3, ఏప్రిల్ 2023, సోమవారం

బొమ్మ కాదా? మరి?...(మిస్టరీ)

 

                                                                                         బొమ్మ కాదా? మరి?                                                                                                                                                                            (మిస్టరీ)

మెక్సికో నగరంలోని ఒక బట్టల కొట్లోని బొమ్మ, బొమ్మ కాదట. అది బట్టల కొట్టు మాజీ యజమానురాలు కూతురి మృతదేహం అని అక్కడి ప్రజలు నమ్ముతున్నారు.

మెక్సికో దేశంలోని చీహుహూ అనే నగరంలో 'లా పాపులర్ అనే పేరుతో వివాహానికి సంబంధించిన బట్టలు అమ్మే ఒక షాపు ఉంది. షాపులో చాలా బొమ్మలు ఉన్నాయి గానీ 'లా పాస్కౌలిత (La Pascualita) అనే పేరున్న ఒక బొమ్మ( షాపులోని మరే బొమ్మకూ పేరు లేదు) బొమ్మ కాదని, అది చనిపోయిన షాపు యజమానురాలు కూతురు యొక్క భద్రపరచబడిన మృత దేహం అని చెబుతున్నారు. లా పాస్కౌలిత అనే బొమ్మ బట్టల కొట్లో గత 80 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఉన్నదట.

గత కొద్ది సంవత్సరాల నుండి బొమ్మ పర్యాటకులను ఆకర్షిస్తోంది. నార్త్ అమెరికా, అమెరికా, యూరోప్ దేశాల నుండి బొమ్మ పెళ్ళి కూతుర్ని చూడటానికి కొన్నివేల మంది వస్తున్నారట. చూసిన వారందరూ బొమ్మ యొక్క తదేకమైన, మంత్రముగ్ధుల్ని చేసే చూపులు, ఆ బొమ్మలో వాస్తవికంగా కనిపించే లక్షణాల్ని చూసి అది బొమ్మ కాదని గట్టి నమంకంతో వెళుతున్నారట.

మార్చి 25, 1930 లో పాస్కౌలిత అనే బొమ్మను పెళ్ళికూతురు అలంకరణతో అలంకరించి కొట్లోని గాజు అద్దాల కిటికీ దగ్గర నిలబెట్టేరు. షాపు వైపుగా వెళ్ళే ప్రతి ఒక్కరూ తమ దృష్టిని బొమ్మపై పెట్టకుండా వెళ్ళ లేరు. ఎందుకంటే బొమ్మ యొక్క సహజమైన అందం, మానవుల పోలికలూ ఎవరినైనా ఆకర్షిస్తుంది. బొమ్మ షాపు యజమానురాలు 'పాస్కౌలా ఎస్పర్జా పోలికలు కలిగి ఉన్నదని వెంటనే గ్రహించారు. ప్రజల ఆలొచనలు ఒక ముగింపునకు వచ్చాయి. బొమ్మ, బొమ్మ కాదని, చనిపోయిన షాపు యజమానురాలి కూతురు మృతదేహం అని ఒక నిర్ణయానికి వచ్చారు.

ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:

బొమ్మ కాదా? మరి?...(మిస్టరీ) @ కథా కాలక్షేపం

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి