30, సెప్టెంబర్ 2022, శుక్రవారం

మారని రాగాలు/అక్షయపాత్ర/పదిహేడవ అల: పూర్తి నవలల PDF లింకులు

 

                                     మారని రాగాలు/అక్షయపాత్ర/పదిహేడవ అల: పూర్తి నవలల PDF లింకులు                                                                                                                 డౌన్లోడ్  PDF లింకులు

1) అక్షయ పాత్ర(పూర్తి నవల)

మనిషి జీవితంలో పలు సంఘటనలకు కొన్ని సందర్భాలలో పరిస్థితులే కారణమవుతాయి. కరెక్టా, తప్పా అనేది పరిస్థితులను బట్టే. ఎటువంటి పరిస్థితులలోనూ అనురాగమును హైజాక్ చేయటమనేది కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది. నాలుగు నెలలుగా ఇంటికే రాని తండ్రిని వెతుక్కుని వెళుతుంది తులసి.

తండ్రి అంటే ఆమెకు ప్రాణం.

ఎంత తీసుకున్నా తరిగిపోని అనురాగమును మాత్రమే ఇచ్చే అక్షయపాత్ర ఆయన. అనురాగము మాత్రమే సర్వరోగనివారిణి అని నమ్మే తండ్రిని ఆమె కలుసుకుందా? ఆమె అక్షయపాత్ర ఆమెకు దొరికిందా? వీటన్నిటికీ జవాబు చెప్పే అక్షయ పాత్రే నవల.

నవలను ఈ క్రింది లింకుతో PDF గా డౌన్లోడ్ చేసుకుని చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.

https://drive.google.com/file/d/1hPT8t_xEdR3EixBVD_wORHPB6gWQa403/view?usp=sharing

2) మారని రాగాలు...(పూర్తి నవల)

రచన అనేది వరమో...తపమో మాత్రమే కాదు! అదొక ఎండిపోని జీవనది. చల్ల చల్లగా రాసుకుని వెళ్ళే ఈదురుగాలి. ఒంటి మీద పడి జలదరింపు పెట్టే వానజల్లు. ఇంటి నిండా గుమగుమలాడే సన్నజాజి వాసన. ఎప్పుడూ కొత్తగా వాసన ఇచ్చే వాడిపోని మల్లె.

రచనకు మాత్రమే ఇవి సొంతం కాదు...ప్రేమకు కూడా! ఎన్ని సంవత్సరాలు అయినా ప్రేమ...ప్రేమే. వయసైతే చల్లగాలి గిలిగింత పెట్టదా ఏమిటి? వర్షపు జల్లు జలదరింపు తీసుకురాదా? మత్తు ఎక్కించదా? సన్నజాజి వాసన ముక్కును తాకదా? వాడిపోని మల్లె మత్తు ఎక్కించదా?

వయసవుతున్న కొద్దీ నిజమైన ప్రేమకు బలం ఎక్కువ అవుతుంది. శరీరాన్ని ముట్టుకోవటం ప్రేమ కాదు. మనసును తాకి లోతుగా చెక్క బడుతుందే...దాని పేరే ప్రేమ!

ముందురోజు మొగ్గలను మాలకట్టి, రాత్రంతా గిన్నె కిందపెట్టి మూసిపెడతారు. మరుసటి రోజు పొద్దున దాన్ని తీస్తే గుప్పుమని విరుచుకుని, ఇల్లంతా వాసన వీస్తుంది.

అలాగే ప్రేమ కూడా! దాని వాసన జీవితాంతం వీస్తుంది. మనసులో మూతపెట్టి, మూసిపెట్టిన మాలలాగా జీవితాంతం పూస్తుంది.

వాడిపోకుండా...నలిగిపోకుండా ఉంటుంది. వాడిపోని మెల్లె పూవులాగా కొత్తగా తెలుస్తుంది.

కృష్ణమూర్తి -- మాలతీ ప్రేమ కూడా అలాంటిదే! దాన్ని ప్రేమ అని చెప్పటం కూడా తప్పే అవుతుంది. ప్రేమలో కామం ఉంటుంది. కామంలో ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు. వీళ్ళకున్నది కామంలేని...మనసును మాత్రమే తాకిన ప్రేమ. ఒకటిగా కలవని...కానీ ఒకటిగా ప్రయాణం చేసిన ప్రేమ.

ఇలాంటి ప్రేమ అపురూపం...ఆశ్చర్యం కూడా! వీళ్ళకు మాత్రమే సాధ్యం. మామూలుగా మానవ కులం మొత్తానికీ సాధ్యం అవాల్సిన విషయం సుతిమెత్తని కొన్ని మనసులకే సాధ్యమవుతుంది.

అలా ఎందుకు...ఎలా? తెలుసుకోవటానికి వర్ణజాలాన్ని చూడండి. కళ్ళను ఆకర్షించే దాని అందాన్ని అనుభవించండి. తరువాత మీ అభిప్రాయాలు తెలియజేయండి!

 నవలను ఈక్రింది లింకుతో PDF గా డౌన్లోడ్ చేసుకుని చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.

https://drive.google.com/file/d/12bfjbuiPBG-6e4ZKrpfgE7l1WlAi-e-Y/view?usp=sharing

3) పదిహేడవ అల(పూర్తి నవల)

న్యూమరాలజీలో పదిహేడు అంకె దేవతతో సమానం అని కొందరు నమ్ముతారు. అందువలన అంకె దైవిక సత్యంతో కూడిన సందేశం ఇస్తుందని నమ్ముతారు. పదిహేడు అంకెలోని మొదటి అంకె ఒకటి 'ధర్మం' ను సూచిస్తుందని(సూర్యుడు-1) మరియు అంకె ఏడు 'రహస్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని' (కేతు-7) సూచిస్తుందని, సంఖ్యల కలయిక (పదిహేడు) శుభప్రదంగా పరిగణించబడి మరియు విజయాన్ని ఆశీర్వదించడానికి ప్రసిద్ధి చెందిందని కొందరు నమ్ముతారు. అందుకే ఈ నవలకు 'పదిహేడవ అల ' అని పేరు పెట్టాము.

భార్గవ్ విశాఖపట్నంలో పనిచేసే విజయవాడ యువకుడు. సుగంధి విశాఖపట్నం కళాశాల ఒకదాంట్లో చదువుతున్న తెనాలి అమ్మాయి. అనుకోకుండా కలుసుకున్న ఇద్దరి కలయిక ప్రేమగా మారినప్పుడు...?(టర్నింగ్ పాయింట్స్ చెప్పేస్తే కథ యొక్క ఆసక్తి తగ్గిపోతుంది)

 ప్రేమ మీదున్న నమ్మకం, జ్యోతిష్యం మీదున్న నమ్మకం ఒక దాని దారిలో ఇంకొకటి క్రాస్ చేసేటప్పుడు ఏర్పడే చిక్కులు, దాని వలన జీవితంలో ఏర్పడే దాగుడుమూతలు, తరువాత సంధర్భ కారణాల వలన భార్యా-భర్తలు అయ్యే ఇద్దరి బంధుత్వ కన్ ఫ్యూజన్స్ -- ఇవన్నీ కలిపే ఈ నవల.

దీన్ని మేము రాసినప్పుడు ముందే తీర్మానించిపెట్టుకున్న కథా అంశం నుండి కొద్దిగా వేరుబడి, మేము కథను రాయకుండా, కథ మమ్మల్ని రాయించింది ఒక సపరెట్ కథ.

చదివే మీరు ఒక తియ్యని అనుభూతిని పొందుతారు. 

 నవలను ఈక్రింది లింకుతో PDF గా డౌన్లోడ్ చేసుకుని చదివి మీ అభిప్రాయాలను పంచుకోండి.

https://drive.google.com/file/d/1VPtpq1aDXqmqgqivrD4L24vAzQw3kgUU/view?usp=sharing

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి