ఓడినవాడి తీర్పు (సీరియల్) (PART-3)
ఈ సంవత్సరం
ఆఫీసులో ‘కంప్యూటర్
లెడ్జర్’ ఓపన్
చేసి చెక్
చేస్తున్నాడు వెంకట్.
అతని టేబుల్
పైన ఉన్న
ఇంటర్ కామ్
మోగింది.
“ఏం.డి
రూముకు రావయ్యా” అని కంపెనీ
జి.ఎం. మరియూ
ఏం.డి
యొక్క బాబాయ్
సుబ్బారావ్ గారి
స్వరం వినబడింది.
“ఇదిగో
వస్తున్నా సార్” అని భవ్యంగా
చెప్పిన వెంకట్, టేబుల్
మీద పెట్టుకున్న
కొన్ని
ప్రింటడ్ లెడ్జర్
కాపీ పేపర్లను
తీసుకుని బయలుదేరాడు.
అనుమతి తీసుకుని
ఆ ఏ.సీ.
రూములోకి వెళ్ళినప్పుడు, ఏం.డి
ఆనంద్ తన
చక్రాల కుర్చీలో
కూర్చుని అటూ--ఇటూ
తిరుగుతున్నాడు.
అతని పెదాలపై
ఏ సమయంలోనైనా
బూడిద చిందించటానికి
తయారుగా ఉన్న
‘సిగిరెట్టు’ వేలాడుతున్నది.
పక్కనే మరో
కుర్చీలో కూర్చోనున్న
ఏం.డి
యొక్క బాబాయ్
సుబ్బారావ్, వెంకట్
చేతిలో ఉంచుకున్న
పేపర్లను తీసుకుని, “ఏం.డి
నిన్ను ఏదో
అడగాలి అని
చెప్పారు” అన్నారు.
“ఏమిటి
సార్?” అన్నాడు
వెంకట్.
“పర్చేస్
లెడ్జర్ను చూసాను.
అందులో మూడు
పేమెంట్లు అండర్
లైన్ చేసి, పక్కన
క్వోశ్చన్ మార్క్
గుర్తు వేసుంది.
అలా ఎవరు
చేసింది అని
అడిగాను. పోయిన
నెల కొత్తగా
ఉద్యోగానికి చేరిన
నువ్వూ అని
చెప్పారు బాబాయి.
అందుకే నిన్ను
పిలిచి అడుగుతున్నాను.
ఎందుకని అలా అండర్
లైన చేసి, క్వోశ్చన్
మార్క్ గుర్తు
వేశావు?” అడిగాడు
ఆనంద్.
“దీని
గురించి ఇతని
దగ్గర నేను
ఇంతకు ముందే
అడిగేశాను ఆనంద్.
కానీ నాతో
చెప్పలేదు. నీ
దగ్గరే చెబుతానని
చెప్పాడు” అన్నారు బాబాయి.
“నా
దగ్గర మాత్రమే
చెప్పటానికి అందులో
ఏముంది రహస్యం?”
“సార్, మన
కంపెనీకి ‘రా
మెటీరియల్స్’ కొనడంలో ఎవరో
అవకతవకులు చేస్తున్నారు
సార్...” అన్నాడు వెంకట్.
“ఎలా
చెబుతున్నావు?”
“ఇనుప
రేకులు మనకి
భువనేశ్వర్ నుండి
నలుగురైదుగురు
డీలర్స్ కొన్ని
సంవత్సరాలుగా
సప్లై చేస్తూ
ఉన్నారు సార్.
కానీ, గత
రెండు సంవత్సరాలుగా
‘రాయల్
ఇండస్ట్రీ’ లో
మాత్రమే కొంటున్నాము.
వాళ్ళు పంపిన
బిల్లులోనే నేను
క్వోశ్చన్ మార్క్
వేసి అండర్
లైన్ చేశాను.
అదే తారీఖులలో
మిగిలిన ఇండస్ట్రీ
డీలర్లు అదే
రేకును ఏ
రేటుకు అమ్మేరో
ఫోను చేసి
గుర్తుగా రాసుకున్నాను
సార్. మార్కెట్
రేటు కంటే
మూడు రెట్లు
అధికంగా బిల్లు
వేశారు. మనమూ
ప్రశ్నలు అడగకుండా
‘పేమెంట్’ పంపించాము.
ఇలా అన్యాయ
రేటు ఇచ్చి
అతని దగ్గరే
మళ్ళీ మళ్ళీ
కొనాల్సిన అవసరం
ఏమిటి సార్?” అన్నాడు
చేతులు కట్టుకుని.
“నిన్ను
ఎవరు అధిక
ప్రసంగి తనంగా
ఫోను చేసి
రేటు వివరాలు
విచారించమని చెప్పింది? నేనొకడ్ని
ఎందుకు ఉన్నాను? నీ
అనుమానాలను నా
దగ్గర అడిగుండొచ్చు
కదా? ఉద్యోగంలో
చేరి ఒక
నెల కూడా
అవలేదు? నీకు
మేనేజ్ మెంట్
గురించి అంత
బాగా తెలుసా...” అరిచారు బాబాయి
సుబ్బారావ్.
“ఉండండి
బాబాయ్” అంటూ ఆయన్ని
ఆపాడు ఆనంద్.
"అతను
ఏదీ తప్పుగా
చెప్పలేదే బాబాయ్? అతను
ఎవర్నీ ఉద్దేశించి
కూడా చెప్పలేదే!
తనకు
ఏర్పడిన న్యాయమైన
అనుమానాలను అడుగుతున్నాడు.
ఆ ఆశక్తినీ, తెలివితేటలనూ
ప్రశంసించడం వదిలేసి, ఎందుకు
అనవసరంగా అరుస్తున్నారు? అతను
అడిగిందే నేను
అడుగుతున్నాను.
మార్కెట్టు రేటుకంటే
మూడు రెట్లు
ఎక్కువపెట్టి ఏ
మూర్ఖుడైనా కొంటాడా? కూరగాయలు
అమ్మే వాడి
దగ్గర కూడా
మనం బేరం
మాట్లాడుతున్నామా, లేదా? ఒక
బిల్లు నాలుగు
లక్షలు. మొదటి
బిల్లు రేటును
చూసి మామూలు
కంటే ఇంత
ఎక్కువ రేటు
ఎందుకు వేశారు
అని అనుమానించాలి
కదా. కానీ
అది వదిలేసి, అదే
రేటుకు అలా మూడుసార్లు
కొన్నాము. అంటే
నాలుగు లక్షల
సరకును పన్నెండు
లక్షలకు కొన్నాము”
“అదే
నాకూ అర్ధం
కావటం లేదు.
మార్కెట్ రేటు
ఆ తారీఖులలో
కూడా తక్కువగా
ఉండి ఉండచ్చు.
డిమాండ్ ఎక్కువగా
ఉండి ఉండచ్చు.
‘రాయల్
ఇండస్ట్రీ’ బాగా
నమ్మకమైన పార్టీ
అనుకున్నాం. మనల్ని
మోసం చేశారు” అన్నారు
బాబాయి.
“సార్
నేనొకటి అడగనా?” అన్నాడు
వెంకట్.
“అడుగు”
“మన
ఆఫీసులో పర్చేస్
కు ప్రత్యేకంగా
బాధ్యతగల మేనేజర్
ఉన్నారే! మొదటి బిల్లు
అమౌంట్ చూసి
‘ఏమిటి
ఇంత రేటు
వేశారు?’ అని
ఆరోజు మార్కెట్టు
రేటు,
ఆరోజు డిమాండు కనుక్కొని
మొదటి బిల్లు
తో ఆ
డీలర్ దగ్గర
నుండి మన
పర్చేస్ ఆపేసి, మిగిలిన
డీలర్స్ దగ్గర
నుండి కొని
ఉండొచ్చు. అలా
చేయకుండా, అదే
పార్టీకి మళ్ళీ
మళ్ళీ ఆర్డర్
ఇచ్చి, బిల్లులపై
సంతకాలు పెట్టి
డబ్బు పంపవచ్చు
అని నోట్
రాసేరు అంటే
ఆయనకీ, ఆ
కంపెనీకీ ఏదో
రహస్య ఒప్పందం
ఉండొచ్చని అనుకుంటున్నా.
రేటు ఎక్కువగా
వేయమని చెప్పి
డబ్బు పంపించి
డిఫెరన్స్ డబ్బును
పంచుకుంటూ ఉండొచ్చు”
“ఒకవేల
అలా ఉండొచ్చో?” అన్నారు
బాబాయ్.
“ఏమిటి
బాబాయ్ అలా
అడుగుతున్నారు? మిమ్మల్ని
నమ్మే కదా
ఈ ఫ్యాక్టరీ
యొక్క పూర్తి
బాధ్యతలను మీకు
అప్పగించాను. మీరు
ఒక్కొక్క బిల్లూ
పేమెంటు చేసేటప్పుడు
బాధ్యతగా చెక్
చేసి ఉండాలి
కదా? మిమ్మల్ని
నమ్మే కదా
చెక్కు పుస్తకం
పూర్తిగా సంతకం
పెట్టి మీ
భాద్యతలో అప్పగించాను” అన్నాడు ఆనంద్.
“ఎలా
గమనించకుండా వదిలేశాను?” తనలో
తనే గొణుగుతుంటే,
“మొదట
పోలీసులను పిలవండి”
“పోలీసులంతా
వద్దు ఆనంద్...తప్పు
చేసిన వాళ్లను
పట్టుకుని నేను
శిక్షిస్తాను, డిఫరన్స్
డబ్బును వసూలు
చేస్తాను”
ఆనంద్,
వెంకట్ వైపుకు
తిరిగాడు. “షేక్
హ్యాండ్ ఇవ్వవయ్యా.
చాలా బాధ్యతగా
నడుచుకున్నావు.
చాలా నచ్చింది.
‘కీప్
ఇట్ అప్’! తరువాత...తప్పు
చేసిన వాడిపై
బాబాయి వేరే
విధంగా నడవడిక
తీసుకుంటానంటున్నారు.
ఆ బాధ్యత
ఆయన్నే తీసుకోనివ్వు.
ఈ విషయం
గురించి ఇంకెవరి
దగ్గరా చెప్పద్దు.
ఎందుకంటే తప్పు
చేసినవాడు తప్పించుకునే
అపాయం ఉంది.
అర్ధమయ్యిందా?” అన్నాడు.
“సరే
సార్” అని తన
టేబులుకు తిరిగి
వచ్చాడు వెంకట్.
ఆనంద్ తన
బాబాయిని నమ్మి
చెక్కు పుస్తకం
పూర్తిగా సంతకం
పెట్టి ఇచ్చేడనే
విషయాన్ని మనసులో
పదిలం చేసుకున్నాడు
వెంకట్.
Continued...PART-4
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి