30, ఆగస్టు 2023, బుధవారం

రెండు ధృవాలు…(సీరియల్)...(PART-5)

 

                                                                             రెండు ధృవాలు…(సీరియల్)                                                                                                                                                                    (PART-5)

రాత్రి ఎనిమిదింటికి మనోజ్ వచ్చాడు! లోపే పద్మనాభం గారిని వినోద్ ఇంటికి తీసుకు వచ్చి చేర్చాడు. పెళ్ళి పనులు చేయటానికి బయలుదేరి వెళ్ళాడు.

రాత్రి డిన్నర్ రెడీ అయ్యింది.

భర్తకు పెట్టేసి, మనోజ్ ను పిలిచింది సరోజా!

నాకు వద్దు. బయట తిన్నాను

ఇదిగో చూడు మనోజ్! నువ్వెందుకు అలా ఉన్నావు! వినోద్ సరైన సమయంలో చేయూతనిచ్చి, కుటుంబ పరువును కాపాడింది నిజమే కదా?” 

దాన్ని కాదనగలమా?…ఎవరూ మర్చిపోలేదు  

చేసిన వాళ్ళకు థ్యాంక్స్ చెబుతూ నాలుగు మాటలు మాట్లాడటం పద్దతి కాదా?”

దాన్ని నేను నిరాకరించలేదే

మరెందుకు అంతకోపం! నీకోపం కారణంగా మీ నాన్న టెన్షన్ పడి, ఆసుపత్రికి వెళ్లారు. ఆయనకు ఏదైనా జరిగుంటే, నేరం పద్మజా మీద పడేది. కష్టపడి ఏం లాభం? ఆయన్ని పిలుచుకు రావటానికి కూడా నువ్వు రాలేదు

అందుకే అతను ఉన్నాడు కదా...

అతను మేము కన్న కొడుకారా...?”

అమ్మా, నాన్న అని పిలవటం మొదలుపెట్టేడే

ఒరేయ్! అభిమానమున్నపెద్దలను అమ్మా, నాన్నా అని పిలవటం తప్పారా? దానివల్ల అతను నీ చోటుకు రాగలడా? ఇంకా, ఇంకా దూరంగా జరిగిపోయి మీ నాన్నకు ఏదైనా జరిగేలాగ చెయ్యకు... మనోజ్

తల్లి బోరున ఏడవ,

మనోజ్ కి ఏదోలాగా అయిపోయింది.

సరోజా! మనోజ్ డిన్నర్ పూర్తి అయ్యిందా?” తండ్రి స్వరం.

ఇస్తున్నా! చూశావారా! పెద్ద కొడుకువని మా ఇద్దరికీ నీ మీద ప్రేమ, అక్కర  ఎక్కువరా! అది అర్ధం చేసుకో. నీ చోటుకు ఎవరూ, ఎప్పుడూ రాలేరు మనోజ్. మా ఇద్దర్నీ కాపాడి, మా ఇద్దరికీ తల కొరివి పెట్టే హక్కు నీకు మాత్రమేరా

సరే వదులు

కాస్త పాలు ఇస్తాను. నాన్న దగ్గరకు వెళ్ళి సమాధానపరుస్తున్నట్టు నాలుగు మాటలు మాట్లాడు. ఆయన  బాగా వాడిపోయారురా...

మనోజ్ కి కూడా మనసులో ఒక నేర భావన ఏర్పడింది.

అది ప్రకృతి ఇచ్చిన ఎమొషన్!

ఎవరో ఒక వినోద్, మంచే కదా చేస్తున్నాడు. నాతో ప్రేమగా, భవ్యంగా  నడుచుకుంటున్నాడు

నేను ఇలా కోపగించుకోవటంలో న్యాయం లేదే?  నాన్న యొక్క ఆవేదన ఎక్కువ అవటానికి నేను కారణమా? ఒక హార్ట్ పేషంట్! జీవితాంతం నేరారోపణకు నేను కారణమవకూడదు

మెల్లగా తండ్రి దగ్గరకు వచ్చాడు.

నాన్నా! అంటూ మంచం మీద కూర్చున్నాడు.

డిన్నర్ చేశావా మనోజ్!

బయట తిన్నాను! అమ్మ పాలు ఇచ్చింది. తాగాను! మీకు ఇప్పుడు సమస్యా లేదు కదా

లేదు మనోజ్! నువ్వేరా కుటుంబానికి పెద్ద. నేను పోయిన తరువాత మీ అమ్మకూ, ఇద్దరు చెల్లెల్లకూ నువ్వేరా గతి?”

నాన్నా! అదంతా ఇప్పుడెందుకు

కోపగించుకోకురా....చేసిన వాళ్ళకు కృతజ్ఞతలు తెలిపేది సంప్రదాయం. పద్మజా ఒక పసిపాప, తెలియక ఏదైనా మాట్లాడుంటే, దాన్ని మనసులో పెట్టుకోకు

లేదు నాన్నా

ఏదేదో జరిగిపోయింది. చైదాటి పోయిందిరా మనోజ్! ఇప్పుడు పరిస్థితి సరి అయ్యింది! నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకుండా ప్రేమగా ఉండరా

అతను మాట్లాడలేదు.

వేరే మతం వాడిని ప్రేమించటం కూడా తప్పు కాదు. తరువాత ఘటనకు అది  వెళ్ళిపోయింది! మేము జాగ్రత్తగానే పెంచాము. ఎక్కడ తప్పు జరిగిందనేది తెలియటం లేదు

వదలండి! జరిగిపోయింది కదా

మనోజ్! కొన్ని సమ్యాలలో హద్దు మీరటం, సరిహద్దులు దాటటం మనిషి జీవితంలో జరుగుతుంది! అది విధి! కాలం కాలంగా ఇది జరుగుతోంది. కొన్ని బంధాలను విధిలించి పారేయలేము మనోజ్! కష్టాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకి ఏది కరెక్టు, ఏది తప్పు, తెలియని ఒక మత్తు వస్తుంది. సమయం గడిచిన తరువాత తెలిసినప్పుడు, చేయి దాటిపోయుంటుంది

ఆయన దేని గురించి చెబుతున్నాడో అర్ధం కాలేదు.

బాధ్యతలు వస్తే, తప్పించుకు రాలేము మనోజ్

నేను కుటుంబాన్ని వదిలిపెట్టను నాన్నా! బాధ్యతలను విశ్మరించను

ఇప్పుడు నేను చెప్పింది నీకోసం కాదయ్యా...నా కోసం!

అర్ధం కాలేదు

కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని ఆలొచించారు.

నేను మీ కందరికీ నాన్నను! నా కూతుర్లకు పెళ్ళి చేయటం, కుటుంబాన్ని నడిపించటం నా కమిట్ మెంటే కదా, దాన్ని నేను విధిలించిపారేయగలనా చెప్పు?”

నాన్నా ఇప్పుడు మీకు ఆరొగ్యం బాగలేదు. అయినా కూడా మీరు ఇంకా చేయాలని ఎవరూ ఎదురుచూడటం లేదు

తెలుసురా

నేను చూసుకుంటాను నాన్నా...తప్పు ప్రేమ, దిక్కు మారి వెళ్ళినప్పుడు,  వినోద్ కలుగజేసుకుని అడ్డుపడి, పద్మజా జీవితం నాశనం అవకుండా, మనం  అవమానపడకుండా చేశాడు. దానికి చాలా థ్యాంక్స్! అంతవరకు ఓకే. మీ హాస్పిటల్ ఖర్చు అతను ఇవ్వకూడదు. దానికి నేనున్నాను.

నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అతనికీ అని కొన్ని హద్దులు ఉన్నాయి. అతను వాటిని దాటకూడదు! పెళ్ళి ఏర్పాట్లను అతను చెయ్యనివ్వండి. దాన్ని అడ్డుకోను. బెంజమిన్ గారి కుటుంబానికి వాళ్ళ అమ్మ ముఖ్యం. అందువలన పద్మజా వాళ్ల కుటుంబం లోపలకు వెళ్లేంతవరకు వినోదే అన్నీ జరపనీ. తరువాత అతను ఇక్కడకు రాకూడదు

పద్మనాభం గారి మొహాన షాక్.

ఎందుకయ్యా?”

ఇదేం ప్రశ్న? నాకు అతను నచ్చలేదు నాన్నా. అతని మాటలూ, అప్రోచ్ అందరికీ నచ్చచ్చు. అది నేను వద్దని అడ్డుకోవటం లేదు. నా కుటుంబంలో అతను కలుగజేసుకోవటం ఇక వద్దు. సారీ నాన్నా! అతను ముఖ్యమని ఇక్కడున్న వాళ్ళు అనుకుంటే, నేను తప్పుకుంటాను

ఆయన కళ్ళల్లో నొప్పి!

సారీ నాన్నా! దీన్ని మనసులో పెట్టుకుని మీరు బాధపడకండి! నా మనసులో ఉన్నది నేను చెప్పాలి కదా? ప్రొద్దున కల్యాణీ వస్తోంది. నేను రైల్వే స్టేషన్ కు వెళ్లాలి

బయటకు వచ్చాడు.

తలుపు చాటున నిలబడి అంతా విన్నది తల్లి.

మనోజ్! పాలు చల్లారిపోయినై. వేడి చేసి ఇవ్వనా?”

వద్దమ్మా వేడిగా ఉన్నప్పుడే తాగాలి! చల్లారిపోయిన దాన్ని వేడి పెడితే రుచి ఉండదు! జీవితమూ అంతే

బయటకు వెళ్ళిపోయాడు.

తల్లి భర్త గది లోపలకు వచ్చింది.

మందు ఇవ్వనా?”

అన్ని పనులూ ముగించుకుని రా...నేను మాట్లాడాలి

ఎక్కువగా మాట్లాడకండీ

మాట్లాడాలని అనుకున్నప్పుడు మాట్లాడేయాలి సరోజా! తరువాత ఒక వేల మాట్లాడటమే కుదరకపోతే!

సరోజా గబుక్కున తన వేళ్లతో ఆయన నోరు మూసింది.

నిప్పు అంటే నోరు కాలిపోదు సరోజా! పనులు ముగించుకుని రా

సరే నండీ!

మనోజ్, పద్మజా నిద్రపోగా... సరోజా తిరిగి భర్త గదిలోకి వచ్చింది.

ఇదిగో చూడండి మనోజ్ మాటలను పెద్దగా పట్టించుకోకండి... రోజు వాడు మనతో కలిసినట్లు ఉండే వాడు! వాడి చిన్నప్పటి నుండి  అది వాడి స్వభావమని మీకు తెలియదా?”

తెలుసు! కానీ ఇప్పుడు నా పరిస్థితి వేరు 

పేషంటనా! ఏమీ లేదు...టెన్షన్ తగ్గించే మాత్రలను కరెక్టుగా వేసుకుంటూ రెస్టు తీసుకుంటే బ్యాడ్ పరిస్థితి రాదు. ఇంతకు ముందు మీరు ఎలా ఉండేవారో అలా అయిపోవచ్చు

నేను అది చెప్పటం లేదు సరోజా. ఒక అసహ్యం నుండి మన కుటుంబాన్ని కాపాడింది వినోద్

నిజమే. సహాయాన్ని నేను నా జీవితాంతం మరిచిపోను

మూడో కంటికి విషయం తెలియకుండా ముగించాడు. నాన్నా అని ఆశగా పిలిచి...ఛాతీ, వీపు అతను రుద్దుతున్నప్పుడు, ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా సరోజా?”

తెలుసండి

సరోజా...తల్లి స్పర్ష ప్రేమ!  భార్య స్పర్ష కామం! అవసరమైన సమయాలలో  కొడుకూ, కూతురి స్పర్షలు ఆనందం! ఇక్కడ ముట్టుకునే స్పర్ష దుఃఖాన్ని దూరం చేసి, శరీరానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది సరోజా! కావలించుకున్నప్పుడు హృదయం చోటు మారుతుంది సరోజా! దాన్ని వినోద్ అందంగా అర్ధం చేసుకున్నాడు! మనోజ్…. నాన్నా అంటూ నా మీద రోజన్నా చెయ్యి పెట్టేడా? నవ్వుతూ సంతోషంగా మాట్లాడాడా?

కోపం మాత్రం వస్తోంది! పద్మజా పెళ్ళి ముగిసిన తరువాత వినోద్ ఇంటికి రానే కూడదట. ఎందుకు సరోజా? వినోద్ అలా ఏం ద్రోహం చేశాడు? వాడి మీద అంత  ఈర్ష్య ఎందుకు. ఇది మంచిదా సరోజా?  వాడు వస్తే, వీడు ఉండడట. నాకు చాలా బాధగా ఉంది సరోజా

ఆయన స్వరంలో శోకం కనబడింది.

వదలండి. సరి చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మనసులో పెట్టుకుని మీరు టెన్షన్  పడకూడదు. మీ ఆరొగ్యం మరింత దెబ్బతింటుంది. వినోద్ ఈ ఇంటికి రాకుండా ఉండలేడు

లేదు సరోజా! అతని పరిచయం కొనసాగితే, మనోజ్ ఖచ్చితంగా మనల్ని వదిలి వెళ్ళిపోతాడు

జరగదండి

మనోజ్ యొక్క పట్టుదల నీకు తెలియదా?”

అందుకోసం కుర్రాడ్ని మనం వదులుకోగలమా?”

అసలు కుదరదు సరోజా! కానీ, కన్న కొడుకును నువ్వు దూరం చేసుకోలేవు

ఎందుకు విడదీసి మాట్లాడుతున్నారు? మనోజ్ కి దూరంగా ఉండటం  మీ వల్ల కుదురుతుందా! ఇప్పుడు బాధ ఎందుకు? పద్మజా ను కన్న వాళ్ళం మనం...అన్నయ్య మనోజ్, ఇలా అందరూ ఉంటే...ఎవరికి తెలిసింది గర్భం దాల్చేంత వరకు పద్మజా వెళ్ళిందని. ఆమెను కాపాడి మంచి దారికి తీసుకు వచ్చింది ఎవరు?”

వినోద్!

లేదండీ! అతని తల్లి భవానీ

దానికీ?”

సమస్యను తీర్చి, ఒక మూర్ఖత్వపు బెంజమిన్ ను మన ఇంటికి తీసుకు వచ్చింది భవానీ. ఆమె మన మనోజ్ మనసును గూడా మార్చగలదు

అలాగా చెబుతావు?”

ఖచ్చితంగా! రేపు కల్యాణీ వచ్చిన తరువాత, నేనూ పద్మజా ను తీసుకుని భవానీ గారిని చూడటానికి వాళ్ళింటికి వెళ్లబోతాము

దేనికీ?” ఆయన షాకయ్యాడు.

మీరెందుకు ఇంత షాక్ అవుతున్నారు? వాళ్ళింటికి మేము వెళ్లకూడదా?”

లేదు...లేదు సరోజా! వినోద్ ను చూస్తేనే మనోజ్ కు అసలు నచ్చదు. అలాంటి వినోద్  ఇంటికే తన తల్లి, చెళ్లెల్లూ వెళితే, మనోజ్ జీర్ణిచుకోగలడా...చెప్పు? పెళ్ళి  అతి దగ్గరలో ఉంది. అలాంటప్పుడు నువ్వు చెప్పేది షాక్ కాకపోతే మరేమిటి?”

వాడి దగ్గర చెప్పా వెళ్తాము? మీరు బయట పెట్టకండి. అది మేము చూసుకుంటాము

వద్దు సరోజా, ప్లీజ్...

ఎందుకు ఇలా భయపడుతున్నారు? మనోజ్ మాటలకు మనం ఎక్కువగా కట్టుబడితే, రేపు అదే మనకు కష్టం తెస్తుంది. మీరు దీన్ని అర్ధం చేసుకుని  నడుచుకోవాలి. నేనొక తల్లిని. నా బిడ్డలకు ఒక మంచి జరగాలి. దాన్ని చేసే వాళ్ళు నాకు ముఖ్యం. వాడ్ని ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు

విపరీతాన్ని ఖరీదుపెట్టి కొనద్దు సరోజా! 

ఇప్పుడు మీరు రెస్టు తీసుకోండి! నేను చూసుకుంటాను. ప్రొద్దున్నే కల్యాణీ  వస్తోంది

దానికి జరిగిందంతా తెలీదు. అది ఎన్ని మాటలు మాట్లాడుతుందో?”

అది పెద్దది! తన చెల్లెలు ఇలా నడుచుకున్నది...అర్జెంటుగా పెళ్ళి చేసుకోబోతున్నది, ఇవన్నీ దానికి తెలిస్తే తట్టుకుంటుందా?”

వేరే దారి లేదు! నేను మాట్లాడుకుంటాను. మీరు దేంట్లోనూ తల దూర్చకండి.  మాట్లాడకుండా ఉండండి

ఆయన మాట్లాడలేదు. సరోజా బయలుదేరింది.

ఎక్కడికి వెళ్తున్నావు సరోజా?”

వారం చివర్లో పద్మజా వెళ్ళిపోతుంది! నేను దానితో పాటూ పడుకుంటాను

సరే! తలుపు వేసేసి వెళ్ళు!

సరోజా వెళ్ళిన తరువాత ఆయన తలుపులు ఒకసారి చెక్ చేసుకుని, మళ్ళీ లైటు   వేశారు.

సెల్ ఫోన్ వెతికారు. దొరకలేదు.

మెల్లగా లేచి హాలుకు వచ్చారు. అక్కడ వెతక, టీ.వీ. పక్కన ఉంది.

అది తీసుకుని వాకిలికి వచ్చారు.

మంచి నీళ్ళు తాగటానికి లేచి వచ్చిన మనోజ్, తండ్రి సెల్ ఫోనుతో సమయంలో వాకిలికి వెళ్ళటం చూశాడు.

మెల్లగా ఆయన్ని వెంబడించాడు.

ఆయన నెంబర్లు నొక్కాడు. అవతలి వైపు మోగింది.

నేనే మాట్లాడుతున్నా

ఆయన మాట్లాడను మాట్లాడను, వాకిలిలో ఉన్న చెట్టు వెనుక నిలబడి మనోజ్ వినడం మొదలుపెట్టాడు.

నాలుగు మాటలే మాట్లాడారు.

చార్జ్ లేక స్విచ్ ఆఫ్ అయ్యింది సెల్ ఫోను.

                                                                                                       Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి