7, సెప్టెంబర్ 2023, గురువారం

రెండు ధృవాలు…(సీరియల్)...(PART-9)

 

                                                                                 రెండు ధృవాలు…(సీరియల్)                                                                                                                                                                    (PART-9)

ఇంటికి తీసుకువచ్చి దింపాడు వినోద్! తరువాత కల్యాణీ ఏమీ మాట్లాడలేదు.

వినోద్ బయలుదేరి వెళ్ళాడు!

మనోజ్ రోజు రాత్రి పదింటికి ఇంటికి వచ్చాడు.

బయట తిన్నాను! నాకేమీ వద్దు!”

మనోజ్ పెళ్ళి సమస్యా లేకుండా మంచిగా జరిగింది. నువ్వు కోపగించుకోకురా!”

విషయంగా నాతో ఎవరూ మాట్లాడకండి! వదిలేయండి!”

ఎందుకురా అలా మాట్లాడుతున్నావు?”

ఇంట్లో నా పొజిషన్ ఏమిటో నాకు అర్ధమయ్యింది! కుంటి సాకూ అవసరం లేదు! అతి త్వరలో దీనికంతా ఒక సమాధానం చెబుతాను

తల్లి నిద్రపోలేదు.

కల్యాణీ కూడా నిద్రపోలేదు.

రాకూడదనే బయటి ఊరుకు వెళ్ళానని అబద్దం చెప్పమన్నాను!’ వినోద్ తల్లి చెప్పిన మాట కల్యాణీకి గుర్తుకు వచ్చినప్పుడల్లా చురుక్కు మంటోంది.

డేవిడ్ కుటుంబమంతా ఆమెను కులదేవతగా కొని ఆడుతోంది! పెళ్ళి జరగటానికి ఆవిడే కారణం అంటున్నారు. మొరటు బెంజిమిన్ ను, కన్విన్స్ చేసి, పెళ్ళి వరకు తీసుకువచ్చి వదిలిందిట!’

వినోద్ ను ముట్టుకున్నందుకే, మనోజ్ ని బెంజిమిన్ కొట్టారే

గర్భం దాల్చిన నా చెల్లి పరువు పోకుండా రక్షించిన ఆవిడ, పెళ్ళికి రాకూడదని ఎందుకు ఇంట్లోనే ఉండిపోయేరు

ఎందుకని?’

ప్రశ్న పెద్దదిగా తలెత్తింది.

అమ్మ దగ్గర ఇది చెబుదామా?’

అది కన్ ఫ్యూజన్ తెస్తుందా?’

మనోజ్ ఆపోసిట్ గా నిలబడ్డాడు

అయోమయంగా ఉంది! రేపు బయలుదేరాలి! ఇక లీవు పెట్టలేను. చివరి సంవత్సరం!’

నువ్వు చదువు ముగించు! జాబ్ కు నేను గ్యారంటీ!’ అతను హామీ ఇచ్చింది గుర్తుకు వచ్చింది.

మరుసటి రోజు ప్రొద్దున, కల్యాణీ బ్యాగు సర్దుకుంటోంది! మనసులోకి వచ్చి వినోద్ తొంగి చూశాడు.

మిమ్మల్ని పెళ్ళి చేసుకోబోయే అమ్మాయి అదృష్టవంతురాలు

కారులో ఆమె చెప్పింది!

అది నేనుగా ఉండకూడదా?’

మా కుటుంబంపైన ఎనలేని ప్రేమ పెట్టుకున్న నువ్వు, కుటుంబానికి అల్లుడుగా వస్తే, కుటుంబానికే అది అదృష్టం!’

నాకు అతని మీద ప్రేమ పుట్టిందని అమ్మ దగ్గర చెప్పేద్దామా?’

చెప్పి, ఒకసారి వినోద్ తల్లిని --నాకు కాబోయే అత్తగరినీ నేను చూస్తే, మనసు సంతోషపడదా?’

రాత్రికే కదా ఊరెళ్లాలి! పగలు వాళ్ళింటికి వెళ్లకూడదా?’

మొదట వాళ్ళను కలిసి మాట్లాడి, తరువాత అమ్మ దగ్గర చెప్పొచ్చు.

మనోజ్ ప్రొద్దున్నే బయలుదేరటంతో,

అమ్మా! వినోద్ తల్లిని చూసి ఒక థ్యాంక్స్ చెప్పటం మర్యాద! రోజు వెళితే నేనూ వస్తా!”

నాన్న దగ్గర మాట్లాడతాను! ముగ్గురం వెళదాం

సరే. నేను వినోద్ దగ్గర మాట్లాడతానుఅన్నారు తండ్రి.

వాళ్ళు బయటకు వెళ్ల, ఆయన వినోద్ కు ఫోను చేసి చాలా సేపు మాట్లాడారు.

సరోజా! వినోద్ ఇప్పుడు వస్తాడు! మిమ్మల్ని కారులో తీసుకు వెళ్తాడు

మీరూ రండి నాన్నా

లేదమ్మా! నాకు నీరసంగా ఉంది! మీరు వెళ్ళి రండి!”

వినోద్ వచ్చి వాళ్లను కారులో తీసుకువెళ్లాడు.

కారులో ఎక్కిన వాళ్ళు మౌనంగానే ఉన్నారు.

రోజు అమ్మ మాట్లాడింది కల్యాణీ చెవిలో పడింది. ఇంటికి వెళ్ళిన తరువాత కల్యాణీ అమ్మ దగ్గర ఏం మాట్లాడుతుందో?’ వినోద్ భయపడ్డాడు.

కారు ఆగినప్పుడు భవానీ పరుగున వచ్చి స్వాగతించింది.

మహాలక్ష్మి కళతో, మంచి రంగుతో, అందంగా, చాలా లక్షణంగా ఉంది భవానీ.

అదే నవ్వు! అభిమాన పూర్వక మాటలూ! ఉపచరణ!

సరోజాకు, థ్యాంక్స్ చెప్పటం కుదరలేదు.

వినోద్ కు అలాగే మీ గుణం. అందర్నీ సులభంగా ఆకర్షించుకునే గుణం!”

నవ్వింది.

నేను బెంజిమిన్ ఇంటికి వెళ్ళి పద్మజాను చూస్తాను

పెళ్ళికి రాకపోవటం పెద్ద లోటే!”

క్షమించాలి! నేను బయట ఊరికి వెళ్ళలేదు! రాకూడదనే అబద్దం చెప్పమన్నాను

సరోజా ఆశ్చర్యపోయింది.

ఎందుకమ్మా?”

దానికొక న్యాయమైన కారణం ఉంది! చెబితే మీరే ఒప్పుకుంటారు! అది సమయం వచ్చినప్పుడు చెబుతాను

కల్యాణీని కౌగలించుకుని ముద్దుపెట్టింది.

అందంగా ఉన్నావు! సంవత్సరం డిగ్రీ అయిపోతుంది కదా? నీకు వినోద్ ఉద్యోగం ఇప్పిస్తాడు. మేము ఏర్పాటు చేస్తాము. నీకేమమ్మా మహారాణివి!”

కల్యాణీకు ఆనందం!

సరోజా అంతకంటే ఎక్కువ సంతోషపడింది!

ఆయనకు ఆరొగ్యం బాగలేదు...రావాలనే ఆశపడ్డారు భవానీ!”

దానికేమమ్మా? వీలున్నప్పుడే రానివ్వండి!”

ఇద్దరికీ భోజనం వడ్డించింది భవానీ.

మీ వంట బ్రహ్మాండంగా ఉంది! ప్రభుత్వ ఉద్యోగం, ఇంగ్లీష్ నాలెడ్జ్, అందం, తెలివి...ఇంకా ఏం కావాలి? మిమ్మల్ని చూస్తే ఆశ్చర్యంగా ఉంది భవానీ

బయలుదేరే సమయం, కల్యాణీకి పట్టు చీర పెట్టింది.

తీసుకెళ్ళి దింపిరా వినోద్!”

ఇంటికి తీసుకు వచ్చి దింపాడు వినోద్! మళ్ళీ తిరిగి వెళ్లాడు.

సరోజా, కల్యాణీ నోరు నొప్పి పుట్టేంత వరకు పొగడారు.

సరే! నువ్వు రోజు రాత్రి రైలుకి బయలుదేరతావు! అంతలో మనోజ్ వస్తాడో, రాడో?”

వాడు రాకపోతే వినోద్ కు ఫోను చేస్తానమ్మా!”

చాలే! వినోద్ ను ఇంకా కష్టపెట్టకూడదు?”

అమ్మా! నేనొకటి చెప్పనా?”

చెప్పమ్మా!”

నా చదువు ముగించుకుని వచ్చేస్తా! వినోద్, మన కుటుంబంపైన ప్రాణమే పెట్టుకున్నాడు కదా...?”

దానికేమిటిప్పుడు...అది మనందరికీ బాగా తెలుసు కదా

నాకు ఆయన్ని బాగా నచ్చిందమ్మా

ఎవరికే అతను నచ్చంది

ఆయనే ఇంటికి అల్లుడుగా వస్తే, నువ్వూ, నాన్నా ఒప్పుకోరా?”

తల్లి తల ఎత్తి చూసింది.

చెప్పమ్మా! ఇలాంటి ఒక భర్త, అత్తగారూ ఎవరికమ్మా దొరూతారు? నా ఆశ తప్పా అమ్మా?”

నాకూ ఆశ ఉంది కల్యాణీ!”

అమ్మా!”

తొందరపడి నేను నొరు జారకూడదని చెప్పలేదు! ఇప్పుడు నువ్వే చెప్పేశావు! అలా ఒకటి జరిగితే, మన కుటుంబానికే అదొక అదృష్టం. కానీ, ఒక సంకటం ఉందే!”

ఏమిటి?”

మనోజ్, వినోద్ ను శత్రువుగా చూస్తున్నాడే. సమస్య పెద్దదవుతూ పోతోంది! మనోజ్, దీనికి అంగీకరిస్తాడా?”

వాడి అంగీకారం ముఖ్యం లేదమ్మా!”

ఏమిటే అలా మాట్లాడుతున్నావు? వాడు నీ అన్నయ్య

వాడికి డేవిడ్ నచ్చలేదు. పద్మజా జీవించకుండా పోయిందా? నాకు వినోద్ బాగా నచ్చాడు. నువ్వు నాన్న దగ్గర మాట్లాడమ్మా! నాన్న వద్దనరు

ప్రొద్దున్నే నాన్నతో మాట్లాడతాను. నువ్వు బయలుదేరు!”

నేనున్నప్పుడే మాట్లాడమ్మా

తల్లి ఆలొచించింది!

సరే రా! వెళ్ళి మాట్లాడేద్దాం

                                                                                                              Continued...PART-10

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి