మిణుగురు పురుగులు…(సీరియల్) (PART-2)
సందడి లేని ఒంటరి
చోట నగరానికి కొంచం చివరగా ఉన్నది ఆ కాన్వెంట్. నగరంలోని డబ్బుగల వారి పిల్లలకనే
కట్టబడిన స్కూలు. డబ్బు అంటే సాధారణ డబ్బు కాదు!
“హాయ్...టుడే
ఆల్సో యువార్ కమింగ్ ఇంద సేమ్ కార్?” అంటూ అడిగే వర్గాల కోసం స్థాపించబడింది. ఎల్.కే.జీ క్లాసు
లోపల కూర్చునేటప్పుడే రక్తానికి బదులు శరీరంలో పొగరు,
సొగసు,
సుఖాలూ పారే వర్గం.
మొదటి రోజు ‘టయోటా కారు’
అయితే, మరుసటి రోజు ‘మెర్సిడీస్ బెంజ్’ కారులో వచ్చే వర్గం. ఫియట్,
అంబాసడర్ లలో వచ్చే
వాళ్ళను హేళనగా చూసే జాతి. ఒక్కొక్క సెలవులకూ అమెరికా,
లండన్ తీసుకు
వెళ్లబడే...మలేషియా, సింగపూర్ లను తమ ఇంటి తోట ఎంట్రన్స్ లాగా అనుకునే అతిపెద్ద
వ్యక్తుల పిల్లలు, మనవళ్ళూ చదివే స్కూలు.
రోజూ స్కూలు అయిపోయి,
పిల్లలందరూ ఇళ్లకు
వెళ్ళిపోయి స్కూలు కాంపౌండ్ సందడి లేకుండా ఉండగా,
ఎనిమిదేళ్ళ అశ్విన్
మాత్రం ఒంటరిగా జారుడు చెక్క ఎక్కుతూ, జారుడు ఆట ఆడుకుంటున్నాడు. వాడికి స్కూలు అయిపోయిన వెంటనే
ఇంటికి వెళ్ళే అలవాటు లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరూ ఉండరు. అందుకని స్కూలు లోనే
చాలాసేపు ఒంటరిగా ఆడుకుని టయర్డ్ అయిన తరువాత ఇంటికి వెళ్లటం వాడికి అలవాటు. ఆ
రోజు కూడా అలాగే ఒంటరిగా ఆడుకుంటున్నాడు. కొంచం దూరంలో చెట్టు కింద వాడి
అల్యూమిన్యం పుస్తకాల పెట్టె, విదేశీయ వాటర్ బాటిల్ వాడిలాగానే ఒంటరిగా పడున్నాయి.
తోడు లేనందున అశ్వినీకుమార్
బాధపడలేదు. ఇంకా చెప్పాలంటే ఎవరైనా అతనికి తోడుగా ఆడటానికి వస్తే చిరాకు పడతాడు.
బహుశ దీనికి కారణం అతను పుట్టిన దగ్గర నుండి అతనికి తోడుగా ఎవరూ లేరు. ఒంటరితనం,
పనివాళ్ళ సహాయం
మాత్రమే తోడు ఉండేవి. అతను ఒంటరి తనానికి అలవాటు పడిపోయాడు.
ఏడోసారిగా మెట్లు
ఎక్కి జారి, కింద ఉన్న ఇసుకలోకి వచ్చినప్పుడు...అంతవరకు ఓర్పుగా
కాచుకోనున్న రుద్రయ్య అంతకు మించి ఓర్చుకోలేక అతని లేత చేతులను ఎర్ర బడేంతగా లాగి
పట్టుకున్నాడు.
“రా అశ్విన్...ఇంటికి
వెళ్దాం” అని కోపంగా చూడా,
అశ్విన్ అతని
కోపాన్ని కొంచం కూడా లక్ష్యం చేయకుండా చెప్పాడు.
“ఊహూ...నేను
రాను పో”
“అమ్మ
‘అవుట్
డోర్ ‘ నుండి
ఈపాటికి తిరిగి వచ్చుంటారు అశ్విన్. నువ్వు ఇంట్లో లేకపోతే కేకలేస్తారు”
అశ్విన్ కళ్ళల్లో
పెద్ద మెరుపు కనబడింది. “నిజంగానే చెబుతున్నావా? అమ్మ వచ్చుంటుందా?”
“వచ్చుంటుంది అశ్విన్”
అశ్వినీకుమార్ పది
రోజుల తరువాత అమ్మను చూడబోతున్నాను అనే ఆశతో, సంతోషపడుతూ, గంతులు వేస్తూ కారువైపుకు పరిగెత్తాడు. వెళ్తున్నప్పుడే ‘ఆ స్కూలు బాక్సునూ, వాటర్ బాటిల్ ను తీసుకురా రుద్రయ్యా’
అంటూ అరిచాడు.
పది రోజులకు
ముందు...హాంకాంగులో ‘అవుట్ డోర్ షూటింగ్’ అంటూ అమ్మ బయలుదేరి వెళ్ళింది జ్ఞాపకానికి వచ్చింది.
వెళ్ళేటప్పుడు కూడా వాడితో మాట్లాడటానికి అమ్మకు సమయం లేదు. చివరి నిమిషం వరకు ఏదో
ఒక ముగింపుకు వస్తున్న సినిమాలో యాక్టింగ్ చేసి,
ఇంటికి ఫోన్ చేసి
మేనేజర్ ను పిలిచి తన సూట్ కేసుతో తిన్నగా విమానాశ్రయం వచ్చేయమని చెప్పింది.
మరిచిపోకుండా ఆయాతో పాటూ కొడుకును తీసుకు రమ్మని చెప్పినందు వలన వాడి వల్ల వెళ్ళటం
కుదిరింది.
అక్కడ కూడా అమ్మవల్ల
కొడుకుతో మామూలుగా మాట్లాడటం కుదరలేదు.
ఆటోగ్రాఫ్ అడుగుతున్న వాళ్ళనూ, నేను మీ ఫ్యాన్ అండీ అనే వాళ్ళను నవ్వుతూ,
నమస్కరిస్తూ పంపించి,
చివరిగా కొడుకు
దగ్గరకు వచ్చి బుగ్గల మీద ఒక ముద్దు.
“ఆయా,
అశ్విన్ ను
జాగ్రత్తగా చూసుకో...” సినిమాలో చెయ్యి ఊపుతున్నట్టే,
అందంగా చెయ్యి ఊపుతూ
లోపలకు వెళ్ళిపోయింది.
అమ్మ ఇప్పుడు తిరిగి
వచ్చింది. వాడి కోసం హాంగ్ కాంగ్ నుండి చాలా బొమ్మలు తీసుకువచ్చింటుంది. రమణ దగ్గర
ఉన్నట్టు రిమోట్ కంట్రోల్ కారు అడిగుంచాడు. నోటి నుండి రబ్బర్ తీసేస్తే ఏడ్చే
బొమ్మ, చిన్న
చిన్న బండ్లు, అమ్మ అన్నీ కొనుకొచ్చి ఉంటుంది.
“త్వరగా
వెళ్ళు రుద్రయ్యా”
పదో నిమిషంలో కారు జూబ్లీ
హిల్స్ లోని ఆ బ్రహ్మాండమైన బంగళాలోకి
వెళ్ళి...పోర్టికో లో ఉన్న తల్లి యొక్క తెల్ల కారు నిలబడుండటం చూసి అశ్విన్ తాను
వచ్చిన కారు ఆగేంతవరకు ఉండలేక తొందరపడి కిందకు దిగి మేడపైకి పరిగెత్తాడు.
“అమ్మా...”
భానూరేఖా యొక్క గది
తలుపుపైన కొట్ట...కింద నుండి పరిగెత్తుకుని వచ్చిన ఆయా బెదిరిపోయి అశ్విన్ చేతులు
పుచ్చుకుని చెప్పింది.
“అమ్మ
నిద్రపోతోంది అశ్విన్. ఇప్పుడే కదా వచ్చింది! అందువల్ల బాగా టయర్డుగా ఉన్నారు.
నువ్వు అల్లరి పెట్టకూడదు. స్నానం చేసేసి,
డ్రస్సు మార్చుకుని,
బుద్దిగా తినేసి,
పాలు తాగేసి పైకి
రావాలి. అప్పుడే మీ అమ్మ నిన్ను చూడటానికి రెడీగా ఉంటుంది”
“లేదు
ఆయా. నాకు ఇప్పుడే అమ్మను చూడాలని ఉంది. చూసి,
ఒక ముద్దు పెట్టేసి,
నాకోసం తెచ్చిన
బొమ్మలన్నిటినీ తీసుకు వచ్చారా అని అడిగేసి వెళ్ళిపోతాను”
“చెబితే
వినాలి అశ్విన్. మంచి కుర్రాడివి కదా”
అశ్విన్
మొండికేసాడు. “లేదు...పో.
నేను బొమ్మలను చూసేసే వస్తాను. మమ్మీ...మమ్మీ...”
మళ్ళీ మూర్ఖంగా
తలుపు కొడుతున్న శబ్ధం వినబడ, గబుక్కున తెరుచుకోగా....సన్నటి నైట్ గౌనుతో నిలబడుంది భానూరేఖా.
లోపల మంచం మీద కూర్చోనున్న ఆ ఎవరో ఒకరు, సిగిరెట్టు కాలుస్తూ నుదురు చిట్లించి అశ్విన్ ను చూడ,
వాడు దాన్ని
పట్టించుకోక అమ్మను మోకాళ్ల దగ్గర కావలించుకున్నాడు. భానూరేఖా ముఖ భావాలు
సరిలేకపోవటం గమనించి తడబడుతూ నిలబడ, ఆమె ఆయాను చూసి కేకలేసింది.
“నీకు
ఎన్ని సార్లు చెప్పేది...అశ్విన్ ను పైకి పంపొద్దని?
ఇదేనా నువ్వు వాడిని
చూసుకుంటున్న లక్షణం?”
“లేదు మేడం...అదొచ్చి....”
“నోరు
ముయ్యి. అశ్విన్...నువ్వు కిందకు వెళ్ళి స్నానం చేసి తింటూ ఉండు. నేను తరువాత వస్తాను”
“లేదు
మమ్మీ...బొమ్మ...”
“బొమ్మలన్నీ
తరువాత! మొదట కిందకు వెళ్ళు. ఊ...”
తలుపు మళ్ళీ
మూసుకోగా...ఆ రోజు అశ్విన్ మనసులో మొదటి దెబ్బ తగిలింది. ‘అమ్మ ఎందుకు నన్ను మాత్రం కిందకు వెళ్లమని తరుముతోంది?
లోపలున్న మావయ్యను
ఎందుకు తరమటం లేదు? ఎవరతను?’
ఇలాంటి మనుషులతో
అమ్మ అప్పుడప్పుడు రావటం, మేడ గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోవటం,
ఆయా వెంటనే నన్ను
తోటలోకి తీసుకు వెళ్ళి ఆడుకోమనడం.
“ఆయా...వాళ్ళంతా
ఎవరు?”
“తెలియదబ్బాయ్!”
“నన్నెందుకు
రూములోకి రావద్దని అమ్మ చెబుతోంది?”
“తెలియదబ్బాయ్!”
“ఆవిడకు
నేనంటే ఇష్టం లేదు కదా ఆయా? అందుకనే నాతో మాట్లాడకుండా,
ఆ మనిషి దగ్గర
మాట్లాడుతోంది కదు ఆయా?”
“తెలియదబ్బాయ్...!”-- కళ్ళ చివర్లో బొట్టు బొట్టుగా కారుతున్న కన్నీటిని చీర
కొంగుతో తుడుచుకుంది.
ఆ రోజు తరువాత ఆ
ఆయాను అతను చూడలేదు. ఆమెకు బదులుగా చిన్న వయసు అమ్మాయి వాడ్ని చూసుకుంటోంది.
“నన్ను
ఆయా అని పిలవకు! పుష్పా అని పిలు” అన్నది. నలుపుగా ఉన్నా
కళగా ఉంది. అయినా కానీ ఆయా యొక్క ప్రేమ ముందు పుష్పా ఓడిపోయింది.
“ఆయా
ఎక్కడ పుష్పా?”
“పని మానేసింది”
“ఎందుకని?”
“నిన్ను చూస్తే ఆమెకు పాపంగా ఉందట”
“పాపం
అంటే ఏమిటి పుష్పా?”
“పాపం అంటే...పాపం అంటే...చేసేటప్పుడు సంతోషంగా తెలుస్తుంది.
చేసిన తరువాత మనసును కష్ట పెడుతుంది”
“ఆలాగంటే?”
“తరువాత నువ్వు చేసేటప్పుడు,
నువ్వే
తెలుసుకుంటావు! ఇప్పుడు మాట్లాడకుండా పడుకో”
ఆయా వెళ్ళిపోవటం అశ్విన్
మనసుకు రెండో దెబ్బ అయ్యింది. తరువాతి దెబ్బ పదమూడో వయసులో పడింది.
“ఏయ్... అశ్విన్
అమ్మ నటించిన సినిమా నిన్న చూసానురా...ఛీఛీ...సరిగ్గా డ్రస్సు వేసుకోకుండా స్నానం
చేసిందిరా?”
“నేను
చూసిన సినిమాలో ఇంకా అసహ్యంగా ఎవరో ఒకర్ని గట్టిగా కౌగలించుకుందిరా”
“ఏరా...
అశ్విన్ కు నాన్నా లేరా?”
“మనకు
ఒక నాన్న అయితే...వాడికి చాలా మంది నాన్నలురా!”
“నీకెలా
తెలుసు?”
“మా
అమ్మ చెప్పింది...”
ఆ మాటలు విన్న అశ్విన్
ఆ రోజంతా భోజనం చేయలేదు. ఎవరికీ తెలియకుండా కళ్ళను అప్పుడప్పుడు
తుడుచుకుంటున్నాడు. చివరి క్లాసు అయిపోయిన తరువాత రమణ దగ్గర కూడా చెప్పకుండా
వచ్చాశాడు.
ఆ తరువాతే అతను బాగా
చెడిపోయాడు. ప్రేమ, చూసుకునే
వాళ్ళు లేకపోవటం, చాలా డబ్బుగల పిల్లల లాగా అయిపోయాడు.
వాడిని ఇంకా
చెడిపేందుకు అతని పనులు చేయటానికి రాణీని పనిలో అమర్చారు. పుష్పా పెళ్ళి చేసుకుని
వెళ్ళిపోయిన తరువాత ఈమె వచ్చి చేరింది. పుష్పా లాగా లేకుండా ఈమె వ్యత్యాసంగా ఉంది.
అతీతంగా దుస్తులు ధరించింది. కావాలనే ఓణీని పక్కకు తొలగించుకుంటుంది.
ఆమెను దగ్గరగా
చూసినప్పుడంతా అశ్విన్ కి ఎదో జరుగుతుంది. ఏమిటనే తెలియని ఎమోషన్ వస్తుంది.
అతని యొక్క
పద్నాల్గవ పుట్టిన రోజుకు వచ్చిన రమణ, మరుసటి రోజు స్కూల్లో వాడితో రహస్యంగా అడిగాడు. “మీ
ఇంట్లో నిన్న ఒక అమ్మాయి ఉన్నదే...ఆమె ఎవర్రా?”
“రాణీ...నన్ను
చూసుకుంటుంది”
“ఆమెను
చూస్తే అలాగే గట్టిగా కౌగలించుకుందామా అని అనిపిస్తోందిరా!”
తనలో ఏర్పడే ఎమోషన్
కూడా అదేనేమో అన్న అనుమానం రాగా, ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే రాణీని వెతికేడు అశ్విన్. హాలు,
వంట గది, ఇంటి వెనుక, పనివాళ్లకు కేటాయించిన క్వార్టర్స్,
తన గది...చివరగా వెతుక్కుంటూ తల్లి రూము గది తలుపులును మెల్లగా
తోసాడు.
అమ్మ మంచంపైన రాణీనూ, తోటమాలి బాబీ ! వీడు ఆశ్చర్యంతో చూస్తూ
నిలబడ...రాణీని వదిలి తొలగి బాబీ లేచినప్పుడు అశ్విన్ శబ్ధం చేయకుండా తలుపు మూసి
కిందకు దిగి వచ్చాశాడు. తాను చూసింది ఎవరితోనైనా చెప్పి పంచుకోవాలని తపించాడు.
చివరగా ఆ రోజు
రాత్రి భోజనానికి పిలవటానికి తన గదిలోకి వచ్చిన రాణీ దగ్గరే మెల్లగా అడిగాడు.
“ఈ
రోజు సాయంత్రం అమ్మ గదిలో నువ్వూ, బాబీ ఏం చేస్తున్నారు?”
ఆమె ఒక నిమిషం షాకై
నిలబడి అతన్ని చూసింది. “అప్పుడు నువ్వు పైకి వచ్చావా?”
అశ్విన్ తల ఊపాడు.
“మమ్మల్ని
చూసావా?”
దానికీ తల ఊపాడు.
“ఎవరి
దగ్గరైనా చెప్పావా?”
లేదనే విధంగా తల ఊప, రాణీ అతని దగ్గరకు మరింత జరిగి, బాగా క్లోజుగా వచ్చి గబుక్కున అతని మొహాన్ని తన గుండెలకు చేర్చి గట్టిగా
అదుముకుంటూ వ్యత్యాసమైన స్వరంతో చెప్పింది.
“ఇక
మీదట ఇవన్నీ చూస్తే ఎవరి దగ్గరా చెప్పకూడదు...ఏం?”
హాయిగానూ, మెత్తగానూ ఉన్న ఆ స్పర్శలో ముఖాన్ని ఇంకా
అదుముకుంటూ రమణ జ్ఞాపకం రాగా...సన్నటి స్వరంతో అడిగాడు.
“ఎందుకు
చెప్ప కూడదు?”
రాణీ వాడి తలను
ముద్దుగా కెలుకుతూ మాట్లాడింది.
“ఎవరి
దగ్గరా చెప్పనని వాగ్ధానం చేస్తే చెప్తాను”
“నిజంగానా?”
“ప్రామిస్”
“అలా
అయితే ఎవరి దగ్గర చప్పనే చెప్పను రాణీ!”
Continued...PART-3
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి