31, ఆగస్టు 2023, గురువారం

వాతావరణ మార్పుల వలన ముప్పు ఉన్న దేశాలు-1...(ఆసక్తి)

 

                                                           వాతావరణ మార్పుల వలన ముప్పు ఉన్న దేశాలు-1                                                                                                                                              (ఆసక్తి)

ఐక్యరాజ్యసమితి యొక్క నివేదిక ప్రకారం, గత రెండు దశాబ్దాల నుండి ప్రకృతి వైపరీత్యాల రెట్టింపు అయ్యాయి.  దీనికి ఎక్కువగా వాతావరణ మార్పే కారణమని చెప్పవచ్చు. నివేదిక ప్రకారం, రాజకీయ నాయకులు, వ్యాపార నాయకులు భూమిని ‘జనావాసాలు లేని నరకం’గా మార్చకుండా చూసుకోవడంలో తమ పనిలో విఫలమవుతున్నారు.

ఐక్యరాజ్యసమితి విభాగంలో ఒకటైన 'విపత్తు ప్రమాదాన్ని తగ్గించే కార్యాలయం' (యుఎన్‌డిఆర్ఆర్) నివేదీక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2000 -- 2019 మధ్య 7,348 పెద్ద విపత్తులు సంభవించాయి. దీనివల్ల జీవితాలు, జీవనోపాధి, ఆర్థిక వ్యవస్థలో భారీ నష్టాలు సంభవించాయి. మొత్తం 1.23 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోగా, 4.2 బిలియన్ల మంది నష్టపోయారు. ఈ విపత్తులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు ₹ 22,105 కోట్లు నష్టం ఏర్పరచింది.

వాతావరణ మార్పుల వల్ల బెదిరింపులకు గురైన ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో, అధిక ఆదాయం, మధ్య ఆదాయం, తక్కువ ఆదాయ దేశాల మిశ్రమాన్ని చూపిస్తోంది. ఇది తీవ్రమైన వాతావరణ పరిస్థితులు అందరినీ ప్రభావితం చేస్తుందనే విషయాన్ని నిర్ధారిస్తోంది. ఏదేమైనా, వాతావరణ మార్పుల ద్వారా వచ్చే ఈ విపరీత వాతావరణ పరిస్థితుల ప్రభావం తక్కువ ఆదాయ దేశాలలో ఎక్కువగా ఉంది. ఈ దేశాలకు దానివలన ఏర్పడే శిధిలాలను తట్టుకునే సామర్థ్యం ఉండకపోవచ్చు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

వాతావరణ మార్పుల వలన ముప్పు ఉన్న దేశాలు-1...(ఆసక్తి) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి