కన్న రుణం (కథ)
తల్లిదండ్రులు చనిపోతే కొడుకులు అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. కొన్ని సంధర్భాలలో కూతుళ్లు కూడా చేయొచ్చని చాటిచెప్పారు కొందరు కూతుళ్లు. కన్న తల్లి-తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి రుణం తీర్చుకోవటం అతిపెద్ద పుణ్యం. ఈ కథలో ఇద్దరు అన్నదమ్ములకు ఆ పుణ్యం కూడా దొరకలేదు. ఎందుకో తెలుసుకోండి.
*********************************
"రేపు మీ అమ్మా, నాన్నలను చూసిన వెంటనే ప్రేమంతా ఒలకబోసి కరిగిపోయి సంబరపడిపోకండి. ఏదో చూశామా...పత్రిక ఇచ్చామా అనుకుని వెంటనే బయలుదేరాలి..." స్వర్ణ ఖచ్చితంగా ఉరమటంతో... సుందరం ఎప్పటిలాగా మౌనంగా ఆ రోజు దినపత్రికలో తల దూర్చాడు.
కొద్ది నిమిషాల తరువాత.......
"రండి...రండి..." అంటూ భార్య ఎవరినో ఆహ్వానిస్తున్న శబ్ధం విని తలెత్తి చూశాడు.
అతని తమ్ముడు మోహన్, అతని భార్య వనజ ,కూతురు శ్రీదేవితో కలిసి లోపలకి వస్తూ కనిపించాడు.
"రా రా... మోహన్ "
"అన్నయ్యా...రేపు అమ్మా-నాన్నలను చూడటానికి వెడుతున్నట్టు వదిన నిన్న 'ఫోన్ చేసింది. మేమూ మీతో వస్తాం. నా కూతురు పెద్ద మనిషి అయిన విషయం వాళ్ళకు తెలియదు. దాన్ని నేరుగా తీసుకువెళ్ళి చూబిద్దామని అనుకున్నాను"
అని మోహన్ చెప్పగా....
'నేను మాత్రం చేసిందేమిటి...ఇళ్లు కట్టుకోవటానికి స్థలం కొన్న విషయం కూడా చెప్పకుండా గృహప్రవేశానికి ఆహ్వానపత్రిక ఇవ్వబోతున్నాను నేను...' అని మనసులోనే గొణుకున్నాడు సుందరం.
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
కన్న రుణం…(కథ) @ కథా కాలక్షేపం
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి