రెండు ధృవాలు…(సీరియల్) (PART-7)
నాన్న వద్దన్నా
వినోద్ వినలేదు!
మరుసటి రోజు
వచ్చాడు.
“ఎలా
నాన్నా ఉన్నారు!”
“ఉన్నానయ్యా!
నువ్వెందుకు కష్టపడతావు?”
“ఏం
కష్టం నాన్నా? చెల్లి
పెళ్ళికి నా
వల్ల చేయగలిగిన
సహాయం”
“అమ్మా!
ఈయనే పెద్దన్నయ్యా?” వెక్కిరింతగా
అడిగింది కల్యాణీ.
“ఓ...
కల్యాణీ వచ్చేసిందా? పనుల
ఒత్తిడిలో అడగటం
మర్చిపోయాను!”
“హలో!
కల్యాణీ అంటూ
మా ఇంట్లో
వాళ్ళు పిలవచ్చు...కానీ, మీరు
మూడో మనిషి!
అంత హక్కు
తీసుకోకండి”
మొహం మీద
కొట్టినట్టు కల్యాణీ
చెప్ప,
మనోజ్ కుమార్ అది
ఎంజాయ్ చేసి
నవ్వ, తండ్రి
బాధపడ్డాడు.
పద్మజా దగ్గరకు
వచ్చింది.
“అన్నయ్యా!
నా దగ్గర
నువ్వు హక్కు
తీసుకోవచ్చు. కారణం
నన్ను జీవింప
చేయబోయేది నువ్వు!
నేను మత్రమే
ఈ ఇంట్లో
నీ చెల్లెల్ని!
అర్ధం అయిందా?”
“చాలే!
ఎవరికీ ఇలాంటి
ఒక అన్నయ్య
అవసరం లేదే!”
కల్యాణీ జవాబు
చెప్ప,
తల్లి దగ్గరకు
వచ్చింది.
“వినోద్!
అది అలా
మాట్లాడినందుకు
నేను క్షమాపణలు
అడుగుతున్నా. నువ్వు
మనసులో ఏమీ
పెట్టుకోకు నాయనా!”
“ఏంటమ్మా
మీరు! ఒకే
కుటుంబమని అయిన
తరువాత ఇదంతా
నేను పెద్ద
విషయంగా పట్టించుకోను”
“ఒకే
కుటుంబమని ఎవరూ
ఇక్కడ ఒప్పుకోలేదు.
మీరుగా వచ్చి
ఇక్కడ అందరి
దగ్గరా
హక్కు తీసుకోకండి”
కల్యాణీ చెప్ప, పద్మనాభం
గారు హర్ట్
అయ్యారు.
“నోరు
ముయ్యి కల్యాణీ!
నేనూ చాలా
ఓపికగా ఉంటున్నా!
నేను ఏదైనా
మాట్లాడి, అది
ఎవరి మనసునైనా
గాయ పరుస్తుందేమోనని
ఓర్చుకుంటూ, సహించుకుంటూ
వెడితే, నువ్వు
హద్దులు దాటి వెళ్తున్నావు. ఇంటికి
రావలసిన ఒక
పెద్ద అవమానాన్ని
అడ్డుకుని, పెళ్ళి
కుదిర్చి, దాన్ని
అందంగా జరుపుదామనుకుని
కష్టపడుతున్న ఒక
వ్యక్తిని, షిఫ్టు
వేసుకుని అవుమానపరుస్తున్నారే....?”
“నాన్నా!
వదలండి...”
“ఉండయ్యా!
ఇక మాట్లాడకుండా
ఉండలేను. పద్మజాకు
పెద్ద వాళ్ళుగా
ఉన్నవాళ్ళు దాని
జీవితం కోసం
ఏం చేశారు? అరే, కన్నవాళ్లం
మేము ఏం
చేసాము... ఈ వినోద్
కు శ్రద్ద
ఎందుకు? ఏమిటి
అవసరం?”
“ఎవరు
పిలిచారు...” కల్యాణీ అడగ,
తండ్రి లేచొచ్చాడు.
లాగి ఒక
లెంపకాయ కొట్టారు!
అందరూ ఆశ్చర్యపోగా,
“నాన్నా!
ప్లీజ్!”
“లేదయ్యా!
నేను వచ్చిన
దగ్గర నుండి
చూస్తున్నా! మనోజ్
నీ మీద
విసుగు చూపిస్తున్నా, దాన్ని
గంభీరంగా చూపిస్తున్నాడు.
కానీ, ఇది, వచ్చిన
దగ్గర నుండి
ఓవరుగా మాట్లాడుతోంది!
అరె, నా
దగ్గర మాట్లాడనీ.
నీ దగ్గర
మాట్లాడే హక్కు
ఏముంది? అలా
ఎందుకు ముయ్యలేని
నోరు?”
“నేను
వెళ్తున్నా”
“దారాళంగా
వెళ్ళు! నిన్ను
ఎవరూ ఇక్కడ
ఉండమని చెప్పలేదు.
ఇది నా
ఇల్లు. ఇప్పుడూ
నేను సంపాదిస్తూనే
ఉన్నాను. నాకొక
తలవంపు ఏర్పడకుండా
నన్ను కాపాడిన
ఇతనూ నాకు
ఒక కొడుకే.
మీ అమ్మ
కూడా దాన్ని
ఒప్పుకోవటానికి
రెడీ. మీ
ఎవరి అంగీకారమూ
నాకు అవసరం
లేదు! ఇక
ఎవరైనా అతని
గురించి మాట్లాడితే, తరువాత
నేను చేసేదే
వేరు!”
మనోజ్ మొహం
ఎర్ర బడింది.
“మనోజ్!
కన్న కొడుకువు
నువ్వు! నిన్ను
అవమాన పరుస్తున్నారు
నాన్న! నువ్వు
మౌనంగా ఉన్నావే?”
తల్లి కసురుకుంది.
“నువ్వు
కూతురివేనా? విడిపోవడానికి
ప్రేరేపిస్తున్నావా? తండ్రీ--కొడుకులను
విడదీస్తున్నావా? ఆయనకు
అసలే బాగుండలేదు.
ఆయన్ని చంపేయటానికి
వచ్చేవటే?”
“అమ్మా!
ఎందుకు అమంగళ
మాటలు! ఈ
పెళ్ళి కారణంగా
దాని భవిష్యత్తు
ప్రశ్నార్ధకం అయిపోతుందేమోనని
కల్యాణీ భయపడుతోంది!
దాంట్లో ఏమీ
తప్పు లేదే?”
కల్యాణీ గబుక్కున
తిరిగింది.
“అందులో
కొంతైనా నిజమే
కదా! మన
సమాజం అలాగే
కదా ఉన్నది? అది
భయపడటంలో తప్పులేదు!
చదువుకున్న అమ్మాయి!
తెలివి గలది!
కొంచం ఫ్యూచర్
ఆలొచిస్తోంది! ఆమె
చోట నిలబడి
చూస్తే, అందులో
ఉన్న న్యాయం
అర్ధమవుతుంది”
కల్యాణీ ఆశ్చర్యపోయింది.
‘కరెక్టుగా
నాడి పట్టుకున్నాడు.
నేను ఎదిరించటంలో
నాకు సపోర్టుగా
మాట్లాడుతున్నాడు.
ఇతను తప్పు
మనిషి కాదు.
మంచి వాడే!’
“ఇలా
చూడు కల్యాణీ...నువ్వు
నన్ను మూడో
వ్యక్తిగా చూడొచ్చు.
అందులో తప్పులేదు.
నిన్ను నేను
అర్ధం చేసుకున్నాను.
ఇప్పుడు పద్మజా
పెళ్ళి ముఖ్యం!
దాన్ని పంపించాలి.
నీ చదువు
ముగియనీ. నీకు
మంచి ఉద్యోగమూ, దాని
తరువాత తగిన
వరుడు దొరుకుతాడని
హామీ ఇస్తున్నాను.
అందమూ, తెలివి
ఉన్న నీకు
పెళ్ళి ఎందుకు
జరగదు? బాగానే
జరుగుతుంది”
కల్యాణీ మౌనంగా
ఉండిపోయింది.
నాలుగు నిమిషాల
సేపు మాట్లాడి
ఆమెను మూగదాన్ని
చేశాడు.
మనోజ్ ఇంకా
ఎక్కువ కోపగించుకున్నాడు.
‘ఇదే
అతని బలం.
పెద్ద చాతుర్యం!
ఎంతపెద్ద శత్రువునైనా
తనవైపుకు తిప్పేసుకుంటాడు’
‘ఇదెలా
సాధ్యమవుతోంది?’
‘సొంత
అన్నయ్యను నేను!
అమెను గొడవ
చేయటానికి పురికొల్పటమే
కుదిరింది తప్ప, ఆమెకొక
నిజాయితీ అయిన
ధైర్యాన్ని నేను
ఇవ్వలేకపోయాను.
అతను వచ్చిన
దగ్గర నుండి
గొడవే. ఆ
గొడవ పెద్దదయ్యేటప్పుడు
అణిచివేశాడు’
‘ఇతను
పెద్ద పదవిలో
ఉన్నాడు. బాగా
సంపాదిస్తున్నాడు.
సొంతంగా కారు, ఇల్లు
అన్నీ ఉన్నవాడు.
వీళ్ళమ్మ సెంట్రల్
గవర్నమెంటులో అధికారి.
ఎటువంటి కష్టమూ
లేదు. మనలాంటి
వారి యొక్క
హీనమైన మాటలు
వినేసి, మనకొసం
కష్టపడక్కర్లేదే.
అయినా కూడా
అతను కోపగించుకోలేదు.
ఇప్పుడు మనం
సిగ్గుతో తల
వంచుకోవాలి?’
“నాన్నా
వద్దు! నన్ను
పొగడుతూ మీరు
మాట్లాడకూడదు. అది
వాళ్ళెవరికీ నచ్చలేదు.
నాకది అవసరమూ
లేదు. సరే!
అది వదలండి!
పెళ్ళి పనులు
అన్నీ పూర్తి
అయినై! మండపం
-- హోటల్లో భోజనం
అంతా రెడీ.
చీర, తాళి
మా అమ్మ
ఈ రోజు
కొంటుంది!”
“అక్కర్లేదు!” మనోజ్ లోపలకు
వచ్చాడు.
“అది
మా బహుమతి
మనోజ్!”
“అవసరం
లేదు. అది
మేము చేసుకుంటాము”
“ఏమిట్రా
ఆ మాటలు?”
మనోజ్ -- తండ్రి
దగ్గరకు వచ్చి
సంతకం పెట్టిన
ఒక చెక్కును
జాపాడు.
“నాన్నా!
పెళ్ళి కొసం
ఇంతవరకు ఎంత
ఖర్చు అయిందో, ఒక్క
రూపాయికి తగ్గకుండా, ఈ
చెక్కులో రాసి
ఆయనకు ఇచ్చేయండి”
“మనోజ్...అక్కర్లేదు”
“పద్మజా
నా చెల్లెలు!
దానికి చెయ్యాల్సిన
బాధ్యత నాకే
ఉంది! మిగిలినవారి
సహాయానికి
చాలా థ్యాంక్స్!
డబ్బు అవసరం
లేదు. అర్ధమయ్యిందా?”
తల్లి నిర్ఘాంతపోయింది.
తండ్రి వేదనతో
చూశాడు.
“సరే
నాన్నా! నేను
ఖర్చు లెక్క
చెబుతాను. మొత్తం
రాసి చెక్కు
ఇవ్వండి! మనోజ్
చెప్పేదాంట్లో
కూడా తప్పులేదు.
ఒక అన్నయ్య
యొక్క న్యాయమైన
ఫీలింగ్ అది!
దీనికి నేను
అడ్డురాను. హక్కు
అతనికే”
“సరే
నాయనా”
“నేను
ఖర్చులను దీంట్లో
రాసి ఉంచుతాను!
మీరు సరి
చూసి చెక్కు
రాసి ఇవ్వండి”
“అలాగే
వినోద్”
“నేను
వెళ్ళొస్తాను. ఎల్లుండి
ప్రొద్దున ఒక
పెద్ద వ్యాన్
తీసుకు వస్తాను.
అందరూ రెడీగా
ఉండండి!”
అతను బయలుదేర,
“వినోద్!
మీ అమ్మను
చూడకుండా నాకు
మనసు చాలా
కష్టంగా ఉంది” సరోజా చెప్ప,
“చూద్దామమ్మా!” నవ్వుతూ వాకిలి
మెట్లు దిగాడు.
బైకు స్టార్ట్
చేయ,
“ఒక్క
నిమిషం!” అని గొంతు
వినబడ తిరిగాడు.
కల్యాణీ నిలబడుంది.
“చెప్పండి?”
“ఎందుకు
‘మీరు’ అని
చేరి పిలుస్తున్నారు? నేనేమన్నా
మూడో వ్యక్తినా? ఈ
ఇంట్లో మీరూ
ఒకరు అని
చెప్పుకుంటూ, నన్నెందుకు
వేరుగా చూస్తారు?”
“అదంతా
ఏమీలేదు...”
“నేను
మీ దగ్గర
క్షమాపణలు అడుగుతున్నాను!” అతని పాదాలు
ముట్టుకుంది.
“అయ్యో!
ఏమిటిది? రోడ్డు
మీదకొచ్చి...ఎవరైనా
చూస్తే?”
“తప్పులేదు!
నా కంటే
మీరు పెద్దవారు.
నేను తప్పుగా
మాట్లాడాను.కానీ, అందుకు
కోపగించుకోకుండా, నా
మనసులో ఏర్పడే
ఎమోషన్స్ ను
సరిగ్గా అర్ధం
చేసుకుని, దాన్ని
విడమరిచి చెప్పి
నాకోసం సపొర్టుగా
మాట్లాడినప్పుడు...నేను
చాలా అవమానంగా
ఫీలయ్యాను”
లోపల నుండి
అంతా చూస్తున్నాడు
మనోజ్.
“అందులో
తప్పు లేదు!
మిగతావారు మన
మీద కోపగించుకోకుండానూ, దానికి
కారణం ఏమై
ఉంటుందని నేను
ఆలొచిస్తాను. చాలా
సమయాలలో మనం
నేరస్తులుగా ఉండచ్చు.
కొన్ని సమయాలలో
పశ్చాతాపం అవతలవారి
మీద పడుతుంది...నీది
రెండో రకం”
కళ్ళు పెద్దవి
చేసింది.
“తల్లీ-తండ్రి
మంచి వాళ్ళు!
వాళ్ళ పిల్లలకు
అంతా మంచే
జరుగుతుంది...బయలుదేరనా!”
“మళ్ళీ
సారీ...”
“చాలు...బాకీ
ఉంచుకో...” నవ్వుతూ
అతను బైకు
తీయగా, అతను
వెళ్లే దిక్కువైపునే
చూస్తూ నిలబడ్డది
కల్యాణీ.
మెల్లగా లోపలకు
రాగా,
ఎదురుగా మనోజ్.
అతని చూపులు
కోపంగా కనబడ, లోపలకు
వెళ్ళింది.
“అతను
తన స్టెయిలులో
నిన్ను కూడా
తనవైపు లాక్కున్నాడుగా?”
“లేదు
మనోజ్! తొందరపడకుండా, మిగిలిన
వారి మనసును
అర్ధం చేసుకునే
గుణమూ, ఓర్పూ
ఆయనకు ఉంది”
“అది
నాకు లేదు
అంటున్నావా?”
“నేను
నిన్ను చెప్పలేదు!
నాకు అవి
లేవు! ఆయన్ని
తప్పుగా మాట్లాడినా, ఆయన
నాకు మంచే
చేస్తానని చెప్పినప్పుడు, మనసు
సిగ్గు పడింది”
“సో, ఈ
ఇంట్లో నేను
ఒంటరి వాడిని!”
“ఎందుకు
అలా అనుకుంటావు? మంచే
చేస్తున్న అతనితో
చేతులు కలుపుకో!
తప్పేముంది?”
“నీ
ఉపదేశానికి థ్యాంక్స్.
నా విషయంలో
నువ్వు తల
దూర్చకు”
తండ్రి దగ్గరకు
వచ్చింది కల్యాణీ.
“సారీ
నాన్నా”
తలెత్తి చూసారు
ఆయన.
“వినోద్
దగ్గర క్షమాపణలు
అడిగాసాను! ఆయన్ని
అర్ధం చేసుకున్నా
నాన్నా!”
“సారీ
కల్యాణీ. భుజాల
ఎత్తుకు పెరిగిన
కూతుర్ని, చేయి
చేసుకున్నది తప్పే!”
“లేదు
నాన్నా! ఆ
దెబ్బ, వినోద్
యొక్క ఓర్పుతో
కూడిన నమ్మకం
నన్ను ఆలొచింపచేసింది!
నేను అర్ధం
చేసుకున్నాను”
తల్లి వచ్చింది.
“సంతోషమే!
నీ దగ్గర
ఇలాంటి ఒక
మార్పు వెంటనే
వస్తుందని నేను
ఎదురు చూడలేదు”
“సరోజా!
బోసు, ఎలాంటి
వారినైనా మార్చేస్తాడు!
అతని లాంటి
ఒక అహింసావాది
ఎవరూలేరు! ఈ
మధ్య కాలంలో
మనం చూస్తున్న
నిజం ఇది!”
“అవునండి”
“కానీ, మనోజ్
కోపం మాత్రం
కొనసాగుతోంది! భయంగా
ఉందండి”
“మారతాడు!
మనోజ్ మనసుని
అర్ధం చేసుకుని, డబ్బు
తీసుకోవడానికి
వినోద్ అంగీకరించాడే!”
“ఇదిగో
చూడు కల్యాణీ!
వినోద్ చెప్పటంతో
ఆగడు. నీకు
ఉద్యోగం ఏర్పాటు
చేస్తాడు. పెళ్ళి
కొడుకును కూడా
తీసుకు వస్తాడు
చూడు”
కల్యాణీ ముఖంలో
ఒక కాంతి.
“చదువు
ముగించి, ఉద్యోగం
దొరకనీ నాన్నా!
అదే ముఖ్యం!”
“సరే.
మనం ప్యాకింగ్
పనులు చూద్దాం, నాతో
రా కల్యాణీ!”
తండ్రి లేచి
ఒంటరిగా వచ్చారు.
ఫోను చేశారు.
అవతలి వైపు
వినోద్!
“చెప్పండి
నాన్నా!”
“నువ్వెక్కడున్నావు?”
“ఇంటికి
దగ్గరలో ఉన్నాను!”
“నువ్వు
ఇంట్లోకి వెళ్ళిన
తరువాత, భవానీని
కొంచం మాట్లాడమని
చెప్పు”
“సరే
నాన్నా!”
ఆయన ఫోను
ఆఫ్ చేసి
తల ఎత్తగా, మనోజ్
జరిగి నిలబడున్నాడు.
అతని చూపులు
షార్పుగా ఉన్నాయి.
“లే...లేదు!
చెక్కును బ్యాంకులో
వెయ్యమని చెప్పాలి.
అతనికి టైము
లేకపోతే, వాళ్ళమ్మ
భవానీ దగ్గర
ఇవ్వాలి. అందుకే
వాళ్ళకు ఫోనులో...”
మనోజ్ ఎటువంటి
మాట మాట్లాడకుండా
కొన్ని క్షణాలు
అక్కడ నిలబడి
లోపలకు వెళ్లాడు.
ఆయనకు చెమటలు
పట్టినై.
అలాగే మంచం
మీద కూలబడి
పోయరు.
శరీరమంతా, కారణం
లేని ఒక
తపన! తల
తిరుగుతున్నట్టు
అనిపించింది.
పడుకుండిపోయారు.
స్ప్రుహ తప్పే
పరిస్థితిలోకి
మెల్లగా జార,
ఫోను మోగింది!
ఆయనకు వినబడలేదు.
మనోజ్ వెళ్ళి
తీశాడు.
“నేనే
మాట్లాడుతున్నా”
“నేనంటే? ఎవరు?” -- అడుగుతూ
స్క్రీన్ మీద
చూడ ‘డార్లింగ్’ అని
ఉంది!
“మీరు
ఎవరండి?”
అవతలివైపు ఒక్క
క్షణం ఆలొచిస్తున్నట్టు
తెలియ, ఫోన్
కట్ అయ్యింది!
‘ఎవరు
ఈ డార్లింగ్?’
‘నాన్న
మామూలుగా తన
ఫోనులో ఎవరి
పేరూ వెయ్యరే’
‘మనోజ్
పేరుకు మై
సన్! అమ్మకు
స్వీటీ!’
‘కల్యాణీకు
డాటర్ -- పద్మజాకు
ముద్దు పిల్ల!
ఆ కుటుంబానికి
మాత్రమే అది
తెలుసు’
‘ఇది
ఎవరు డార్లింగ్!’
‘మళ్ళీ
డయల్ చేద్దామా?’
డయల్ చేశాడు.
స్విచ్ ఆఫ్
అనే గొంతు
కొనసాగ, అది
పెట్టేసి వచ్చాడు!
లోపలకు వచ్చిన
తల్లి, “ఈ
పాలు తాగండి!
ఇలా చూడండి...ఏమైంది? ఎందుకిలా
చెమటలు పట్టినై?”
తల్లి కేకలు
వేయగా...ముగ్గురు
పిల్లలూ పరిగెత్తి
రాగా,
“రేయ్!
నాన్నకు స్ప్రుహ
తప్పుతున్నట్టు
ఉందిరా!”
మొహం మీద
నీళ్ళు జల్ల, కళ్ళు
తెరిచారు. తల్లి
ఆందోళన పడింది.
“ఏ...ఏమీ
లేదు! కొంచంగా
తల తిప్పింది...ఒంట్లో
బాగా నీరసం, అలసట.
అందుకే చెమటలు.
కళ్ళు తిరగటం.
ఇప్పుడు సరిపోయింది!
పాలు ఇవ్వు
సరోజా!”
తల్లి పాల
గ్లాసు ఇచ్చి
పక్కనే కూర్చోగా,
“నాన్నా!
నేను ఇక
మీదట తప్పుగా
మాట్లాడను! నా
వల్ల మీకు
ఎటువంటి సమస్య
రాదు నాన్నా!” కల్యాణీ
ఏడ్చింది.
“లేదమ్మా!
నాకు కళ్ళు
తిరగటానికి కారణం
నా ఆరొగ్యమే.
మీరెవరూ కారణం
కాదు. మీ
ఇద్దరికీ ఒక
మంచి జీవితం
సెట్ అయితే, ఆ
తరువాత నాకేం
జరిగినా పరవాలేదు!”
“నేనున్నా!
మీరు మాత్రమే
నాకు సపోర్ట్!”
“నిన్ను
వదిలి నేను
వెళ్ళిపోనే! నువ్వు
బాధపడకు!”
“సరే
నాన్నా! మీరు
పడుకోండి!” -- అందరూ
వెళ్ళిపోగా, మనోజ్
కి టెన్షన్
గా ఉంది.
‘ఎవరీ
డార్లింగ్?’
‘మళ్ళీ
నేను ఫోన్
చేస్తే స్విచ్
ఆఫ్’
‘నేను
అనుమానించేది కరక్టేనా?’
మనసులో చాలా
ప్రశ్నలు పరిగెత్తాయి!
‘దీంట్లో
ఉన్న నిజం
నేను కనిబెట్టాలి!’
‘ఇప్పుడొద్దు!’
‘పద్మజా
పెళ్ళి జరగనీ!
ఆ తరువాత
నేను అణ్వేషణలో
దిగే తీరాలి’
Continued...PART-8
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి