వర్షంలో వెన్నెల...(సీరియల్) (PART-6)
మధ్యాహ్నం చూసిన
దానికంటే కొంచం
తేటగానే ఉన్నారు
మోహన్ కుమార్. కిషోర్
తన తల్లిని, శైలజానీ, హాస్పిటల్
కు రమ్మని
పిలిచినప్పుడు...నేనూ
వస్తానంటూ చెప్పి
బయలుదేరింది పద్మ.
వాళ్ళను చూసి
నవ్విన మోహన్
కుమార్, “అమ్మాయిని
కుటుంబంలో ఒకత్తిగా
చేసినట్లున్నారే!” అని అడిగారు.
“ఏమిట్రా
తమ్ముడూ...అలా
మాట్లాడుతున్నావు? ఆమె
ఎప్పుడూ మన
కుటుంబంలోని ఒకతే
కదా! చాలా
బాగా పెంచిందిరా
లక్ష్మీ. ఎలాగూ
అది కూడా
వచ్చేస్తుంది” అని ఓదార్పుగా
చెప్పింది ప్రభావతి.
“ఏమ్మా
అత్తయ్య ఫ్యామిలీ
నచ్చిందా?” అని
శైలజాను చూసి
అడిగారు.
“బాగా
నచ్చింది. ఇంత
అభిమానమున్న, యధార్ధమైన
కుటుంబాన్ని నేను
చూసిందే లేదు” అంటూ నవ్వింది
శైలజా.
“మావయ్యా, ఈ
సారి మీ
పుట్టినరోజును
మనందరం కలిసి
జరుపుకోవాలి. ఇప్పుడు
వినోధినీ పిలిచిన
వెంటనే వస్తుంది
కదా...” అన్నది పద్మ.
“వద్దమ్మా.
మనం ఎప్పుడూ
లాగానే ఇంట్లోనే
సెలెబ్రేట్ చేద్దాం” అంటున్న మోహన్
కుమార్ గారి
మాటలకు కిషోర్
అడ్డుపడి, “అత్తయ్యను
పిలుచుకు రావటమే
నాకూ, వినోధినీకి
ఉన్న ముఖ్యమైన
తరువాతి ప్రోగ్రాం.
మీరు ఆరొగ్యాన్ని
బాగా చూసుకుంటే
చాలు” అని చెప్పి, శైలజావైపుకు
తిరిగి ప్రశ్నార్ధకంగా
చూశాడు. అతన్ని
చూడనట్టు పక్కకు
తిరిగింది ఆమె.
వీళ్ళిద్దరి నాటకాన్నీ
చూసిన మోహన్
కుమార్ మొహంలో
నవ్వు వికసించింది.
“సరి...సరి...బయలుదేరదాం.
ఎల్లుండి మావయ్యను
‘డిస్చార్జ్’ చేస్తామని
చెప్పారు. ఆయన
బాగా రెస్టు
తీసుకుని, లక్ష్మీ
అత్తయ్య వచ్చేలోపు ఆయన
బాగా కోలుకోవాలి” అని అందరినీ
కదిపేడు కిషోర్.
‘అలాగైతే
ఆయనతో ఇక్కడ
ఉండేది ఎవరు?’ అనే
ప్రశ్న తలెత్తింది
శైలజాకి. “నేను
కావాలంటే రాత్రికి
ఇక్కడే ఉంటా...” తడబడుతూ చెప్పింది.
“ఓ
నీకు ఈ
విషయం తెలియదా? తన
వల్ల ఎవరూ
కష్టపడకూడదట. మేనేజర్ను
మాత్రమే రాత్రి
పూట తనతో
ఉండటానికి అనుమతిస్తారు
మావయ్య. మేనేజర్
పెళ్ళికాని వ్యక్తి.
మావయ్యతోనే ఉంటూ
అలవాటుపడ్డారు.
అందువలన ఆయన్ని
మాత్రమే తనతో
ఉంచుకుంటారు. ఆయన
యొక్క కఠినమైన
రూల్స్ లో
ఇదీ ఒకటి” అని వివరించాడు
కిషోర్.
“బయలుదేరుతున్నాం
తమ్ముడూ. ప్రశాంతంగా
రెస్టు తీసుకో.
ఇప్పుడు నీ
మొహం ఎంతో
తేటగా ఉంది” అన్నది ప్రభావతి.
“అవును...ఏమిటో
జీవితం మీద
ఒక నమ్మకం
వచ్చినట్టు ఉంది
కిషోర్! తరువాత
ఒక
విషయం. రేపు
వినోధినీ బెంగళూరు
తిరిగి వెళ్ళేటట్టు
ఏర్పాటు చెయ్యి.
పాపం...నాకోసం
పరిగెత్తుకు వచ్చింది.
సమస్యలో చిక్కుకో
కూడదు” అన్నారు బ్రతిమిలాడే
విధంగా.
“ఓకే
మావయ్యా. టికెట్టు
బుక్ చేయటానికి
నేను ఏర్పాటు
చేస్తాను” అని చెప్ప, అందరూ
ఆయన దగ్గర
వీడ్కోలు తీసుకున్నారు.
ఆందరూ బయటకు
వచ్చినప్పుడు శైలజా, “ఇదిగో
వస్తున్నా” అని చెప్పి, మళ్ళీ
మోహన్ కుమార్ దగ్గరకు
వెళ్ళింది. ఆయన
దగ్గరగా కూర్చున్న
ఆమె “సారీ
అంకుల్...నేనొచ్చి
మీ నమ్మకాన్ని
పాడు చేసాను? మీరేమో
ఆనందంగా ఉన్నట్టు
నటిస్తున్నారు?” అని
కళ్ళ నీళ్ళు
పెట్టుకుంది.
“లేదమ్మా!
నిన్ను పంపించటం
ద్వారానే నా
కూతురికి నా
మీద ప్రేమ, అక్కర
ఉన్నదని అర్ధం
చేసుకున్నాను. ఎలాగూ
నన్ను చూడటానికి
త్వరలోనే వస్తుంది.
అప్పుడు నువ్వు
కూడా దాంతో
రావాలమ్మా. ఎప్పుడూ
నువ్వు నన్ను
మీ నాన్నగా
అనుకుని నన్ను
చూడటానికి వచ్చావో, నువ్వూ
నా కూతురివేనమ్మా” అన్న ఆయన
కళ్ళల్లో నుండి
కూడా నీరు
కారింది. చేతులెత్తి
ఆయనకు నమస్కరిస్తూ
బయటకు వచ్చింది.
మనసులో భారం
వచ్చి ఒత్తిడి
చేస్తునట్టు ఉన్నది.
ఇంటికి తిరిగి
వచ్చిన తరువాత
అందరినీ భొజనానికి
పిలిచింది ప్రభావతి.
అంతే! దానికోసమే
కాచుకున్న వారిలాగా
పరిగెత్తుకు వచ్చారు
శంకర్, ప్రమీలా.
“మావయ్య
ఎలా ఉన్నారమ్మా? ఎప్పుడు
డిస్చార్జ్ చేస్తారు?” అంటూ
అక్కరతో విచారించాడు
శంకర్.
“ఇప్పుడు
ఆయన మొహం
క్లియర్ గా
ఉందిరా. అంతా
మన వినోధినీ
వలనే. భగవంతుడా!
వాళ్ళ ముగ్గురినీ
ఒకటిగా చేర్చేయి” అని వేడుకుంటూ
ముగించింది ప్రభావతి.
“అమ్మా...నాకొక
డౌట్! భగవంతుడా
అని పిలిచి
ఏదైనా కోరుకుంటే
ఇచ్చేలాగా ఆయన
ఇక్కడే తిరుగుతుంటారా? అలాగైతే
అన్ని చోట్లా
ఆయన ఎలా
ఉండగలడు” అని అడిగింది
ప్రమీలా.
“అయ్యో...దేవుడి
గురించి ఏమీ
మాట్లాడకు ప్రమీలా.
అమ్మకు కోపం
వస్తుంది.అవన్నీ
వదులు. వినోధినీ
దగ్గర మనం
మాట్లాడవలసింది
చాలా ఉందే” అన్నాడు శంకర్.
“బాగుందిరా...ఇద్దరూ
మాట్లాడి, దేవుడి
గురించి మాట్లాడేంత
పెద్ద మనుషులం
కాదు మనం.
నమ్మకం పెట్టాలి...అంతే.
తరువాత ‘అయ్యయ్యో’ అని
చెప్పకూడదని ఎన్నిసార్లు
చెప్పాను?” అని
కొంచం కోపంగా
ఖండించిది ప్రభావతి.
“ఓకే.ఓకే!
సరేనమ్మా...ఇకమీదట
మాట్లాడను” అన్న శంకర్, “నువ్వు
చెప్పు వినోధినీ...సినిమాలు
ఎక్కువగా చూస్తావా? ఏ
హీరో అంటే
ఎక్కువ ఇష్టం? హిందీ
సినిమాలు చూస్తుంటావా? లేక
తెలుగు సినిమాలేనా? క్రికెట్టులో
ఎవరు నచ్చుతారు?” అంటూ
ప్రశ్నల వర్షం
కురిపిస్తుంటే
“హలో
సార్! ఇన్ని
ప్రశ్నలకు ఎలా
జవాబు చెప్పేది? ఒక్కొక్క
ప్రశ్నగా అడిగితేనే
కదా కాస్త
గాలి పీల్చుకోగలను?” అంటూ
గేలి చేసింది
శైలజా. హాస్పిటల్
నుండి వచ్చిన
తరువాత మనసులో
కాస్తో కూస్తో
ఉన్న బిడియం
కనబడకుండా పోయినట్లు
అనిపించింది.
“వావ్...సూపర్
అక్కా” అన్నది ప్రమీలా.
“ఏయ్
ప్రమీలా! ఎందుకలా
అరుస్తావు? రాత్రిపూట
అక్కడక్కడ తిరుగుతున్న
దయ్యం - భూతాలు
అన్నీ, తమ
బంధువులేవరో పిలుస్తున్నారే
అనుకుని పరిగెత్తుకు
వచ్చేస్తాయి. భయంగా
ఉంది!”
హెచ్చరిస్తున్నట్టు
రహస్య స్వరంతో
చెప్పింది పద్మ.
సెల్ ఫోనులో
మాట్లాడేసి అప్పుడు
అక్కడకు వచ్చిన
కిషోర్, “అయితే
వినోధినీను కూడా
మీ గ్రూపులో
చేర్చేశారా?” అని
అడిగి శైలజాను
చూడ నవ్వుల
అలలు విస్తరించాయి.
అతని చూపులను
తప్పించుకోవటానికి
తల తిప్పుకుంది.
“అన్నయ్యా, వినోధినీను
పోయి దయ్యం--భూతాల
గుంపులో చేరుస్తున్నారే? ఇంకొక
అడుగు
పైకెళ్ళి మోహినీ
దయ్యం అని
కావాలంటే చెప్పచ్చు” అన్నాడు శంకర్
నవ్వుతూ.
శైలజా వెంటనే
“ఆంటీ!
వచ్చి నన్ను
కాపాడండి. ఇక్కడొక
భయంకరమైన చోట
నన్ను ఒంటరిగా
వదిలేసి వెళ్ళిపోయారే!” అని భయపడుతున్నట్టు
కళ్ళు పెద్దవి
చేసి నవ్వింది..
ఒక విధంగా
నవ్వులు తగ్గిన
తరువాత ప్రమీలా, “వినోధినీక్కా!
మీ నవ్వు
కూడా అందంగా
ఉంది” అన్నది.
“అవును...అవును...మోహినీ
దయ్యం నవ్వినా
కూడా చాలా
బాగుంటుంది” అన్నాడు శంకర్.
“మాకు
తెలియదయ్య. నువ్వే
వాటితో స్నేహం
పెట్టుకున్నావు
లాగుంది” అన్నది వదలకుండా
శైలజా.
“చాలు...చాలు.
ఏం మాటలు
అవి? రాత్రిపూట
ఇలా మాట్లాడితే, నిద్రలో
భయంకరమైన కలలు
వచ్చి భయపడతారు.
ఇంకేదైనా మాట్లాడుకోండి” అంటూ డిన్నర్
వడ్డించింది ప్రభావతి.
మధ్యాహ్నం లంచ్
లాగా కాకుండా, డిన్నర్
లైటుగా ఉన్నది.
చపాతీ- కూర్మా, ఇడ్లీ-పచ్చడి.
రుచి చాలా
బాగుంది.
నవ్వుతూ తింటున్న
కిషోర్, “ఇలా
ఒకరికొకరు పోట్లాడుకుంటే
వినోధినీ ఇప్పుడే
ఊరికి వెళ్ళిపోతానని
పట్టుబడుతుంది.
తరువాత ఈ
రాత్రికే కారులో
తీసుకు వెళ్ళి
దింపాల్సిందే! నాకే
కష్టం” అని శోకంగా
చెప్పాడు.
దానికి కూడా
శంకర్ మౌనంగా
ఉండకుండా “ఇంతవరకు
వినోధినీకు అలా
అనిపించలేదు అనుకుంటా
అన్నయ్యా. మీరు
మొదలుపెట్టేసేరే...ఇక
అంతే. చూడండి...మొహమే
ఎంత సీరియస్
గా మారిపోయిందో!” అని చెప్ప, అందరూ
వినోధినీను చూశారు.
“నిజంగానా
వినోధినీ? వీళ్ళందరి
కంటే ఎక్కువ
టార్చర్ పెట్టే
వాడినా నేను? ఈ
రోజు పూర్తిగా
నాతో ఉన్నావే!
కానీ, ఖచ్చితంగా
పోటీలో నిన్ను
మించలేను అనుకుంటున్నా...” అంటూ ఆమెను
కెలికాడు. కళ్ళల్లో
అల్లరి కనబడింది.
“ఇంతకాలం
మీతోనే ఉంటున్న
శంకర్ చెబితే
నమ్మే కదా
తీరాలి” అని అమాయకంగా
మొహం పెట్టుకుని
చెప్పింది. అందరూ
గొల్లుమని నవ్వారు.
నవ్విన ప్రభావతి
కూడా “చాలా
ఆనందంగా ఉందమ్మా...నువ్విలా
అందరితో కలిసిపోయి, కుతూహలంగా
మాట్లాడటం చూస్తుంటే, ఎక్కడ
మా అందరినీ
ద్వేషించుకోనుంటావో
అని అనుకున్న
నా ఆలోచనను
తునాతునకలు చేసింది” అని చెప్పటంతో
అందరూ మౌనం
వహించారు.
ఆ మౌనాన్ని
సహించలేని ప్రమీలా
“ఇప్పుడు
నేనడిగే ప్రశ్నకు
కరెక్టుగా సమాధానం
చెప్పాలి. ఏ
నెలలో ఇరవై
ఎనిమిది రోజులు
ఉంటుంది?” అని
అడిగింది.
“ఇది
తెలియదా? ఫిబ్రవరీ!” అని హడావిడిగా
చెప్పాడు శంకర్.
“లేదు...లేదు!
అన్ని
నెలలలోనూ ఇరవై
ఎనిమిది రోజులు
ఉంటుంది” అని శైలజా
చెప్పగా, సిగ్గుతో
“అవును
కదా?” అన్నాడు.
“ఏయ్...బాగా
మోసపోయావా? వినోధినీ
అక్క మాత్రమే
నా అంత
తెలివిగలది” అంటూ
కాలర్ పైకెత్త
“అవునవును...అదే
నేనూ చెప్పాను” అని కిషోర్
చెప్పగా, “అవును!
మీ చెల్లెలు
మీలాగానే కదా
ఉంటుంది” అని వదలకుండా
శైలజా గేలి
చెయ్య, అందరూ
పెద్దగా నవ్వారు.
ఆ శబ్ధంతో
చంద్రశేఖరం గది
నుండి బయటకు
వచ్చారు.
“ఏమిటీ
ఒకటే ఆర్భాటం? వార్తలు
కూడా వినలేకపోయాను.
కానీ, ఆ
వార్తల శోకం
వినటం కంటే, ఇక్కడైనా
చేరిపోదామని వచ్చాశాను” అన్న ఆయన, ఒక
కుర్చీలో కూర్చున్నారు.
ఆయనకు డిన్నర్
వడ్డించింది ప్రభావతి.
‘అబ్బబ్బా...జీవితంలో
ఇంత సంతోషంగా
ఉన్నామా?’ అనే
ఆలొచన శైలజాకు
వచ్చింది. తనూ, వినోధినీ
ఏన్నో అల్లరి
పనులు చేసే
ఆనందించేవారు. మిగిలిన
వారిని కూడా
సంతోషంగా ఉంచుకుంటారు.
కానీ, ఈ
రోజు సంతోషం
తేడాగా ఉన్నది.
చంద్రశేఖరం వాళ్ళతో
కలిసి డిన్నర్
చేయటం మొదలుపెట్ట, ఆమె
చదువు, బెంగళూరు
గురించి మాటలు
ఆ దిక్కుగా
తిరిగినై. మళ్ళీ
మనసు నత్తగుల్ల
లోపల అట్టలాగా
ముడుచుకుంది. ‘ఏదైనా
వాగేస్తే?’ అనే
భయంతో హెచ్చరికతో
సమాధానం చెప్పింది.
“ఇప్పుడెందుకు
వాళ్ళ ఇంటి
గురించి అడిగారు
నాన్న? చూడండి... వినోధినీ ఎంత
సీరియస్ గా
మారిందో?” అని
పద్మ గొణిగింది.
“అలాగంతా
ఏం లేదే!” అంటూ మామూలుగా
మాట్లాడ ప్రయత్నించి
ఓడిపోయింది శైలజా.
ప్రభావతీనే ఆమెకు
చేయూత నిచ్చింది.
“చాలు...బూర్ర
కథ కచేరీ.
వెళ్ళి పడుకునే
ప్రయత్నం
చూడండి. ఈ
రోజు ఎక్కువగానే
నవ్వాము. ఇంతకు
పైన కుతూహలం
మంచిది కాదు” అని చెప్ప, ఒక్కొక్కరుగా
లేచి చేతులు
కడుక్కున్నారు.
“నేను
ఈ రోజు
వినోధినీ అక్కతోనే
నిద్రపోతాను” అన్నది ప్రమీలా.
వెంటనే అడ్డుపడింది
పద్మ “అదంతా
అక్కర్లేదు. అనవసరమైన
మాటలతో బోరు
కొట్టిస్తావు! నేనే
వినోధినీతో పడుకుంటాను”
“వద్దు
వినోధినీ. నేను
చెప్పేది విను.
ఒంటరిగా పడుకున్నా
కూడా సమస్యలేదు.
ఇది కథలు
చెప్పి చెప్పి
నిన్ను పిచ్చిదాన్ని
చేస్తుంది” అని హెచ్చరించాడు
శంకర్.
అప్పుడు ప్రభావతీ
కలుగజేసుకుని “వినోధినీకి
తోడుగా నేనే
ఉంటాను...సరేనా?” అని
అడిగింది.
“పరవాలేదు
ఆంటీ. నేను
ఒంటరిగానే పడుకుంటాను”
అందరూ ఆమెకు
గుడ్ నైట్
చెప్ప, ప్రభావతీనూ, పద్మానూ
ఆమెను గదికి
తీసుకు వెళ్ళారు.
ప్రభావతీ ఆమె
దగ్గరకు వచ్చీ, “నువ్వూ,
నాకు ఒక
కూతురివే కదమ్మా.
నీకేదైనా కావాలంటే
ప్రమీలా, పద్మా
పక్క రూములోనే
ఉంటారు” అన్న ఆమె,
ఆమె చెంపలను
తడిమి...“బాగా
నిద్రపోమ్మా” అని చెప్పగా
పద్మా కూడా
నవ్వుతూ గుడ్
నైట్ చెప్పి
వెళ్ళింది.
తలుపుకు గొళ్ళెం
పెట్టుకుని మంచం
మీద కూర్చున్న
శైలజాకు మనసంతా
ఒక విధమైన
పరవశంతో ఉన్నది.
‘కుటుంబం
అంటే ఇలాగే
ఉంటుందో?’ ఈ
కుటుంబమే తనకు
సొంతమైనట్లు ఆనందంతో
తడిసిన ఆమె,
సెల్ ఫోన్
తీసి వినోధినీకి
ఫోను చేసింది.
వినోధినీ ఫోన్
ఆన్ చేసిన
వెంటనే, “బయలుదేరావా? పొద్దున
ఎన్నింటికి వస్తావు?” అని
అడగ, ఒక్క
క్షణం తడబడి...“ఇదిగో
చూడు వినోధినీ!
తెలిసో తెలియకో
మనం ఒక
నాటకం ప్రారంభించాము.
దాన్ని కరెక్టుగా
ముగించాలి. అందువల్ల
నేను ఈ
రోజు ఇక్కడ్నుంచి
బయలుదేరలేకపోయాను.
కానీ, మన
నాటకం మీ
నాన్నకు తెలిసిపోయింది” అన్న వెంటనే
కంగారుపడింది వినోధినీ.
“ఎలా? ఆయన
ఏం చెప్పారు? అయ్యో...పాడుచేశామా?” అని
ఆందోళన చెంద, “అమ్మా
తల్లీ...నేనేమీ
పాడుచేయలేదు. ఆయన
ఇదివరకే నిన్ను
చూసున్నారట. నన్ను
చూసిన వెంటనే
చాలా సంతోష
పడ్డారు తెలుసా? నన్ను
నువ్వు పంపించినందు
వలనే నీకు
ఆయనపై ప్రేమ
ఉన్నట్టు, ఖచ్చితంగా
త్వరలోనే నువ్వు
వచ్చి ఆయన్ని
చూస్తావని చెప్పారు.
ఆయన గురించి
నువ్వు తెలుసుకోవాలసింది
చాలా ఉంది
వినోధినీ.
ఆయన ‘దయ
నిలయం’ అని
ఒక ఆశ్రమం
నడుపుతున్నారు.
అనాధ పిల్లలకు, ఎవరూ
చూడని వృద్దులకు
ఆయన ఇచ్చే
ఆస్రయం చూసావంటే...ఆయన్ని
వదిలి నువ్వే
రావు! అంతా
నిన్ను కలుసుకున్నప్పుడు
చెబుతా. రేపు
ఎలాగూ వచ్చేస్తాను.
ఒకటే ప్రేమ
వర్షం. నేను
నిజంగానే నువ్వు
అయ్యుండాలని ఆశగా
ఉంది తెలుసా?” అని
అభిలాషతో చెపింది.
“అరెరె...పొద్దునేమో
పులి, సింహం
అని చెప్పావే!
ఇప్పుడు పూర్తిగా
మారిపోయావు. నాకు
వాళ్ళందరినీ చూడాలని
ఉంది” అన్నది వినోధినీ.
“చూడచ్చు.
నువ్వు ఇక్కడకు
వచ్చే తీరాలి” అని నొక్కి
చెప్పింది.
వినోధినీ మౌనంగా
ఉండటంతో “ఓ. కే.
వినోధినీ...రేపు
ఖచ్చితంగా బయలుదేరతాను.
గుడ్ నైట్” అని చెప్పి
ఫోను పెట్టేసింది
శైలజా. నిద్రపోవాలని
పరుపు మీద
వాలింది. కానీ
నిద్రపట్టలేదు.
మనసు ఆ
రోజు సంఘటనలను
గుర్తుకు తీసుకు
వచ్చింది. ఒకే
రోజు ఎన్ని
సంఘటనలు. అందులో
వినోధినీ తండ్రి
తనని గుర్తు
పట్టింది, ఆయన
ఇల్లు...ఇవన్నీ
నమ్మలేకపోయినట్లు
ఉన్నది. ఇలాంటి
ఒకే ఒక
కుటుంబంతో కలిసి
ఉండటానికి ఛాన్స్
ఇచ్చినందుకు వినోధినీకి
కృతజ్ఞతలు తెలపాలి
అని అనుకున్నది.
తరువాత కిషోర్
తో వెళ్ళింది
గుర్తుకు రాగా...దాంతో
పాటూ, అతని
మీద వాలిపోయి
ఏడవటం -- అతను
దగ్గరకు చేర్చుకుని
ఓదార్పు మాటలు
చెప్పటం సినిమాలాగా
మనసు యొక్క
కళ్ళ ముందు రన్
అయ్యింది. ఛ!
కొంచం కూడా
సిగ్గూ -- బిడయం
లేకుండా...ఆమె
తన మామయ్య
కూతురు కాదు
అనే నిజం
తెలిసినప్పుడు, ఎంత
విసుగుతో చూస్తాడు
అనేది తలుచుకుంటేనే
భయంగా ఉన్నది.
శ్వాశ అడ్డుపడుతున్నట్టు
అనిపించింది...లేచి
‘బాల్కనీ’ తలుపు
తీసింది.
పౌర్ణమి రాత్రి
చంద్రుడు ఆమెను
‘రా’ అని
పిలుస్తున్నట్టు
అనిపించ, ఎవరూ
లేరని గ్రహించి
మెల్లగా ముందుకు
వెళ్ళింది. చల్లటి
గాలి మొహాన
పడటంతో ఒళ్ళు
జలదరించింది.
తనని మరచి
నిలబడున్నప్పుడు
ఆ గొంతు
వినబడింది.
Continued...PART-7
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి