13, ఏప్రిల్ 2023, గురువారం

ఆలయం…(నవల)


                                                                                               ఆలయం                                                                                                                                                                                     (నవల)

ఆఫీసుల్లో/ఫ్యాక్టరీలలో పెత్తనం చేసేవారు ఖచ్చితంగా ఆ ఆఫీసును/ఫ్యాక్టరీను పెట్టుబడి పెట్టి నిర్మించిన యజమానిగా ఉండడు. ఎందుకంటే యజమానే అన్నిటినీ చూసుకోవటం కష్టం. అందువలన మేనజర్లు అనో, పి.ఆర్.ఓ. లనో, హెచ్.ఆర్ లనో ఎదో ఒక పేరుతో ఒక ఆఫీసర్ ను నియమించి, వారికి అధికారం అప్పగించి, వారే మొత్తం అని, వారు చెప్పిందే వేదం అనుకుని, వారు ఏం చెబితే దానికి సపోర్ట్ చేస్తారు.

చాలా మంది అధికారులు తమ ఉద్యోగంపైన శ్రద్ద చూపటం మానేసి, తమ అధికారాన్ని, తమ కింద పనిచేస్తున్న ఉద్యోగులపై చూపుటంలోనే శ్రద్ద చూపుతారు.

యజమానులు ఇలా చేయటం వలనే ఎంతో మంది మేధావులైన, మంచి సిన్సియర్ ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయటం, వేరే కంపనీలకు వెళ్ళటం జరుగుతున్నది. ఎంతోమంది ఉద్యోగస్తులు ఒత్తిడికి లోనై ఆనారొగ్యాల పాలవుతున్నారు.

ఆలయం అనే ఈ నవలలో ఉద్యోగం చేసే చోటు ఒక ఆలయం, యజమానే దైవం అనుకుంటూ తన ఉద్యోగాన్ని నిజాయితిగా చేసుకుంటూ వెడుతూ ఉంటాడు ప్రసాద్. ఆ సిన్సియర్ ఉద్యోగికి ఒక అధికారి అపకారం తలపెడతాడు.

 మేనేజ్మెంట్ కూడా అధికారి మాటలే వింటుంది. ప్రశాద్ ను పనిలోనుండి తీసేయాలని నిర్ణయించుకుని, మొదటిగా అతన్ని సస్పెండ్ చేస్తారు.

ఏ నేరమూ చేయని ప్రశాద్ పైన అధికారి మోపిన ఫిర్యాదు ఏమిటి? ఎందువలన నిజాయతీగా ఉన్న ఉద్యోగిని అడ్డుతొలగించాలనుకున్నారు? వాళ్ళ కోరిక నెరవేరిందాఅధికారి మోపిన నేరాన్ని ప్రశాద్ ఎలా ఎదుర్కొన్నాడు?

అలాంటి ఆ ఉద్యోగికి ఏం జరిగిందిఅనేదే ఈ నవలలోని సారాంశం.

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

విజయవాడ నగరములోని ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయం భక్తులుతో కిట కిట లాడుతోంది. రోజు అమ్మవారి దర్శనం కోసం కనకదుర్గ గుడికి వెళ్ళాడు ప్రసాద్. వెంకట్ ప్రసాద్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టారు. అది ఎందుకో తెలియదు గానీ రెండు మాటలున్న పేర్లు గలవారిని చాలామంది రెండు మాటలతో పిలవరు. సురేష్ కుమార్ ను సురేష్, రామ మూర్తిని రామూ, క్రిష్ణ కుమార్ ను క్రిష్ణా అని పేరును కుదించి పిలవటమే అందరి నాలుకలకు అలవాటైపోయింది. కారణం కొసమే వెంకట్ ప్రసాద్, ప్రసాద్ అయిపోయింది.

 

మనం కూడా ప్రసాద్ అనే పిలుద్దాం...!

 

ప్రసాద్ ఒక కనకదుర్గ భక్తుడు. కనకదుర్గ గుడికి వెళ్ళే ముందు క్రిష్ణా నదిలో స్నానం చేసి వెళ్ళేటం అలవాటు. ఒక్కోసారి స్నానం చేసిన తరువాత అక్కడ మెట్ల మీద కూర్చుని ఊహల్లోకి వెళ్ళిపోతాడు.

 

అతను అలా ఊహల్లోకి వెళ్ళటానికి ముఖ్య కారణం అతనొక రచయత. అందులోనూ బాగా పేరుపొందిన రచయత. అతనికని విజయవాడ నగరంలో ఒక చిరునామా ఉన్నది. దాంతో పాటు అతను ఒక ఫ్యాక్టరీలో సీనియర్ ఉద్యోగస్తుడు.

 

అతనికని మూలాధార శక్తులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ఇంద్రకీలాద్రి పైన కొలువున్న కనకదుర్గ అమ్మవారు, రెండు అతను పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమాని శంకరయ్య! కనకదుర్గ అమ్మవారిని అందరికీ తెలిసుంటుంది. శంకరయ్య నే అందరికీ పరిచయం చేయాల్సి ఉంది.

 

శంకరయ్య, ప్రసాద్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ యొక్క యజమాని!

 

యజమాని అని పిలిస్తే సామాన్యంగా ఉంది కదా? అందంగా 'చైర్మన్అని చెప్పటంలోనే ప్రసాద్ కూ ఇష్టం. ఆయన వలనే అతను రచయతగా అవగలిగాడు. గుడిలో అమ్మవారి ముందుచైర్మన్కోసం కూడా ప్రార్ధన చేసుకుంటాడు ప్రసాద్. శంకరయ్య గారు ఒక 'మల్టీ మిల్లియనర్’ . ఎటు చూసినా ఆయనకు ఫ్యాక్టరీలున్నాయి. ప్రపంచం మొత్తాన్ని చుట్టి చుట్టి వస్తారు. వంశ పారంపర్యంగా ఆస్తిపరుడు. కానీ, ఎక్కువమంది డబ్బుగలవారిలో అతుక్కోనుండే ఎటువంటి అహంభావమూ లేని అద్భుత ఆత్మ.

 

ప్రపంచంలో అన్ని రంగాలలోనూ అద్భుతమైన మనుష్యులు ఉంటారు. అందులో ఒకరిగా శంకరయ్య గారిని చెప్పొచ్చు. ప్రసాద్ కు ఆయన ఒక అతిపెద్ద ఉదాహరణ మనిషి కూడా! అందుకనే నేమో ప్రసాద్ తన కొడుక్కి ఆయన పేరు పెట్టుకున్నాడు.

 

ఒక వేడుక ఏమిటంటే...కొడుక్కి ఆయన పేరు పెట్టి, 'రేయ్ శంకరయ్య ' అని ప్రేమతో పిలవటానికి ఇష్టపడడు. తన కొడుకును 'చైర్మన్అనే పిలుస్తాడు.

 

ప్రసాద్ భార్య మాలతి...మంచి హౌస్ వైఫ్. ఆమె కూడా భర్తతో కలిసి తన కొడుకును 'చైర్మన్అనో, ‘ఎం.డిఅనో పిలవటం ఒక వెడుక గా మొదలయ్యి, తరువాత అలవాటుగా మరిపోయింది.


ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:


ఆలయం…(నవల) @ కథా కాలక్షేపం-2 


***************************************************************************************************

                                                                                                                                                                                                                                                           

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి