వర్షంలో వెన్నెల...(సీరియల్) (PART-7)
“ఓ...నువ్వేనా
ఈ గుంపుకు
నాయకత్వం వహిస్తున్నావు?” అని
అడుగుతూ వస్తున్నాడు
శంకర్.
“గుంపా...ఏం
గుంపు?” అంటూ
చేతులు కట్టుకుంటూ
అడిగింది శైలజా.
“అది...చంద్రుడు, నక్షత్రాలు, మేఘాల
గుంపు, తరువాత
రాత్రి పూటా
సంచరించే దయ్యాలు--భూతాలు...” అని చెబుతూ
వెళుతుంటే, “ఓ...అప్పుడు
ఆ సంచరించే
గుంపులో నువూ
ఉన్నావా?” అని
అడ్డుపడింది శైలజా.
“ఛఛ!
పెద్ద దెబ్బ
తిన్నానే” అని అన్న
తరువాత...మాటలు
చదువు వైపు
మల్లింది. తాను
బయటదేశాలకు వెళ్ళి
చదువుకుని అక్కడే
ఉద్యోగం తెచ్చుకోవాలని
చెప్పాడు శంకర్.
“అంటే
నీ అందమైన
కుటుంబాన్ని వదిలేసి
వెళ్ళాలనే నిర్ణయంతో
ఉన్నావు...అంతే
కదా?” అని
అడిగింది.
“అదంతా
లేదు...కొన్ని
రోజులే! అది
సరే...నువ్వేం
చెయ్యబోతావు? పెళ్ళి
చేసుకుని ఇల్లాలు
అవబోతావా? ఊ...నువ్వు
ఇంత అందంగా
ఉండటంతో చాలామంది
నీ వెనుకే
తిరుగుతారే? నిజం
చెప్పు...” అని ఎగతాలిగా
అడిగాడు.
“అయ్యయ్యో!
ఈ ఆటకు
నేను రాను
బాబూ. నువ్వు
చెప్పేలాగా ఆడాలంటే, ఒక
బానిస కోతిగా
ఉండాలి. నేను
ఉండలేను. అవి...’జూ’ రోడ్డులో
చాలానే ఉంటాయి.
కావాలంటే వెళ్ళి
‘సెలెక్టు’ చేసి
వద్దామా?” అని
అడిగి నవ్వగా, శంకర్
కూడా కలిసి నవ్వాడు.
ఆ ప్రశాంతమైన
రాత్రి ఆ
నవ్వు సంగీతంలా
వినబడింది. అప్పుడు
పక్కవైపు నుండి
ఇంకొక తలుపు
తెరుచుకుని కిషోర్
బయటకు వచ్చాడు.
“ఏమిటి
శంకర్...ఇంకా
నిద్రపోలేదా? రేపు
కాలేజీ లేదూ?” అని
అడగ, ఇద్దరికీ
గుడ్ నైట్
చెప్పి మెట్లు
దిగి వెళ్లాడు
శంకర్.
అక్కడ్నుంచి పరిగెత్తాలని
తపించింది శైలజా
మనసు. కానీ, కాళ్ళు
జరగటానికి ఒప్పుకోవటం
లేదే! నిలబడున్న
చోట్లోనే శిలలాగా
నిలబడిపోయున్న
ఆమె దగ్గరకు
వచ్చాడు కిషోర్!
“నువ్వు
బెంగళూరులో పెరిగినా...దేని
గురించి -- ఎవరి
గురించీ బాధపడని
గుంపుతో కలిసి
పెరిగుండొచ్చు.
అందుకని ఇలా
మధ్య రాత్రి
మేడమీద నిలబడి
సుత్తివేసుకోవాలా? ఈ
కుటుంబానికి ఒక
గౌరవం ఉంది.
అది జ్ఞాపకం
పెట్టుకో...వెళ్ళు...వెళ్ళి
నిద్ర పోవటానికి
ప్రయత్నించు” అని తరిమాడు.
చురుక్కున కోపం
తలకెక్కింది శైలజాకి.
నేను ఏ
విధంగా ఈ
ఇంటి గౌరవం
పోయేటట్టు నడుచుకున్నాను? “నాగరీకం, గౌరవం
మాకూ ఉంది.
అనవసరంగా నా
విషయంలో తల
దూర్చకండి. అలాంటి
హక్కు మీకు
ఎవరూ ఇవ్వలేదు” అన్నది గట్టిగా.
“పొగరు...పొగరు.
ఆ కుటుంబంలో
పెరిగినదానివేగా? మంచి
చెబితే తలకెక్కదు.
ఎలాగైనా పో.
ఇక్కడున్నంత వరకు
మంచిగా నడుచుకో” అని చెప్పినతను
తన గదివైపు
నడవటానికి తిరిగాడు.
‘ఎంత
హీనంగా మాట్లాడుతున్నాడు? పొగరు
నాకా...అతనికా? లేదు...ఇతన్ని
ఇలాగే వదల
కూడదు’ అని
ఆలొచించిన ఆమె
“నేను
ఏ విధంగా
మీ గౌరవానికి
బంగం
కలిగేటట్టు నడుచుకున్నానో
చెప్పగలరా? తమ
మనసులో మురికి
ఉన్నవాళ్ళకు చూసేదంతా
మురికిగానే కనబడుతుందని
విని ఉన్నాను.
ఇప్పుడు తిన్నగా
చూస్తున్నాను” అని చెప్పి
నడవటం మొదలుపెట్టింది.
“ఏయ్...నిన్ను...” అంటూ ఆమె
చెయ్యి పుచ్చుకుని
కొట్టటానికి చెయ్యి
ఎత్తినవాడు -- చటుక్కున
స్పృహలోకి వచ్చిన
వాడిలాగా “ఛఛ!
నిన్ను పోయి
మంచిదానివనుకున్నానే?” అని
వేగంగా ఆమెను
విధిలించుకున్నాడు.
అతని దగ్గర
నుండి తనని
విడిపించుకోవటానికి
ప్రయత్నిస్తున్న
ఆమె, ఈ
ఎదురు చూడని
విధిలింపు వలన
బ్యాలన్స్ తప్పి
కింద పడబోయింది.
క్షణంలో విషయం
అర్ధం చేసుకున్న
అతను, ఆమెను
తన రెండు
చేతులతో పట్టుకున్నాడు.
ఆ మరుక్షణం
ఆమెను తనతో
చేర్చి కావలించుకున్నాడు.మొదట
ఆశ్చర్యంతో చూసిన
ఆమె -- అతని
కావలింత బిగియ
బిగియ తనను
మరచి, ఆలోచించటం
గుర్తురాక నిలబడిపోయింది.
తనని తాను
మరచి ఎంతసేపు
నిలబడిందో, ఆమె
నున్నటి బుగ్గల
మీద అతను
గట్టిగా ముద్దు
పెట్టుకున్నప్పుడు
ఆమె ఒళ్ళు
జలదరించ -- హృదయం
వేగంగా కొట్టుకోవటంతో
రెండవసారిగా మనసు
తుళ్ళింది. గబుక్కున
అతని దగ్గర
నుండి తప్పించుకుని
గదికి పరిగెత్తిన
ఆమె, తలుపుకు
గొళ్లెం పెట్టి
మంచం మీద
కూర్చుంది. వణుకు
తగ్గలేదు. అనవసరంగా, సంబంధమే
లేకుండా ఏడుపు
వచ్చింది.
‘ఎక్కడకొచ్చి
ఏం కార్యం
చేస్తున్నాను? ఏమైంది
నాకు? ఇన్ని
రోజులుగా కాపాడుకుంటూ
వచ్చిన నా
క్రమశిక్షణ ఒక్క
క్షణంలో గాలికి
ఎగరేసేనే? అతనికి
నేను మావయ్య
కూతురు అన్న
ఆలొచన వచ్చి
ఉండొచ్చు. నాకు
కదా బుర్ర
పనిచేయంది? రేపు
తెల్లారుతుందే...ఎలా
అతని మొహాన్ని
చూసేది? ఇప్పుడు
ఇక్కడ్నుంచి పారిపోదాం
అనుకున్నా అదీ
కుదరదు’ -- ఏమిటేమిటో
తలుచుకుని మనసు
కుంగిపోయింది. మొహం
కడుక్కుని వచ్చి
మంచం మీద
వాలిపోయిన ఆమె, ‘భగవంతుడా!
నన్నెందుకు ఇలా
పరీక్షిస్తున్నావు?’ అని
వాపోయింది.
భువనేశ్వరీ అమ్మగారు
ఆమెకు ఒక్కొక్క
వయసులోనూ క్రమశిక్షణ
యొక్క ముఖ్యత్వం
గురించి చెప్పి
పెంచారు. పెరిగిన
తరువాత ఎన్నో
పరీక్షలు ఎదురైనా, ఆవిడ
బోధనలు ఆమెను
కాపాడినై. పదోక్లాసు
ముగించి, కంప్యూటర్
క్లాసుకు వెళ్ళినప్పుడు, కొంతమంది
యువకులు ఆమెను
గొడవ చేశారు.
కొంతమంది ఆమెతో
స్నేహం చేయాలని
ప్రయత్నించారు.
వాళ్ళందరినీ ఒక
హద్దులో ఉంచింది.
ఆందులో ఆ
ప్రేమ్ కుమార్, ప్రేమించమని
ఆమెను వదలకుండా
ఒత్తిడి చేస్తూ
వచ్చాడు.
భువనేశ్వరీ అమ్మగారి
దగ్గర ఆ
విషయం గురించి
చెప్పినప్పుడు
“ఇదంతా
ఈ వయసులో
సహజమమ్మా! కానీ, నువ్వే
మనసును కట్టుబాటులో
ఉంచుకోవాలి. ఎందుకంటే, ఈ
ఆశ్రమంలోని పిల్లలలో
చాలామంది ఆశ
చూపించి మోసం
చేసిన మగవాళ్ళ
దగ్గర ఓడిపోయిన
ఆడవాళ్ళ పిల్లలుగానే
ఉంటారు. కన్నవారు
లేకుండా జీవించటం
ఎంత ఘోరమో
అనేది నీకే
తెలుసు. పట్టుదలగా
-- క్లియర్ మనసుతో
నడుచుకో” -- అని
సలహా ఇచ్చేది.
దాంతో పాటూ
ఆమెను సెల్ఫ్
- డిఫెన్స్ కోసం
ఆమెకు కరాతే
కూడా నేర్పించింది.
తరువాత మహిళా
కళాశాల అయినా
‘హాస్టల్లో’ ఉండి
బయటకు వెళ్ళేటప్పుడు
ట్రబుల్స్ ఉంటూనే
ఉండేవి. ప్రేమ్
కుమార్ ఆమెను
పెళ్ళి చేసుకోమని
ఒత్తిడి చేస్తూ
వచ్చాడు. కాలేజీ
దగ్గరే ఒక
‘ఇంటర్
నెట్ కఫే’ ఒపన్
చేసారు. తన
తల్లి-తండ్రుల
చేత ఆశ్రమ
వార్డన్ కు
ఫోను చేయించాడు.
ఆమెకు ఆ
ఆలొచనే లేదు
అని తెలుసుకున్న
వార్డన్, ‘తరువాత
చూద్దాం’ అని
చెప్పి పంపినట్ట
తరువాత తెలిసింది.
‘నిన్ను
ఒక మంచి
చోట అప్పగించాలని
నాకు ఆశ
అమ్మాయి! కానీ
ఇప్పుడు కొంతమంది
అయోగ్యులు, అనాధ
ఆడపిల్లలను ప్రేమ
చూపించి పెళ్ళి
చేసుకుని...తరువాత
ముంబై, కలకత్తా
మరియూ విదేశాలకు
తీసుకువెళ్ళి అమ్మేస్తున్నట్టు
వార్తలు వస్తున్నాయి.
అందువలనే తొందరపడకూడదు
అని అనుకుంటున్నా.
నువ్వు బాగా
చదువుకుని నీ
కాళ్ళపై నువ్వు
నిలబడితేనే సెల్ఫ్
బిలీఫ్ వస్తుంది.
అప్పుడు మంచి
జీవితం అమర్చుకోవాలనే
క్లారిటీ డెవెలప్ అవుతుంది.
అంతవరకు జాగ్రత్తగా
ఉండమ్మా. దేవుడు
నీకిచ్చిన అందం...ప్రమాదకరమైనది.
నువ్వే హెచ్చరికతో
ఉండాలీ’ -- అలా
ఆవిడ సలహాలు
ఇచ్చిన తరువాత
కూడా నేనెందుకు
ఇలా నడుచుకున్నాను? ఈ
రోజు నాకేమైంది?.
పెళ్ళి చేసుకుని
ఇలాంటి ఒక
మంచి కుటుంబంలో
జీవితం దొరకటం
ఆమె కొంచం
కూడా ఎదురు
చూడలేని విషయం.
‘మూగవాడు
ఒకడు, పెద్ద
గాయకుడై గొప్ప
పేరు తెచ్చుకోవాలని
అనుకుంటే జరిగే
విషయమా’. జరగదని
తెలిసిన ఒక
విషయం గురించి
ఇలా ఆశపడటం
మూర్ఖత్వం. మనో
వేదనే మిగులుతుంది.
మనసులో కన్
ఫ్యూజన్ తో
నిద్ర రాక
దొర్లిన ఆమె, ఏప్పుడో
నిద్రపోయింది.
శైలజా కిందకు
వచ్చినప్పుడు, టైము
ఎనిమిదయ్యింది.
కిషోర్ కంట్లో
పడకుండా ఉండాలని
వేడుకుంది. అందరూ
బయలుదేరే తొందరలో
ఉన్నారు. ప్రమీలా, భుజాలపై
సంచీతో వచ్చి
గుడ్ మార్నింగ్
చెప్పి “అక్కా...నాకు
ఈ రోజు
స్కూలుకు వెళ్ళటానికే
మనసు రావటం
లేదు. కానీ, ఏం
చేయను? ప్లీజ్...ఇంకా
ఒక్కరోజైనా మాతో
ఉండండి అక్కా” అని బ్రతిమిలాడింది.
ఏం చెప్పాలే
తెలియక చిన్నగా
నవ్వింది శైలజా.
పద్మ కూడా
అదే చెప్పటంతో
“అదేముంది? త్వరగానే
వినోధినీనూ, లక్ష్మీనూ
ఇక్కడికే రాబోతారు.
తరువాత అంతా
హ్యాపీయే కదా?” అని
వాళ్ళను సమాధానపరిచింది
ప్రభావతి.
వాళ్ళిద్దరూ సగం
మనసుతో వెళ్ళగా, శైలజాకు
కాఫీ ఇచ్చింది.
ఇంతలో శంకర్
వచ్చాడు. ప్రభావతి
వంటగదిలోకి వెళ్ళిన
సమయం చూసి
శైలజాతో “అన్నయ్య
తిట్టారా వినోధినీ? మొహమంతా
వాడిపోయి, ఏడ్చినట్లు
ఉంది. నావల్లే
కదా...సారీ
వినోధినీ” అని నొచ్చుకున్నాడు.
కిషోర్ గురించి
మాట్లాడిన వెంటనే
మొహం ఎరుపెక్కటం
గ్రహించిన ఆమె
అడ్జెస్టు చేసుకుని
తెచ్చుకున్న ఎగతాలి
చూపులతో, “హలో!
మనమేమన్నా ఆయనకు
ఎదురుగా కుట్ర
చేస్తున్నామా? ఆయన
ఎందుకు తిడతాడు?” -- అని
అడగ, మొహం
వికసించిన శంకర్...“ఈ
రొజే బయలుదేరాలా” అని తరువాతి
ప్రశ్నను అడిగాడు.
ఒక కుటుంబంతో
చాలా సంవత్సరాలు
కలిసి ఉన్నట్టు
అనిపించింది శైలజాకు.
వీళ్ళను ఇక
చూడబోయేది లేదు
అనే ఆలొచన
వచ్చిన తరువాత
మనసు నొప్పి
పుట్టింది. వెంటనే
‘కానీ, నాకు
ఏం హక్కుంది
వీళ్ళదగ్గర?’ అనే
మరో ఆలొచన
రాగా మనసు
కాస్త ప్రశాంతత
చెందింది. “ఆల్
ద బెస్ట్
శంకర్” అన్నది. గుమ్మం
వరకు
అతనితో వెళ్ళి
అతనికి బై
చెప్పి తిరిగినప్పుడు, “హలో, మేడమ్...గుడ్
మార్నింగ్” -- ఉత్సాహంగా
చెవి దగ్గర
గొంతు వినబడ
ఉలిక్కిపడి జరిగింది.
కిషోర్ మొహంలో
కొంటరి చూపు
చూసిన తరువాత, అవమానంతో
మనసు సిగ్గు
పడింది. వేగంగా
నడిచి ప్రభావతిని
చూడటానికి వెళ్ళింది.
పరిస్థితి తెలియని
ప్రభావతి, “రామ్మా...టిఫిన్
తిందాం” అంటూ కిషోర్
ఉన్న చోటుకే
తీసుకు వచ్చింది.
తలవంచుకునే తినడం
మొదలుపెట్టింది
శైలజా. ప్రభావతి
కూడా వాళ్ళతో
పాటూ కూర్చుంది.
“నాన్న
గారు పొద్దున్నే
హాస్పిటల్ కు
వెళ్ళిపోయారు. రేపే
‘డిస్
చార్జ్’ చేస్తున్నారటగా.
అంతవరకు వినోధినీ
ఉండలేదే” అని బాధపడుతూ
చెప్పింది.
“అవునమ్మా...ప్రస్తుతానికి
పెద్ద సమస్య
ఏమీ లేదు.
కొంచం జాగ్రత్తగా
ఉంటే, ఒక
నెల తరువాత
కూడా ఆపరేషన్
పెట్టుకోవచ్చని
డాక్టర్ చెప్పారు.
అంతలొ అత్తయ్యను
పిలుచుకు వచ్చేయాలి” అన్నాడు. అతని
చూపులు అప్పుడప్పుడు
ఎదురుగా ఉన్న
తన మీద
పడుతున్నట్టు గ్రహించింది
శైలజా. అతని
కళ్ళను కలుసుకోవటం
అవాయిడ్ చేసింది.
“లంచ్
తరువాతే కదా
వినోధినీ బయలుదేరబోతోంది?” అని
అడిగింది ప్రభావతి.
“అవునమ్మా.
ఇప్పుడు నేను
రిసార్టుకూ, మావయ్య
ఇంటికీ తీసుకువెళ్ళి
చూపించి...అలాగే
మావయ్యను చూసి
వచ్చేస్తాను. తిన్న
వెంటనే బయలుదేరటమే.
సరే కదా
వినోధినీ ?” అని
ఆమెను అడుగుతూ
అతను చూపులను
సున్నితంగా
ఆమె మీద
పెట్టాడు.
అతని చూపులు
ఆమెను ఏదో
చేసింది. ‘మళ్ళీ
అతనితో బయటకు
వెళ్ళటమా? అయ్యో...వద్దనే
వద్దు’
“సారీ!
ఈ రోజు
ఎక్కడికీ వెళ్ళొద్దు.
హాస్పిటల్ కు
కావాలంటే వెళ్దాం” అన్నది.
“వెళ్దాం!
కానీ మిగిలిన
రెండు చోట్లూ
నువ్వు చూడాల్సినవే!
అందువలన ఎలాంటి
వాదనా వద్దు.
ఓకేనా?” అని
కళ్ళు పెద్దవి
చేస్తూ అడగ, అతన్ని
కోపంగా చూసింది
శైలజా.
అతని చూపు
ఆమెను అయిస్కాంతాం లాగా
లాగింది. గబుక్కున
కళ్ళను తిప్పిన
ఆమెకు కోపం
వచ్చింది. నిన్న
అలా జరిగినందువలన, దాన్నే
మనసులో పెట్టుకుని
చూస్తున్నాడే!
“నేను
ఇక్కడే మీతో
మాట్లాడుతూ ఉంటాను
ఆంటీ!” అన్నది
ప్రభావతిని చూసి
బ్రతిమిలాడే ధోరణితో.
“కిషోర్
తో వెళ్ళి
ఒకసారి చూసిరామ్మా” అంటూ ప్రభావతి
కూడా ప్రేమతో
చెప్ప వేరేదారిలేక
అతనితో వెళ్ళింది.
కారు బయలుదేరిన
తరువాత, “నాతో
రావటం నీకు
భయంగా ఉందా
వినోధినీ?” అని
అడిగి ఆమెను
ఉక్కిరిబిక్కిరి
చేశాడు. ‘అవును...భయమే’ అన్నది
ఆమె మనసు.
“భయమంతా
లేదు. మీరేమన్నా
సింహమా...పులా? అక్కర్లేదు
అనుకున్నాను” అని బయటకు
చూస్తూ చెప్పింది.
వెనక్కి తిరిగి
ఆమెనొకసారి చూసి
“అక్కడ...సెలవు
రోజుల్లో బయటకు
వెళ్తావా? సినిమా, షాపింగ్
లాంటివాటికి?” అంటూ
మాట మార్చాడు.
“ఊ...ఎప్పుడైనా” అన్నది సంగ్రహముగా!
“నీకు
చాలా మంది
స్నేహితులు ఉన్నారా
వినోధినీ?” అంటూ
మరో ప్రశ్న
అడిగాడు. ఒళ్ళు
మండిది ఆమెకు.
‘ఇతను
నన్నెందుకు ఇంటర్
వ్యూ చేస్తున్నాడు?’
జవాబు చెప్పకుండా
బయటకే చూస్తోంది.
ఆమె వైపుకు
చూపులను తిప్పి
“నీకు
నా మీద
ఏమిటి కోపం? నాతో
ఉంటేనే అంటీ
అంటనట్టు ఉంటావు.
నేనూ శంకర్, పద్మ
లాగానే?” అని
అడిగినతనికి ఏం
జవాబు చెప్పాలి
అని ఆలొచించింది.
‘వాళ్ళూ, మీరూ
ఒకటి కాదే!’ అని
అతనితో చెప్పగలదా
ఏమిటి?
Continued...PART-8
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి