రెండు ధృవాలు…(సీరియల్) (PART-1)
పరిపూర్ణంగా కథా పాత్రల గుణగణాల ఆంశంతో రాయబడ్డ నవల! సరాసరి గుణాలు
ఉన్న మనుష్యులు కూడా, స్వార్ధం లేని ప్రేమ పక్కకు వస్తే, మనుష్యులుగా మారటానికి ఛాన్స్ ఉంది అనేది చెప్పే ఎమోషనల్ నవల.
కొన్ని సమయాలలో హద్దు మీరటం, సరిహద్దులు దాటటం మనిషి జీవితంలో
జరుగుతుంది! అది విధి! కాలం కాలంగా ఇది జరుగుతోంది. కొన్ని బంధాలను విధిలించి
పారేయలేము! ఆ కష్టాన్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. మనకి ఏది కరెక్టు, ఏది తప్పు, తెలియని ఒక మత్తు వస్తుంది. సమయం గడిచిన
తరువాత తెలిసినప్పుడు, చేయి దాటిపోయుంటుంది.
తల్లి స్పర్ష ప్రేమ! భార్య స్పర్ష కామం! అవసరమైన సమయాలలో కొడుకూ, కూతురి స్పర్షలు ఆనందం! వాళ్ళు ముట్టుకునే స్పర్ష దుఃఖాన్ని దూరం చేసి, శరీరానికి కొత్త ఉత్సాహం ఇస్తుంది! కావలించుకున్నప్పుడు హృదయం చోటు మారుతుంది!
***************************************************************************************************
బలం అనేది
దెబ్బతీసేది కాదు...ఉండిపోయేది!
చివరి క్షణాలలో
పెద్దాయన.
గత ఆరు
నెలలుగానే పద్మనాభం
గారికి ఆరొగ్యం
సరిగ్గా లేదు!
ఇప్పటికే రెండుసార్లు
హార్ట్ అటాక్
వచ్చి, అన్ని
రకాల ట్రీట్మెంట్లూ
తీసుకుని, ప్రాణాన్ని
అరిచేతిలో పెట్టుకోనున్న
మనిషి.
అన్ని రకాల
వ్యాధులూ ఆయన శరీరంలో
ఉన్నాయి.
ఆహారం కంటే
కూడా మందులే
ఎక్కువగా ఆయన శరీరంలో
చోటు పట్టుకోనుంది.
వయసు యాభైనాలుగు
సంవత్సరాలే! ప్రైవేట్
కంపెనీలో పనిచేశారు--కొంచం
పెద్ద కంపెనీనే.
పెద్ద పోస్టు
మాత్రం కాదు.
జస్ట్ సూపర్
వైజర్.
ఒక అబ్బాయి, ఇద్దరు
అమ్మాయలు. కష్టపడి
ముగ్గురినీ చదివించారు.
అబ్బాయి డిగ్రీ
పూర్తి చేసి, ఒక
చోట పనికి
చేరి, ఉద్యోగం
చేస్తూనే ఎం.బి.ఏ.
ముగించి, తన
ప్రతిభతో ఒక
పెద్ద కంపెనీలో
పని సంపాదించుకున్నాడు.
అతి మేధావి!
స్కూలు చదువుకుంటున్నప్పట్నుంచి
తండ్రికి ఏ
మాత్రం డబ్బు
ఖర్చు పెట్ట
నివ్వకుండా, స్కాలర్
షిప్ తెచ్చుకుని
తన చదువును
ముగించాడు. తానుగానే
ఉద్యోగం వెతుక్కున్నాడు.
మనోజ్ కుమార్ ఎక్కువగా
మాట్లాడాడు. కోపం
చూపించడు. ఇష్టా
అయిష్టాలను చూపించడు.
“ఏరా? నువ్వేమన్నా
యంత్రమా? ఇంట్లో
ఎవరిదగ్గర ఏదీ
చెప్పవా - ఇంట్లో
వాళ్ళ దగ్గరే
మిత భాషిగా ఎలారా
ఇలా ఉంటున్నావు?”
తరువాత చెల్లెలు
కల్యాణీ అతన్ని
గొడవకు ఈడుస్తుంది.
ఆమె వాగుడుకాయ.
ముక్కోపి. పట్టుదల
మనిషి! ఎప్పుడూ
ఏదో ఒక
గొడవ తీసుకుని
వచ్చి నిలబడుతుంది.
స్కూలు చదువు
ముగించి, కాలేజీలో
చేరటానికి ఆమె
చేసిన గోల
అంతా ఇంతా
కాదు. తనకు నచ్చిన
కాలేజీ తాముంటున్న
ఊర్లో లేదని
చెప్పి, ఇంకో
ఊరి కాలేజీకి
దరఖాస్తు చేసి, సీటు
దొరకటంతో, హాస్టల్లో
ఉండాల్సిన అనివార్యం
ఏర్పడింది. దానికీ
చేర్చీ డబ్బు
కట్టింది! రెండు
ఖర్చులు!
తల్లి సరోజ
కోపగించుకుంది.
“ఏమే!
నీకు కాలేజీ
ఫీజు, హాస్టల్
ఫీజు, భోజనం
ఖర్చు అంటూ
చాలా ఖర్చు
అవుతుంది. నాన్న
ఎక్కడ్నుంచి తెస్తారే
అంత డబ్బు? మన
ఊరి కాలేజీలో
చదివి బాగుపడిన
పిల్లలు లేరా?”
ఆవేశం ఎక్కువవగా, గొడవ
బలం పుంజుకుంది.
“ఏం...నాన్న, మనోజ్
అన్నయ్య ఇద్దరూ
సంపాదిస్తున్నారు
కదా?”
“మనోజ్ కు
ఇప్పుడే ఉద్యోగం
దొరికింది! నాన్న
ఒకరి సంపాదనతో
ముగ్గుర్నీ చదివించి, ఐదుగురికి
భోజనం, ఇంటద్దె!
ఎక్కడ్నుంచి తెస్తారే? పదిపైసలు
సేవింగ్స్ లేవు.
నెలాఖరుకి చేతిలో
డబ్బు చాలక
టెన్షన్ వస్తోంది!
మీ ఇద్దరికీ
పెళ్ళిచేయటానికి
మా దగ్గర
డబ్బులు లేవు!”
“కన్న
తరువాత, చేసే
తీరాలి”
“ఎవరి
దగ్గరుంది?”
“అప్పు
చెయ్యి! అందరూ
చేతులో ఉంచుకునా
చేస్తున్నారు?”
“మనోజ్!
ఇటు రా!”
“ఏంటమ్మా?”
“నువ్వూ
ఈ ఇంట్లో
పుట్టిన వాడివే
కదా?”
“దేనికోసం
ఈ ప్రశ్న?”
“దేంట్లోనూ
కలిగించుకోవా! అది
బయట ఊర్లో
చదువుకుంటుందట!
ఖర్చు తట్టుకోలేము...కుదరదూ
అని చెప్పరా”
“అమ్మా!
నేను జీతం
డబ్బును తీసుకుని
నీ చేతికి
ఇచ్చేసి, కూరగాయలకు
కూడా నీ
దగ్గరే తీసుకుని
వెళ్తున్నాను! ఇలాంటి
వాటిలో నేను
తల దూర్చనమ్మా!”
రెండో చెల్లెలు
చప్పట్లు కొట్టింది.
“ఎందుకే
చప్పట్లు కొడుతున్నావు?”
“మనోజ్
అన్నయ్య ఇంత
పొడవైన వాక్యం
మాట్లాడి నేను
ఇప్పుడే వింటున్నాను”
కల్యాణీ కూడా
నవ్వ,
సరోజ కోపం
తలకెక్కింది.
“కన్నవారి
కష్టాలు, ఏ
కుక్కకైనా ఇక్కడ
తెలుస్తోందా?”
పద్మనాభం లోపలకు
దూరారు.
“వదులు
సరోజా. అడ్జస్ట్
చేసుకుందాం. చదువుకోవటానికి
ఆశ పడుతోంది.
అది సెలెక్టు
చేసిన కాలేజీ
మంచి కాలేజీ.
బాగా చదివితే, అక్కడే
క్యాంపస్ ఇంటర్వ్యూ
లో ఉద్యోగం
వస్తుంది! ఖర్చులు
అడ్జస్ట్ చేసుకుందాం.
చేతులో ఉంచుకుని
మన ఇంట్లో
ఏది జరిగింది
చెప్పు. అప్పు
తీసుకుందాం”
“ఊరంతా
అప్పు. ఇంట్లో
దూరి కొట్టబోతారు” గొణిగింది
సరోజ.
కల్యాణీ గెలిచి, బయట
ఊరి కాలేజీలో
చేరింది.
అప్పుడు పద్మనాభం
గారే కాలేజీకి తీసుకు
వెళ్ళి విడిచిపెట్టారు.
తరువాతది పద్మజా.
పదోక్లాసు చదువుతోంది!
ఇదే ఈ
కుటుంబ పరిస్థితి.
సరోజా కూడా
ఖాలీగా ఉండదు.పచ్చళ్ళు, అప్పడాలు, చిప్స్
లాంటివి తయారు
చేసి, కొంతమంది
రెగులర్ కస్టమర్స్
ను పెట్టుకుని
నెలకు ఒక
చిన్న సంపాదన
తన వంతుగా
సంపాదిస్తున్నది!
అక్కడ మనోజ్
కుమార్ కష్టపడి
ఏం.బి.ఏ.
ముగించి కొంచం
పెద్ద కంపెనీలో
చేరాడు. మంచి
జీతం రావటం
మొదలయ్యింది.
తండ్రి కంటిన్యూగా
రెండు షిఫ్టులు
పనిచేసి, రెస్టు
లేకుండా పనిచేసినందువలన
నలభైతొమ్మిది సంవత్సరాల
వయసులో జ్వరం, తలతిరగటం, వాంతి
వచ్చి హాస్పిటల్లో
చేరాడు.
అన్ని పరీక్షలూ
జరిపారు.
పరిశుభ్రం లేని
ఫ్యాక్టరీలో దుమ్ము, తుమ్ములతో, కంటిన్యూగా
పనిచేయటం వలన, ఆయనకు
అదే ఒక
అంటువ్యాధిలాగా
అయిపోయి, ఆయన
ఆరొగ్యాన్ని బాధించింది.
ఒక వారం
రోజులు ఉండి, ఇంటికి
వచ్చారు.
అలా ఆయనకి
మొదటి జబ్బు
మొదలయ్యింది. ఆడపిల్లలు
పెద్దపిల్లలవుతూ
రావటంతో, వాళ్ళను
తీరానికి చేర్చాలే!
సొంతంగా ఒక
ఇల్లు కూడా
లేదే అన్న
కలత ఆయన్ని
మరింత బాధపెట్టింది.
సరోజాకు
భర్త మదనపడటం
అర్ధమయ్యింది.
“ఏమండీ... మనోజ్ పైకొచ్చాడు
కదా! ఇప్పుడు
పెద్ద జీతమే
కదా వస్తోంది!
విదేశాలకు వెళ్లే
ఛాన్స్ కూడా
వస్తుంది. మీవల్ల
కాకపోతే కంపల్సరీ
రిటైర్మెంట్ తీసుకోండి?”
“లేదు
సరోజా! అమ్మాయిల
పెళ్ళిల్లు అయ్యేంతవరకూ
నేను కష్టపడే
తీరాలి. పూర్తి
బాధ్యత మనోజ్
మీద వెయ్యకూడదు”
“మీవల్ల
పనిచేయటం కుదరటం
లేదే! మీ
నాన్నకు నువ్వు
చెప్పరా మనోజ్!”
“నువ్వు
చెబుతున్నావు కదమ్మా!”
“కొడుకు
నోటి ద్వారా
వింటే ఆయన
మనసుకు ఒక
ధైర్యం వస్తుంది”
అప్పుడు కూడా
మనోజ్ మాట్లాడలేదు.
మంచికొడుకు. ఎటువంటి
చెడు అలవాటూ
లేదు. జీతం
పూర్తిగా ఇచ్చేస్తాడు.
అదంతా ఓకే.
కానీ, ఓదార్పు
మాటలు చెప్పి
ప్రేమ చూపించడు.
కానీ, కుటుంబీకులంటే
ఎనలేని ప్రేమ.
కానీ కలవడు.
నీళ్ళల్లో తామారాకులాగా
అంటీ అంటనట్టు
నిలబడతాడు.
చుట్టుపక్కలున్న
పిల్లలందరూ తల్లికి
సన్నిహితంగా ఉండటం, ఆ
తల్లులు ‘నా
పిల్లాడిలాగా ఎవరూ
ఉండరూ’
అని డప్పు
వాయించుకుంటూ ఉంటే
సరోజాకు మనసు
నొప్పిగా ఉంటుంది.
తట్టుకోలేక గొణుక్కునేది.
“దేవకీ కొడుకుకు 25
సంవత్సరాలు! ఇప్పుడు కూడా వాడికి ముద్దలు పెడుతుంది దేవకీ. ఆమె
ఒడిలో తల పెట్టుకుని పడుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ అలాంటిది ఒక్కరోజైనా జరిగిందా? ”
దానికీ సమాధానం లేదు!
“వదులు సరోజా! సైలెంటు
గా ఉండటం వాడి న్యాచర్! ఇంట్లో వాళ్లతో ప్రేమతో ఉండటాన్ని మాటల్లోనూ,
చేష్టలలోనూ చూపించాలా? అలా చూపించటం మనవాడికి
తెలియదు! ”
తల్లి ఒకరోజు బాగలేదని పడుకుంది.
ప్రేమగా అమ్మను చేరుకుని,
ముట్టుకుని చూడటం, ఒక చిన్న స్పర్శ...వాత్సల్య
చూపు...ఆదరణగా “ఇప్పుడెలాగుందమ్మా” అని
నాలుగు మాటలు ఏదీ లేదు.
తట్టుకోలేక సరోజ అడిగినప్పుడు,
“నిన్ను నాన్న
ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించి, మందులు
రాయించుకుని, కొనిచ్చారే. డాక్టర్ చూసి ‘పెద్ద సమస్య ఏమీ లేదు’ అని చెప్పారు కదా. తరువాత
ఏమిటమ్మా? ”
తల్లి వంటను పొగడటం,
తప్పు పట్టడం లాంటి నాలుగు మాటలు చెప్పడు.
తన నోటికి రుచిగా ‘ఇది చెయ్యి...అది చెయ్యి’ అని అడగడు.
షాపుకు రాడు.
పండుగలు,
విశేషాల సమయంలో కూడా ఇంట్లో ఎవరి దగ్గర నవ్వుతూ, సంతోషంగా గడపడు.
మొహాన నవ్వే ఉండదు.
ఉండబట్టలేక ఒకరోజు సరోజ భర్తతో చెప్పింది!
“మనోజ్ ఎందుకు ఇలా
ఉన్నాడో తెలుసా? దానికి కారణం మీరే? ”
“నేనా”
“మనకు పెళ్ళి
జరిగి మీ ఇంటికి వచ్చినప్పుడు...మీ అమ్మా, చెల్లెళ్ళు,
వదినా అంటూ ఒకటే కుటుంబంగా, ఉమ్మడి కుటుంబంగా
జీవించేమే. మర్కెట్టులోలాగా ఎప్పుడూ చూడు కిక్కిరిసి”
“దానికీ,
మనోజ్ యొక్క గుణానికీ ఏమిటే సంబంధం?”
“మనకు ఎలుకల బోను
లాంటి ఒక రూము. తిరిగి పడుకుంటే గోడ తగులుతుంది. పాత ఫ్యాను. దాని శబ్ధం ఘోరంగా
ఉంటుంది. దోమల బెడద. మురికి కాలవ వాసన. సగం రోజులు పవర్ కట్”
“దానికి?”
“మన దాంపత్యం
ఆనందంగా గడవలేదు. ఏదో పడుకున్నాం, లేచాము
అని యంత్రంలాగా అన్నీ జరిగినందువలన వాడిని కడుపుతో ఉన్నాను. అది కూడా ఏదో ఒకరోజు
జరిగే బుర్ర కథ! ”
“ఉమ్మడి కుటుంబం
అంటేనే అంతేనే!”
“కడుపులో బిడ్డను
మోస్తున్న కాలంలో మీ ఆదరణ, ప్రేమ దొరకలేదు. మీ
ఇంటి ఆడవాళ్ల టార్చర్. ఎప్పుడు చూడూ సంతలో లాగా గుంపు. గర్భిణీకి రెస్టు ఇద్దామనే
ఉద్దేశమే మీ ఇంట్లో వాళ్ళకు లేదు. నేనూ సంతోషంగా మోయలేదు. ఒక మంచి సంగీతం, రుచికరమైన భోజనం...ప్రేమగల భర్త, ఏదీ దొరకక, నాకు నొప్పులు వచ్చి వీడు పుట్టాడు. యంత్రం లాంటి పరిస్థితుల్లో మొలచి,
ఆర్ద్రత మనో పరిస్థితిలో మోసి, చేదుతో రోజులు
గడిపి, ఒక స్త్రీ నవ్వును మర్చిపోతే, పుట్టబోయే
బిడ్డ ఎలా నవ్వుతుంది. ఎలా ఉత్సాహంగా ఉంటుంది. మనోజ్ ఇలా ఉండటానికి కారణం ఇదే”
పద్మనాభం మౌనం వహించాడు.
“ఇలా చూడు! నువ్వు
చెప్పేదే నిజం అని పెట్టుకున్నా! దానికి ఇప్పుడేం చేయగలం? ”
“ఇదేం ప్రశ్న”
“వాడు
తానుగా ఏ నిర్ణయం తీసుకోడు. ఇంట్లో వాళ్ళెవరినీ ఎప్పుడూ నొప్పించ లేదు.
కోపగించుకోలేదు. చేతి నిండా సంపాదిస్తూ, ఆ
సంపాదన మొత్తం ఇంటికే ఇస్తున్నాడు. ఈ రోజు వాడి వలనే ఈ కుటుంబం సుభిక్షంగా ఉంది!
దీనికంటే ఏం కావాలే. పక్కింటి దేవకీ కొడుకు అమ్మ ఒడిలో పడుకుని
బ్రతిమిలాడుతున్నాడు. కానీ ఏ పనీ చేయకుండా ఊరంతా ఆంబోతులాగా తిరుగుతున్నాడు. వాడి
వల్ల ఆ ఇంటికి ఒక్క పైసాకూడా ప్రయోజనం లేదు. ఎదురింటి మాణిక్యం ఉత్త తాగుబోతు! ఈ
వీధిలో క్రమశిక్షణ గల పిల్లాడు మన మనోజ్ మాత్రమేనే. దానికి సంతోషించు”
“సమాధాన
పరుస్తున్నారా?”
“ఏమే
జీవితంలో ఉన్న కష్టాల కంటే, సుఖాలను
పెద్దవి చేసి మాట్లాడుతున్నావు. ఎప్పుడూ సంతోషంగా ఉండు. జీవితం కూడా సంతోషంగా
ఉంటుంది”
అలా చెప్పిన పద్మనాభం గారికే దెబ్బపై
దెబ్బ, శరీరంపైన మరియు మనసులోనూ పడింది.
Continued....PART-2
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి