29, ఏప్రిల్ 2023, శనివారం

ఓడినవాడి తీర్పు...(సీరియల్)...(PART-5)

 

                                                                      ఓడినవాడి తీర్పు (సీరియల్)                                                                                                                                                                    (PART-5)

పోయిన సంవత్సరం

మహతీ కంప్యూటర్ లో వర్క్ చేస్తోంది.

ప్యూన్ వచ్చి, “మ్యాడమ్, మిమ్మల్ని ఎం.డి గారు పిలుస్తున్నారు అన్నాడు.

మహతీ లేచి నడిచింది.

సార్...లోపలకు రావచ్చా?”

రండి మహతీ. కూర్చోండి అన్నాడు ఆనంద్.

టైములో గదిలో అతను మాత్రమే ఉన్నాడు.

పరవాలేదు సార్ అంటూ నిలబడింది.

మూడు కోట్ల రూపాయల సప్లై అగ్రీమెంట్ ఒకటి మన చేయి జారిపోయింది మహతీ...దాని గురించి మీకు తెలుసా?” అన్నాడు -- టేబుల్ మీదున్న ఫోను రీజీవర్ను ఉత్తినే తిప్పుతూ.

తెలియదు సార్

దానికి కారణం మనం ఇచ్చిన కోట్ కంటే ఇంకొకరు జస్ట్ వంద రూపాయలు తక్కువగా కోట్ ఇవ్వటమే. అంటే, మన ఆఫీసు రహస్యాలు ఎవరో ఒకరు మన శత్రు కంపెనీకి అందిస్తున్నారు.

ఇప్పుడు యాభై కోట్లకు ఒక కొత్త అగ్రీమెంట్ వేసుకునే ఛాన్స్ వచ్చింది. దీనికైన సెల్లింగ్ రేట్ కోట్ ను నేను రహస్యంగా రెడీ చెయ్యబోతాను. నాకూ మీకూ తప్ప, ఇంకెవరికీ ఇది తెలియకూడదు. ఇది పక్కా రహస్య ప్లాను. రహస్యాన్ని  కాపాడతావా...?”

ఖచ్చితంగా సార్

మంచిది! రేపు ప్రొద్దున పదిగంటలకు నేను ఆఫీసుకు రాబోయేది లేదు. హోటల్ పసిఫిక్ లో 408 నెంబర్ గదిలో ఉంటాను. మీరూ ఆఫీసుకు రాకండి. తిన్నగా అక్కడికి వచ్చేయండి. నేను ల్యాప్ టాప్ తో కాచుకోనుంటాను. మధ్యాహ్నము లంచ్ కు ముందే గబగబా కొటేషన్ రెడీ చేసి, అక్కడ్నుంచి పంపించేద్దాం. సరేనా?”

సరే సార్ అన్నది మూర్ఖత్వంగా!

సంవత్సరం.

మేనేజర్ గదిలోకి, చేతిలో ఫైల్స్ తో వెళ్ళాడు వెంకట్.

ఏమిటీ?” అన్నారు సుబ్బారావ్ గారు.

నాలుగు ఫైల్స్ నూ నేను చెక్ చేసాను సార్. మీరు ఒకసారి చూసేస్తే, స్టేట్ మెంట్ తీస్తాను

ఉండండి అని చెప్పి, సుబ్బారావ్ గారు లేచి గదిలో నుండి అటాచ్ చేయబడ్డ స్నానాల గదిలోకి వెళ్ళి -- తలుపుకు గొళ్ళెం పెట్టుకున్నాడు.

అవకాశంతో వెంకట్ రెండు పనులు ముగించాడు.

టేబుల్ మీద ఆయన వదిలిపెట్టి వెళ్ళిన ఆయన టేబుల్ డ్రా తాళం చెవిని తన జేబులో పెట్టుకున్న సోపును తీసి దగ్గరున్న వాష్ బేసిన్ లో నీళ్ళతో తడిపి, దాంట్లో తాళంచెవి ముద్రను తీసుకున్నాడు.

రెండో పనిగా సుబ్బారావ్ గారి చిన్న సూట్ కేసును తీసి, అందులోని ప్లాస్టిక్ భాగంలో ఖచ్చితంగా సరిపొయే ఒక బటన్ సైజు కెమేరా ఫోనును  అతికించించాడు.

తరువాత -- మంచి వ్యక్తిలాగా కూర్చుని -- సుబ్బారావ్ గారి రాకకు కాచుకోనున్నాడు.

                                                                                                                           Continued...PART-6

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి