ఆనందనిలయం (కథ)
"విమల్...డైనింగ్ టేబుల్ మీద చపాతీలు ఉన్నాయి. ఫ్లాస్కులో కాఫీ పోసుంచాను. డాడీ ఏడు గంటలకు వచ్చాస్తారు. అంతవరకు చదువుకుంటూ ఉండు. ఆకలి వేస్తే నువ్వు తినేయి. నాకు ఆఫీసుకు టైమైంది" అని హడావిడి పడుతోంది స్వర్ణ.
"నువ్వు తిన్నావా అమ్మా?"
"లేదు బంగారం. నాకు ఆఫీసుకు టైమైంది. నేను బయలుదేరుతాను. ఇళ్ళు తాళం వేసుకుని జాగ్రత్తగా ఉండు"
"సరేనమ్మా?"
వేగ వేగంగా రెండు ముద్దలు తినడానికి కూడా సమయం లేక వెలుతున్న అమ్మను చూస్తున్న విమల్ కు చదువుకోవటానికో...తినడానికో ఇష్టం లేకపోయింది.
రాత్రి ఏడు గంటల తరువాత ఇంటికి వచ్చిన
విమల్ తండ్రి ప్రశాద్,
"తిన్నావా విమల్...?" అని ఏదో అడగాలని అడిగి, భోజనం చేయకుండా పడుకుండి పోయాడు.
ఎప్పటిలాగానే ప్రొద్దున్నే లేచాడు ప్రశాద్. విమల్ కు నాలుగు ముక్కలు 'బ్రెడ్ టోస్ట్' చేసిచ్చి ఉద్యోగానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. నైట్ షిఫ్ట్ కు వెళ్ళిన అమ్మ ఎనిమిది గంటలు దాటితేనే వస్తుంది.
ఇద్దరూ 'ఐ.టి’ కంపెనీలలో పని చేస్తున్నారు.
చాలా వరకు ఎవరో ఒకరితోనే విమల్ వలన ఇంట్లో గడపడం జరుగుతుంది. ఆ రోజుకూడా తల్లి ఇంటికి
రావటానికి ముందే స్కూల్ కి బయలుదేరి వెళ్ళిపోయాడు విమల్.
ఆరో క్లాసు చదువుతున్న విమల్ ఎప్పుడూ ఏదో వెలితిగానే ఉంటాడు. ఆ రోజు ఆదివారం. స్వర్ణ మాత్రం ఇంట్లో ఉంది. ప్రశాద్ అర్జెంటు పని ఉన్నదని ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
వంట పనులు
ముగించుకుని, బట్టలు ఉతికి
ఆరేయటానికి వెళ్ళేటప్పుడు సమయం మధ్యాహ్నం ఒంటి గంట దాటింది. కాసేపు రెస్టు
తీసుకుందామని విమల్ పక్కన వచ్చి కూర్చుంది. వాడు తల్లిని గమనించక ఏదో ఆలొచనలో
ఉన్నాడు.
"ఎందుకు
అదోలాగా ఉన్నావు విమల్? ఏమిటి ఆలొచిస్తున్నావు?" కొడుకు తల నిమురుతూ అడిగింది.
"ఏమీ
లేదమ్మా"
"నీ ముఖమే
సరిలేదు విమల్...ఏమిటో చెప్పు? విషయం ఏమిటో చెబితేనేగా తెలుస్తుంది "
"నువ్వూ, నాన్నా ఎందుకమ్మా
ఇంట్లోనే ఉండటం లేదు? నాన్న ఇంట్లో ఉంటే నువ్వు పనికి వెడుతున్నావు. ఇంట్లో నువ్వుంటే ...నాన్న
పనికి వెళుతున్నారు. ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం ఇంట్లో ఉండటం చూడటమే
కుదరట్లేదు"
ఈ కథను చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
ఆనందనిలయం….(కథ) @ కథా కాలక్షేపం-1
***************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి