16, ఏప్రిల్ 2023, ఆదివారం

శతమానం భవతి…(పూర్తి నవల)


                                                                                         శతమానం భవతి                                                                                                                                                                              (పూర్తి నవల) 

పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిన మానస సంతోషంగా జీవితం కొనసాగిస్తూ ఉంటుంది. ఆమె సంతోషాన్ని మరింత పెంచే విధంగా ఆమె చెల్లి పెళ్ళి నిశ్చయం అయ్యిందని తండ్రి ఫోన్ చేసి చెబుతాడు. పెళ్ళి చేసుకుని కాపురానికి వెళ్ళిన మానస పెళ్ళి తరువాత తన సొంత ఊరికి ఒక్కసారి కూడా రాలేకపోయింది...అందువలన ఎప్పుడెప్పుడు తన సొంత ఉరు వెళ్ళి, చెల్లిని ఆటపట్టిస్తూ, పెళ్ళి పనులలో తల్లి-తండ్రులకు సహాయం చేయాలని ఆత్రుత పడుతున్న మానసకు, చెల్లి పెళ్ళికి ఊరు రావద్దని, వస్తే తాను చేసిన తప్పు తిరిగి బయటకు వచ్చి చెల్లి పెళ్ళి ఆగిపోయే పరిస్థితి వస్తుందని తల్లి గట్టిగా చెప్పటంతో విలవ్లలాడిపోతుంది.

భర్తకు ఏవో కుంటి సాకులు చెప్పి చెల్లి పెళ్ళికి తాను వెళ్లటం లేదని చెబుతుంది మానస. భర్త కైలాష్ కు భార్యపై అనుమానం వస్తుంది.

చెల్లి పెళ్ళికి నెలరోజుల ముందు వెడతానని పట్టుబట్టిన భార్య, సడన్ గా ఎందుకు అసలు పెళ్ళికే వెళ్లనంటోంది? గత కొన్ని రోజులుగా భార్య పడే వేదనను గమనిస్తున్న కైలాష్, ఆమె బాధకు కారణం ఏమిటో ఎలా తెలుసుకున్నాడా? అసలు ఆ కారణం ఏమిటి? చివరికి చెల్లి పెళ్ళికి మానస వెడుతుందా? లేదా?.....ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ నవల చదవండి. 

నవలలో ఎన్నో టర్నింగ్ పాయింట్స్, ఎమోషనల్ సీక్వెన్స్ మిమ్మల్ని అలరిస్తుంది.

వంటింట్లో కూరగాయలు తరుగుతున్నది మానస

'అలూ...బైంగల్...సబ్జీ'- ప్రతి రోజూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఖంగుమని వినిపిస్తుంది కూరగాయలమ్ముకునే తాత గొంతు.

రోజు గొంతు వినబడ్డ వెంటనే నవ్వుకుంది మానస.

పెళ్ళి చేసుకుని మహారాష్ట్రం వచ్చిన కొత్తలో హిందీ భాష ఒక ముక్క కూడా అర్ధమయ్యేది కాదు.

"నీకు హిందీ భాష వచ్చా?"  గోరింటాకు పెట్టుకున్న భార్య చేతి వేళ్ళను మృధువుగా నొక్కుతూ ఫస్ట్ నైట్ రోజు అడిగాడు భర్త కైలాష్

వచ్చుఅన్నట్లు తల ఉపుతూ "హిందీలో మధ్యమ వరకు చదువుకున్నాను" చెప్పింది మానస.

"అయితే...కొంచం తెలుసని చెప్పు"

"హూ" అంటూ తల ఊపింది మానస.

కానీ

మొదటిసారి కాపురానికి డిల్లీ వెళ్ళే రైలు ఎక్కి కూర్చున్నప్పుడు, చెన్నై నుండి మాహారాష్ట్రం వెడుతున్న ఒక గుంపు వాళ్ళకు ఎదురుగా కూర్చుని మాట్లాడిన హిందీ భాషను విని కొంచం భయపడింది మానస. వాళ్ళు భర్త కైలాష్ తో మాట్లాడిన హిందీ, కైలాష్ వాళ్ళకు హిందీలో ఇచ్చిన సమాధానం విన్న మానసకు తల  తిరిగినంత పనైంది

"ఏం మాట్లాడుతున్నారు...నా గురించి ఏదో చెబుతున్నారు?" భర్త చెవిలో గుశగుశలాడింది మానస.

"నీకు హిందీ బాగా వచ్చు కదా"

భర్త సమాధానంతో పరువు పోయినట్లు ఫీలయ్యింది మానస.

'ఏక్ గావోమే ఏక్ కిశాన్కంఠస్తం పట్టిన తన హింది పనికిరాదని తెలుసుకుంది.

ఇదిగో కూరగాయలు అమ్ముకునే తాత గొంతును మొదటిసారి విన్నప్పుడు, అతను అమ్ముతున్న కూరగాయలు ఏమిటో వాటిని చూసిన తరువాత మానసకు అర్ధమయ్యింది.

రోజు భర్త కైలాష్ ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయలు అమ్ముకునే తాత గురించి, అతని దగ్గర కూరగాయలు ఎలా కొన్నది వివరించి చెప్పింది. పగలబడి నవ్వాడు భర్త కైలాష్.

నాకు హిందీ బాగా వచ్చు...ఫస్ట్ నైట్ రోజు గొప్పగా చెప్పావుమొదటి పనిగా హిందీ నేర్చుకో. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసుకో. హిందీ తానుగా వస్తుంది...కానీ అంతవరకు హిందిలో మాట్లాడ కూడదు" అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడు. భర్త నవ్వుతుంటే సిగ్గుగా అనిపించింది మానసకు

అది తలచుకునే ఇప్పుడు నవ్వుకుంటోంది. అలా కూరగాయలు అమ్ముకునే తాత దగ్గర, ఇరుగు పొరుగు వారితో తెలిసీ తెలియని హిందీలో మాట్లాడుతూ, వారి దగ్గర నుండి చాలా వరకు హిందీ నేర్చుకుంది.  

మహారాష్ట్రం వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పుడు మానసకు హిందీ భాష మాట్లాడడం, అర్ధం చేసుకోవడం బాగా అలవాటయ్యింది.

కైలాష్ కి అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. మంచి జీతం, కావలసిన వసతులతో కంపనీ క్వార్టర్స్, హాయిగా గడిచిపోయే జీవితం.

ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

శతమానం భవతి...(పూర్తి నవల)@ కథా కాలక్షేపం-2

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి