ఓడినవాడి తీర్పు (సీరియల్) (PART-1)
ప్రియమైన నా భర్తకు - మీ భార్య నమస్కరించి రాయునది! కొద్ది కాలంగా శేఖర్ అనే అతనితో నాకు పరిచయం ఏర్పడి, ఆ కొత్త స్నేహం లోతుగా పెరిగింది. శేఖర్ మీ కంటే అందంలోనూ-వసతిలోనూ గొప్పవాడు. మా స్నేహం ప్రేమగా మారింది. పెళ్ళి అనే బంధం మా ప్రేమకు పెద్ద అడ్డుగా నిలబడుతోంది. చాలా ఆలొచించి ఈ నిర్ణయానికి వచ్చాను.
ఈ రోజు నేనూ, శేఖరూ ఈ ఊరు వదిలి బయలుదేరి వెళుతున్నాము...ఒక కొత్త జీవితం కోసం. ఇది తప్పే. చెయ్యకూడని పనే. కానీ, నా వలన శేఖర్ను మరిచిపోవటం కుదరటం లేదు. అందువల్ల మిమ్మల్ని వదిలి వెళుతున్నాను. నన్ను వెతక వద్దు. నన్ను క్షమించండి. మరిచిపొండి.
******************
ప్రియమైన కొడుకుకు -- తండ్రి ప్రేమతో రాస్తున్నది.
ఈ మధ్య వ్యాపారంలో నాకు ఏర్పడిన నష్టం నాకు తగిలిన, తేరుకోలోని ఒక పెద్ద దెబ్బ! పేకమేడలాగా నేను ఒక్కసారిగా వేగంగా పడిపోయాను. ఇంతపెద్ద ఓటమిని నా వల్ల తట్టుకోవటం కుదరటం లేదు. వెళ్ళిన ప్రతి చోటా నన్ను దుఃఖం విచారిస్తున్నారు. పెద్ద అవమానంగా ఉంది.
పారేసుకున్న మనశ్శాంతిని వెతుక్కుంటూ నేను ఈ ఇంటిని, ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలనేది నేనే తీర్మానించుకోలేదు. నా మనసు నిలకడగా లేదు. నిలకడ అయినప్పుడు, తిరిగి వస్తాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందో నాకే తెలియదు. ఎవరూ నన్ను వెతకటానికి ప్రయత్నించ వద్దు. నీకు నా ప్రేమ పూర్వకమైన దీవెనెలు.
ఇట్లు.
******************
పై రెండు ఉత్తరాలకు ఒక పెద్ద లింకు ఉన్నది. అదేమిటో తెలుసుకోవటానికి ఈ సస్పెన్ష్ నవలను చదవండి.
****************************************************************************************************
PART-1
పోయిన సంవత్సరం
వర్షం కురిసి ఆగింది.
అందువలన కాశంలో వెలుతురును రాజీనామా చేయమని చెప్పి, చీకటి పదవి ఎక్కింది.
మనుషులు ఇంకా గొడుగులను మడవకుండా నడుస్తున్నారు. కట్టుకున్న మూటలను మళ్ళీ విప్పుదామా, లేకపోతే చిరంజీవి సినిమా చూడటానికి వెళ్ళిపోదామా అని ప్లాట్ ఫారం మీద షాపులు పెట్టుకున్న వాళ్ళు ఆలొచించ, రైన్ కోటు వేసుకున్న రెండు చక్రాల వాహనదారులు రోడ్డు మీద 'వీర్ ' అని ఎగురుతున్నారు. చూసి చూసి అడుగులు వేస్తున్న పాదచారుల దుస్తుల గురించి పట్టించుకోకుండా, బురద నీటిని వాళ్ళ మీద జల్లుతూ వెళ్తున్నాయి బస్సులు.
కంప్యూటర్ క్లాసు ముగించుకుని, రెండు అంతస్తుల మెట్లను జాగ్రత్తగా దిగి, చేయి జాపి చూసి, వర్షం పూర్తిగా తగ్గిందని తెలుసుకుని తన సైకిల్ దగ్గరకు వెళ్ళాడు వెంకట్.
‘తరంగినీ మొబైల్స్’ ఎదురువైపు సీరియల్ బల్బులు అలంకరించుకుని మొబైల్ ఫోనులు ఉన్నవాళ్ళను కూడా కొత్త మొబైల్ కొనుక్కుని అప్ డేట్ అవండి అని పిలుస్తున్నది.
సైకిల్ తాళం చెవిని జేబులో వేసుకుని రోడ్డు క్రాస్ చేద్దామనుకున్నప్పుడు ఒక ఆటోవాడి దగ్గర తిట్లు తిని, వెంటనే తుడుచుకున్నాడు.
షాపుకు అద్దాల తలుపులు ఉన్నాయి.
మల్లికా, నల్లరంగు చుడీధార్ వేసుకుని అతనికి వీపు చూపిస్తూ 'ఆల్బం
తిరగేస్తున్నది. ఒకసారి తన జడను అనవసరంగా విప్పి, విదిలించుకుని మళ్ళీ కట్టుకుంది.
తలుపు తోసుకుని ఆమెకు దగ్గరగా వచ్చాడు అతను.
ఆమె చెవి దగ్గర, “హాయ్ మల్లికా?” అన్నాడు.
“హాయ్” అంటూ వెనక్కి తిరిగిన మల్లికా “ఈ ఆల్బం రెండు కాపీలనూ వేరు వేరు సంచీలలో వేసి ఇవ్వండి” అని షాపతనికి చెప్పి, వెనక్కి తిరిగి “ఎలా ఉన్నారు వెంకట్?” అని అడిగింది.
ఆల్బం సంచులను తీసుకుని, తన దగ్గరున్న మరో పెద్ద సంచిలో పెట్టుకుంది ఆమె.
“ఐస్
క్రీమ్ తిందామా
వెంకట్?”
“వద్దు...వద్దంటే
నాకు వద్దు.
నీకు కంపెనీ
ఇస్తాను”
“ఇవ్వండి”
ఆ ఐస్
క్రీమ్ షాపులో
గోడకు తగిలించబడి
ఉన్నది పెద్ద స్క్రీన్
గల టెలివిషన్.
అందులో ఫుట్
బాల్ మ్యాచ్
టెలికాస్ట్ అవుతోంది.
టీవీ లో
నుండి ప్రేక్షకుల
అరుపులు, ఐస్
క్రీమ్ షాపులో
ఆటను టీవీలో
చూస్తున్న ప్రజల
అరుపులు కలిసి
అక్కడ కోలాహల
వాతావరణం.
“రెండు
స్ట్రాబెరీ” అని ఆర్డర్
ఇచ్చింది.
“నేను
వద్దని చెప్పానుగా?” అని
సనుగుతున్న అతన్ని
చిరుకోపంతో చూసి
“ఎందుకు
వద్దు?” అన్నది.
“నాకు
బాగా ఆకలిగా
ఉంది మల్లికా.
ఐస్ క్రీమ్
తింటే ఆకలి
చచ్చిపోతుంది. సరిగ్గా
లంచ్ చేయలేను”
“అలాగైతే
హోటలకు వెళ్ళి
టిఫిన్ తినుండొచ్చే.
తిందామా?”
“ఊహూ.
లంచ్ కు
వస్తానని ఇంట్లో
చెప్పాను. వదిన
ఎదురు చూస్తూ
ఉంటుంది”
“హోటల్లో
తిన్నానని చెబితే
తల తీసేస్తారా
ఏమిటి...?”
“తియ్యరు.
కానీ, అది
మర్యాద కాదే
మల్లికా! అన్నయ్య
ఇంట్లో ఉంటూ
ఉద్యోగం వెతుక్కుంటున్నాను.
వాళ్ళకు అనవసరమైన
ఇబ్బందులు కలిగించవచ్చా?”
“వదిన
అంటే మీకు
భయమా?”
“లేదు.
భక్తి. ఆమెలాంటి
ఒక మంచి
స్వభావం ఎవరి
దగ్గరా చూడలేము.
కోపమే రాదు.
ఎప్పుడూ మొహాన
ఒక చిరునవ్వు.
అన్ని విషయాలలోనూ
త్యాగాన్ని అనుసరించే
వెడతారు. మా
అన్నయ్య చాలా
అదృష్టవంతుడు”
ఐస్ క్రీమ్
వచ్చిన తరువాత సగం
తిని పెట్టేసి, టిష్యూ
పేపర్ తీసుకుని
నోరు తుడుచుకున్నాడు
వెంకట్.
ఆమెకు ‘టాటా’ చూపించి
సైకిల్లో ఇంటికి
వచ్చినప్పుడు, మళ్ళీ
వర్షం చినుకులతో
మొదలయ్యింది.
ఇంటి వాకిట్లో
ఉన్న అన్నయ్య
స్కూటర్ వెనుక
తన సైకిల్ని
పెట్టి స్టాండూ, తాళం
వేసి, తలుపు
కొట్టాడు.
మహతీ తలుపులు
తెరిచి “తడిసిపోయారా?” అన్నది.
“లేదు” అన్నాడు.
సోఫాలో ఆనుకుని
కూర్చుని టీవీ
చూస్తున్న కల్యాన్
వెనక్కి తిరిగి
చూసి, “వాడు తడిసిపోయున్నది
కనబడటం లేదా.
తుడుచుకోవటానికి
తుండు తీసివ్వు” అన్నాడు
మహతీ భర్త.
“మన
వీధి చివరికి
వచ్చిన తరువాతే
మళ్ళీ వర్షం
మొదలయ్యింది అన్నయ్యా.
పెద్దగా తడవలేదు”
“సరే.
తల తుడుచుకుని
డ్రస్సు మార్చుకుని
రా వెంకట్.
నీతో కొంచం
మాట్లాడాలి” అన్నాడు కల్యాన్.
వెంకట్ తన
గది తలుపు
మూసుకుని డ్రస్సు
మార్చుకుని హాలులోకి
వచ్చి అన్నయ్య
పక్కన కూర్చున్నాడు.
“ఏంటన్నయ్యా?”
“మహతీ
కాసేపు ఆ
టీవీ ఆఫ్
చేయి”
మహతీ టీవీ ఆఫ్ చేసింది.
ప్లేటులో వేడి
వేడి ఉల్లిపాయ
పకోడీలు తీసుకువచ్చి
సోఫా దగ్గరున్న
టీపా మీద
పెట్టి ఎదురుగా
ఉన్న సింగిల్
సీటర్ లో
కూర్చుంది మహతీ.
“వెంకట్, వదిన
ఏం ఆలొచన
చెబుతోందంటే...ఆమె
డిగ్రీ పూర్తి
చేసి ఖాలీగానే
ఇంట్లో కూర్చోనుందట.
టైము గడపటం
కూడా కష్టంగానే
ఉన్నదట. ఉద్యోగానికి
వెళ్తానని చెబుతోంది.
నాకు అది
ఇష్టం లేదు...ఎందుకంటే
నాతో పనిచేస్తున్న
స్త్రీలు పడే
శ్రమ కళ్ళారా
చూస్తున్నాను.
తొందర తొందరగా
వంట పనులు
ముగించుకుని, టెన్షన్
పడుతూ బస్సు
పట్టుకోటానికి
వచ్చి....చిన్న
చిన్నగా చాలా
అవస్తలు ఉన్నాయి.
అందువలనే నాకు
ఆ ఆలొచన
నచ్చలేదు” అన్నాడు కల్యాన్.
“లోకంలో
నేను ఒక్కదాన్నే
కొత్తగా ఉద్యోగానికి
వెళ్ళి కష్టపడబోతాను
చూడండి!? మనకు
పిల్లలు పుట్టిన
తరువాత అలా
చెప్పినా న్యాయంగా
ఉంటుంది. వాళ్ళనూ
చూసుకుంటూ, ఉద్యోగానికి
వెళ్లటం శ్రమే” లాగుతూ అన్నది
మహతీ.
“కొంచం
ఉండండి” అన్నాడు వెంకట్.
“ఇద్దరికీ
నచ్చినట్టు నేనొక
తీర్పు చెప్పనా?”
“చెప్పు”
“వదిన
ఉద్యోగానికి వెళ్ళనివ్వండి...ఒక
బిడ్డ పుట్టేంతవరకు”
“నాకు
ఓకేనే” -- అంగీకరించింది
మహతీ.
“నాకెందుకో
దీంట్లో ఇష్టం
లేదు. కానీ, నువ్వు
ఇష్టపడుతున్నావు
కాబట్టి నాకు
ఓకే”
“అదంతా
సరే, ఏ
కంపెనీలో వదినను
ఉద్యోగానికి రమ్మంటారు”
“ఇక
మీదటే ప్రయత్నాలు
మొదలుపెట్టాలి” అన్నది
మహతీ.
“సరే.
ఆ విషయం
నా దగ్గర
విడిచిపెట్టండి.
ఆ బాధ్యత
నాకివ్వండి. ఇప్పటివరకు
నా కోసం
మాత్రమే ఉద్యోగ
ప్రయత్నం చేసేను.
ఇప్పుడు మీకూ
కలిపి చేస్తాను.
స్త్రీలకు
త్వరగా ఉద్యోగం
దొరుకుతుంది”
“ఎందుకంటే
స్త్రీలు కబుర్లు
చెప్పుకోకుండా
సిన్సియర్ గా
పనిచేస్తారు. అదే కారణం?” అన్నది
మహతీ.
Continued....PART-2
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి