలు అరగంట ఆలస్యం.

ఏదో ఒక పుస్తకం కొనుక్కుని కూర్చున్నాడు!

మనసులో కఠినమైన ఉక్కబోత. చదవటానికి ఇష్టం లేక పోయింది. కాఫీ తాగాడు.

ఒక విధంగా రైలు వచ్చి, కల్యాణీ దిగింది.

ఏం మనోజ్? నాన్నకు అసలు బాగుండలేదా? ‘నాలుగు రోజులు సెలవి పెట్టి రావేఅని అమ్మ ఫోనులో ఏడ్చింది. మొదటి అటాక్ వచ్చిన తరువాత మళ్ళీ  సమస్యా! నాన్న ఇప్పుడు ఇంట్లోనా...హాస్పిటల్లోనా?”

అతను ఏమీ మాట్లాడకుండా నడిచాడు.

బయటకు వచ్చి ఒక హోటల్ లోపలకు వెళ్లాడు.

ఎందుకు ఇక్కడికి వచ్చావు?”

టిఫిన్ తిని వెళ్దాం. పళ్ళు తోముకున్నావా?”

...ఎందుకు? టిఫిన్ సమయం ఇంకా కాలేదే

చెప్తాను! కూర్చో

ఆమె చేతులు శుభ్రం చేసుకుని రాగా, టిఫిన్ ఆర్డర్ చేశాడు.

నాన్న ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. కానీ, ఎమోషన్, టెన్షన్ పడకూడదని హెచ్చరిక చేశారు

ఉద్యోగానికి వెళ్లటం లేదా?”

వెళ్తున్నారు! ఇప్పుడు సెలవులో ఉన్నారు

తరువాత ఎందుకురా, అర్జెంటు అర్జెంటుగా నన్ను రమ్మన్నది అమ్మ?”

ఆదివారం పద్మజాకు పెళ్ళి

ఏమిటీ? మన పద్మజాకు పెళ్ళా? అదీ వచ్చే ఆదివారమా? ఏమిట్రా చెబుతున్నావు? దానికంటే పెద్దవాళ్లం ఇద్దరం ఉన్నామే? అక్కయ్య నేనున్నప్పుడు దానికి ఎందుకురా అర్జెంటు పెళ్ళి?”

ఆందోళన చెందింది.

నన్ను పూర్తిగా మాట్లాడనిచ్చి, తరువాత నువ్వు మాట్లాడు! అందుకే నిన్ను టిఫిన్ కు తీసుకు వచ్చాను

జరిగినదంతా ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా చెప్పి, వినోద్ అనే కొత్త శక్తి మూలాన్ని చెప్పి, అతన్ని తన కన్నవాళ్ళు ఎలా సపోర్టు చేస్తున్నారో చెప్పి, అతనిపైన తనకున్న సకల అయిష్టాన్నీ వివరించి చెప్పాడు.

అది వదలరా! ఎంత గుండె ధైర్యం రా పద్మజాకి! గర్భం అయ్యెంతవరకు  వెళ్ళిందే? అందులోను మతం వదిలి వెళ్ళి...దాన్ని ఎలారా వదిలిపెట్టారు? నరికి పారేసుండొద్దా. మీకందరికీ సిగ్గూ-సెరం ఏమీ లేదా?”

వినోద్ మనింటి విషయంలో కలుగజేసుకోవటం వలనే ఇది బయటకు  వచ్చింది!

ఎవర్రా అతను? మన కుటుంబ విషయాల్లోకి రావడానికి అతనెవరురా? అతనికేం హక్కురా? మతం మారి పద్మజాకు ఒక పెళ్ళి జరిగితే పెద్దదాన్ని నా జీవితం ఏంకాను? రేపు నన్ను పెళ్ళి చేసుకోవటానికి ఎవరు వస్తారు? విషయాన్ని దాచి పెళ్ళి జరపగలమా? లేక చెబితే ఎవడైనా పెళ్ళి చేసుకోవటానికి ముందుకు వస్తాడా? చెప్పు మనోజ్?”

ఉండవే! ఇంతలో నీకు నీ పెళ్ళి గురించి బాధా? అంతా స్వార్ధం

బాధపడకుండా? నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? నీ గురించి మాత్రమే కదా ఆలొచిస్తున్నావు?”

నోరు ముయ్యి! నువ్వు ఇంత ఖర్చుపెట్టి, హాస్టల్లో జేరి చదువుతున్నావే! అదంతా ఎవరి డబ్బే? నేను పంపే డబ్బే నని అర్ధమయ్యిందా?”

అన్నయ్యే కదా? నాన్నకు బాగుండకపోతే, నువ్వే కదా చెయ్యాలి. ఇదేమన్నా త్యాగమా ఏమిటి?”

పొగరే నీకు? త్యాగమని నేను చెప్పలేదే! మన  కుటుంబంలో ఎవరికీ కృతజ్ఞతా భావం లేదు. నీ దగ్గర మాత్రం దాన్ని నేను ఎలా ఎదురు చూడగలను. ఎవడో ఒక వినోద్ వచ్చిన వెంటనే వాడివైపుకు వెళ్ళిపోయి నన్ను పక్కకు తొసేసారు. నీకేం బాధ. నాకెందుకని నేను వెళ్ళిపోయుంటే, నీ చదువు మధ్యలోనే ఆగిపోతుంది! పెద్దగా మాట్లాడుతున్నావు

కల్యాణీ బెంబేలు పడింది.

రేయ్ కోపగించుకోకు! నువ్వు కుటుంబ హెడ్! నాకు అన్నయ్య... హక్కుతో  చెప్పాను

కొత్తగా ఒక అన్నయ్య వచ్చాడు. కుటుంబమే అతనికి జెండా ఎగరేసి అతని వెనుకే నిలబడుంది. నీ చదువుకు అతను డబ్బు కట్టే ఛాన్స్ కూడా ఉంది

ఏమిట్రా మనోజ్ నువ్వు! నా దగ్గర కోపగించుకుంటున్నావు. నాలుగు దెబ్బలు వేయాల్సిన దానిని వదిలేసి, నా మీద కోపగించుకోవటంలో న్యాయం లేదు

సరే పోనీ..టిఫిన్ తిను...

...

ఇంటికి వెళ్ళిన వెంటనే, నీకు కోపం వచ్చినా దాన్ని నాన్న ఎదురుగా చూపకు. ఆయన గనుక చచ్చిపోతే, నేరం మన మీద...

ఎందుకురా అలా మాట్లాడుతున్నావు

అభిమానం, ప్రేమ చోటు మారితే, చిల్లుపడితే, పగిలిపోతే విసుగే వస్తుంది. నిన్ను హెచ్చరించటానికే టిఫినుకు తీసుకు వచ్చాను. కొంచం జాగ్రత్తగా నడుచుకో. ఇక మీదట ఎవరి దగ్గర నుండీ కృతజ్ఞతలు ఎదురు చూడకు. ఎవరు, ఎప్పుడు, ఎవరివైపు మొగ్గు చూపుతారో ఎవరికీ తెలియదు

ఆమె టిఫిన్ పూర్తి చేసింది.

నీ చదువు నువ్వు పూర్తిగా ముగించవచ్చు. దానికి నేను గ్యారంటీ. తరువాత నన్ను విడిచిపెట్టి వెళ్లటానికి నీకు పూర్తి స్వాతంత్రం ఉంది... బిల్లు ఇవ్వయ్యా

నువ్వేం తినలేదే మనోజ్

కడుపు నిండుగా ఇంట్లో పెడుతున్నారే

ఎక్కువగా మాట్లాడని నువ్వు...ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నావేరా!

నేను అందులో కొంచం వీకేనమ్మా! కొత్తగా వచ్చిన అన్నయ్యను చూడు! ప్రేమ, అభిమానం ఇంటినే ఎత్తేస్తుంది! సరి...వెళ్దామా

ఇద్దరూ ఆటో పుచ్చుకుని ఇంటికి వచ్చారు.

రా... కల్యాణీ..." తల్లి స్వాగతించ,

కల్యాణీ వచ్చేసిందా!" తండ్రి గొంతు వినబడ,

ఎక్కడ నా గర్భిణీ చెల్లి?”

అలా ఆమె అడిగిన వెంటనే, తల్లికి చురుక్కుమన్నది.

మనోజ్ చెప్పాడా?”

అవును! వాడొక్కడే నన్ను ఇంటి వ్యక్తిగా గౌరవమిచ్చి చూస్తున్నాడు

సరేనే...ఇదేమన్నా ఫోనులో చెప్పే విషయమా? మొదట నాన్నను వెళ్ళి చూడు

ఆమె లోపలకు వెళ్ళింది.

రామ్మా కల్యాణీ

ఏమిటి నాన్నా! బాగున్న మిమ్మల్ని దూదిలాగా, ముక్కలు ముక్కలు చేసేసిందా నా చెల్లెలు?”

ఏమిటే మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడే అంతా ఒక విధంగా సహజ పరిస్థికి వచ్చింది. లోపలకొచ్చి కాఫీ తాగు! రా...

తల్లి కల్యాణీని లోపలకు లాక్కు వచ్చింది. నువ్వెందుకురా దాని దగ్గర అంతా ఒప్పగించావు? ” అంటూ అక్కడే ఉన్న మనోజ్ ను కసురుకుని, కల్యాణీ వైపు తిరిగిసరే, వాడు చెప్పినా, నాన్న ఆరొగ్యం గురించి తెలిసుండి కూడా ఆయనెదురుగా అలాగా మాట్లాడతావు

పద్మజా బయటకు వచ్చింది.

ఆమె దగ్గరకు వెళ్ళిన కల్యాణీ విసుగుతో పద్మజాను చూసి , ఆవేశంగా చేతులెత్త, పద్మజా ఆమె చెయ్యిని పుచ్చుకుంది.

కల్యాణీ ఒక్క నిమిషం నిర్ఘాంతపోయి, “చేసిన తప్పుకు నిన్ను చంపేసుండాలి. అలా చేయటానికి ఇక్కడ ఎవరికీ ధైర్యం లేదు. నేను చెయ్యి ఎత్తితే పట్టుకుంటావా? ఎంత పొగరే నీకు?”

నన్ను కొట్టటానికి నువ్వు ఎవరు?”

నీ అక్కను

నన్ను కన్నవారే నన్ను కొట్టలేదు. ఇక్కడున్న ఎవరూ నన్ను ఆదరించలేదు...ఎవరో ఒకతను, మధ్యలో చొరబడి, నన్ను కాపాడటానికి వచ్చాడు. పెళ్ళి ఏర్పాట్లూ చేశాడు. నువ్వే ఇంకొకరి మీద పడి తింటున్నావు! నువ్వు నన్ను కొట్టటానికి చేయి ఎత్తుతావా? విరిచేస్తాను, జాగ్రత్త

తల్లి ఆశ్చర్యపోయింది.

కొవ్వెక్కిందే నీకు! నీ మీద ప్రేమ పొంగి, పెళ్ళికి ముందే నువ్వు చేసిన పనికి అవమానం తట్టుకోలేక నిన్నుకొట్టటానికి రాలేదు! నీ వల్ల రేపు నా జీవితం ప్రశ్నార్ధకం అయిపోతుందే! విషయం ఇంట్లో ఎవరి బుర్రకూ ఎక్కలేదు. నీ పెళ్ళే ఇప్పుడు అందరికీ ముఖ్యమయ్యిందిఇప్పుడు అదే పెద్దదిగా కనబడుతోంది

టెన్షన్ నాకూ ఉందమ్మా! తండ్రి వచ్చాడు.

దాని గురించి తరువాత మాట్లాడదాం. మీరు లోపలకు వెళ్లండి

నాన్న! మీకేం అవకూడదు. ఇది చేసిన ఘనకార్యంతో నన్ను పెళ్ళిచేసుకోవటానికి ఎవరు ముందుకు వస్తారు నాన్నా? నా మెడలొ తాలి ఎక్కుతుందా?”

తండ్రిని కావలించుకుని ఏడుపు మొదలుపెట్టింది పెద్దది.

నువ్వు బాధపడకు కల్యాణీ! ఇప్పుడు దాని గురించి ఆలొచించే సమయం కాదమ్మా

మీరందరూ ఆలొచించ కుండా ఉండొచ్చు! కానీ నేను నా జీవితం గురించి ఆలొచించక్కర్లేదా?”

మనోజ్ లోపలకు వచ్చాడు.

కల్యాణీ! పెద్దన్నయ్య వినోద్ వస్తారు. ఆయన వల్ల జరగనిది అని ఏదీ ఉండదు.  నీ పెళ్ళి ఆయన జరుపుతారు

తండ్రి మొహం ఎరుపెక్కింది!

ఎందుకురా అతన్ని లాగుతున్నావు? ఇప్పుడు మన కుటుంబ అవమానం  నాలుగు గోడలు దాటకుండా ఉంది అంటే దానికి వినోదే కదా కారణం. అది మరిచిపోయి గుచ్చి గుచ్చి మాట్లాడుతున్నావు

సరోజా కోపగించుకోగా,

ఎవరా వినోద్? అతనెందుకు నాకు పెళ్ళి చెయ్యాలి? ఎవరో ఒకరు కలిగించుకుని పెళ్ళి చేయటానికి నేనేమన్నా అనాధనా?” కల్యాణీ ఉరిమింది. 

నోరు ముయ్యి కల్యాణీ! అతను ఎవరో కాదు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు! తండ్రి అరిచాడు.

ఎవరో కాకపోతే, అతను మనకి విధంగా బంధువు?”

నీకు తెలియదు కల్యాణీ? వీళ్ళిద్దరే అతనికి తల్లీ--తండ్రులు! అందుకే అతన్ని ఏమన్నా అంటే వీళ్ళకు పొడుచుకు వస్తుంది

తండ్రి మనోజ్ ను చూసి దన్నం పెట్టాడు.

చాలురా మనోజ్! ఎందుకురా వినోద్ మీద నీకు ఇంత ఈర్ష్య. అతను మనకు మంచే  కదా చేశాడు! ఎటువంటి చెడూ జరగలేదే

ఆయన ఏడ్చారు.

తల్లి తిరిగింది.

చాలురా! మీరిద్దరూ మా పిల్లలేనా? నాన్నను పిచ్చివాడ్నిగా చేసి, ఒక మూల కూర్చోబెట్టే తీరుతారా? మీ ఇద్దరికీ ఎందుకురా అంత ఆశ -- మీ అమ్మను విధవరాలుగా చూడటానికా? ”

బోరుమని ఏడ్చింది.

తండ్రి మనసు విరిగి వెనక్కి తిరిగి నడుస్తుంటే, తూలి కింద పడబోతుంటే పద్మజా వచ్చి పట్టుకుంది.

రండి నాన్నా! అంటూ ఆయన్ని తీసుకువెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది!

నాన్నా! ప్రాబ్లమూ లేదే!

లేదమ్మా! రోజువారి దెబ్బలు తినడం మొదలు పెట్టాను. హృదయం  స్ట్రాంగుగా ఉన్నదని అర్ధం

తల్లి వచ్చింది.

ఇలా చూడండి! ఏదీ చెవులో వేసుకోకుండా మీరు ప్రశాంతంగా ఉండండి! అదే అన్నిటికీ మంచిది

సరోజా! నువ్వు, పద్మజా ను తీసుకుని వినోద్ ఇంటికి వెళ్ళాలన్నావు కదా?!”

లేదండీ! ఇప్పుడున్న మనో పరిస్థితిలో నేను వెళ్లను. మంచి చేసే వాళ్ళింటికి  వెళ్ళి కన్నీరు పెట్టుకుంటే అది మహా పాపం. ఎలాగూ భవానీ గారు పెళ్ళికి వస్తారు కదా! అప్పుడు మాట్లాడతాను. మీరు స్నానాకి రండి!

చాలా నీరసంగా ఉంది సరోజా!

సరే! కాసేపు పడుకోండి! టిఫిన్ తిని స్నానం చేద్దురుగాని!

బయటకు వచ్చింది.

కొడుకునూ, కూతుర్ను చూడటానికి విరక్తిగా ఉంది.

మనోజ్ కుమార్ లోపలకు వెళ్ళిపోయాడు. కల్యాణీ అతని వెనుకే వెళ్ళింది.

నేను నీతో చెప్పే కదా తీసుకువచ్చాను. ఎందుకు అంత గోల చేశావు?”

ఏమిట్రా అలా మాట్లాడుతున్నావు. కష్టపడబొయేది నేను!

అలా ఏమీ జరగదు. ఇప్పుడు నువ్వు చదువు ముగించి, ఉద్యోగానికి వెళ్ళిన తరువాతే కదా నీకు పెళ్ళి. టైములో చూసుకుందాం! ఇకనైనా నోరు మూసుకోనుండు

నేను రేపే బయలుదేరతాను!

పెళ్ళి ఆదివారమే!

కార్యానికీ నేను ఉండబోయేది లేదు. ఇదే విషయమని తెలిసుంటే, నేను వచ్చే ఉండను!

అమ్మ లోపలకు వచ్చింది!

నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు! నువ్వుంటేనే గోల!

నేనా గోల చేస్తున్నా. చెడిపోయిన దాన్ని తరిమే ధైర్యం లేదు. నన్ను అంటావా?”

కార్యం అని ఎందుకే చెబుతావు? అది నీ చెల్లెలు. ఎక్కడికి వెళ్ళినా అది జీవించాలి. దాని కడుపులో బిడ్డ! రాతి గుండె నీది! అమ్మాయిగా పుట్టిన కారణంగా, అందరికీ అన్నీ వస్తుంది! అప్పుడు తెలుస్తుంది బాధ!

నేను దాని లాగా ఇంత మూర్ఖంగా, అనాగరీకంగా నడుచుకోను

సరి...సరి...! నేనేం మాట్లాడను. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి!

అక్కడ తండ్రి గదిలో ఫోను మోగింది. ఆయన ఎత్తారు.

నాన్నా! వినోద్ మాట్లాడుతున్నా! రాత్రి ఫోనులో చార్జ్ లేదా!

అవునయ్యా...

ఇప్పుడు అమ్మతో మాట్లాడతారా!

లేదయ్యా! వద్దు

ఏం నాన్నా మీ స్వరంలో ఉత్సాహాం లేదు? మళ్ళీ బాగుండలేదా? నేను రానా?”

వద్దు వినోద్...తప్పుగా తీసుకోకు!

పెళ్ళి ఏర్పాట్లన్నీ చేసి ముగించాను! మీ దగ్గర చెప్పాలి

వద్దు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకేసారి పెళ్ళిలో చూసుకుందాం

నాన్నా...!

అర్ధం చేసుకో వినోద్! ఇప్పుడు మనో కష్టమూ వద్దు. నువ్వు తెలివిగల వాడివి! సరేనా?”

సరే నాన్నా

ఆయన ఫోను కట్ చేశారు.

లోపలకు వచ్చిన కల్యాణీ, పెళ్ళి వివరాలు అడిగింది.

ఒక చిన్న హాలులో జరుగుతుంది

ఎటువంటి సంప్రదాయంతో?”

తాళి కట్టి, ఉంగరం మార్చుకునేటట్టు...

దానికి నగలు వేస్తున్నావా? పెళ్ళి ముహూర్తం చీర, డ్రస్సు ఖర్చులు?”

తల్లి తల ఎత్తి చూసింది అక్కడే ఉన్న తల్లి.

నా దగ్గరున్న ముప్పై కాసులలో సగం దానికి వేస్తున్నాను

మిగతాది?”

నీకే!

పారిపోయేదానికి ఎందుకు పదిహేను కాసులు?”

అది పారిపోలేదు...పెద్దలు చూసి చేస్తున్న పెళ్ళి! ఎవరూ ఏదీ అడగలేదు.  కట్టుకున్న చీరతో ఏలుకోవటానికి వాళ్ళు సిద్దంగా ఉన్నారు! వేరే మతంగా ఉన్నా వాళ్ళకు మానవత్వం చాలానే ఉంది!

కట్టుకున్న చీరను వాళ్ళ కొడుకు లాగేసిన కారణంగానే, కట్టుకున్న చీరతో ఒప్పుకుంటున్నారు!

ఆపవే! కన్న తల్లికి ఎదురుగా ఇలా అసహ్యంగా మాట్లాడకే

నీ చిన్న కూతురు చెడిపోయి రావటం పుణ్యం. నేను మాట్లాడేది అసహ్యమా?”

నువ్వు ఇక్కడ ఉండటానికి ఇష్టం లేదంటూ వెళ్ళి పోతానని చెప్పావు! తరువాత ఎందుకే నీకు ఇన్ని వివరాలు?”

చెడిపోయిన మొహాలు ఎలా ఉన్నాయో నేను చూడాలి!

అమ్మా! నువ్వు లోపలకు రా! పద్మజా పిలవ,.

ప్రసవ నొప్పులు వచ్చినట్టున్నాయి! వెళ్ళి చూడు

సరోజా కుంగిపోయింది.

మంచి చేసిన వినోద్ పైన, ఈర్ష్యతో కచ్చెగా ఉన్న ఒక బిడ్డ! వచ్చిన వెంటనే తన జీవితం నాశనం అయిపోతుందే అంటూ అగ్నిలాగా మాటలను విసురుతున్న ఒక కూతురు! కడుపుతో నిలబడ్డ ఒకత్తి! రోగిష్టి భర్త! భగవంతుడా! ఇంత అవకతవకలున్న కుటుంబమా ఇది?’

పద్మజా! నేను గుడికి వెళ్తున్నాను. నాన్న పేరు మీద అర్చన చేయించాలి! నువ్వొస్తావా?”

అది చర్చుకు అయితే వస్తుంది! అక్కడ అర్చన చేస్తారా?”

 తల్లి తిరిగి చూసింది.

అంతా భగవంతుడే! మనసులో కల్మషం ఉంటే, భగవంతుడూ మనకు తోడు రాడు

...శరీరంలో కల్మషం ఉంటే, తప్పులేదనుకుంటా?”

తల్లి దగ్గరకొచ్చింది.

నేను దాన్ని పిలిచాను! నిన్ను కాదు. చేతులెత్తి దన్నం పెడతాను! పెళ్ళి జరిగి ముగిసేంతవరకు నువ్వు మాట్లాడకుండా ఉండు! తరువాత కూడా నీ ఆవేశం తగ్గకపోతే, నన్ను చంపేయి!

తల్లి లోపలకు వెళ్ళిపోయింది.

మనోజ్ కుమార్ బట్టలు మార్చుకుని బయటకు వచ్చాడు.

ఎక్కడికి వెళ్తున్నావు?”

బ్యాంకులో కొంచం పనుంది

నేనూ వస్తాను!

దేనికీ?”

నాకు డబ్బులు కావాలి!

నెల కోటా అమ్మ పంపించేసిందే! అంతకంటే ఎక్కువ ఇవ్వటానికి నా దగ్గర లేదు! నిన్ను వీపున మోసుకుని తిరగటానికి నేను రెడీగాలేను

అతను వేగంగా బయటకు వెళ్లాడు.

అమ్మ దగ్గరకు వచ్చింది కల్యాణీ!

నేను నీ దగ్గర చాలా మాట్లాడాలి

ఇంకానా! ఇంతకు ముందే టన్నులు, టన్నులుగా మాట్లాడావే! ఇంకా నువ్వు మాట్లాడి నేను వింటే నాకు స్ప్రుహ పోతుంది! నువ్వు మాట్లాడింది చాలు!

తల్లి వెళ్ళిపోగా, కల్యాణీ పిచ్చి పట్టిన దానిలాగా నిలబడింది.

                                                                                                    Continued...PART-7

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి