తీరం ముగ్గులు...(సీరియల్) (PART-9)
“ఏం
చెబుతున్నాడు? ప్రదీప్?”
ప్రకాష్ ఆత్రుతతో
చెల్లెల్ని అడిగాడు!
“నువ్వు
చెప్పింది వందకు
వందశాతం కరెక్టు
అన్నయ్యా!”
“అలాగంటే?”
“చాలా
స్వార్ధం, డబ్బు
ఆశ, అభిమానానికి
కొంచం కూడా
మర్యాద ఇవ్వని
మనసు...ఈ
మనిషిని మార్చటానికి
నేను చాలా
కష్టపడాలనుకుంటా!”
“కష్టపడటం
ఓకే సుజాతా! దానికి
ఫలితం దొరుకుతుందా?”
“తెలియదు!”
తల్లి దగ్గరకు
వచ్చింది.
“సుజాతా!
నేను అడుగుతున్నానని
తప్పుగా అనుకోవద్దు.
ఇది సరిగ్గా
ఉంటుందా? ఈ
పెళ్ళి నీకు
సంతోషం ఇస్తుందా
లేక భారంగా
ఉండబోతుందా?”
“లేదమ్మా!
నేను అలా
అనుకోలేదు! ఖచ్చితంగా
మొదటి రోజు
నుండే పోరాటమే!
అది నాకు
తెలుసు. కానీ, ఆ
కుటుంబం అద్భుతమైన
కుటుంబం అమ్మా!
నాలాంటి వికలాంగు
రాలికి ఖచ్చితంగా
భర్త ఆదరణ
మాత్రం సరిపోదు!
దాన్నీ దాటి, ఆ
కుటుంబం అభిమానంగా
ఉండాలి. అది
ఈ కుటుంబం
మాత్రమే చూపించగలదు!”
“సరేనే!
ప్రదీప్ తన
కుటుంబాన్ని పూర్తిగా
వ్యతిరేకిస్తున్నాడే!”
“అమ్మా!
చివరగా, కొంచం
ఓపన్ గా
ఒక ప్రశ్న
అడుగుతాను. ప్రదీప్
దేనికోసం నన్ను
పెళ్ళి చేసుకుంటున్నాడు?”
“నువ్వే
చెప్పమ్మా!”
“నేను
సంపాదిస్తున్న
కనీసమైన వేల
రూపాయల కోసం!
ఖచ్చితంగా వికలాంగురాలైన
ఈ సుజాతా
దగ్గర ప్రదీప్
మాత్రమే కాదు...ఎవరికైనా
సరే నన్ను
ఇష్టపడటానికి కారణం
నేను సంపాదిస్తున్న
డబ్బే అవుతుంది!”
“సరి!”
“అందువల్ల
నా మీద
కోపం తెచ్చుకోలేరు!
నన్ను మరీ
అవమానపరచలేరు!”
“సరేనమ్మా!
డబ్బుతో వేసే
మూడుముళ్ళూ కలకాలం
నిలబడతాయా?”
“తెలియదు!
అది పెట్టే
కదా నేను
పాచికలు దొర్లించబోతాను!”
ప్రకాష్ అడ్డు
వచ్చాడు.
“అమ్మా
వదిలేయ్! దానికి
ధైర్యమూ, నమ్మకమూ
ఉంది. ఆ
కుటుంబం పక్కబలంగా
ఉంటుంది! ఇంకా
ఏం కావాలి? నువ్వు
బాధపడకు!”
“సరే
నాయనా!”
“సుజాతా!
నీకు మెట్టినిల్లూ, పుట్టినిల్లూ
రెండూ ఆదరణగా
ఉంటాయి! రెండు
వైపులా చేతులు
కలిపి పోరాటాన్ని
మొదలుపెట్టు. నువ్వు
గెలుస్తావు!”
“నాకూ
ఆ నమ్మకం
ఉందన్నయ్యా!”
Continued...PART-10
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి