ఓడినవాడి తీర్పు...(సీరియల్) (PART-4)
పోయిన సంవత్సరం
బస్ స్టాండులో
కాచుకోనుంది మహతీ.
పరీక్షించే లాగా
అక్కడున్న మిగిలిన
వాళ్ళకు వెంట
వెంటనే బస్సు
వచ్చి, ప్రయాణీకులను
తీసుకు వెళ్ళింది.
ఈమెకు కావలసిన
బస్సు రాలేదు.
చేతులు కట్టుకుని
చాలాసేపు కాచుకోనున్నది.
కొద్ది సేపట్లో
ఆమె ముందుకు
వచ్చి నిలబడింది
పడవలాంటి ఆ
కారు.
దాని చూసిన
వెంటనే -- అది
తన ఎం.డి
ఆనంద్ గారి
కారు అనేది
అర్ధమయ్యింది.
ఉద్యోగంలో చేరిన
మూడు నెలలలో, రెండు
సార్లు మాత్రమే
ఆమె ఆనంద్
ను చూసింది.
ఆమె ఇంతవరకు
అతనితో మాట్లాడింది
లేదు.
కారు అద్దాలు
కిందకు దిగ, కూలింగ్
గ్లాసులు వేసుకోనున్నఆనంద్
తొంగి చూసి
నవ్వి “హలో
మేడం. ఎక్కండి.
మీ ఇంటికి
తీసుకువెళ్ళి దింపుతాను” అన్నాడు.
“పరవాలేదు
సార్. నాకు
బస్సు వస్తుంది”
“నాకేమీ
శ్రమ లేదు.
మీ యొక్క
నిజాయతీ సేవ
గురించి బాబాయ్
చాలా ఎక్కువ
చెప్పారు. నా
జ్ఞాపకశక్తి సరైతే, మీ
పేరు మహతీ.
మిస్సస్ మహతీ
కల్యాన్. మీకు
సహాయపడటానికి చిన్న
సంధర్భం...రండి”
తన ఎం.డి
యొక్క నిజమైన
రిక్వెస్టును ఎలా
నిరాకరించాలో తెలియక
మహతీ చిన్న
సంసయంతో కారు
వెనుక సీటులో
ఎక్కింది.
కారు బయలుదేరిన
తరువాత ఆనంద్
వెనుకకు చూసే
అద్దాన్ని కొంచంగా
సరి చేసాడు.
వెనుక కూర్చున్న
మహతీని చూడటానికి.
“మన
ఆఫీసులో చేరిన
రెండు నెలలలోనే
మీరు చాలా
హార్డ్ వర్కర్
అని విన్నాను.
మీ సేవ
చాలా కాలం
మా ఆఫీసుకు
అందాలని విష్
చేస్తున్నాను”
“థ్యాంక్యూ”
“కల్యాన్
గారు ఏం
చేస్తున్నారు?”
“ఒక
పెద్ద ఎలేక్ట్రికల్
కంపెనీలో ‘సీనియర్
స్టెనో’ సార్”
“సీతమ్మపేటలోనే
కదా మీ
ఇల్లు?”
“అవును
సార్”
“దార్లో
మిమ్మల్ని చూసింది
ఒక విధంగా
మంచిదే అయ్యింది
మహతీ. నాకోక
సహాయం చేస్తారా?”
“చెప్పండి
సార్?”
“నా
స్నేహితుడి కూతురికి
రేపు పెళ్ళి.
ఆమెకు ఒక
జత లేటెస్ట్
డిజైన్ బంగారు
పోగులు బహుమతిగా
ఇద్దమనుకుంటున్నా.
కానీ, నాకు
ఆడవారి నగలు
సెలెక్టు చేయటం
తెలియదు. అరగంట
ఆలస్యంగా మీరు
ఇంటికి వెడితే
పరవాలేదా? నాతో
పాటూ నగల
కొట్టుకు వచ్చి
సెలెక్టు చేసి
ఇవ్వగలరా?”
“సరే
సార్”
ఆ నగకొట్టు
ముందు కారును
ఆపాడు ఆనంద్.
ఇద్దరూ లోపలకు
వెళ్ళారు.
“మహతీ, ఖరీదు
ఎంతనేది సమస్య
కాదు. మీకు
ఏ నగ
నచ్చిందో...దాన్ని
సెలెక్టు చేయండి.
అదే తీసుకుంటాను”
ఒక కుర్చీలో
కూర్చుని -- షాపతను
ఇచ్చిన కూల్
డ్రింక్ ను
తాగుతున్నాడు ఆనంద్.
అరగంట సమయం
గడిపి, మహతీ
ఒక జత
పోగులు సెలెక్టు
చేసింది.
దానికి డబ్బులు
కట్టి ఇద్దరూ
బయటకు వచ్చారు.
“నేను
ఇక్కడి నుండి
బస్సు పుచ్చుకుని
వెళ్తాను సార్”
“ఇంత
దూరం మిమ్మల్ని
తీసుకు వచ్చి, ఇంటి
దగ్గర డ్రాప్
చెయ్యకపోతే మర్యాద
కాదు! ప్లీజ్
ఎక్కండి”
మళ్ళీ కారులో
పయనించింది.
ఈ సంవత్సరం
“ఏమిటి
నాన్నా బాగా
నీరసంగా కనబడుతున్నారు?” అన్నాడు
అశోక్.
సుబ్బారావ్ గారికి
ఒకే కొడుకు.
“ఆనంద్
మేలుకుంటాడేమోనని
భయంగా ఉంది
అశోక్” అన్నారు ఆనంద్
బాబాయ్ సుబ్బారావ్
గారు. పెద్ద
నిట్టూర్పుతో సోఫాలో
వెనక్కి వాలుతూ.
“ఏమైంది
నాన్నా?”
“ఆఫీసులో
‘వెంకట్’ అని
ఒక కొత్త
అకౌంటంట్ వచ్చాడు.
మంచి పేరు
తెచ్చుకోవాలి
అనే ఆదుర్దాతో
వాడు అన్ని
ఫైళ్ళనూ తవ్వి
తొంగి చూస్తున్నాడు.
పర్చేస్ విషయంలో
భువనేశ్వర్ పార్టీతో
చేరి దగ్గర
దగ్గర ఏడు
లక్షల వరకు
నేను అవకతవక
చేసాను. దరిద్రుడు
దాని కనిబెట్టేశాడు.
దాని గురించి
ఆనంద్ కు
తెలియపరిచాడు. పర్చేస్
మేనేజర్ ఈ
తప్పును చేసుంటాడు
అని ఒక
విధంగా సమాధానపరిచి, అతని
మీద యాక్షన్
తీసుకుంటాను అని
చెప్పి ఆనంద్
ను కామ్
చేసాను. కానీ, ఆనంద్
నా మీద
కొంతైనా అనుమానపడి
ఉంటాడు అని
వర్రీగా ఉంది.
ఈ వెంకట్
గాడు ఇంకా
ఎన్ని కెలుకుతాడో.
మరీ పాతవి
కెలికితే మన
దోపిడి అంతా
అతనికి తెలిసి, అది
ఆనంద్ కు
తెలిసిపోతుంది
అనేది తలుచుకుంటే
ఆ వర్రీ
ఇంకా ఎక్కువ
అవుతోంది”
“ఎందుకంత
వర్రీ అవుతారు? ఆనంద్
ఒక మూర్ఖుడు
నాన్నా. నిన్ను
పోయి అలాగంతా
అనుమానపడడు. ఎన్ని
సంవత్సరాలుగా మిమ్మల్ని
నమ్ముతున్నాడు.
మీరు లేకపోతే
వాడి ఆటలు
సాగవు. మీరు
వాడితో ఉండబట్టే
వాడు వ్యాపారం
గురించి పట్టించుకోకుండా
వాడి ఇష్టం
వచ్చినట్టు ఆడుతున్నాడు.
వాడి ఆటలు
సాగాలంటే వాడికి
ఖచ్చితంగా మీరు
కావాలి. వాడు,
వాడి ఆటలకు
బానిస అయిపోయాడు.
అందుకని మీ
జోలికి రాడు.
మీరు కంగారుపడకండి”
“అదంతా
సరే అశోక్.
కానీ ఆనంద్
మూర్ఖుడు కాదు.
మంచి తెలివిగలవాడు.
అతని
తెలివితేటలను వ్యాపారంలో
ఉపయొగించ నివ్వకుండా
మొదటి నుంచే
అతని దిక్కును
మార్చి ఉంచాను.
అతని యొక్క
పెద్ద బలహీనం, స్త్రీల
మీద ఉండే
మోహం! దాని
కోసం ఒక
బాబాయి చేయకూడని
పనులన్నీ నేను
చేసున్నాను...అంతా
దేనికోసం? అతని
చూపంతా వేరే
ధ్యాస మీద
ఉండేటప్పుడే, అక్కడ్నుంచి
కొంచం కొంచంగా
డబ్బు దోచుకుందామనే
కదా! ఇక
మీదట అది
కుదరదులాగుందే
అశోక్” అన్నారు సుబ్బారావ్
గారు.
Continued...PART-5
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి