రెండు ధృవాలు…(సీరియల్) (PART-8)
చెప్పినట్టే ఆదివారం
పెళ్ళి గ్రాండుగా
జరిగింది.
ఒక చిన్న
హాలు! రెండు
కుటుంబాలూ కలిపి
మొత్తం యాభై
మందే.
ఆ హాలును
అందంగా అలంకరించి, అన్ని
ఏర్పాట్లనూ వినోదే
చూసి చూసి
చేశాడు.
మంచి క్యాటరింగ్
వాళ్లనూ, ఫోటో
గ్రాఫర్ను, వీడియో
గ్రాఫర్నూ ఏర్పాటు
చేశాడు.
అందరూ కలిసిపోయారు.
ముహూర్త సమయం.
వినోద్ బొంగరం
లాగా చుడుతూ
ఉంటే, డేవిడ్
కుటుంబం అంతా
అక్కడ ఉండ,
“ముహూర్త
సమయం వచ్చేసింది? తాళి
కట్టేసి, ఉంగరాలు
మారుద్దామా! ఎలా?”
సరోజా అడ్డుపడింది.
“ఈ
పెళ్ళి జరగటానికి
ముఖ్య కారణమైన
వినోద్ తల్లి
భవానీ గారు ఇంకా
రాలేదే! ఆవిడ
రానివ్వండి”
బెంజిమిన్ ముందుకు
వచ్చారు.
“కరెక్టే!
భవానీ గారు రాలేదా
వినోద్? ఆమే
కదా నాతో
వాదించి, నా
కోపాన్ని తగ్గించి, ఈ
పెళ్ళి జరగటానికే
కారణం”
“ఆవిడ
మా కుల
దేవత!” ఏంజలికా
చెప్పింది.
“ఏమైంది
బాబూ?” సరోజా
అడగ,
“సారీమ్మా!
అమ్మ బయట
ఉరు వెళ్లాల్సిన
ఒక నిర్భంధం
వచ్చింది. ఆమెతో
పాటూ పని
చేసిన ఒకావిడ
హార్ట్ అటాక్
వచ్చి చనిపోయింది. అమ్మ
వెళ్లే తీరాల్సిన
పరిస్థితి. తాళి
కట్టేంతవరకూ అమంగళ
వార్త చెప్పకూడదని
చెప్పారు! మీరు
ఆపకుండా అడుగుతున్నప్పుడు
నాకు వేరే
దారి తెలియలేదు”
“భగవంతుడా! ముఖ్యమైన
మనిషి ఆవిడే
కదా?”
“సరే! తిరిగి
వచ్చిన తరువాత, ఆవిడ
దగ్గర ఆశీర్వాదం
తీసుకుందాం. ఇప్పుడు
పెళ్ళి జరగనివ్వండి”
సుమూహూర్త సమయంలో
డేవిడ్ పద్మజా మెడలో
తాళి కట్టాడు
డేవిడ్. ఇద్దరూ ఉంగరాలను
మార్చుకుని, షేక్
హ్యాండ్ ఇచ్చుకున్నారు. పరస్పరం
ఇద్దరూ స్నేహంతో
కౌగలించుకున్నారు.
“దీనికంతా
భవానీనూ, వినోదూనే
కారణం. భవానీ
రాలేకపోయింది. వినోద్
కు మనం
థ్యాంక్స్ చెప్పాలి”
డేవిడ్ లేచొచ్చి, అతనికి
సాలూవా కప్పి, పూలమాల
వేసి, ఒక
ఉంగరమూ వేశాడు.
“అంకుల్! ఏమిటిదంతా?”
“తప్పులేదు! ఇది
మా అభిమానం! మేము
నీకు ఇవ్వగలిగిన
మర్యాద”
“పద్మజా నా
చెల్లెలు అంకుల్”
డేవిడ్ ముందుకు
వచ్చాడు.
“ఏరా
అల్లుడూ! నీకూ, నాకూ
నాలుగేళ్ళ స్నేహం, పరిచయం! కానీ
నిన్న వచ్చిన
పద్మజా నాకంటే
ఎక్కువా?”
“రేయ్! ఇక
మీదట నేనేరా
నిన్ను అల్లుడూ
అని పిలవాలి!”
“...........”
“నా
మాటకు మర్యాద
ఇచ్చి, నా
చెల్లికి జీవితం
ఇచ్చావే అదే
చాలురా!”
ఇద్దరూ కావలించుకున్నారు.
సరోజా మనోజ్
దగ్గరకు వచ్చింది.
“ఇదిగో
చూడూ మనోజ్! వినోద్
డేవిడ్ ను అల్లుడని
పిలుస్తూ థ్యాంక్స్
చెబుతున్నాడు. కానీ, నువ్వు
పద్మజా సొంత
అన్నయ్యవు అయ్యుండి. మాట్లాడకుండా
నిలబడ్డావు! వాళ్ళ
కుటుంబం ఏమనుకుంటుందిరా?”
మనోజ్ మౌనం
పాటించ, పక్కకు
వచ్చిన కల్యాణీ,
“వదులమ్మా! సమస్యను
లేపకు!”
“కల్యాణీ! డేవిడ్
మన అల్లుడే! వీడు
తప్ప మిగిలిన
వాళ్లందరూ అతనితో
నవ్వుతూ మాట్లాడుతున్నారు. వీడు
మాత్రం నవ్వకుండా, వేరుగా
ఉంటే ఏం
అనిపిస్తుంది? పోరా
వెళ్ళి మాట్లాడరా మనోజ్”
“అమ్మా! నువ్వు
అర్ధం చేసుకోవా! మనకోసం
కష్టపడుతున్నది
వినోద్! వీడు
అక్కడికి వెళ్ళి
డేవిడ్ ను అవమానపరుస్తాడు! అది
డేవిడ్ వల్ల
తట్టుకోవటం కుదరదు. సమస్య
పెద్దది అయ్యి, ఆనందమైన
పెళ్ళి, కలవరం
అవుతుంది! గొడవకు
నువ్వే విత్తనం
వేస్తావా?”
“సరోజా! ఇలా
రా!” భర్త
పిలవ,
తల్లి వెళ్లగానే
కల్యాణీ జరిగింది.
“ఒక్క
నిమిషం ఆగు
కల్యాణీ!” మనోజ్
పిలవ,
“ఏమిటి?”
“నేను
వినోద్ ను అవమాన
పరుస్తాను! అది
డేవిడ్ తట్టుకోలేడు
కదా?”
"అదే
కదా నిజం”
“నిన్న
వచ్చిన వినోద్, తప్పుగా
వచ్చిన డేవిడ్
ఇద్దరూ హీరోలు
అయిపోయారు! నువ్వు
పుట్టిన దగ్గర
నుండి నీతో
జీవించిన నేను
విల్లన్ అయిపోయానా? చెప్పు
కల్యాణీ!”
“ఇక్కడ, మండపంలో
మనిద్దరి మధ్యా
వివాదం వద్దు
మనోజ్!”
కల్యాణీ జరిగి
వెళ్లగా, మనోజ్
విరక్తి శిఖరానికే
వెళ్ళిపోయాడు!
హోటల్లో ఏర్పాటు
చేయబడిన భోజనం
హాలులో వడ్డించబడింది!
జనం తగ్గి
కుటుంబ వ్యక్తులు
మాత్రం ఉండ,
“మా
ఇంట్లోనే ‘ఫస్ట్
నైట్’ జరుపుదాం!” ఏంజలికా
చెప్ప,
“దానికంతా
ఇక అర్ధం
ఉందా!” మనోజ్
అడగ, డేవిడ్
ముఖం నల్లబడింది.
అందరూ నొచ్చుకున్నారు.
వినోద్, మనోజ్
దగ్గరకు వచ్చాడు.
“తప్పు
మనోజ్! జరిగింది
జరిగిపోయింది. దాన్ని
సరి చేసి
పెళ్ళి కూడా
చేశాము. ఇప్పుడు
ఇలా ఎందుకు
మాట్లాడటం! డేవిడ్
మనింటి అల్లుడు! అతను
మనసును గాయపరచకు?”
“నాకు
ఒక విషయం
తెలియాలి వినోద్...
డేవిడ్ మా
ఇంటి అల్లుడా...మీ
ఇంటి అల్లుడా?”
“మనోజ్! పద్మజా
మన చెల్లెలు!”
“నా
చెల్లెలా...నీ
చెల్లెలా?”
బెంజమిన్ లోపలకు
వచ్చారు.
“ఏమిటి
తమ్ముడూ ఇలా
మాట్లాడుతున్నారు! ఇరు
కుటుంబాలనూ కలపటానికి
వినోద్ పడ్డ
పాట్లు కాస్తా
కూస్తా! నేనూ
వచ్చిన దగ్గర
నుండి గమనిస్తున్నాను! మీరు
దేంట్లోనూ కలుగజేసుకోకుండా
ఉండిపోయారు! మొహాన
నవ్వు లేదు”
“ఇక్కడ సంతోష
పడేలాగా ఏదీ
లేదే”
“తమ్ముడూ
తప్పుకు కారణం
డేవిడ్, పద్మజా
ఇద్దరూ! అది
అర్ధం చేసుకోవాలి”
“నేను
తప్పు చేసిన
పద్మజాను ఆమొదించలేదే! అందువలన
మీ డేవిడ్
ను గౌరవించి, అల్లుడిగా
నేను మనస్పూర్తిగా
ఆమోదించలేను”
వినోద్ అడ్డుపడి,
“మనోజ్! మాట్లాడకుండా
ఉండు! అంతా
మంచిగా జరిగిన
తరువాత ఎందుకు
ఈ మాటలు. ఇవి
అనవసరమైన మాటలు”
“యూ
షటప్! నువ్వు
మరీ అతిగా
కలుగజేసుకుంటున్నావు! అది
నాకు నచ్చలేదు”
“అతను
కలుగజేసుకోక పోయుంటే
నీ చెల్లెలి
మెడలో తాళి
కట్టే ఉండను! అతన్ని
షటప్ అంటున్నావు. కృతజ్ఞత
ఉందా నీకు?”
“చెడిపేసి
నువ్వు పారిపోతే
వదిలేస్తారా! కష్టపడి
పెళ్ళి జరిపేవాడిని”
“అయ్యో...వద్దు
మనోజ్! నువ్వు
మాట్లాడే మాటలు
పద్మజాను బాధిస్తుంది. అది
సంతోషంగా
జీవించాలి".
“పోరా!” వినోద్
ను మనోజ్
తోసాడు.
“అతన్నా
తోసావు?” బెంజమిన్, మనోజ్
ను లాగి
ఒకటిచ్చాడు.
“అంకుల్! ఎందుకు
చెయ్యి చేసుకుంటున్నారు!” వినోద్
అడ్డుపడ,
“డేవిడ్ ను
తోసున్నా, చెప్పున్నా
నేను ఓర్చుకునే
వాడిని, నిన్ను
ముట్టుకుంటే ఉరికే
వుండను. నేను
ప్రాణాలతో ఉండటానికి
మీ అమ్మ
భవానీనే కారణం!”
డేవిడ్ చేతులను
పద్మనాభం గారు
పట్టుకున్నారు.
“అల్లుడూ! నేను
క్షమాపణలు అడుగుతున్నాను. వియ్యంకులూ
మీరూ క్షమించండి!”
బెంజమిన్ కాళ్ల
మీద పడ,
మనోజ్ ఆగ్రహించాడు!
“మీ
కొడుకును ఈ
బెంజమిన్ చెయెత్తి
కొడుతున్నారు! దాన్ని
అడ్డుకునే ధైర్యం
చేయక, ఆయన
కాళ్ల మీద
పడుతున్నారా?”
“రేయ్! నువ్వెందుకురా
వినోద్ ను తోసావు?” బెంజమిన్
అరవ,
“వదలండి
బావా!” పద్మనాభం
గారు ఆందోళన
పడ,
వినోద్ అడ్దుపడి,
“సార్! మనోజ్
నా తమ్ముడులాగా! అతను
నన్ను తోసినా
తప్పులేదు! ఇక్కడ
జరిగిన ఏ
సంఘటనా నా
చెల్లెలు పద్మజాను
బాధించకూడదు! అందరినీ
నేను చేతులెత్తి
వేడుకుంటున్నాను”
ఏంజలికా దగ్గరకు
వచ్చింది.
“అబ్బాయ్
నువ్వు బాధపడకు! మేము
ఏ సమస్యా
తీసుకు రాము”
“ఏమండీ...”
బెంజమిన్, మనోజ్
దగ్గరకు వచ్చి
క్షమాపణలు అడిగాడు!
కోపిష్టి మనిషి
అయిన ఆయన, చేతులెత్తి
నమస్కరించాడు.
“మీ
అమ్మాయిని మా
ఇంటికి తీసుకు
వచ్చి దింపటానికి, ఎవరు
వస్తున్నారు!”
ఎవరూ మాట్లాడలేదు.
“వినోద్! నువ్వు
వెళ్ళి రావయ్యా! నీ
చెల్లెల్ని నువ్వే
తీసుకు వెళ్ళి
దింపి రావయ్యా!”
సరోజా చెప్పగా,
“అమ్మా! వినోద్
తో పాటూ
నేనూ వెళ్తాను!” కల్యాణీ
చెప్ప,
“సరే…రా
కల్యాణీ!” అన్నాడు
వినోద్.
మనోజ్ అక్కడ
ఉండలేక, భోజనం
కూడా చేయకుండా
వెళ్ళిపోయాడు.
బెంజమిన్ కుటుంబంతో
వినోద్, కల్యాణీ
కూడా బయలుదేర,
పద్మజా కన్నీటితో
నిలబడింది. సరోజా
కూతురి దగ్గరకు
వచ్చి కూతుర్ని
కావలించుకుని ఏడ్చింది.
“మంచిగా
ఉండమ్మా! మంచి
కుటుంబం! నిన్ను
అంగీకరించి కోడలుగా
స్వీకరించి నీకు
జీవితం ఇచ్చారు! వాళ్ళ
మనసు కష్టపడకుండా
మంచిగా పెద్ద
వాళ్ళను గౌరవిస్తూ
నడుచుకో...సరేనా?”
ఏంజలికా ఆమెను
హత్తుకుని “అమ్మా...నాకు
కూతుర్లు లేరు. ఇక
మీదట పద్మజా
నే నా
కూతురు! మనవుడితో
పాటూ వస్తోంది! ఆమెను
కూతురులాగా చూసుకుంటాను. మీరు
బాధపడకండి”
“నాకు
మీ మీద
ఆ నమ్మకం
ఉందమ్మా"
“మేమొస్తాం”
“అమ్మా! మీ
వల్ల కుదిరినంతవరకు
ప్యాక్ చేయండి. నాన్న
ఏ పనీ
చేయకూడదు. పద్మజా
ను దింపి, నేనూ, కల్యాణీ
ఇక్కడకు వచ్చేస్తాము. ఆ
తరువాత హాలు
ఖాలీ చేస్తే
చాలు! సరేనా?”
“సరే
నాయనా”
చాలామంది వెళ్ళిపోవటంతో
ఆ హాలు
ఖాలీగా అనిపించింది.
పద్మనాభం గారు
అలాగే కూర్చుండి
పోయారు.
“ఏమిటండీ?”
“మనోజ్
ఎందుకు అలా
బిహేవ్ చేస్తున్నాడు
సరోజా?”
‘నాకూ
అర్ధం కావటం
లేదు! మౌనంగా
ఉంటాడు. నవ్వడు, ఎవరితోనూ
కలవడు. ఎవరి
మీద పెద్దగా
అభిమానం, ప్రేమ
చూపించడు! ఇవన్ని
మనకే తెలుసు. కానీ
ఇంత ఘోరంగా
మాట్లాడగలడని ఈ
రోజే తెలుసుకున్నాను. ఈ
బిహేవియర్ చేంజ్
ఎందుకు వచ్చిందో
తెలియటం లేదు”
“అదే
మనం చేసిన
తప్పు సరోజా! వాడి
గుణాలు తెలుసుకున్న
వెంటనే చిన్న
వయసులోనే వాడిని
సరిదిద్ది, సరైన
దారిలో తీసుకురాకుండా
పోయాము. ఇది
మనం చేసిన
తప్పు. అది
ఇప్పుడు పెద్ద
గుంతగా తయారయ్యింది”
“కల్యాణీ
కూడా తప్పుగా
మాట్లాడింది! దాన్ని
వినోద్ సరి
చేసేసాడు! మనోజ్
ని మాత్రం
మార్చటం కుదరటం
లేదు...”
“కారణం
మనోజ్ కు వినోద్
నచ్చలేదు! మన
కుటుంబం వినోద్ పైన
చూపుతున్న ప్రేమాభిమానలు
వాడు పూర్తిగా
తట్టుకోలేక పోతున్నాడు. అదే
కారణం”
“వియ్యంకుడు, మన
మనోజ్ ను కొట్టటం
నాకే నచ్చలేదు!”
“వినోద్ ను
మనోజ్ తోసాడు! డేవిడ్
ను తప్పుగా
మాట్లాడాడు! వియ్యంకుడు
మొరటు మనిషి! చేయి
చేసుకున్నాడు”
“మంచి
కాలం, పద్మజా
ని మన
దగ్గరే వదిలేసి
వాళ్ళు వెళ్ళిపోయుంటే
ఏమయ్యేది...?”
“వినోద్
వదిలిపెట్టాడు
సరోజా! వాడి
మాటకు వాళ్ళ
కుటుంబమే కట్టుబడుతుంది”
“ఇప్పుడు
మనోజ్ భోజనం
చేయకుండా, కోపంగా
వెళ్ళిపోయాడు! ఏ
మనో పరిస్థితిలో
ఇంటికి వస్తాడో
తెలియటం లేదే”
“వాడే
తప్పు చేసేసి, వాడే
కోపగించుకుంటే
ఎలా సరోజా?”
“సరే
నండీ! మనం
జీవించాలంటే, మన
కొడుకును మనం
శత్రువుగా చూడగలమా?”
“వీళ్ళిద్దరినీ
కలపటానికి ఏమిటి
దారి?”
“వినోద్
మంచి కుర్రాడు! ఏం
చెప్పినా వింటాడు. మనోజ్
ను సమాధాన పరచటమే
కష్టంగా ఉంది”
ఇద్దరూ బాధపడ్డారు.
అక్కడ డేవిడ్
ఇంట్లో...కోడలకు
హారతీ తీసి, ఒక
హిందూ కుటుంబంలో
చేయాల్సిన సంప్రదాయాలు
చేసారు.
పూజ గదికి
రాగా, అక్కడ
ప్రధానంగా ఏసు, మేరీ
బొమ్మలు ఉన్నాయి. వాటితో
పాటూ వినాయకుడు, లక్ష్మీ
దేవీ, సరస్వతీ, వెంకటేశ్వర
స్వామి, అమ్మవారు
అంటూ సకల
దేవతల ఫోటోలూ
ఉన్నాయి.
కల్యాణీ ఆశ్చర్యపడుతూ
అడిగేసింది.
“దానికి
కారణం, వినోద్
తల్లి భవానీనే
అమ్మా!”
“అలాగా?”
“ఈయనకు
ఆమె యొక్క
ఒక కిడ్నీ
ఇచ్చి ఈయన్ని
కాపాడి, ఈ
ఇంటికే వెలుగునిచ్చిన
దైవం! సో, ఆవిడ
అలవాట్లు, వాళ్ల
దైవం అన్నీ
మా ఇంట్లోనూ
ఉన్నాయి. మాకు
కూడా మతం
పిచ్చి లేదమ్మా!”
“భవానీ
అమ్మగారు లేకుండా
డేవిడ్ పెళ్ళి
జరగటమే ఒక
లోటు!”
బెంజమిన్ చెప్ప,
“అమ్మను
నేను తీసుకు
వస్తాను!” వినోద్
చెప్పి,
“మేము
బయలుదేరతాము. నాన్న
పేషంట్! ఇద్దరూ
ఒంటరిగా ఉంటారు! కల్యాణీని
ఇంట్లో దింపాలి”
“వినోద్! కోపగించుకోకు! ఆ
మనోజ్ ఎందుకు
అలా ఉన్నాడు?”
“వదలండి
అంకుల్!...అతన్ని
తప్పుగా అనుకోకండి. అతను
చాలా మంచి
వాడు. కుటుంబం
అంటే అంత
ప్రేమ. నేను
కష్టపడ్డా నన్ను
ఖర్చు పెట్టనివ్వలేదు. డబ్బు
ఇచ్చేశాడు. ఎక్కువ
స్వీయ మర్యాద
ఎదురు చూస్తాడు. మీలో
ఎవరి మీద
అతనికి కోపం
లేదు. నేను
నచ్చలేదు”
“నిన్ను
ఇష్టపడని వారు
ఎవరైనా సరే, వాళ్ళూ
మాకు వద్దు
వినోద్”
“ప్లీజ్
అంకుల్ అలా
చెప్పకండి! ఇదొక
చిన్న ఈగో
సమస్య. దీన్ని
నేను సరి
చేసుకుంటాను! అతనికి
అర్ధం అయ్యేటట్టు
చేస్తాను. దానికి
నాకు కాస్త
టైము కావాలి”
పద్మజా వినోద్
చేతులు పట్టుకుంది.
“త్వరగా
సరి చేసేయి
అన్నయ్యా! లేకపోతే
నాన్న ఆరొగ్యం
మరింత క్షీణిస్తుంది. ఆయన
ఆరొగ్యం సరి
అవాలంటే మీరిద్దరూ
చేతులు కలపాలి!” ఏడ్చింది.
“అరెరె! ఇదొక
సమస్యే కాదు. నేను
సరి చేస్తాను. ఇక్కడకొచ్చి
నువ్వు ఏడవచ్చా...సంతోషంగా
ఉండు! మనోజ్
కూడా నిన్ను
చూడటానికి వస్తాడు. అంకుల్
అర్ధం చేసుకోండి... కల్యాణీ వెళ్దామా?”
కల్యాణీ శిలలా
నిలబడింది.
‘ఎంత
గొప్ప యువకుడు! ఎలా
అందరినీ ఆకర్షించి
తనవైపు లాక్కుంటున్నాడు’
‘ఇతనిపైన
ప్రాణమే పెట్టుకుంటున్నారే!’
‘ఇతని
తల్లిని ఈ
కుటుంబం దైవంగా
భావిస్తోంది!’
‘ఆ
అమ్మను మేమెవరమూ
చూడలేదే’
‘వెంటనే
చూడలి!’
ఏంజలికా కల్యాణీకి
చీరపెట్టి గౌరవించింది.
ఇద్దరూ బయలుదేరారు.
కారును వినోద్
డ్రైవ్ చేస్తుంటే, పక్కనే
కల్యాణీ.
“మిమ్మల్ని
చూడ చూడ
ఆశ్చర్యంగా ఉంది
వినోద్! నాకు
ఏం చెప్పాలో
తెలియటం లేదు”
“అలాంటప్పుడు
వదిలేయి!”
“నిజంగానే
మిమ్మల్ని పెళ్ళి
చేసుకోబొయే అమ్మయి
చాలా అదృష్టం
చేసుండాలి”
“అదంతా
ఏమీ లేదు
కల్యాణీ!”
“ఎవరా
పెట్టి పుట్టిన
వారో?”
అతని ఫోన్
మోగింది.
“చెప్పమ్మా! అక్కడ
పెళ్ళి మంచిగా
జరిగి, పద్మజాను
ఆమె అత్తగారింట్లో
దింపేసి, ఇంటికి
తిరిగి వెళ్తున్నా. హాలులో
అమ్మా, నాన్నలు
ఉన్నారు! వాళ్లను
ఇంట్లో దింపాలి”
“......................”
“నాన్నకు
ఏ సమస్యా
లేదమ్మా! నువ్వు
పెళ్ళికి రాకపోవటమే
అందరూ లోటుగా
బావిస్తున్నారు!”
అతని వేలు
తగిలి స్పీకర్
బటన్ ఆన్
అవగా,
“రాకూడదనేగా, బయట
ఊరు వెళ్లానని
నిన్ను అబద్దం
చెప్పమని చెప్పాను!”
గబుక్కున ఆఫ్
చేశాడు!
మరింత ఆశ్చర్యంతో
కల్యాణీ అతన్నే
చూస్తూ ఉన్నది.
Continued....9
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి