9, ఏప్రిల్ 2023, ఆదివారం

తొలిచూపు...(నవల)

 

                                                                                              తొలిచూపు                                                                                                                                                                                    (నవల)

లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమ నిజమేనా? ఒకరిని చూడగానే.. వీళ్లు మన జీవితంలో లేకుంటే అసలు బతకడమే వృథా అనిపించేస్తుంది. తొలి చూపుకే జీవితమంతా చేయాల్సిన ప్లానింగ్ గురించి మనసులో అలజడి మొదలవుతుంది. ఎవరి ముఖమైనా ఒకసారి చూడగానే, వారిపై ఒక అభిప్రాయానికి రావడానికి మెదడుకు సెకనులో పదో వంతు సమయం పడుతుంది.

ఫస్ట్ ఇంప్రెషన్లో కేవలం వ్యక్తిలో ఆకర్షణ కోణాన్ని అంచనా వేయడమే కాదు, వారి వ్యక్తిత్వం గురించి చాలా కోణాలు ముందుకు వస్తాయి.  అలాంటిదే నవలలోని హీరోకు జరుగుతుంది. కానీ హీరోయిన్ కు అలాంటిది ఒకటి జరిగిందనేదే తెలియదు(తనని ఎవరో ఒకరు చూశారని). హీరోయిన్ను తప్పుగా అర్ధం చేసుకున్న ఆమె తల్లి, తాను చూసిన అబ్బయినే పెళ్ళిచేసుకోవాలని క్షోబ పెడుతుంది. ఆమె చూసిన అబ్బాయినే పెళ్ళి చేసుకుంటానని తల్లికి ప్రమాణం చేసిస్తుంది. ఈలోపు కుటుంబంలో ఎన్నో సంఘటనలు. సంఘటనలు హీరోయిన్ని భాధ్యతలకు దగ్గర చేస్తుంది.

మరి తొలిచూపులోనే హీరోయిన్ని చూసిన హీరో ఆమెను పెళ్ళిచేసుకో గలిగాడా? హీరోయిన్ ఎలాంటి సంఘటనలను ఎదుర్కొంది? చివరికి ఏం జరిగింది?

                                                                *****************************************

సూర్యుడనే ప్రేమికుడు తన వెలుతురనే చేతులతో భూమి అనే ప్రేమికురాలుని ముట్టుకున్న సమయం.... మేలుకున్నది మానవ జాతి. బద్దకాన్ని వదలి, తమ లక్ష్య సాధన కోసం యంత్రంగా పనిచేయడం ప్రారంభించింది.

 సరే రండి...మనమూ వాళ్ళతో ప్రయాణం చేద్దాం!

 

మనం ఇప్పుడు నిలబడున్నది హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని ఒక ముఖ్యమైన వీధిలో!

 

మీ 'కెమేరా' కళ్ళను రెడీగా ఉంచుకుని నన్ను అనుసరించి రండి.

 

చూశారా...! పెద్ద పెద్ద గాజు పెట్టెలను ఒకదాని మీద ఒకటి పేర్చిపెట్టినట్టున్న భవనాలు, ఆకాశాన్ని తాకేటట్లున్న వాటి గంభీరమైన ఎత్తు. ఉన్న వెలుతురు చాలదని రాత్రి నక్షత్రాలను చేబదులు తీసుకుని వెదజల్లిన కాంతివంతమైన షాపులు. ప్రొద్దుటి పూట కూడా తమ 'పవర్నుచూపిస్తున్నారట. హూ...

 

హైదరాబాద్ లో ప్రతి రోజూ పండుగ వాతావరణమే. నగరంలో ఎటు చూసినా ఉచితంగా కనబడే జిగేలు మనిపించే వేలకొలది అందాలు. రాత్రి అయితే ఇంద్రలోకంలో ఉండేటట్లే అనిపిస్తుంది.

 

అరెరే! అలా నోరు వెళ్ళబెట్టుకుని ఆగిపోయారేం? ఆగకుండా నాతో రండి. జనం'పల్లెటూరి గబ్బిలాయిగాళ్ళు అనే పేరు పెట్టి మిమ్మలని పక్కకు తోసేలోపు నడవటం మొదలుపెట్టండి.

 

ఇదిగో...మనం వెతుక్కుంటూ వచ్చిన ప్రదేశం వచ్చేసింది.

 

ఆకాశాన్ని అంటుకునే ఎత్తులో ఉన్న భవనాలకు మధ్య, ఎదుగుతున్న పిల్లలాగా నిలబడున్న చిన్న భవనం. భవన ముఖ ద్వారంలో 'నన్ను గమనించిన తరువాతే లోపలకు వెళ్ళాలిఅని చిన్న గర్వంతో గంభీరంగా ఉంచబడ్డ భవనం యొక్క నేమ్ బోర్డ్.

 

గాయత్రి నర్సింగ్ హోమ్


ఈ నవలను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:


తొలిచూపు...(నవల) @ కథా కాలక్షేపం-2 

***************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి