23, ఆగస్టు 2023, బుధవారం

మోక్షానికే మోక్షం...(కథ)

 

                                                                                  మోక్షానికే మోక్షం                                                                                                                                                                   (కథ)

సమస్య వ్యక్తిగతం అయితే, ఆ సమస్యను ఆ వ్యక్తే తీర్చుకోవాలి. సమస్య ఊరిదైతే. ఆ ఊరి ప్రజలే వారి సమస్యకు పరిష్కారం వెతుక్కోవాలి. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులూ కొకొల్లలుగా ఉన్నా కొన్నిసార్లు సమస్యలు తీరవు. ఎందుకంటే అవినీతి, లంచగొండితనం ఎక్కువగా పెరిగిపోవటం, చట్టానికి ప్రభుత్వాలు, రాజకీయనాయకులు, ప్రభుత్వ అధికారులు భయపడకపోవటం. అందుకని ఎక్కడ సమస్య పరిష్కారం కాలేదో అక్కడున్న ప్రజలు పోరాటాలు చేసి వీలైనంతవరకు సమస్యలకు పరిష్కారం తెచ్చుకుంంటున్నారు.

ఈ కథలో కూడా ఒక పెద్ద సమస్యకు కొత్తరకం పోరాటం చేస్తామని ప్రకటించటంతో సమస్యను ప్రభుత్వం తీరుస్తానంది. అదేమిటో చదివి తెలుసుకోండి.

ప్రొద్దున ఎనిమిది గంటలు.

మంచు పడే కాలం కాబట్టి, అప్పుడే తెల్లవారినట్లు వెలుతురు తక్కువగా ఉన్నది. నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి, న్యూస్ పేపర్ను తిరగేస్తున్నరామక్రిష్ణ యొక్క సెల్ ఫోనులో వాట్స్ ఆప్మెసేజ్ వచ్చినట్లు మోత వినబడింది.

కాలేజీ స్నేహితుడు జగపతి తండ్రి చలం మరణించారు...' అన్న వార్తను తెలుసుకున్న వెంటనే, రామక్రిష్ణ మనసు మరో విషయం గురించి ఆలోచించటానికి ఒప్పుకోలేదు.

చివరిగా ఒక సారి, ఆయన మొహం చూడాలిఅనే ఆతురతతో, డ్రైవర్ కు ఫోను చేశాడు. కొద్దిసేపట్లో కారులో కూర్చున్న అతను వెంకటాద్రి గ్రామానికి వెళ్ళవలసిన దూరాన్ని, సమయాన్నీ గూగుల్ ద్వార గణించి చెబుతూ ఉన్నాడు.

రెండు వందల కిలో మీటర్ల దూరం వెళ్ళాలి. మామూలుగా వంద కిలోమీటర్ల వేగంతో వెళితేనే కనీసం మూడు గంటలు అవుతుంది అనుకుంటున్నా...

రామక్రిష్ణ చెప్పిన వెంటనే, ‘సరి అనేలాగా తల ఊపిన కారు డ్రైవర్, “సార్...అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇంత దూరం, అందులోనూ అర్జెంటుగా వెళుతున్నారే. చనిపోయిన వ్యక్తి మీకు బాగా దగ్గర బంధువా?” అన్నాడు.

ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

మోక్షానికే మోక్షం...(కథ) @ కథా కాలక్షేపం-1 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి