10, సెప్టెంబర్ 2023, ఆదివారం

నాకని ఒక చిరునామా…(కథ)

 

                                                                               నాకని ఒక చిరునామా                                                                                                                                                                (కథ)

నేను ఎన్నో రాత్రులు నిద్రపోకుండా గడిపాను. కానీ, ఈ రోజు రాత్రిలాగా నన్ను కష్ట పరచిన రాత్రి ఇంకేదీ లేదు. నన్ను ముట్టుకోకుండానే -- నన్ను ఎక్కువగా గాయపరిచిన మగాడివి నువ్వుగానే ఉంటావు.

ఆడదాని వాసనే పడకుండా నువ్వు కాలం గడిపావు! ఏమయ్యా...మనిద్దరం కలిసి ఎందుకు ఒకటిగా జీవించ కూడదు...?

ఇలా అడుగుతున్నానని నువ్వు నన్ను తప్పుగా అర్ధం చేసుకోకు! నిన్ను లేబుల్ గా ఉంచుకుని నేను మళ్ళీ మురికి ఊబిలోకి, వీధిలోకి వెళ్ళిపోతే ఎం చేయను అని అనుమానపడొద్దు. నాకని ఒక చిరునామానే నాకు ఇప్పుడు కావాలి. ఉత్త బెడ్ రూం సుఖం కాదు!...దీని గురించి తెలుసుకోవటానికి ఈ కథను చదవండి.

ఆమెను తల ఎత్తి చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను.

ఈమా...?”-- నేను నమ్మలేకపోయాను. బద్రత కోసం వచ్చున్న పోలీసుల దగ్గర అనుమతి తీసుకుని ఆమె దగ్గరకు చేరుకున్నాను.

నువ్వు...నువ్వు... మానసానే కదా...?”

ఆమె తలెత్తి నన్ను చూసింది.

ఏయ్ మనోహర్...నువ్వెలా ఇక్కడ...?” ఆమె మామూలుగా నన్ను విచారించింది.

నేను ఈ న్యాయస్థానంలోనే రైటర్ గా ఉన్నాను! నువ్వు... ప్రశ్న అడగడానికే సంకోచించాను.

నువ్వెలా ఈ గుంపులో చిక్కుకున్నావు అని అడుగుతున్నావా...? ఎందుకు సంకోచపడుతున్నావు...? ప్రాస్టిట్యూషనే...ఈ రోజు పట్టేశారు! ఏముంది మూడు నెలలో లేక ఆరు నెలలో...? అంతా అలవాటైపోయింది! ఆమె చాలా సహజమైన రీతిలో చెప్పింది.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

నాకని ఒక చిరునామా…(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి