రెండు ధృవాలు…(సీరియల్) (PART-10)
తండ్రి కిటికీలో
నుండి బయటకు
చూస్తూ, డీప్
గా ఆలొచిస్తూ
పడుకున్నారు.
“నాన్నా!” కల్యాణీ
గొంతు వినబడ,
మెల్లగా లేచి
కూర్చున్నారు!
“ఏమ్మా! కాలేజీ
హాస్టల్ కు
బయలుదేరావా?”
“ఇంకో
అరగంటలో బయలుదేరుతా... మనోజ్ రాలేదు!”
“నువ్వు
వినోద్ దగ్గర
చెప్పుంటే, కారుతో
వచ్చుంటాడే!”
“ఫోను
చేశాను నాన్నా. వచ్చేస్తారు! వినోద్
తల్లిని చూసి
వచ్చిన తరువాత
నేనూ, అమ్మా
మాట్లాడుకున్నాము!”
“నా
చదువు ముగిసిన
తరువాత, ఖచ్చితంగా
నాకు మంచి
ఉద్యోగం చూసిపెడతానని
చెప్పారు!”
“నీకు
ఉద్యోగం, పెళ్ళీ
అన్నీ జరుగుతాయి. నాకు
ఆ నమ్మకం
వచ్చింది!”
“దాని
గురించి మాట్లాడటానికే
ఇప్పుడు మేము
వచ్చింది! అమ్మా
నువ్వే చెప్పు”
“ఏమిటది
సరోజా?”
“నాకూ
అందులో ఇష్టమే! కల్యాణీకి
అదే ఆలొచన
ఉంది! నోరు
తెరిచి నా దగ్గర
అడిగేసింది! మీరు
కూడా ఖచ్చితంగా
వద్దని చెప్పరని
మాకు నమ్మకం
ఉంది”
“ఏమిటా
ఇష్టం? చెప్పండి!”
రాహుకాల సమయం
వాకిట్లో కారు
వచ్చి నిలబడింది! వినోద్
దిగి లోపలకు
వస్తున్నాడు.
“వినోద్
కంటే ఒక
మంచి కుర్రాడు
ఈ లోకంలోనే
ఉండడు! మనోజ్ ను
--
వినోద్ ను కలపాలంటే
ఒకే ఒక
వంతెనే ఉందండి!”
“చెప్పు! అంతకంటే
సంతోషం నాకు
వేరే ఏదీ
లేదు!”
వినోద్ అది
వింటూ లోపలకు
రాగా,
“మన
కల్యాణీని, వినోద్
కు ఇచ్చి
పెళ్ళి చేసేస్తే...?”
తండ్రి ముఖం
వెంటనే మారి
పోయింది! వినోద్
అలాగే నిలబడిపోయాడు.
“అతని
కంటే మంచి
అల్లుడు మనకు
దొరకడు! భవానీ
లాంటి అత్తగారు
ఈ లోకంలోనే
ఉండరండి”
ఆయన ముఖం
ఎర్రబడ, నరాలన్నీ
లాక్కుపోగా...ఆయన
శరీరమే ఒక
విధంగా ఊగిపోగా,
వినోద్ లోపలకు
వచ్చాడు.
“అమ్మా! ఏం
మాట్లాడుతున్నారు
మీరు?”
“మీ
అమ్మ దగ్గర
ప్రొద్దున్నే మాట్లాడుంటాను...సరే, ఈయన
దగ్గర అడగకుండా, చెప్పకుండా
మాట్లాడ వద్దనుకున్నా...!”
“ఇది
ఎప్పటికీ జరగదమ్మా!”
“ఎందుకు
వినోద్ అలా
చెబుతున్నావు? మనోజ్
గురించి బాధపడకు!
వాడు ఎదిరించినా
నేను వాడితో
మాట్లాడి సరిచేస్తాను.
అది నా
భాద్యత”
“ఎంతో
మూర్ఖుడైన మొరటు
బెంజిమిన్ ను
సరి చేసిన
భవానీకి మనోజ్
ను సరిచేయటం
కష్టమా! ఇద్దరూ
కలుసుకుంటే ఆవిడ
సాదిస్తుంది! నువ్వు
బాధపడకు”
“ఆయన
నాకు నాన్న, మీరు
అమ్మ...
మనోజ్ తమ్ముడు-- పద్మజా చెల్లెలు...అప్పుడు... కల్యాణీ కూడా
చెల్లే కదా?”
“నో
వినోద్. అలా
చెప్పకండి? నేను
మిమ్మల్ని ఇష్టపడుతున్నాను”
“లేదు...లేదు.
వినోద్ చెప్పేదే
కరెక్ట్! వాడు
నా కొడుకే!
పెళ్ళి కొడుకుగా
మారలేడు!”
ఆయన స్వరం
పెద్దగా వినబడింది.
“ఏం
మాట్లాడుతున్నారు, వాడ్ని
నేను పది
నెలలు మోసి
కన్నానా! భవానీ
కన్న పిల్లాడు
ఈ వినోద్!
కొడుకు అని
చెబితే...పెళ్ళికొడుకు
కూడా కొడుకే!”
“లేదు...లేదు...లేదు!” ఆయన గుండె
పట్టుకుని వాలిపోగా, కుటుంబమే
బెదిరిపోయింది.
ఆయనకు మొహం
కందిపోయి, శరీరం
వణుకుతూ, చెమటతో
స్నానం చేసి, ఒక
విధమైన ఫిట్స్
లాగా రాగా, సరోజా
కేకలు పెట్టింది.
అమాంతం బోసు
ఆయన్ని ఎత్తుకుని
కారులో వేశాడు!
అందరూ కారెక్క, కారు
బయలుదేరింది.
“ఏమండీ? ఏమండీ?”
“ఎందుకు
నాన్నకు ఇంత
ఆందోళన! అడగకూడనిది
ఏదీ నేను
అడగలేదే?”
"కల్యాణీ!
విమర్శలు ఇప్పుడొద్దు!
ఆయన ఆరొగ్యం
ఇప్పుడు ముఖ్యం.
డాక్టర్లు చూడనీ!
ఇంకేదీ మాట్లాడకు!
ప్లీజ్”
“అవునే
ముందు నాన్న
బయటపడనీ! అంతా
మంచే జరుగుతుంది!”
ఆసుపత్రిలో చేర్చ, ఎమర్జన్సీ
చికిత్సా విభాగానికి
ఆయన్ని తీసుకు
వెళ్ల, తీవ్ర
చికిత్స ప్రారంభమైంది.
ఆందోళనతో కాచుకోనుండ, మనోజ్
విషయం
తెలుసుకుని వచ్చాడు.
“ఏమిటి? ఏం
జరిగింది నాన్నకు?”
“కారణం
వద్దు మనోజ్.
మొదట ఆయన
కోలుకోనీ! తరువాత
మాట్లాడదాం”
మనోజ్, కల్యాణీను
వేరుగా తీసుకు
వెళ్ళి అడగ, ఆమె
కొంచం సంసయించి, తరువాత
చెప్ప,
“ఛాన్సే
లేదు! వాడు
నా శత్రువు!
ఏ కాలంలోనూ
ఈ ఇంటికి
అల్లుడు అవలేడు”
“నాకు
నచ్చాడు!”
“నాన్న
కూడా వినోద్
అల్లుడు కాలేడు
అనే కదా
అడ్డుపడ్డారు”
“................................”
“సరి...
వినోద్ ఏం
చెప్పాడు?”
“ఆయనా
ఇష్టపడలేదు! నువ్వు
నాకు చెల్లెలు
అంటున్నారు”
“తప్పించుకున్నాను”
కొన్ని గంటలు
పోరాడిన తరువాత
డాక్టర్ బయటకు
వచ్చాడు.
“ఐ
యాం సారీ.
ఆయన ఇక
బ్రతకరు. అందువల్ల
వెంటీలేటర్ తో
ఇంటికి తీసుకు
వెళ్ళొచ్చు”
కుటుంబమే దుఃఖంలో
మునిగిపోయింది.
ఆంబ్యులాన్స్ ఇచ్చారు.
అందులో ఉంచి
ఆయన్ని ఇంటికి
తీసుకు వెళ్లారు.
ఇంటికి తీసుకు
వచ్చిన మరు
క్షణమే పద్మజాకు
విషయం తెలుప, వెంటనే
ఆందోళన పడుతూ
బయలుదేరారు.
ఆయనకు కొంచంగా
స్ప్రుహ ఉంది.
అందరూ వచ్చాసారు.
చుట్టూ నిలబడ్డారు.
“నువ్వు
మాత్రం లోపలకు
రా సరోజా!”
వచ్చింది!
“నేనింక
బ్రతకను! వినోద్
ను మన
కొడుకుగా అనుకున్నాము.
అందువలన అతను
అల్లుడు కాలేడు.
అర్ధమయ్యిందా?”
సరోజా ఏదో
మాట్లాడటానికి
రాగా, “నువ్వు
మనోజ్ ని పిలు!
నేను చూడాలి”
“నేను
ఇక బ్రతకను!
ఈ కుటుంబానికి
పెద్ద నువ్వే!
ఇది నా
చివరి వాగ్మూలం!
వినోద్ ఎక్కడ?”
“వాళ్లమ్మను
పిలుచుకు రావటానికి
వెళ్లాడు!”
“తలుపు
ముయ్యి”
అతను ముయ్య.
పదిహేను నిమిషాలు
అతనితో మాట్లాడారు.
మనోజ్ మౌనంగా
వింటూ ఉన్నాడు.
అతనూ ఏదో
చెప్పాడు. వివాదం
మొదలయ్యింది!
తరువాత కల్యాణీ
పిలవబడింది.
“నన్ను
క్షమించమ్మా! వినోద్
ఈ ఇంటి
అల్లుడు అవలేడు!”
“............................”
“అతనూ
ఒప్పుకోలేదు! నీకు
మంచి జీవితం
అతనే ఏర్పాటు
చేస్తాడు”
పద్మజా -- డేవిడ్ పిలవబడ్డారు.
“నా
కూతుర్ని బాగా
చూసుకోండి అల్లుడూ!”
వినోద్ వచ్చాసాడు.
“అమ్మ
రాలేదా బోసు?” సరోజా
అడగ,
“ఆవిడ
ఇంట్లో లేదు!
ఫోను చేస్తే
ఎత్తటం లేదు!
నేను వచ్చేసానమ్మా”
“నాన్న
నిన్ను పిలిచారు!” మనోజ్ చెప్ప,
లోపలకు వెళ్ళిన
అతనూ పదిహేను
నిమిషాలు మాట్లాడాడు!
తొందరగా పిలిచాడు!
అందరూ గుమికూడ, ఆయన
ప్రాణం, సరోజా
మొహాన్ని చూస్తున్న
కళ్ళల్లో నుండి
విడిపోయింది.
కుటుంబమే ఏడ్చింది!
అందరికీ కబురు
వెళ్ళింది.
ఆ రోజే
తీసేద్దమనే నిర్ణయానికి
వచ్చారు.
“పెద్ద
కొడుకును స్నానం
చేసి తడి
బట్టలతో రమ్మని
చెప్పండి!” బ్రాహ్మడు
చెప్పాడు.
“మనోజ్
రా!”
మనోజ్ వెనక్కి
తిరిగాడు.
"వినోద్
నువ్వు స్నానం
చేసిరా!”
“ఏయ్
మనోజ్! నువ్వే
ఆయన కొడుకువి.
తలకొరివి పెట్టే
హక్కు నీకే
ఉంది” వినోద్ చెప్ప.
అందరూ అది
అమోదించ,
“ఆయన
కొడుకుగా ఉండి, ముప్పై
ఏళ్ల వయసు
అనేది ఉత్త
నెంబరే. కానీ, నువ్వు
ఒక నెలలో
కుటుంబ గౌరవాన్ని
కాపాడి, చెల్లి
పెళ్ళి జరిపి, గంభీరంగా
నిలబడ్డావే! అందరినీ
అభిమానించావే! అత్మార్ధంగా
అమ్మా, నాన్న, తమ్ముడూ, చెల్లెలూ
అంటూ
అందరినీ దగ్గరకు
చేర్చుకున్నావే.
అభిమానానికి రోజులు, నెలలు
ముఖ్యం కాదు.
అది లోతైన
మనసులో నుండి
రావాలి! వచ్చింది.
నువ్వు తల
కొరివి పెడితే
నాన్న ఆత్మ
శాంతిస్తుంది. అమ్మ
ఆనందిస్తుంది! హక్కును
నేను వదిలిపెడుతున్నా...చెయ్యి!”
సరోజా కూడా
దానికి అంగీకరించ,
కొన్ని గుసగుసలు
దాటి “ఇది
వాళ్ల కుటుంబ
విషయం! మనోజే
చెప్పేశాడు. భార్య
ఒప్పుకుంది! ఇంకేం
కావాలి?” అని
మాట్లాడారు కొందరు.
కల్యాణీకు మాత్రమే
ఇందులో కోపం, ఓటమి
అంతా! వినోద్
స్నానం చేసి
తడిబట్టలతో వచ్చి, మనోజ్
దగ్గరగా నిలబడ, తండ్రి
అంత్యక్రియలు జరిగే
ఏర్పాటు చేశారు.
శ్మశానానికి వెళ్ళింది.
వినోద్ తలకొరివి
పెట్టాడు! మనోజ్
పక్కన నిలబడ్డాడు.
శరీరం కాలుతున్నప్పుడు, మనోజ్
ఏడుస్తూ
వినోద్ హృదయం
మీద వాలాడు.
“నన్ను
క్షమించు వినోద్”
“ఎందుకురా? నీపైన
నాకెప్పుడూ కోపం
లేదు. ఎంత
పెద్ద ఛాన్స్
ను నువ్వు
నాకు వదిలిపెట్టవు!”
“వదిలిపెట్టానా?” అంటూ
ఒక చిన్న
నవ్వు నవ్వి, “మనం
ఇప్పుడు తిన్నగా
అమ్మను చూడటానికి
వెళుతున్నాము... భవానీ అమ్మ
ఇంటికి! బండి
తీయి”
ఎలెక్ట్రిక్ క్రిమటోరియం!
బూడిద కూడా
రాగా, దాన్ని
కుండలో సేకరించుకుని
వినోద్ కారు
తీశాడు.
ఇంటి ముందు
కారు ఆగ, భవానీ
తలుపు తీయ, వినోద్
తో మనోజ్
నిలబడ,
భవానీ అధిరి
పడింది.
“తలకొరివి
పెట్టిన వాడ్ని
ఎందుకురా ఇక్కడికి
తీసుకు వచ్చావు?”
“అమ్మా!
తలకొరివి పెట్తింది
నేను!"
వినోద్ చెప్ప,
“ఏ...ఏమిటి? నువ్వా?”
“మనోజే
పెట్టమన్నాడు! అమ్మ
ఒప్పుకుంది!”
భవానీ తల
వంచుకోనుంది. జుట్టు
విరబోసుకుని ఉన్నది.
“అమ్మా
నేను లోపలకు
రానా?”
“రా
బాబూ”
“నాన్న
నా దగ్గర
అన్నీ చెప్పారమ్మా!” అతని కళ్ళు
తడవ,
తండ్రి మాట్లాడిన
స్వరం చెవిలోపల.
“మనోజ్!
ఇది నా
మరణ వాంగ్మూలం!
నీ దగ్గర
దాచటం నాకిష్టం
లేదు. నేను
భవానీని ప్రేమించి
హద్దు మీరినందువలనే
ఆమె గర్భం
దాల్చింది!
ఆ తరువాతే
జాతీ, కులం, అదీ, ఇదీ
అంటూ పలువురు
మాట్లాడ, మమ్మల్ని
విడదీసి, మీ
అమ్మను ఇంట్లోనే
కట్టి పడాశారు.
నేనూ పిరికివాడినై, భవానీకి
తాళి ఇవ్వలేకపోయాను.
ఇప్పటివరకూ కుదరలేదు.
ఆమె అడగలేదు.
మొదట పుట్టింది
వినోద్! ఆ
తరువాతే సరోజాకు
మీరు ముగ్గురూ
పుట్టారు. భవానీ
సంపాదించి ఇల్లు
కట్టి, కొడుకును
పెంచి పెద్ద
చేసి అంతా
చేసింది! ఒక్క
పైసా కూడా
నేను ఆమెకు
సహాయం
చేయలేదు. ఆమె
అడగలేదు.
నా సమాజ
గౌరవం చెడిపోకూడదని, ఆమె, వినోద్
నిర్ణయం తీసుకుని
జీవించారు. తాను
ఎవరు అనేది
ఈ లోకానికి
చెప్పలేదు. బంగారంలాగా
పెంచింది తన
కొడుకును. ఇప్పటి
వరకు అతనూ
నన్ను తప్పు
పట్టలేదు, కోపగించుకోలేదు.
దూరంగా జరిగి
వెళ్లలేదు. మీ
ముగ్గురికీ అతను
అన్నయ్యరా! భవానీ
ఇప్పుడు ఇక్కడికి
ఎందుకు రాలేదో
తెలుసా?
నేను ఉన్నప్పుడు
తెలియని నిజం, చనిపోయిన
తరువాత తెలిస్తే
మీ అమ్మ
సరోజాకు, పిల్లలకూ
నా మీద
ఉన్న మర్యాద
తగ్గి పోతుందని
చివరిసారిగా నా
మొహం
కూడా చూడటానికి
రాలేదు. ఆమె
నా కుల
దేవత రా!
నా పిల్లలకు
ఆమె సెక్యూరిటీ
దేవుడు. అలా
ఉండే పద్మజా
విషయం పసిగట్టింది.
బెంజమిన్ గారిని
కలిసింది. ఈ
నిజం నీకు
మాత్రమన్నా తెలియకపోతే
నా శరీరం
వేగదురా.
మనోజ్! కొడుకు
ఎలారా అల్లుడు
అవగలడు? అర్ధం
చేసుకోరా మనోజ్!”
చెప్పి ముగించారు.
“అమ్మా!
మీరు దైవమే!
ఇప్పటికీ మా
అమ్మ మనసు
విరిగిపోకూడదని, మీ
భర్త చనిపోయే
సమయంలో కూడా
మీరు చూడటానికి
రాలేదు కదమ్మా!
దీని కంటే
ఒక త్యాగం
ఉందా! ఉంటుందా? ఈ
మీ త్యాగాన్ని
గౌరవించాలనే మీరు
కన్న బిడ్డకు, ఆయన
పెద్ద కొడుకుకు
తల కొరివి
పెట్టే ఛాన్స్
నేను ఇచ్చాను.
ఇది నాన్న
నాకు చెప్పలేదు!
ఆయన ఆత్మ
శాంతి చెంద
నేను చెప్పేనమ్మా!
తప్పా?”
అతని దగ్గరకు
వచ్చి, చెయ్యి
పుచ్చుకున్న భవానీ
అతన్ని గట్టిగా
హత్తుకుని నుదిటి
మీద ముద్దు
పెట్టి, భర్త
చనిపోయినందుకు
భోరున ఏడ్చింది.
“నువూ
నా కొడుకువే
కదరా”
వినోద్ కుమార్
– మనోజ్
కుమార్ అనే
రెండు దృవాలనూ
ఒకటిగా కలపటానికి
తన ప్రాణం
ఇచ్చిన తండ్రి
ఆత్మ ఇక
శాంతిస్తుంది.
కొన్ని నిజాలు
లోకానికి తెలియకుండా
ఉండటమే మంచిది!
ఇద్దరు కొడుకులూ
తల్లి ఒడిలో
ముఖం దాచుకుని
దుఃఖం తీరేంత
వరకు ఏడవనీ.
****************************************************సమాప్తం******************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి