వర్షంలో వెన్నెల...(సీరియల్) (PART-9)
కలలో జరుగుతున్నట్లు
ఉన్న శైలజా,
కిషోర్ ఇంట్లో
మంచం మీద
కళ్ళు తుడుచుకుంటూ
కూర్చోనుంది. నిన్నటి
రోజున ఒక్కొక్క
పువ్వుగా వికసించిన
బంధుత్వాలు, ఈ
రోజు మధ్యాహ్నం
లోపల వాడిపోయి
ముగిసిపోయింది
అంటే కలే
కదా అది!
కొంత సేపటికి
ముందు కిషోర్
దగ్గర బ్రతిమిలాడుతూ
అతని వెనుకే
పరిగెత్తినది, అతనో
నిర్లక్ష్యంగా
‘ప్యాంటు
జేబులో’ చేతులు
పెట్టుకుని ఆగకుండా
నడుస్తూ ఉండటం
గుర్తుకు వచ్చింది.
మేడ మెట్లు
ఎక్కినతను -- మొదట
ఉన్న గదిలోకి
వెళ్ళి “ఈ
గది ఇకమీదట
నీ గది” అన్నాడు. వినోధినీ
యొక్క అందమైన
ఫోటోలు అక్కడక్కడ
నవ్వుతూ, ఆమె
ఉపయోగించిన బొమ్మలు
అందంగా సర్ది
పెట్టున్నాయి. ఏనుగు
దంతం రంగు
గోడ, మధ్యలో
అందమైన మంచంతో
ప్రకాశవంతంగా వెలుగుతున్న
ఆ గది
యొక్క అందాన్ని
ఎంజాయ్ చేయలేక
శైలజా మనసు
తపించింది.
“నేను
చెప్పేది దయచేసి
వినండి. మీరు
మాత్రం ఇంటికి
వెళ్ళి ఆంటీ...అమ్మను
చూడండి. నేనొస్తే
పెద్ద సమస్య
అయిపోతుంది” అంటూ మళ్ళీ
మళ్ళీ బ్రతిమిలాడింది.
“అలాగంతా
జరగదు వినోధినీ.
నేను నీతోనే
ఉంటాను కదా” అన్నాడు కొంత
విసుగుతో.
‘ఇంత
కంటే ఎలా
చెప్పేది?’ అని
అర్ధంకాక కొట్టుకుని
“ఫైనల్
గా చెబుతున్నా.
నేను మీతో
బెంగళూరు రాను” అన్నది ఖచ్చితంగా.
“అలాగైతే
కాళ్ళూ -- చేతులూ
కట్టేసి, కారులో
పడేసి తీసుకు
పోతాను” -- నవ్వాడు.
“భగవంతుడా!” అనుకుంటూ
రెండు చేతులతోనూ
మొహం మూసుకుని, అక్కడున్న
కుర్చీలో కూర్చుంది.
“హై...ఏమైంది?” అంటూ
అతను దగ్గరకు
రావటం చూసి
లేచి జరిగిన
ఆమె -- ఒక
నిర్ణయంతో, “ఒకే.ఒకే!
నేను నిజం
చెప్పేస్తాను. నేను...నేను
వినోధినీనే కాదు” అన్నది.
గబుక్కున ఆగినతను, ఒక్క
క్షణం కళ్ళు
చిట్లించి ఆమె
చెప్పేది నమ్మని
వాడిలాగా చూశాడు.
“అవును.
నేను వినోధినీ
కాదు. ఆమె
స్నేహితురాలు శైలజా.
ఆమె వలన
రావటం కుదరలేదు
కాబట్టి నన్ను
పంపింది. ఈ
విషయం వాళ్ళ
నాన్నకు తెలుసు.
మీ దగ్గర
ఈ విషయాన్ని
చెప్పవద్దని ఆయనే...ఆయనే
చెప్పారు. అందుకే...”
అతని మొహమంతా
ఎర్రబడి కోపంతో
కళ్ళు పెద్దవి
చేసి చూస్తున్న
అతన్ని భయంతో
చూసింది.
“అప్పుడు
నిన్న పొద్దుటి
నుంచి నా
దగ్గర వినోధినీ
లాగా నటించావు?” గట్టిగా
అరిచాడు.
‘అవును’ అని
తల ఊపుతూ
అదే భయంతో
అతన్ని చూసింది.
“అంటే
వ్యక్తి మార్పిడి
చేసి మొసం
చేశావు!” -- కళ్ళల్లో
కోపం ఉడికిపోతోంది.
“లేదు...అలాకాదు.
వినోధినీ యొక్క
నాన్న కోసం, ఆమె
చాలా ఒత్తిడి
చేసి చెప్పినందువలనే
వచ్చాను” అన్నది గబగబా.
“ఓ...ఎవరైనా
నటించమని చెబితే
నటిచ్చేస్తావా? అసహ్యంగా
లేదూ...? నువ్వు
కూలీకి నటించే
కోవకు చెందిన
దానివా?” -- మాటలు
నిప్పు కణాలలాగా
ఒలికినై.
“ఎంత
బాగా నటించి...ఛ!
తలుచుకుంటేనే ఛీదరగా
ఉంది. ఏదీ
పిలు...నీ
తెలివిగల స్నేహితురాలుని” -- ఉరిమాడు.
సెల్ ఫోను
తీసి వొణుకుతున్న
వెళ్ళతో వినోధినీ
కు ఫోన్
చేసింది. ‘హలో’ చెప్పేలోపే
ఆమె దగ్గర
నుండి ఫోను
లాక్కుని “హలో!
నీ స్నేహితురాలుని
జైలుకు పంపనా? లేదు...తోడుకు
నువ్వూ వెళ్తావా?” కోపంగా
అడిగాడు.
“..........................”
“నేను
ఎవరైతే నీకేంటి? నిన్ను...తిన్నగా
వచ్చి పట్టుకుంటాను” అని అతను
కోపంగా మాట్లాడ, అవతలివైపు
ఏదో చెప్పింది
వినోధినీ.
కొద్ది క్షణాలు
ఓర్పుగా విన్న
అతను “నేను
ఈ రోజు
సాయంత్రమే అక్కడికి
వస్తున్నా. నా
కంటే ముందే
నువ్వు బయలుదేరి
వెళ్ళి, నీ
ఇంట్లో ఉండు.
లేకపోతే ఏం
చేస్తానో నాకే
తెలియదు” అని చెప్పేసి
ఫోను ఆఫ్
చేసి ‘బయలుదేరు’ అని
ఆర్డర్ వేసి
వెళ్ళిపోయాడు.
ఇంటికి వచ్చి
చేరేంత వరకు
ఆమెనొక వస్తువుగా
కూడా చూడలేదు, పట్టించుకోలేదు.
చిట్లించుకున్న
మొహంతోనే కారును
నడిపిన అతను, కారు
నిలబడగానే డోర్
ను ఒక
తోపు తోసి
మూసి లోపలకు
వెళ్ళిపోయాడు. అది
ఆమెను కొట్టినట్టు
ఉన్నది. అతని
యొక్క విసుగు, కోపమూ
ఆమెను ఎక్కువగా
బాధ పెట్టింది.
మేడమీద గదిలోకి
వెళ్ళి కూర్చున్న
ఆమె తన
మనసులో ఏర్పడుతున్న
ఆందోళనను అనుచుకోలేకపోయింది!
బంధుత్వాల వలన
వచ్చే ఫీలింగ్స్, ఇంత
బాధ ఇస్తాయంటే...బంధుత్వాలే
అక్కర్లేదు అనిపించింది.
మందు రోజు
ఈ కుటుంబం
ఆమెతో ఎంత
సహజంగా, సరదాగా
గడిపింది! ఈ
రోజు ఏ
బంధమూ లేకుండా, అందరూ
ఆమెను మొసగత్తెలాగా
చూస్తున్నది తలుచుకుని
ఒక్క క్షణం
మనసు చివుక్కుమన్నది.
ఆంటీ, అంకుల్
విసుక్కోరు. అని
ఆమె మనసు
చిన్నగా ఆశపడింది.
కానీ పిల్లలు
విసుక్కుంటే సన్నిహితంగా
ఉండరు. కిషోర్
గురించి చెప్పనే
అక్కర్లేదు. ఆల్రెడీ
ఆమెను ఉపయోగం
లేని వస్తువులాగానే
కదా తీసుకు
వచ్చి చేర్చాడు?
మనసులోని నొప్పి
పెద్ద నిట్టూర్పుగా
బయటపడ్డప్పుడు
“శైలజా!” అన్న పిలుపుతో
ఉలిక్కిపడి లేచి
చూసింది.
లోపలకు వచ్చిన
ప్రభావతి చూపుల్లో
కోపమో, విసుగో
లేదు. అభిమానం
మాత్రమే ఉంది.
“బాధపడకు
అమ్మాయ్. నువ్వు
ఎవరినా సరే
నా తమ్ముడి
కోసం ఇంత
దూరం వచ్చావే!
ఖచ్చితంగా మనమధ్య
ఏదో ఒక
బంధం ఉంది” అంటూ శైలజా
చెయ్యి పుచ్చుకుని, ధైర్యం
చెబుతుంటే, శైలజా
కరిగిపోయింది.
కన్నీళ్ళను తుడుచుకుని
తన గురించి
పూర్తిగా చెప్పిన
శైలజా “వినోధినికి
రావాలనే ఆశ.
కానీ, వాళ్ళ
మావయ్య అప్పుడప్పుడు
వచ్చి చూసి
వెళ్తారు. ఆయన
ఇప్పుడు విదేశాలకు
వెళ్ళారు. అందుకని
వినోధినిని కనిపెట్టుకుని
ఉండటానికి బయట
ఒకడ్ని కాపలాకు
ఉంచారు. అందువలనే
అది భయపడి
రాలేదు” అని చెప్పి, “కానీ, దాంతో
నాకే మంచి
జరిగింది. బంధువులు, బంధుత్వాలతో
అలవాటు లేని నాకు ఇక్కడున్న ఈ రెండు రోజులూ
స్వర్గంలో గడిపినట్లు
ఉన్నది. ఈ
జ్ఞాపకాలే నాకు
చాలు” అంటూ మళ్ళీ
కన్నీరు పెట్టుకుంది.
“నిన్నే
మేము మొదటగా
వినోధినిగా చూశాము.
అందువలన వినోధిని, నువ్వూ
మాకు ఒకటే.
అందువలన వినోధినితో
పాటూ నువ్వు
కూడా వచ్చేయాలి” అంటూ ప్రేమగా
ఆర్డర్ వేసింది.
అది కూడా
శైలజాకు బాధగానే
ఉంది. “కానీ, మీ
అబ్బాయి నన్ను
క్షమించరు ఆంటీ.
ఒక రోజంతా
ఆయనతో ఉండి
నిజం చెప్పకపోవటం
నా తప్పే?” అని
బాధపడింది.
“ప్రేమ
చూపించటంలోనైనా
సరే, కోపించుకోవటంలోనైనా
సరే...అతన్ని
మించలేమమ్మా. కోపంగానే
ఉన్నాడు. పోను
పోను సరిపోతాడు” అని సమాధానపరిచింది.
కోపమైతే సరిపోతుంది.
కానీ, అతనిలో
ఇప్పుడు ఉన్నది
విరక్తి. ఆమెను
ఎంత గగుర్పాటుగా
చూశాడు. తలుచుకుంటేనే
వణుకు వచ్చింది
ఆమె.
“అమ్మా!
మూడు గంటలకు
విమానం. రెడీ
అవమనండి. నేను
మరో గంటలో
వచ్చేస్తాను” అని తల్లి
దగ్గర చెప్పేసి
వెళ్ళాడు కిషోర్.
దాని తరువాత
వినోధినిను బలవంతపెట్టి
భోజనం తినిపించింది
ప్రభావతి. చంద్రశేఖరం, ప్రభావతి
ఆమెను ఆశీర్వదించి
మళ్ళీ రావాలని
ప్రామిస్ చేయించుకుని
పంపించారు. ప్రమీలా, పద్మ, శంకర్ దగ్గర
తాను క్షమాపణలు
అడిగానని చెప్పి
సెలవు తీసుకుంది.
అతని దగ్గరగా
కారులో కూర్చునప్పుడు
మనసు ఖాలీగా
ఉంది. మొదటిసారి
ఎక్కినప్పుడు ఉక్కిరిబిక్కిరి
అవటం జ్ఞాపకం
వచ్చింది. డోరును
ఆనుకున్నట్టు కూర్చుంది.
‘వర్షం
అందమా...ఎండ
అందమా? బుజ్జగించేటప్పుడు
వర్షం అందం.
కర్ణా నువ్వు
కోపగించుకునేటప్పుడు
ఎండ అందం!’ పాట
వినిపించింది.
‘ఇతను
కోపగించుకుంటే
లోపల నిప్పులాగా
సెగగా ఉందే!’ అని
అరవాలన్నట్టు ఉన్నది
శైలజాకి. ‘మాట్లాడు...మాట్లాడు’ అన్న
అతను మాట్లాడితే
కొట్టేవాడిలాగా
కనిపిస్తున్నాడు.
మొదటి విమాన
ప్రయాణం. విమానంలో
అతని దగ్గరగా
ఉన్నప్పుడు, ఇదంతా
కలే అన్నట్టు
అనుకున్నది. విమాన
ఉద్యోగి వచ్చి
‘సీటు
బెల్టు’ వేసుకోమని
చెప్పిన తరువాత, కొంచం
కష్టపడింది. నిర్లక్ష్యంగా
ఆమె నడుంపై
‘సీటు
బెల్టు’ తగిలించిన
అతను, ఆమె
ముఖ కవలికలను
కొద్ది క్షణాలు
చూసేసి కళ్ళను
తిప్పుకున్నాడు.
అతని మొహాన
కఠినత్వం ఇంకా
కొంచం పెరిగున్నది.
ఆమెకో అతని
చేయి తగలినందువలన
గుండె కొట్టుకుంటున్న
వేగం పెరిగింది.
పని ముగిసిందని
కళ్ళు మూసుకుని
ఆనుకున్నాడు కిషోర్.
ఆమెకు మాత్రం
ఏం చేయాలో
అర్ధం కాలేదు.
ప్రయాణాన్ని ఎంజాయ్
చేసే మనో
పరిస్థితిలో ఆమె
లేదు. చెవ్వు
మూసుకు పోయింది.
బయటకు చూసింది.
మేఘాల మధ్యలో
దూరి దాగుడుమూతలు
ఆడేసి, బయటకు
వచ్చినప్పుడు చల్లటి మంచు
పొగలాంటి మేఘాలపైన
ఎగురుతున్నట్టు
అనిపించింది.
చుట్టూ ఏమీ
లేనట్టు ఖాలీ.
తరువాత ఎక్కడికీ
అనేది అర్ధం
కాక, యంత్రం
చూపించే దారిలో
ప్రయాణం. జీవితమూ
అలాగే వెళ్తున్నది.
ప్రమాదం జరగకుండా
వెళ్ళి చేరాలి
అనేది భగవంతుడి
చేతిలో కదా
ఉన్నాది? నీ
జీవితం దిక్కు
తెలియకుండా వెళుతోంది’ -- అర్ధం
కాని దుఃఖం
ఆమె మనసును
చుట్టుకుంది.
మళ్ళీ కారులో
ప్రయాణం చేస్తుంటే
టెక్నాలజీ మహిమ
ఆశ్చర్యంలో ముంచెత్తింది.
ఇరవై నిమిషాలకంటే
తక్కువ సమయ
విమాన ప్రయాణం.
బెంగళూరు నగరం
ఎప్పటిలాగానే నిర్మలంగా
చిక్కులాగా ఉన్నది.
దారిలో ఒక
పెద్ద హోటల్
ముందు కారు
ఆపాడు.
హైదరాబాద్ నుండి
ఇప్పటివరకు, ‘రా...పో...ఉండు’ అనేది
తప్ప అతను
ఇంకేదీ మాట్లాడలేదు
అనేది ఆమెకు
బాధ కలిగించింది.
ఇక మాట్లాడకుండా
ఉండలేము అని
అనుకున్న ఆమె
“ఇక్కడికి
ఎందుకు వచ్చాము?” అని
అడిగింది.
“నాకు
ఆకలిగా ఉంది.
నీకూ కావాలంటే
తిను. లేకపోతే
వేడుక చూడచ్చు.
దిగు” అంటూ దిగాడు.
ఆ స్టార్
హోటల్ చాలా
ఆడంబరంగా ఉన్నది.
చుట్టుపక్కల చేసున్న
అలంకారాన్ని ఎంజాయ్
చేస్తూ అతని
ఎదురుగా కూర్చుంది.
‘ఏవేవో
ఆర్డర్’ చేశాడు.
అంతా ‘టిఫినే’. రిలాక్స్
గా వెనక్కు
వాలి కూర్చున్న
అతను “అమ్మ
నీ గురించి
అన్ని విషయాలూ
చెప్పింది. నిన్ను
పెంచి పెద్ద
చేసిన చోట
నీకు నటించటం
కూడా నేర్పించారా
ఏమిటీ? అనుమానమే
రాలేదే! లేక
నటించటం ఎలా
అనేదానికి ఏదైనా
స్పేషల్ ట్రైయినింగా?” -- అన్నాడు.
అతని మాటల్లో
ఎగతాలి తెలిసింది.
“మీరు
నమ్మినా, నమ్మకపోయినా
పరవాలేదు. వినోధిని
మరీ బలవంతం
పెట్టింది కాబట్టే
వచ్చాను. అప్పుడుకూడా
వాళ్ళ నాన్న
దగ్గర, మీ
అందరి దగ్గర
నిజం చెప్పి
బయలుదేరతాను అని
చెప్పాను. ఆయనే...నువ్వు
చాలా కోపగించు
కుంటావని చెబుతూ
అడ్డుపడ్డారు. ఆయనే
చెప్పుకుంటానని
చెప్పారు. అందువలనే...” అని వివరించింది.
“అదంతా
సరే...కానీ, ఎలా
సహజంగా నటించ
గలిగావు?” అంటూ
పెద్దగా ఆశ్చర్యపడుతున్నట్టు
అడిగాడు.
రక రకాల
టిఫెన్లు రావటంతో, ఆమెకూ
ఒక ప్లేటు
పెట్టబడి వడ్డించబడింది.
కానీ, టిఫిను
ఆమె గొంతుకలోకి
దిగితేనే కదా!
ఆమె ఏం
చేస్తున్నది అనేది
కూడా గమనించకుండా, టిఫిన్
తిని ముగించినతను
“ఇప్పుడు
గుట్టు బయటపడింది
కదా! ఇంకా
ఎందుకు నటించటం? నటించేటప్పుడు
బాగా తిన్నావు!
ఇప్పుడు కుదరటం
లేదా? డిఫెరెంట్
మనిషివే నువ్వు” అంటూ గుండెల్లోకి
బాణాన్ని దించాడు.
‘ఇతనికి
నా మీద
ఉన్న కోపం
తగ్గదా? నేను
ఇక్కడికి వినోధిని
పేరుతో ఎందుకు
రావలసి వచ్చిందో
చెప్పాను కదా.
అయినా అర్ధం
చేసుకోడెందుకు. ఇంతక
ముందు లాగా
మాట్లాడడా?’--మనసు
పరితపించింది.
అదే ఆలొచనతో
నడుస్తున్న ఆమె, ఎదురుగా
వచ్చి, “హలో
శైలజా” అంటున్న ప్రేమ్
కుమార్ ను గమనించలేదు.
ఆమె భుజాన్ని
ముట్టుకుని “శైలజా!
ఇక్కడ...” అని చెప్పగా,ఉలిక్కిపడి
తల ఎత్తింది. ఆమె
మొహంలో కోపం, విసుగు, విరక్తి
కనబడింది. ‘ఎంత
ధైర్యం ఉంటే
భుజం ముట్టుకుని
పిలుస్తాడు?’
ఆమె జవాబు
చెప్పే లోపల, ముందుగా
వెళుతున్న కిషోర్
వెనక్కి తిరిగి
ఇద్దర్నీ ప్రశ్నార్ధంకంగా
చూశాడు.
“ఆశ్చర్యంగా
ఉంది! నువ్వు
ఇక్కడకు వచ్చావేమిటి? ఓ...ఈయనతో
వచ్చావా? సార్...నేను
ప్రేమ్ కుమార్!
ఈమెను మూడు
సంవత్సరాలుగా లవ్
చేస్తున్నాను. డిగ్రీ
పూర్తి చేసి
పెళ్ళి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాము” అన్నాడు
ప్రేమ్ కుమార్.
శైలజాకి మెదడు
మొద్దుబారిపోయినట్టు
అనిపించింది. కిషోర్
ను చూసింది.
ఎటువంటి ఎమోషనూ
లేకుండా కొత్త
మనిషిని చూసి
“హలో” అన్న అతను, “వెళ్దామా?” అంటూ
ఆమె దగ్గర
కూడా అడిగాడు.
“మీరు
ఎవరనేది తెలియలేదే
సార్?” అని
ఇంకితం తెలియక
అడిగాడు ఆ
మూర్ఖుడు.
“నేను శైలజాకి
‘గార్డియన్’”. సంసయమే
లేకుండా జవాబు
వచ్చిన వెంటనే... “ఓ.కే...!
బై. మిమ్మల్ని
తరువాత కలుస్తాను” అని చెప్పి
ఆమెను పిలుచుకుని
వెళ్ళాడు కిషోర్.
కారు ప్రయాణంలో
అతను ఏమీ
అడగనందున ఆమే
తానుగా, “నేను
కంప్యూటర్ క్లాసు
చదువుతున్నప్పుడు, నాతో
పాటు చదువుకున్నాడు.
అప్పట్నుంచే నన్ను
ట్రబుల్ చేసేవాడు.
ఆ తరువాత
పెద్దవాళ్ళను పిలుచుకు
వచ్చి మా
ఆశ్రమం వార్డన్
దగ్గర మాట్లాడాడు.
అమెకూ నచ్చలేదు
కాబట్టి డిగ్రీ
ముగించాలి అని
చెప్పి పంపింది.
ఆ తరువాత, కాలేజీకి
పక్కనే ఒక
ఇంటర్నెట్ సెంటర్
ప్రారంభించారు.
సెలవు రోజుల్లో
బయటకు వెళ్ళేటప్పుడు
వచ్చి మాట్లాడతాడు.
అతన్ని ఎలా
విడిపించుకోవాలో, నా
వెనుక పడకుండా
ఎలా తరమాలో తెలియటం
లేదు. ఇష్టం
లేదని చెబితే
వేరే విధంగా
అల్లరి చేస్తాడు
అని చెప్పి
వార్డన్ ఓర్పుగా
ఉండమంది.
ఇప్పుడు కొంచం
కూడా బుద్దే
లేకుండా ఎలా
మాట్లాడుతున్నాడో
మీరే చూశారుగా?” అంటూ
విసుగును కక్కింది.
ఏదైనా సమాధానం
చెబుతాడేమో నని
తపనతో ఎదురుచూసింది.
ఆమెను నిర్లక్ష్యంగా
చూసిన కిషోర్, “స్త్రీల
కొసమే ఎన్నో
స్వీయ రక్షణ
కళలు అందుబాటులో
ఉన్నాయి కదా!
అందులో ఒకటి
నేర్చుకోనుండచ్చు
కదా! అంతెందుకు
ఈవ్ టీజింగ్
అని చెబితే, పోలీసులు
తీసుకుపోయి కీళ్ళు
విరుస్తారు. ఇంతదాకా
వదిలిపెట్టిసి, ఇప్పుడు
ఏడిస్తే ఏమీ
ప్రయోజనం లేదు.
నువ్వు ఆరితేరిన
నటివే కదా!
ఎలాగైనా అతన్ని
మాయ చేసి
తరిమేసుండచ్చే?” అంటూ
మళ్ళీ పాత
చోటుకు వచ్చి
నిలబడ్డాడు. ‘ఇతనితో
చెప్పటమే తప్పు’ అని
అనుకున్నది శైలజా.
“లేదు.
వాడు చాలా
డబ్బుగలవాడు. తప్పుకుని
వెడితేనే మంచిది” అన్నది, తన
పరిస్థితిని అతనికి
తెలియజేయాలనుకునే
వేగంతో.
“ఓ!
అలాగంటే నీ
మత్తులో పడిన
వాళ్ళ లిస్టులో
ఎందుకైనా ఉండనీ
అనుకుని అతన్ని
ఉంచుకున్నావా?” అని
అడిగాడు కొంచం
కూడా కనికరం
అనేది లేకుండా.
“ఛీ!
మీరు మనిషే
కాదు. మీ
దగ్గర వివరణ
ఇవ్వటమే తప్పు.
మీలాగానే నన్నూ
అనుకోకూడదు. ఆ
నలినీని పనిలోకి
చేర్చుకుని తయ్యతక్క
లాడుతున్న వారే
కదా మీరు? నా
గురించి మాట్లాడే
అర్హత మీకు
లేదు” -- అని
ఆయసపడుతూ చెప్పింది.
వినోధిని యొక్క
ఇల్లు -- నగరం
దాటి ఉండటం
వలన ఒక
గంటకు పైనే
పట్టింది. అప్పుడప్పుడు
శైలజా వినోధినితో
వెళుతుంది. వినోధిని
తల్లి,
ప్రేమ చూపించకపోయినా...
శైలజాను డిఫెరెంటుగా
చూసేది కాదు.
వినోధిని యొక్క
ఒత్తిడివలనే వినోధినితో
పాటూ వాళ్ళింటికి
వెళ్ళేది. ఈ
రోజు ఎలా
రియాక్ట్ అవుతారో
అన్న భయం
ఇప్పుడు ఆమెను
చుట్టుకుంది.
ఆమె దగ్గర
దారి అడిగి
-- ఇంటి దగ్గరకు
వెళ్ళగానే, “నీ
స్నేహితురాలి దగ్గర
మనం వచ్చేమనేది
తెలియపరచు” అని ఆర్డర్
వేశాడు కిషోర్.
ఇంటి యొక్క
పెద్ద గేటు
తెరవబడి, దగ్గరే
నిలబడింది వినోధినీ.
కారులో నుండి
ఇద్దరూ దిగిన
వెంటనే శైలజా
చేతులు పుచ్చుకుని, “రండి
-- అమ్మతో నేనేమీ
చెప్పలేదు. మీరు
ఊంటే ధైర్యంగా
చెప్పవచ్చు అనుకుని
ఆగాను. లోపలకు
రండి. అమ్మ
ఉన్నది.” అని పిలుచుకు
వెళ్ళింది.
హాలులో ఉన్న
లక్ష్మీ తిరిగి
చూసి -- శైలజాను
గుర్తించి నవ్వుతూ
లేచి, కిషోర్
ను ప్రశ్నార్ధకంగా
చూసింది. “రా
శైలజా, రా
తమ్ముడూ...?” అంటూ
వినోధినీను కూడా
చూసింది.
“నేను
కిషోర్. హైదాబాద్
నుండి వస్తున్నా
అత్తయ్యా” అంటూ తనని
పరిచయం చేసుకుంటూ
కూర్చిలో కూర్చున్నాడు.
అర్ధం చేసుకున్నట్టు
ఆమె మొహంలో
పలు భావాలు.
జరిగిన విషయాలను
కిషోర్ బ్రీఫ్
గా చెప్పగా, లక్ష్మీ
మొహమో కోపంతో
ఎర్రబడింది. వినోధినీను
కోపంగా చూసింది.
వినోధినీ నేమో
క్షమించమన్న భావనతో
తల వంచుకుని
కూర్చోగా, కిషోర్
యొక్క గొంతు
మాత్రమే వినబడింది.
“వ్యక్తులు
నేరస్తులుగా మారటం
లేదు...మార్చబడుతున్నారు
అనేది ఎక్కడో
చదివున్నాను. మీరూ, మావయ్యా
చేరి ఈ
రోజు ఈ
నేరస్తులను తయారు
చేశారు. వ్యక్తి
మార్పిడి ఎంత
పెద్ద నేరమో
మీకు తెలిసుంటుంది” అన్నాడు.
గొంతును సరిచేసుకుని
మాట్లాడటం మొదలుపెట్టింది
లక్ష్మీ.
“నాకు
తెలియకుండా వినోధినీను
కిడ్నాప్ చేసి
అక్కడికి తీసుకు
వెళ్ళాలని ప్రయత్నించారు.
అది మొదటి
తప్పు. ఆ
తరువాత వినోధినీ
అనే పేరుతో
ఎవరో వస్తే, వచ్చింది
వినోధినినేనా, కాదా
అనేది కూడా
తెలుసుకోకుండా, వచ్చింది
వినోధినినే నని
మూర్ఖత్వంగా నమ్మి
అనుమతించింది రెండో
తప్పు. దానికీ, మాకూ
సంబంధం లేదు...అది
సరే ఇక్కడకొచ్చి
పిల్లలను నేను
నేరస్తులుగా మార్చానని
వాగుతున్నావే, ఇదే
మాట అక్కడ
ఆయన్ని అడిగావా...అడిగుండవు, అడగలేవు” అన్నది ఎమోషన్స్
నిండిన స్వరంతో.
కొంచం ఎదురు
దెబ్బ తగిలినా, దానిని
ఎవరికీ కనిపించనివ్వకుండా
నిర్లక్ష్యంగా
నవ్వాడు
కిషోర్. “మేము
చేసిన తప్పుకు
శిక్ష ఉండదు.
కారణం వినోధినీ
వయసులో మేజర్.
కానీ, ఈ
అమ్మాయి చేసిన
మనిషి మార్పిడి
విషయాన్ని పోలీసులకు
ఫిర్యాదు చేస్తే
కనీసం మీరు
ముగ్గురూ పోలీస్
స్టేషన్ వరకు
వెళ్ళాల్సి వచ్చే
శిక్ష అయినా
దొరుకుతుంది...తెలుసుకోండి
అత్తయ్యా. తన
తండ్రిని చూసే
హక్కు వినోధినీకి
ఉన్నది” అన్నాడు నొక్కి
చెబుతూ.
“హత్యా
నేరం చేసినవాడిని
కూడా సంధార్భానుసారం
మన్నించి విడిచిపెట్టవచ్చు.
నమ్మిన వాళ్ళను
అనుమానించి మొసం
చేసిన ఆయన
నీడకూడా నా
కూతురు మీద
పడటం నాకు
ఇష్టం లేదు.
నన్ను బెదిరించి
ఒప్పుకునేటట్టు
చెయ్యాలనే ఆలొచన
ఉంటే అది
జరగదు బాబూ.
చనిపోయిన దాన్ని
ప్రాణాలతో తీసుకురావటం
మన సైన్స్
ప్రతిభలో కూడా
ఇంకా సాధ్యం
కాలేదు అనేది
నీకు తెలుసు
కదా” అన్నది
ఖచ్చితంగా.
వినోధినీ, శైలజానూ
కలత పడుతున్న
మొహంతో ఒకర్ని
ఒకరు చూసుకున్నారు.
“అలాగైతే
మావయ్య కట్టిన
తాలి, ఆయన
గుర్తుగా ఇవ్వబడ్డ
బహుమతి వినోధినీ
ను ఎందుకు
మీతో ఉంచుకున్నారు? తప్పు
చేసింది మావయ్యే
కదా? వినోధినీకి
ఎందుకు శిక్ష
వేశారు? ఆమెకు
న్యాచురల్ గా
దొరకవలసిన తండ్రి
ప్రేమను, ఆమెకు
దొరకకుండా చేసిన
మిమ్మల్ని శిక్షించేది
ఎవరు? మీ
స్వార్ధం వలన
ఆమె పడిన
మనో వేదనకు
ఏం సమాధానం
చెప్పబోతారు? ఇందాక
చెప్పేరే హత్యా
నేరం చేసినవాడిని
కూడా సంధార్భానుసారం
మన్నించి విడిచిపెట్టవచ్చు
అని. ఆ
పని మీరెందుకు
చేయలేదు. తన
తప్పు తెలుసుకుని
ఎన్నిసార్లు తనని
మన్నించమని మా
మావయ్య మిమ్మల్ని
బ్రతిమిలాడుంటారు.
మీకొక నీతి, ఆయనకొక
నీతా?"
- కోపము, విరక్తి, విసుగు
కలిసిన స్వరంతో
అతను చెప్పగా...షాక్
తో వినోధినీను
చూసింది లక్ష్మీ.
అది కిషోర్
ను ఉత్సాహపరచటంతో...మాటలు
కొనసాగించాడు. “మీరు
మావయ్య ను శిక్షించాలని
అనుకోనున్నా, ఆయనతో
పాటూ ఒకే
ఇంట్లో ఉండి
మీ విరక్తిని, చూపి
ఆయనకు పాఠం
నేర్పించి ఉండాలి.
అది వదిలేసి
ఇలా ముగ్గురి
జీవితాలనూ వేస్టు
చేసుండక్కర్లేదు.
కొంచం ఓర్పుగా
ఆలొచించి చూస్తే, ఆయనకు
మీ మీదున్న
విపరీతమైన ప్రేమే
మావయ్యను తప్పుగా
మాట్లాడించిందని
అర్ధమవుతోంది.
దానికి ఇంతవరకు
వేసిన శిక్ష
చాలు. ఆయన
ఇంకా ఎక్కువ
రోజులు బ్రతకరు.
మీ క్షమింపు
కొసమే ప్రాణాలను
అరచేతిలో పెట్టుకుని
బ్రతుకుతున్నారు.
చాలు...అత్తయ్యా!
ఇకమీదట అయినా
వినోధినీ మీ
ఇద్దరి ప్రేమనూ
ఒకటిగా అనుభవించనివ్వండి.
కాదూ, కూడదూ
అంటే ఆ
పాపం మిమ్మల్ని
మరో జన్మలో
కూడా తరుముతుంది” అంటూ లేచినతను, “నేను
బయలుదేరతాను. రేపు
పొద్దుటి దాకా
ఆలొచించండి. మీ
మనసులో కొంచమైనా
జాలి, దయ, తడి, మానవత్వం
ఉంటే...నాతో
రేపు బయలుదేరండి” అని చెప్పి
బయటకు వచ్చాశాడు.
అతని వెనుకే
వినోధినీ వెళ్ల, శైలజా
కూడా ఆమెతో
వెళ్ళవలసి వచ్చింది.
అతను కారు
దగ్గరకు చేరుకున్నప్పుడు
“ఒక్క
నిమిషం బావా...” అని
వినోధినీ పిలవటంతో, ఆగాడు.
“మమ్మల్ని
క్షమించండి. నాన్న
కొసమే ఇలా
చెయ్యాల్సి వచ్చింది” అన్నది బ్రతిమిలాడే
ధోరణితో!
అతను తన
సెల్ ఫోన్
నెంబర్ను చెప్పాడు.
“రేపు
పొద్దుటి వరకే
అవకాశం. ఆ
తరువాత పోలీసు
స్టేషన్లో కలుసుకోవలసి
వస్తుంది అని
ఇద్దరూ అత్తయ్యకు
ఎత్తి చూపండి” అంటూ కారులోకి
ఎక్కి తిరిగి
చూడకుండా వెళ్ళిపోయాడు
కిషోర్.
‘ఈ
రోజు వరకూ
తనతోనే ఉండే
శరీర భాగం
ఒకటి తెగి
పడిపోతే ఇంత
నొప్పి పుడుతుందా?’ -- అన్న
ఆలొచన వచ్చి
శైలజాను ఆశ్చర్యపరచింది.
స్థంభించి నిలబడ్డ
ఆమెను వినోధినీ
పిలుపు ఊపింది.
“ఏయ్!
ఎన్నిసార్లు పిలవాలమ్మా? ఎందుకు
అక్కడే నిలబడ్డావు? లోపలకు
వెళ్దాం...రా” అని కేక
వేసి చెప్పింది.
నిదానంగా లోపలకు
వెళ్ళిన శైలజా
షాకుతో కళ్ళు
మూసుకుని కూర్చోనున్న
వినోధినీ తల్లి
లక్ష్మీను మామూలు
లోకంలోకి తీసుకు
వచ్చింది. అప్పటికప్పుడు, వెనువెంటనే
చేయవలసిన పని
ఆమెను ఒప్పించి
హైదరాబాదుకు పంపించటం.
ఆ తరువాత
తన సమస్య
గురించి ఆలోచించవచ్చు.
అని నిర్ణయం
తీసుకున్నట్టు
వినోధినీతో పాటూ
వెళ్ళి లక్ష్మీ
కాళ్ళ దగ్గర
కూర్చున్నారు.
“అమ్మా!
సారీమ్మా...నాన్న
చాలా సీరియస్
కండిషన్లో ఉన్నారని
చెప్పారు. అప్పుడు
కూడా వెళ్ళకపోతే
ఆ నేర
భావన నన్ను ప్రశాంతంగా
ఉండనివ్వదనే ఇలా
చేశాను. రియల్లీ...సారీమ్మా” అని కన్నీరు
కార్చింది.
కళ్ళు తెరిచిన
లక్ష్మీ...కూతుర్నీ, శైలజానీ
దగ్గరకు తీసుకుని, హత్తుకుని
లేచింది.
Continued...PART-10
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి