తీరం ముగ్గులు...(సీరియల్) (PART-5)
ప్రదీప్ పొద్దున్నే
ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
మిగిలిన వాళ్ళంతా
ఇంట్లోనే ఉన్నారు!
సుమారు పదిగంటల
సమయంలో వాకిట్లో
ఆటో వచ్చి
నిలబడ, సుజాతా
దిగింది.
మహతీనే మొదటగా
చూసింది.
“అమ్మా!
ఆ సుజాతా
వస్తోంది!”
“ఆ
మాట విన్న
అందరూ హాలులోకి
జేర, సుజాతా
కుంటు కుంటూ
మెల్లగా మెట్లు
ఎక్క, దిలీప్
పరిగెత్తుకుని
వచ్చి పట్టుకున్నాడు!”
“థ్యాంక్యూ
డాక్టర్!”
“నేనింకా
డాక్టర్ని అవలేదు!”
“అవాల్సిన
రోజు చాలా
దూరంలో ఏమీ
లేదే? ఇంట్లో
ఒక డాక్టర్
ఉండటం కారణంగా, మేము
ధైర్యంగా రోగాలను
రప్పించుకోవచ్చు!”
గలగలమని మాట్లాడుతూ
సుజాతా లోపలకు
వచ్చింది.
“రామ్మా!” తల్లి స్వాగతించింది.
తండ్రి దగ్గరకు
వచ్చాడు.
“చూడాలని
ఒక కబురు
పెట్టుంటే, మేమే
వచ్చుంటామమ్మా!”
సుజాతా తల
ఎత్తింది.
“రావలసిన
దానిని నేనే
కదా! అందుకే
నేనే వచ్చాను!” ఆమె మాటలలోని
అర్ధాన్ని అందరూ
గ్రహించారు.
“తాగటానికి
ఏదైనా తీసుకురానా
సుజాతా?”
“ఉత్త
కాఫీ ఇచ్చి
తరిమేద్దాం అని
చూస్తున్నారా? ఈ
రోజు నేను
ఇక్కడే భోజనం
చేసి వెళ్ళబోతాను”
తల్లి మొహం
వికసించింది.
నాన్న మరింత
దగ్గరకు వచ్చాడు.
“నన్ను
మన్నించు సుజాతా!”
“దేనికీ?”
“ఆ
రోజు నువ్వు
వచ్చినప్పుడు నా
కొడుకుతో వాదన
చేసి, నేను
కూడా అనాగరీకంగా
నడుచుకున్నాను”
“నేను
దాన్ని తప్పుగానే
తీసుకోనేలేదే. వీధిలోనా
మీ వాదన
జరిగింది? ఇంటి
లోపల తండ్రి-కొడుకులు
వాదించుకోవటం సహజం.
అది యధార్ధం!
తప్పేముంది!”
మహతీ దగ్గరకు
వచ్చింది.
“అన్నిటినీ
పాజిటివ్ గా
తీసుకుంటున్నారే!
ఎలా?”
“ఎందుకంటే
నా బ్లడ్
గ్రూప్ ఏ-పాసిటివ్!”
దిలీప్ హాయిగా
నవ్వాడు. తల్లి-తండ్రుల
మొహంలోనూ నవ్వు.
క్షణంలో ఇల్లే
కోలాహాలంగా మారింది.
“సరే!
నేను ఎందుకొచ్చానో
చెప్పేస్తాను. మీ
అబ్బాయి ప్రదీప్
మనసులో ఏమున్నదో
నాకు తెలియదు.
కానీ, నేను
ఆయన్ని పెళ్ళి
చేసుకుని, ఈ
ఇంటికి కోడలుగా
రావాలనుకుంటున్నాను!”
“ఇంత
జరిగిన తరువాత
కూడానా?”
“ఏం
జరిగింది?”
“అమ్మా
సుజాతా! నా
కొడుకు జీవితాన్ని
నేనే పాడుచేస్తున్నట్టు
అనుకోవద్దు!”
“అనుకోను?”
“నువ్వు
పెళ్ళికి రెడీ
అని కుండబద్దలు
కొట్టినట్టు బహిరంగంగా
చెబుతున్నావు! కానీ, వాడు
స్వార్ధ పరుడు, జిడ్డు
మొహం, ఈర్ష్యా
గుణం కలిగినవాడు.
వాడి దగ్గర
మంచి గుణం
ఏదీ లేదమ్మా!
సారీ అమ్మా!
నీకు శరీరంతో
ఉన్న వికలాంగం
తెలుస్తుంది. స్వీయ
నమ్మకంతో జీవితం
గెలుచుకుంటూ వస్తున్నావు!
ఈ సమయంలో
జీవితం వికలాంగం
అయిపోకూడదుగా? నీకొక
నాన్న ఉండుంటే, నీ
మీద శ్రద్దతో
చెప్పరా?”
“నాన్నా!
నేను మీ
అభిప్రాయాలను తప్పు
అని చెప్పలేదే?”
“నాన్నా
అనా పిలిచావు?”
“ఇక
మీదట మీ
ఇద్దరినీ నాన్నా--అమ్మా
అనే పిలువబోతాను!”
ఇద్దరి ఒళ్ళూ
జలదరించగా సుజాతాను
చూసారు.
“ఏమిటలా
చూస్తున్నారు? కొన్ని
కుటుంబాలలో మెట్టింటి
కొచ్చిన కోడలు, భర్త
యొక్క తల్లి-తండ్రులను
నాన్నా--అమ్మా
అనే పిలుస్తుంది!”
“నువ్వు
నిర్ణయమే తీసుకున్నావా
సుజాతా?”
“అవును!
ఆయన గురించి
మీరంతా చెప్పారు!
మా అన్నయ్య
కూడా చెప్పాడు.
మీరందరూ
చెప్పిన కారణాల
మూలంగానే నాకు
మీ అబ్బాయి
నచ్చాడు! దీనిని
ఒక ఛాలెంజుగానే
తీసుకుంటున్నాను!”
“నీకిది
అవసరమా?”
“ఇదిగో
చూడండి. ఆడపిల్లలు
అందరూ కట్టుకోబొయే
భర్తనే మొదట
తూకం వేస్తారు!
నేను వ్యత్యాస
పడుతున్నాను. నేను
ఈ కుటుంబాన్ని
తూకం వేసాను!
మంచి అభిమానమున్న
అమ్మా-నాన్నలు!
వినయమైన తమ్ముడు, చెల్లెలు!
నేను ప్రదీప్
ను సెలెక్టు
చేయటానికి ఆయన
కారణం కాదు!
ఈ కుటుంబమే
కారణం!”
“పెళ్ళి
అయిన వెంటనే
వాడు వేరు
కాపురం పెడదామని
చెబుతాడమ్మా?”
“దానికి
ఛాన్స్ లేదు
నాన్నా! నెను
ఈ కుటుంబంతో
కలిసి జీవించటానికే
ఆయన్ని చేసుకుంటున్నాను.
కొంచం కొంచంగా
ఆయన్ని మార్చి, ప్రేమగల
కొడుకుగా చేయాలి.
నా ఈ
ప్రయత్నానికి మీరందరూ
నాకు తోడుగా
ఉండరా?”
తల్లి ఏడ్చేసింది.
“అది
గనుక నువ్వు
చేసేస్తే, మా
జీవితాంతం నీ
కాళ్ళ దగ్గర
పడుంటాం, సుజాతా!”
నాన్న అన్నారు.
“అమ్మా
సుజాతా! నాకు
ఏం మాట్లాడాలో
తెలియటం లేదు.
వాడిని తలుచుకునే
ఇన్ని సంవత్సరాలు
ఏడ్చాము. ఇప్పుడు
నీ కొసం
ఆనంద కన్నీరు
కారుస్తున్నాము!
మళ్ళీ అడుగుతున్నాను.
వాడు కట్టే
తాళి నీ
మెడలో ఎక్కిన
తరువాత, ఏమిట్రా
ఇలాంటి ఒక
నిర్ణయం తీసుకున్నాను
అని నువ్వు
బాధ పడకూడదు
కదా?”
దిలీప్ దగ్గరకు
వచ్చాడు.
“వదిన
అలాంటి అమ్మాయి
కాదు నాన్నా!”
సుజాతా చటుక్కున
తిరిగింది.
“అవును!
మీరే మాకు
వదిన అని
నేనూ, నా చెల్లి నిర్ణయం
తీసుకున్నాం”
మహతీ దగ్గరకొచ్చి
సుజాతా చెయ్యి
పుచ్చుకుంది.
“మీరు
నాకు బాగా
నచ్చారు వదినా!”
“థ్యాంక్స్”
“మీ
అన్నయ్యనూ, అమ్మనూ
కలిసి సంప్రదాయంగా
మేము మాట్లాడతామమ్మా!”
“సరే!
ఈ రోజు
వంట ఏమిటి?”
“ఇక
మీదటే వంట
మొదలు పెట్టాలి!
నీకు ఏమిష్టం? చెప్పు”
“నేనే
వంట చేస్తాను
అమ్మా!”
“నువ్వా”
“ఏం? మా
ఇంట్లో నేనే
వంట చేస్తాను!
నాకు ఇంటి
పనులు చేయాలంటే
చాలా ఇష్టం!
సుమారుగా వండుతాను!
భోజనం చేసి
చెప్పండి!”
లేచింది.
అమ్మతో పాటూ
వంట గదిలోకి
వచ్చింది.
“మీ
అందరికీ నచ్చిన
వంటలు చెప్పండి!”
మహతీ ఒక
లిస్టే చెప్పింది.
“అమ్మా!
మీరు సహాయం
మాత్రం చేయండి!
ఈ రోజు
ఛీఫ్ కుక్
ని నేనే!”
ఒక గంటలో
వింధు భోజనమే
రెడీ అయిపోయింది!
డైనింగ్ టేబుల్
మీద తీసుకు
వచ్చి పెట్టింది.
సుజాతానే, అందరినీ
కూర్చోబెట్టి వడ్డించింది.
అందరూ భోజనం
చేసి ముగించారు.
“అమ్మా!
వచ్చే మూహూర్తం
చూసేయి! ఎందుకంటే
నువ్వు వంట
చేయటం ఆపాలి!
ఇంత రుచిగా
నువ్వు ఒక్క
రోజు కూడా
వండిందే లేదు!”
“అయ్యయ్యో
-- అమ్మ బాధపడుతుంది!”
“బాధ
పడదు వదినా!
సమాధానం కూడా
చెప్పకుండా దాక్కుంది
చూడండి!” -- మహతీ!
నాన్న హాయిగా
నవ్వారు.
“నువ్వు
ఈ ఇంటికి
వచ్చిన తరువాత
వంట గదివైపుకే
రాను!” -- అమ్మ!
“వదిన
వచ్చేంతవరకు కాచుకోవాలే!”
సనిగాడు దిలీప్.
“ఈ
కుటుంబం ఇంత
సరదాగా ఉండటం
మేమెవరమూ చూసిందే
లేదు. సుజాతా!
పొగడ్త అంతా
నీకేనమ్మా! త్వరగా
వచ్చేయమ్మా? మీ
అమ్మ దగ్గర
మాట్లాడి చటుక్కున
ముహూర్తం పెట్టేస్తాం!”
అమ్మ తల
ఎత్తింది.
“సుజాతా!
ఈ రోజు
నువ్వు ఇక్కడికి
వచ్చి, వంట
చేసి, ఇంత
సంతోషంగా మనమందరం
గడిపింది, ప్రదీప్
కు తెలియకూడదు!”
“ఏమిటే? తెలిస్తే
తప్పేమిటి? తలకాయలు
నరికేస్తాడా?”
“లేదండీ!
మీరు అర్ధం
చేసుకోకుండా ఆగ్రహిస్తున్నారు!”
“వాడికి
ఇప్పుడే, దీనికే
భయపడితే, సుజాతా
ఈ ఇంట్లో
ఏదీ సాధించలేదు!”
“నాన్నా!
కొంచం ఉండండి!
అమ్మ చెప్పేదాంట్లో
ఒక అర్ధం
ఉంది!”
“ఏంటమ్మా
చెబుతున్నావు?”
“మీకందరికీ
నేను చాలా
సపోర్టుగా ఉన్నానని
ఆయనకు తెలిస్తే, ఒక
వేళ ఈ
పెళ్ళే వద్దని
చెప్పచ్చు. ఇదే
కదమ్మా మీరు
అనుకున్నది!?”
“సుజాతా!
నా మనసులో
ఉన్నది అలాగే
చెప్పాసావు!” -- అమ్మ
ఏడ్చేసింది.
“నాన్నా!
నేను ఇక్కడకు
వచ్చేస్తే, కథే
వేరు! రాకుండా
అడ్డుకుంటే కష్టమే
కదా?”
“న్యాయమే!”
“అది
మాత్రమే కాదు
సుజాతా! వాడికి
ప్రారంభంలోనే మనసులో
ఒక విసుగు
ఏర్పడితే, దాన్ని
మార్చలేము! దాన్నే
తలుచుకుంటూ మృగంలాగా
నడుచుకుంటాడు! అది
అందరినీ బాధిస్తుంది.
భార్యగా వచ్చిన
వాళ్ళకు బాధింపు
ఎక్కువగా ఉంటుంది!
”
“సరేనమ్మా!
దీన్ని ఎవరూ
చెప్పొద్దు. పెద్దలు
మాట్లాడి సహజంగా
వచ్చినట్టు రానీ!”
“నువ్వు
చెప్పి, ప్రకాష్
ద్వారా ప్రదీప్
కు వార్త
రానీ. మేము
దూరంగానే ఉంటాము.
గొప్పలన్నిటినీ
నా కొడుకే
వీపున మోసుకోనీ.
నువ్వు ఈ
ఇంట్లోకి రావటానికి
ఎటువంటి ఆటంకమూ
ఉండకూడదు!”
“అవును
నాన్నా!”
మాట్లాడి మాట్లాడి
సాయంత్రం నాలుగు
గంటలు అయిపోయింది!
“మహతీ!
‘టీ’ పెట్టు! …వదినా!
మా మహతీ
‘టీ’ స్పేషలిస్టు!
ఉప్పు వేసి
‘టీ’ ఇస్తుంది
చూడండి!”
“పో
అన్నయ్యా”
మహతీ ‘టీ’ తయారుచేసుకుని
వచ్చింది.
“బ్రహ్మాండంగా
ఉంది! ఈ
ఇంటికి వచ్చిన
వెంటనే వంటలో
నాకు సహాయం
చేసేది నువ్వే.
నిన్ను నేను
తయారు చేస్తాను!”
“వదినా!
అది వంట
చేయక పోయినా
తప్పులేదు. చదువులో
బాగా తయారుచేయండి!”
“అన్నీ
జరుగుతాయి డాక్టర్!
అయితే నేనిక
బయలుదేరనా?”
“వదినా!
మిమ్మల్ని ఇంటికి
తీసుకువెళ్ళి దింపుతా!”
దిలీప్ రెడీ
అయ్యాడు.
“వద్దు
దిలీప్! ఒక
ఆటో పట్టివ్వు!
నేను వెళ్ళిపోతాను.
మీ కొడుకు
ద్వారా సంబంధం
వచ్చేటప్పుడు సహజంగా
ఉండండి! ఎవరూ
ఎక్కువ సంతోషాన్ని
చూపకండి!”
“సరే
సుజాతా!”
ఆటో వచ్చింది!
సుజాతాను ఎక్కించటానికి
కుటుంబమే వాకిలికి
వచ్చింది!
“త్వరాగా
వచ్చేయి సుజాతా!”
అందరికీ ఆమె
చెయ్యి ఊపగా, ఆటో
బయలుదేరి వెళ్ళింది!
కుటుంబం మొత్తం
తృప్తిగా ఉన్నది.
Continued...PART-6
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి