మిణుగురు పురుగులు…(సీరియల్) (PART-7)
“అరే...వెళ్ళేటప్పుడు
ఎరుపులో వెళ్ళి, వచ్చేటప్పుడు ఆకుపచ్చలో వచ్చారే! అలాగంటే ‘సిగ్నల్ ఓకే’ అని అర్ధమా?”
తిరిగి వచ్చి కారులో
ఎక్కి కూర్చున్న శృతికాను కురకురమని చూస్తూ అడిగాడు అశ్వినీకుమార్. ఆ చూపులోని
ఆకర్షణ శక్తిని తట్టుకోలేక తల వంచుకుని అడిగింది ఆమె.
“అలాగంటే...?”
ఏమీ అర్ధం కానట్లు ప్రశ్న తిరిగి వచ్చినప్పుడు కొంటరిగా నవ్వాడు.
“అరే...అంతేనా
మీరు? నేనేదో మిమ్మల్ని బాగా తెలివి గల మనిషి అనుకుంటు న్నాను” -- కళ్ళను ఆర్పుతూ ఎగతాలి చేస్తున్న స్వరంతో అడగగా అమె కూడ అదే వేగంతో తల
ఎత్తింది.
“ఒక
పెద్ద గీతను దాని మీద చెయ్యి పెట్టకుండా చిన్న గీతగా చేయగలం...?”
ఇది చాలా చాలా పాత
పజిల్. అయినా చెప్తాను. “ఆ గీతకు పక్కన ఇంకొక గీతను పెద్దదిగా గీస్తే...ఇది చిన్న గీత అయిపోతుంది"
“చాలా
కరెక్టు. అదేలాగానే నేను తెలివిగల వ్యక్తినే. నా పక్కన ఇంకొక పెద్ద తెలివిగల
వ్యక్తి వచ్చి కూర్చుంటే, నా తెలివిగల తనం తక్కువగానే
తెలుస్తుంది”
“ఆహా!” -- అంటూ నిజంగానే సంతోషపడి నవ్వాడు అశ్వినీకుమార్.
“అమ్మో!
ఇది మామూలు నోరులాగా తెలియటం లేదు. ఇంకా ఈ నోటిని కెలికి చూడాలని ఉంది. ఇంకా,
ఇంకా...మాట్లాడుతూనే ఉండాలని అనిపిస్తొంది”
“ఏరా...ఈ
రోజు కాలేజీకి సెలవు పెట్టేస్తే ఏం?”
రమణ వెంటనే అతి
తీవ్రంగా అపోజ్ చేసేలాగా చెప్పాడు.
“నో...నో...ఏం
మాట్లాడుతున్నావ్ అశ్విన్. ఇంతవరకు మనం ఏ రోజైనా ఇలా అవసరం లేకుండా సెలవు పెట్టామా?
అనవసరంగా ఈ రోజు ఎందుకు సెలవు పెట్టాలి?”
“సెలబ్రేట్
చేయాలంటే ఎలా?”
“మిస్
శృతికా ఎలా చెబితే అలా...”
“నేనా?”
అంటూ సాగదీసింది ఆమె. “ఈ రోజు నేను ఖచ్చితంగా
కాలేజీకి వెళ్ళాలే?”
“ఏమిటంత
విషేషమో తెలుసుకోవచ్చా?” కావాలనే భవ్యంగా అడిగాడు అశ్వినీకుమార్.
“లేదు...ఈ
రోజు మధ్యాహ్నం రెండు గంటలకు నా అభిమాన రచయత యొక్క ‘ఒన్ టు
ఒన్’ ప్రోగ్రాం. మా కాలేజీ ఇండోర్ స్టేడియంలోనే ఉంది...”
“అదెవరు
మీ అభిమాన రచయత?”
చెప్పింది.
“ఓహో...ఇద్దర్ని
కథా పాత్రలుగా చేసి రాస్తారే...ఆయనా?”
“ఆయనే!”
అది విన్న అశ్వినీకుమార్
మొహం వాడిపోయింది. ఆపైన ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే తల ఒంచుకుని మౌనంగా
వస్తుంటే...ఆమే మళ్ళీ అడిగింది.
“ఏమిటి
సడన్ గా మాట్లాడకుండా వస్తున్నారు?”
“మీరేమిటండీ?”
-- అని తిరిగి ఆమెను సోకంగా చూశాడు. స్వరం లోనూ ఒక వ్యామోహం కనబడింది.
“మేము
మీ దగ్గర మాట్లాడాలి, స్నేహం చేయాలి అని ఆశగా ఉన్నాం. కాలేజీ
కూడా కట్ చేసి రావడానికి తయారుగా కాచుకోనున్నాము. ఇంతవరకు ఇలా ఒక్కరోజు కూడా మేము
కాలేజీ ‘కట్’ చేసింది లేదు. మీకొసం
ఇన్నిచేసి ఉత్సాహంగా ఉంటే...మీరు రచయత, ‘ఒన్-టు-ఒన్’ ప్రొగ్రాం అంటూ సమాధానం చెబుతున్నారు.
అది వింటున్నప్పుడు
ఎంతో కష్టంగా ఉంది! మాకంటే మీకు ఆయనే కదా గొప్పగా అనిపిస్తున్నాడు? ఉండనివ్వండి...పరవాలేదు. రేయ్ రమణా...ఇలా
కాలేజీ పక్కగా వాకిలిలోనే కారు ఆపరా. ఆమె ఆ ప్రొగ్రాముకు వెళ్ళనీ”
రమణ...కాలేజీ ఎంట్రన్స్
పక్కగా కారు ఆప-- శృతికా కిందకు దిగకుండా కూర్చునే ఉంది. అర నిమిషం తరువాత
తిరిగి చూసిన అశ్వినీకుమార్ “ఏమండీ...దిగటం లేదా...కావాలంటే కాలేజీ లోపలకు వెళ్లమని చెప్పనా? లేదు...దిగుతారా?”
“వద్దు...నేను
వెళ్ళటం లేదు" -- శృతికా దగ్గర నుండి సనుగుతున్నట్టు సమాధానం రావటంతో అతను ఇంకా కోపంగా మాట్లాడాడు.
“వద్దు...ఇలా
సగం మనసుతో మాతో రావద్దు. కుదిరితే...మళ్ళీ కలుసుకుంటే ఇంకోసారి చూసుకుందాం”
“లేదు...ఈ
రోజే వెళదాం!”
“వద్దండీ...తరువాత
ఆ ప్రోగ్రాం లో కలుసుకోలేక పోయేమే...ఆయన్ని చూడలేక పోయామే అంటూ రహస్యంగా బాధపడుతూ
మనసులో మిమ్మల్ని తిట్టుకుంటారు”
“ఛీఛీ!” అంటూ కళ్ళు పెద్దవి చేస్తూ చిన్న పిల్లలాగా తల ఊపింది. “రహస్యంగా ఏడవటం, మనసులోపల తిట్టుకోవటం నా దగ్గర
ఉండదు. ఏదైనా సరే మొహానికి ఎదురుగా చెప్పేస్తాను. ఎప్పుడైనా సరే ఒకటి అటూ, లేకపోతే ఇటు. ఏదో ఒకటి తేల్చేస్తాను.
నేను చాలా ఒపన్
మైండడ్. అందువల్ల వస్తాను అని చెబితే వస్తాను. ఈ ‘ఒన్-టు-ఒన్’ లేకపోతే
ఏం? ఆయనకంటే నాకు మీరే ముఖ్యం. అందువలనే మీతోనే వస్తాను”
“ఓ...థ్యాంక్యూ
శృతికా. థ్యాంక్యూ సో మచ్...” -- ఎమోషనల్ అయిపోయి, చటుక్కున ఆమె చెయ్యి పుచ్చుకుని కృతజ్ఞత చెప్పినప్పుడు ఆమెలో నూట నలభై
వోల్టుల కరెంటు చురచురమని ఎక్కి ఒళ్ళు జలదరించింది. హృదయంలో గుప్పుమని ఏదో పొంగి
లేవ...ఓక్క క్షణం అన్నీ మరిచిపోయింది. అతని చేతులో ఉన్న తన చేతిని
విడిపించుకోవాలనే ఆలొచనకూడా లేకుండా తలవంచుకుని కూర్చోగా,
రమణ ను చూసి విజయం
సాధించిన నవ్వుతో కన్నుగీటాడు అశ్వినీకుమార్.
‘నేను
అనుకున్నదాని కంటే సులభంగా’ ఈమే పడిపోయింది చూశావా?’
“నేను
అప్పుడే చెప్పానే...ఈ ‘మిడిల్ క్లాస్ అందాలన్నీ సులభంగా
ప్రేమ అనే అస్త్రానికి పడిపోతాయని! నా లెక్క ఎప్పుడూ తప్పు అవదు
గురువా...ఊ...తరువాత ఘట్టాన్ని కంటిన్యూ చెయ్యి...”
చూపుల్లో రమణ చూపిన
పచ్చజెండా అర్ధం అవటంతో...తన చదరంగం ఆటలో తరువాత రాణిని జరపటం ప్రారంభించిన రాజుకు
ఎలా ‘చెక్’ పెట్టాలని ఆలొచించాడు.
“ఎక్కడికి
వెళ్దామో మీరే చెప్పండి. మీరే ఈ రోజు ‘చీఫ్ గెస్ట’! అందువలన ఈ రోజు మొత్తం మీ ఇష్టానికే జరగాలి...”
“అయ్యో...నాకు
అదంతా తెలియదు. మీరేం చెబుతారో అలా చేద్దాం. మొదట కాలేజీ వాకిలి నుండి కారు
తీయండి. ఎవరి కంటికీ కనిపించకూడదు. కనిపిస్తే కష్టం”
రమణ కారు స్టార్ట్
చేసి గాంధీ రోడ్డులోనే తిన్నగా...కానీ, మెల్లగా నడుపుతూ అడిగాడు........”ఏం అశ్విన్,
కారును ఎక్కడ పార్కింగ్ చేయాలి?”
“ఊ...ఎక్కడికి
వెళదాం? నువ్వు చెప్పరా”
“సెలెబ్రేషన్
అంటే ఏమిటి అర్ధం? ఎక్కడైనా టిఫిన్ తిని, ఏదైనా సినిమాకు వెళదాం. రిటర్నులో సాయంత్రం ఒక కాఫీ. ఈమెను ఇప్పుడు ఎక్కడ
దింపామో, అక్కడే దింపేసి మనం వెళ్దాం...ఏమంటావు?”
“ఏమంటావు
మిస్. శృతికా?”
“ఓకే!
కానీ, సాయంత్రం ఎక్కువ ఆలస్యం అవకూడదే?”
“అర్ధమయ్యింది.
ఆలస్యం అయితే మీ అమ్మ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేవు. అంతే కదా...? ఇప్పుడు టైము పదకుండు అవుతోంది. తిన్నగా ఒక మంచి హోటల్ కు వెళ్ళి తినేసి,
ఏదైనా సినిమా, బయటకు వచ్చిన వెంటనే ఒక
కాఫీ...నాలుగున్నర, ఐదు గంటలకంతా ఇల్లు. సరేనా...?”
“సరి...” -- ఆమె తల ఊప,
“దట్స్
గుడ్...” అని నవ్వాడు అశ్వినీకుమార్. "బండీని యూ టర్న్
చేసి తిన్నగా హోటల్ కు పో రమణా"
“ఎస్
బాస్!” -- అంటూ అతను తలవంచి వినయంగా చెప్ప... శృతికా
నవ్వింది.
“ఏమిటి
నవ్వుతున్నారు...?” అని కారును నడుపూతూనే వెనక్కి తిరిగాడు రమణ.
మొట్ట మొదటి సారిగా ఆమెతో మాటలు మొదలు పెట్టాడు.
“నిజంగానే
వీడు మాకు ‘బాసే’. వీడెవరో మీకు తెలుసా?
పెద్ద కోటీశ్వరిని ఒకడే కొడుకు”
“ఏయ్...” అంటూ అశ్వినీకుమార్ అరవ,
అతను, “లేదప్పా, చెప్పనప్పా” అన్నాడు.
“ఇలాగేనండి
ఒక మాట కూడా గొప్పగా మాట్లాడనివ్వడు. గొప్పలు అక్కర్లేదండి. నిజం కూడానా చెప్పకూడదు?
చెప్పనివ్వడే! ఒక్కొక్కడూ వాడికి లేనివి కూడా ఉన్నట్టు చెబుతాడు.
వీడేమిట్రా అంటే నిండు కుండ తొనకదు అనేలాగా నడుచుకుంటాడు.
నిజంగా
చెబుతున్నానండీ...ఇలాగంతా రానే రాదు. ఒక ఆడపిల్ల దగ్గర తల ఎత్తి మాట్లాడడు. ఎవరినీ
తన బండీలో ఎక్కించడు. సినిమా, హోటల్ అంటూ తిరగడు. ఈ రోజు ఎందుకో తెలియదు...మీరు వీడ్ని ఎక్కువ మార్చారు”
“నేనా?”
-- సంతోషం కలిసిన చిన్న షాక్ తో ఆమె చూసినప్పుడు... రమణ
చిన్న నవ్వుతో మళ్ళీ అది కన్ ఫార్మం చేశాడు.
“మీరే
నండీ!”
హోటల్లో తినేసి
బయటకు వచ్చిన వెంటనే, “ఇప్పుడు ఏం సినిమాకు వెళదాం?” అని శృతికాను
చూడ...ఆమె, “ఏదైనా ఓకే...” అన్నది.
“ఏం
సినిమాకు వెళదాం?” అంటూ రమణ ను చూడ...,
అతను, “సినిమానా ముఖ్యం...? ఈమెతో వెళ్తున్నామనేదే ముఖ్యం. అందువల్ల సినిమా ఏదైతే ఏముంది?” అన్నాడు జవాబుగా.
“ఏదైనా
ఎక్కువ గుంపు ఎక్కువగా లేని ‘నూన్ షో’ జరిగే
సినిమా హాలుకు పో రమణ. అప్పుడే ఈమెతో ఫ్రీగా మాట్లాడొచ్చు”
సినిమా హాలు
వాకిలిలో కారు ఆపి తాళం వేసి, రమణ వెళ్ళి టికెట్టు కొనుక్కు రాగా...లోపలకు వెళ్ళి కూర్చున్నారు.
రమణ, తరువాత అశ్వినీకుమార్, పక్కన శృతికా అని కూర్చోగా, స్క్రీనుపై సినిమా
మొదలయ్యింది. పావుగంట వరకు సినిమాపై ద్రుష్టి పెట్టిన అశ్వినీకుమార్ చటుక్కున
తిరిగి శృతికాను చూడ...ఆమె సినిమా చూడటం మానేసి తననే చూస్తున్నది గమనించి నవ్వుతూ
దగ్గరగా జారి మెల్లగా చెప్పాడు.
“సడన్
గా రెండు షార్ప్ గల కడ్డీలు మీదకొస్తున్నట్టు అనిపించిందా...ఏమిట్రా ఇది అనుకుంటూ
భయపడి తిరిగి చూస్తే మీరు నన్నే చూస్తున్నారు”
“హూ...” అంటూ ముద్దుగా అతని కళ్ళలోకి లోతుగా తన చూపులను పోనివ్వ,
ఎమోషన్ అయ్యి ఆమె
చేతిని పుచ్చుకుని నొక్కాడు అశ్వినీకుమార్. “శృతీ...ఐ లవ్ యూ...” అని
చెప్ప...ఉక్కిరిబిక్కిరి అయిపోయిన ఆమె తల వంచుకుని శరీరం జలదరించ...చెంపలకూ,
మొహానికీ గుప్పుమని రక్తం పార...చాలా చిన్నగా, “నేను కూడా..." అని చెప్పింది నోరు!
Continued...PART-8
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి