23, ఏప్రిల్ 2023, ఆదివారం

ఓడినవాడి తీర్పు (సీరియల్)...(PART-2)


                                                                                  ఓడినవాడి తీర్పు (సీరియల్)                                                                                                                                                                  (PART-2) 

సంవత్సరం

స్నానం చేసేసి నడుముకు తడి తుండు చుట్టుకుని, బట్టలున్న బకెట్టుతో వరాండాలో నడిచి తన ఏడో నెంబర్ రూముకు వచ్చాడు వెంకట్.

సోపు బాక్సులో పెట్టున్న తాళం చెవిని తీసుకుని తాళాన్ని తెరిచి లోపలకు వెళ్ళాడు. తడి బట్టలను విదిలించి, తీగమీద ఆరేసి, గోడకు తగిలించిన అద్దం ముందు నిలబడి తల దువ్వుకుని, పౌడర్ అద్దుకుని, ఇంతకు ముందు ఉతికి, ఇస్త్రీ చేసిపెట్టుకున్న డ్రస్సు వేసుకుని, బెల్టు పెట్టుకుని, చెప్పులు వేసుకున్నాడు.

అలమరాలో ఉన్న ఆర్.ఆర్.కంపెనీ యొక్క ఉద్యోగ అపాయింట్ మెంట్ ఆర్డర్ కవర్ను తీసి మడత పెట్టి, ‘జేబులోపెట్టుకున్నాడు. అప్పుడు మ్యాన్షన్ లో పనిచేస్తున్న కుర్రాడు వచ్చి తలుపు తట్టి, “సార్, మీకు ఫోను అన్నాడు.

గదికి తాళం వేసి మెట్లలో వేగంగా దిగివచ్చి టెలిఫోన్ ఎత్తాడు.

హలో వెంకట్ మాట్లాడుతున్నా

మల్లికా మాట్లాడుతున్నా. కంగ్రాట్స్

బయలుదేరే ముందు నేనే నీకు ఫోను చేయాలనుకున్నా మల్లికా

మీ నాన్న దగ్గర చెప్పి ఉద్యోగం నాకు దొరికేటట్టు చేసింది నువ్వే కదా? మొదటి సారిగా ఉద్యోగానికి వెళ్తునప్పుడు పిలిచి థ్యాంక్స్ చెప్పద్దా?”

చాలా రోజుల తరువాత ఇప్పుడే నువ్వు పాత ఉత్సాహంతో మాట్లాడుతున్నావు. వినడానికే ఆనందంగా ఉంది. మధ్యలో ఎక్కువగా మనసు విరిగిపోయి మౌనంగా ఉండేవాడివి

దానికి కారణం ఏమిటో నీకు తెలుసు కదా మల్లికా

తెలుసు! అదిప్పుడెందుకు? ఇప్పుడెందుకు దాని గురించి గుర్తుకు తెచ్చుకోవటం... 

సరి ఫోను పెట్టేయనా?”

ఉండండి, మీరుగా అడుగుతారేమో అనుకుంటే, ‘పెట్టేయనా?’ అని కత్తిరించటానికి ప్రయత్నిస్తున్నారే...సరే, పరవాలేదు. అడగకుండానే ఇస్తాను

ఫోనులో ఆమె ముద్దుల శబ్ధం విని, అతను నవ్వుకున్నాడు.

రిసీవర్ పెట్టేసి, అక్కడున్న న్యూస్ పేపర్లను వేగంగా చూసేసి, పక్కనున్న షెడ్డులో నిలబెట్టున్న స్కూటర్ను బయటకు తీసినప్పుడు అతని మనసు బరువెక్కింది.

అది అన్నయ్య కల్యాన్ నడిపిన స్కూటర్.

బండి స్టార్ట్ చేసి బయలుదేరేడు వెంకట్.

పోయిన సంవత్సరం

వాటర్ బెడ్ మీద నిదానంగా కదులుతున్నాడు. రెండు చేతులను రిలాక్స్ గా పెట్టుకుని పడుకోనున్న ఆనంద్, నిక్కర్ మాత్రమే వేసుకోనున్నాడు.

ఇంటర్ కామ్మోగినప్పుడు, శరీరాన్ని తిప్పి--చెయ్యి జాపి రిసీవర్ తీసి, “ఏమిటి బాబాయ్, మీరింకా ఆఫీసుకు వెళ్ళలేదా?” అన్న ఆనంద్ కు చెవి చివర్లలో జుట్టు. ముఖ ద్వారంలో నుండి మొదలైన మీసాలు రెండుగా విడిపోయి పై పెదవికి అనకట్ట కట్టింది. చెస్ట్ పైన ఉన్న రోమాలు రింగులు రింగులుగా ఉన్నాయి. మెడలో ఆరు మడతలలో ఒక మడతలో ఇరుక్కుని కనబడుతున్నది పదికాసుల బంగారు గొలుసు, పసిపిల్లాడిలాగా ఒళ్ళంతా పౌడర్.

రోజు నువ్వు కూడా ఆఫీసుకు వస్తానని చెప్పావుగా ఆనంద్. అందుకే కాచుకోనున్నాను

మొదట అలాగే అనుకున్నాను. సడన్ గా ఫోను వచ్చింది. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన మనిషికోసం కాచుకోనున్నాను

సరే...నేను బయలుదేరుతాను. రేపు వస్తావా? కొన్ని ముఖ్యమైన ఫైల్సును నువ్వు చూడాల్సి ఉంది

అన్నీ మీరు చూస్తే చాలు బాబాయ్. మీరు చూపిన చోట సంతకం పెడతా

ఫోను పెట్టేశాడు బాబాయ్.

రెండు కాళ్ళనూ జాపి, చక్రాలు అమర్చిన టీపాని తన పక్కకు లాగాడు ఆనంద్. టీపా మీదున్న విస్కీ బాటిల్ తీసుకుని ఒక పెగ్గుపోసుకుని తాగి, సిగిరెట్టు వెలిగించినప్పుడు,

సార్...లోపలకు రావచ్చా?”

వచ్చినామె తన కాళ్ళతో తలుపు మూసేసి ఫైల్సును సోఫాలో విసిరేసి, అతనున్న అవతారం చూసి, ఒక చిన్న కులుకుతో పాటూ తన రెండు చేతులతోనూ తన మొహాన్ని మూసుకుని ఛీఛీ! ఇంత అవసరమా?” అన్నది.

రెండు చేతులనూ జాపి జంప్అన్నాడు ఆనంద్.

అతనిపై గెంతింది. సిగిరెట్టు పొగని ఆమె చెవిలోకి ఊది, ఆమె జుట్టును సవరిస్తూ,

విస్కీ తాగుతావా?”

“........................”

రెండు పెగ్గులే

తాగింది.

ఆమె వేసుకున్న దుస్తులలో, మిగిలిపోయిన వాటిని ఊడతీయటానికి వాటికి ఉన్న బొత్తాలను వెతికాడు.

టెలిఫోన్ మోగింది. విసుక్కున్నాడు ఆనంద్.

హలో డాడ్! నేను సుధీర్ మాట్లాడుతున్నా

విసుగును తగ్గించుకుని, “సుధీర్ కన్నా, ఎలా ఉన్నావు?”

బాగున్నా డాడీ...నాకు మీ మీద చాలా కోపం...!

ఎందుకురా...?”

పోయిన వారం మా స్కూల్లో స్కూల్ డే సెలెబ్రేషన్కు వస్తానని ప్రామిస్ చేసేవే. తరువాత ఎందుకు రాలేదు?”

ఇక్కడ కొంచం అర్జెంటు పనులు వచ్చినై సుధీర్

ఏమిటంత అర్జెంటు పని. చిన్న తాతను చూసుకోమని చెప్పి ఉండవచ్చు కదా?”

ఆయనవల్ల కుదరదురా, నేనే చూసుకోవలసిన పని

నా మీద నిజంగానే మీకు ప్రేమ ఉన్నదా?”

ఏమిట్రా అలా అడుగుతున్నావు! నువ్వు నాకు ఒకే కొడుకువు, ఒకే బిడ్డ. అదేదో చెబుతారే......మన వంశొద్ధారకుడివి! నీ మీద నాకు ఎంత ప్రేమో తెలుసా?”

ఫోన్ కట్ చేసి ఆమెను చూసాడు ఆనంద్.

ఎలాంటి ముఖ్యమైన టైములో ఫోను చేస్తున్నాడో చూడు...

మీ అబ్బాయి టైములో ఫోను చేసినా అది మీకు ముఖ్యమైన టైముగానే ఉంటుంది అన్న ఆమెను ముద్దుగా గిల్లాడు.

ఆదివారం నీకు ఇంకేదైనా పనుందా...? లేకపోతే నాతో రా...నా పిల్లాడ్ని చూసి వచ్చేద్దాం

మీ అబ్బాయిని చూడటానికి వెళ్తున్నప్పుడు కూడా ఇది అవసరమా?”

పిల్లాడితో ఒక గంట గడిపేసి బయలుదేరిన తరువాత, ఊటీ చలిలో ఏం చేసేది? అక్కడికెళ్ళి అది వెతుక్కోగలమా...? అందువలనే నిన్ను పిలుస్తున్నా...వస్తావా చెప్పు...?”

ఊహూ. నేను బెంగళూరు వరకు వెళ్ళాల్సి ఉంది

ఐదు రోజులు తప్ప మిగతా అన్ని రోజులూ నువ్వు చాలా బిజీనేగా. అడ్వాన్స్ బుకింగుతో ఉంటావు! సరే...నేను హెలన్ని పిలిచి చూస్తాను అంటూనే ఆమెను హత్తుకున్నాడు.

హెలెన్ ఎవరు?”

మా ఆఫీసులో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అని చెప్పినా నమ్మలేము

ఆవిడ్నీ కూడా వదిలిపెట్టలేదా?”

ఎవర్నీ?”

ఆఫీసులొ పని చేస్తున్న స్త్రీలనూ!

అందరినీ కాదు. నేనంత చీప్ మనిషిని కాదు. కొంతమంది ఆడవాళ్ళను చూసిన వెంటనే మనసులో డింగ్-డాంగ్ అని కొట్టుకుంటుంది. హెలెన్ మొదట్లో నోఅన్నది. మూడు నెలలు ప్రయత్నం చేసి ఆమెను వసపరచుకున్నాను. తరువాత నా వలనే ఒక అబార్షన్ చేసుకోవలసి వచ్చింది

పాపం కాదా?”

ఏమిటి పాపం?”

మేము దీనికని ఉన్న పనివాళ్ళం...సరి. కుటుంబంలో ఉన్న స్త్రీలను కూడా పాపం చేయిస్తున్నారే?”

ఏమిటి నువ్వు సడన్ గా పాప, పుణ్యాల గురించి మాట్లాడుతున్నావు? ‘త్రిల్అని ఒకటుంది చూడు -- దానికి ముందు పాపమూ, పుణ్యమూ ఏదీ లేదు...? పెళ్ళి అయిన స్త్రీలంటే అదొక వేరు సుఖం. అదేలాగా ఇంకో విషయం చెబుతా. మొదట్లో మొండికేసి, కోపగించుకుని మడి కట్టుకున్న అమ్మాయలను చివరికి ఎంత కష్టపడైనా సరే జయించేస్తా తెలుసా? ఓటమే లేదు

వాడు వాడు ఏవేవో విషయాలలో సాధనలు చేస్తున్నాడు. మీరు విషయాన్ని పెద్ద సాధనగా చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారే?”

ఏమైంది నీకు? మీ ఇంటికి పక్కనే కొత్తగా జ్ఞానోదయం చెట్టు పెరుగుతోందా...?” అన్న అతను -- ఆమెను మూర్ఖంగా హత్తుకుని ముద్దుపెట్టడంతో, ఆమె బెదిరి -- తనని విడిపించుకుంది.

కింద పెదవిని ముట్టుకు చూసినప్పుడు వేలుపై...రక్తం మరక!

మరుసటి రోజు ఆఫీసుకు వచ్చిన ఆనంద్ కి ప్యూన్తో మొదలుపెట్టి ఒక్కొక్కరూ నమస్తే చెబుతూ వస్తుంటే -- అతను మౌనంగా తల ఆడిస్తూ నడిచాడు.

అప్పుడు ఒక స్వీట్ స్త్రీ వాయిస్ విని -- వాయిస్ వినబడ్డ టేబుల్ ముందు ఒక క్షణం నిలబడ్డాడు.

నమస్తే చెప్పిన ఆమెను ఆశతో చూసాడు.

మనసులో డింగ్ -- డాంగ్ అని గంట కొట్టింది.

తన రూముకు వచ్చిన వెంటనే-- స్త్రీని సూచిస్తూ అది ఎవరు బాబాయ్?” అన్నాడు.

కొత్తగా ఉద్యోగంలోకి వచ్చింది ఆనంద్. పేరు మహతీ అన్న బాబాయ్. వద్దురా, ఉద్యోగంలోకి చేరి రెండు వారాలే అవుతోంది. పెళ్ళి అయిన స్త్రీ అన్నారు అతని మొహంలో కనబడ్డ కోరిక నవ్వు చూసి.

అయితే ఏమిటి బాబాయ్. ఆమె ఇంట్లో వాటర్ బెడ్ ఉండదు కదా అన్నాడు ఆనంద్ నవ్వుతూ.

                                                                                                        Continued...PART-3

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి