అతి పెద్ద హిందూ దేవాలయ రహస్యాలు (ఆసక్తి)
చరిత్రను ఓక సారి తిరగేస్తే...హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు ఇప్పటికే రుజువులు ఉన్నాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించింది. దీనికి నిదర్శనం కంబోడియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణు దేవుని ఆలయం. హిందూ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెబుతున్న ఈ దేవాలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం.
ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఈ దేవాలయంలో చూడవచ్చు. ఈ ఆలయానికి కొన్ని శతాబ్ధాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్‌ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
అతి పెద్ద హిందూ దేవాలయ రహస్యాలు…(ఆసక్తి) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి