7, ఆగస్టు 2023, సోమవారం

గ్రహాంతరవాసి శవపరీక్ష వీడియో నిజమైనదే…(మిస్టరీ)

 

                                                        గ్రహాంతరవాసి శవపరీక్ష వీడియో నిజమైనదే                                                                                                                                        (మిస్టరీ)

                                         రోస్వెల్ లో కూలిపోయిన గ్రహాంతరవాసి యొక్క శవపరీక్ష వీడియో

దాదాపు డెబ్బై ఐదు ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయిన 1947 నాటి ‘రాస్వెల్’ ఏలియన్ మిస్టరీ త్వరలోనే తేలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి! గ్రహాంతరవాసుల ఉనికిపై ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలను కెనడా పరిశోధనా సంస్థ ఒకటి ఈ ఏడాది బహిరంగ చర్చకు పెట్టబోతోంది. ఈ చర్చలో రాస్వెల్ మిస్టరీ యొక్క అంతు చిక్కవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

అమెరికా రాష్ట్రమైన న్యూ మెక్సికోలోని రాస్వెల్ ప్రాంతంలో మాక్ బ్రాజెల్ అనే ఓ వ్యవసాయదారుడు న్యూ  రాస్వెల్ ప్రాంతంలో ఆయన వ్యవసాయ క్షేత్రం దగ్గర 1947 జూలైలో ఒక రోజు అంతరిక్ష శకలాల వంటివేవో పడి ఉండడాన్ని గమనించాడు. వాటి తాకిడికి అక్కడ అగాధం లాంటి గొయ్యి ఏర్పడింది. విషయాన్ని వెంటనే సైనికాధికారులకు చేరవేశాడు బ్రాజెల్. తక్షణం ఇద్దరు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి వచ్చి చూశారు. వెనకే పోలీసు బలగాలు. పరిశోధన మొదలైంది. 1947 జూలై 8వ తేదీ ఉదయం విడుదల చేసిన ఓ ప్రకటనలోఎగిరేపళ్లెం (ఫ్లయింగ్ సాసర్) ధ్వంసమై ఆ శకలాలు బ్రాజెల్ వ్యవసాయ క్షేత్రం పక్కన పడ్డాయని రాస్వెల్ ఆర్మీ ఎయిర్ ఫీల్డ్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ విలియం బ్లాకార్డ్ వెల్లడించారు! అమెరికా అంతటా ఆ వార్త గుప్పుమంది.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

గ్రహాంతరవాసి శవపరీక్ష వీడియో నిజమైనదే…(మిస్టరీ)  @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి