8, సెప్టెంబర్ 2022, గురువారం

చిక్కుముడి జీవితాలు...(సీరియల్)...(PART-5)

 

                                                                           చిక్కుముడి జీవితాలు...(సీరియల్)                                                                                                                                                              (PART-5)

బృందా యొక్క పెళ్ళి ఇంకా ఒక సంవత్సరం తరువాతే అయినా, వేరే దారిలేక ఆమెకంటే ముందు శాంతీ పెళ్ళి జరపాల్సి ఉంది. బృందా కోసం తీసుకున్న లోను, ఉంచిన నగలు ఉపయోగించి తన శక్తిమేరకు మంచిగానే పెళ్ళి జరిపాడు. అతి ముఖ్యమైన వాళ్ళను మాత్రమే పిలవటం వలన...ఎక్కువ గుంపు -- హడావిడి లేకుండా జరిగింది. హఠాత్తుగా నిర్ణయించిన పెళ్ళి పనుల వలన మురళీ బాగా అలసిపోయాడు.

ఆఫీసుకు పది రోజులు 'లీవుపెట్టున్నాడు. అక్కయ్య ఉన్నప్పుడు...చెల్లెలికి పెళ్ళా?’ అని అందరూ ప్రశ్నల వర్షం వేసి, అతన్ని గుచ్చి గుచ్చి అడగకూడదని, ఎక్కువ మాట్లాడే దూరపు బందువులను కూడా పిలవలేదు. అర్చనాని పిలుద్దామా?’ అని అనుకున్న అతను తరువాత వద్దుఅని తీర్మానించుకున్నాడు.

ఇంట్లో అనవసరమైన ప్రశ్నలు తలెత్తుతాయి. ఎందుకీ ధర్మ సంకటం?’ అని ఆలొచించాడు. ఆమెకూ అనవసరమైన ఖర్చు. ఉద్యోగం ఇప్పించాను కాబట్టి, ఎక్కువ ఖర్చు పెట్టి ఏదైనా పెద్ద గిఫ్టు కొంటుంది.

పాపం...ఆమె ఇంటి పరిస్థితికి ఆమెకు అలా ఖర్చు అయ్యేటట్టు చేయకూడదు అనే ఒకే కారణంతో ఆమెను కూడా పిలవలేదు. తిరుగుడు మూలంగా ఆమెను స్వయంగా చూడటానికో...మాట్లాడటానికో కుదరలేదు. పెళ్ళి ముగిసిన తరువాతే ఆమెను వెళ్ళి కలవాలి...ఉద్యోగం ఎలా ఉంది?’ అని అడగాలి.

పెళ్ళి అయిన మరుసటి రోజు అల్లుడ్నీ, చెల్లిని తీసుకు వెళ్ళి వాళ్ళింట్లో దింపేసి వెంటనే బయలుదేరాడు.

కొంచం స్వీట్లు, హాటూ కట్టివ్వమ్మా

వచ్చీరావటంతో ఎక్కడికిరా బయలుదేరావు?”

వచ్చేస్తాను అన్న మురళీ, తల్లి కట్టిచ్చిన ప్యాకెట్టును తీసుకుని మెట్లు దిగాడు.

రిసెప్షన్ లో అర్చనా కనబడలేదు. అక్కడున్న వేరొక అమ్మాయి దగ్గర ఆమె గురించి అడిగాడు.

ఆమెకు ఒంట్లో బాగుండలేదని రోజు లీవుపెట్టింది. రూములో ఉంటుంది

ఏమిటి ప్రాబ్లం?”

తెలియదు సార్!

అతను ఆందోళనతో ఆమె గదికి వచ్చాడు.

తలుపు తెరిచిన అర్చనా మొహం ఎర్రదనంతో వాచిపోయుంది.

ఏం జరిగింది?” -- అదే ఆందోళనతో అడిగాడు.

అతని పలకరింపుతో ఆమె కళ్ళు తట్టుకోలేకపోవటంతో, లోపలకు వచ్చి మోకాళ్ళ మధ్య మొహం దాచుకుంది.

ఏమైంది అర్చనా? చెబితేనేగా...

ఆమె చెంపల మీదున్న తడిని తుడుచుకుని తలెత్తి చూసింది.

తరువాతి సమస్య ప్రారంభమయ్యింది...

ఏమిటది?”

ఆమె ఇంటి వివరాలు కొంతవరకు తెలుసు కాబట్టి, ఏమై ఉంటుందని ఆలొచించసాగాడు.

డబ్బూ-నగలూ అన్నిటినీ తీసుకుని ఎవడితోనో ఒకడితో అక్కయ్య వెళ్ళిపోయిందని చెప్పానే?”

ఆమె కేమిటి?”

అతను బాగా అనుభవించి, డబ్బూ-నగలను ఖర్చు చేసి...ఆమెను కొట్టి తరిమేశాడట

మురళీ కళ్ళు మూసుకుని, ‘...ఒక అమ్మాయిని ఇలా కూడా మొసం చేస్తారా? ఎలా కుదురుతుంది? అక్కా-చెల్లెల్లతో పుట్టుండడో? ఇలాంటి మగవాళ్ల వలన మొత్త మగజాతికే చెడ్డపేరుఅని అనుకున్నాడు.

ఇప్పుడు అక్కయ్య ఎక్కడుంది?”

అదెక్కడికి పోతుంది? వచ్చి మా ఇంట్లోనే ఉంది. నేను తప్పు చేసేనేఅనే బాధ కొంచం కూడా లేదు. తల్లి-తండ్రి తనకి బాధ్యతగా సరైన వయసుకు పెళ్ళి చేసుంటే...నేను ఇలా నాశనం అయ్యుండేదానినా?’ అని ఆమె తప్పును కన్నవారి మీద తోస్తోంది. తండ్రి మంచంలో! అమ్మ అక్కను అణచ లేకపోతోంది. నేనూ అక్కడ లేను.

అందువలన ఇప్పుడు అక్కడ అక్కయ్య పెట్టిందే చట్టం. నేను పంపుతున్న డబ్బును అమ్మ దగ్గర నుండి తీసుకుని, తన దగ్గర ఉంచుకుని, ఆమే ఇంటి ఖర్చులకు తిరిగి ఇస్తోందట. అమ్మ ఏడుస్తూ ఉత్తరం రాసింది. ఆమె కన్నీటి బొట్లు ఉత్తరంలోని కొన్ని అక్షరాలపైన పడి అవి చెరిగిపోయిన్నాయి. అది చూసి నాకు ఏడుపు ఆగలేదు. మనసంతా ఎవరో కెలికినట్లు నొప్పి పుట్టింది. నాకేమీ అర్ధం కావటంలేదు మురళీ. అక్కను ఎలా కంట్రోల్ చేయాలి...ఏమిటి,ఎలా? అని అర్ధంకావటంలేదు.

నేను ఎంతో కొంత సంపాదిస్తున్నాను. డబ్బుతో, అమ్మనీ, నాన్ననీ చూసుకుంటూ, కలోగంజో తాగుతూ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారని చూస్తే... ప్రశాంతత ఒక నెల కూడా నిలబడలేదు.

ఆమె వెళ్ళిపోవటమో -- చెడిపోవటమో...తిరిగి రావటమో నేను తప్పు అని చెప్పలేదు. కనీసం ఇంత జరిగిన తరువాత ఇప్పుడైనా తనని మార్చుకోవచ్చు కదా? అయ్యిందేదో అయిపోయింది. ఇక తన భవిష్యత్తు ఎలా ఉండాలి అని ఆలొచించి ఒక మంచి దారి ఎన్నుకుని తన కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నించాలా, లేదా?

కానీ, అక్కయ్య తన గురించి బాధపడుతున్నట్టు తెలియటం లేదు. ఇంటి గురించి కూడా బాధపడుతున్నట్టు లేదు. విషం కక్కే అదే మాటలు, ప్రవర్తన ఇంకా ఎక్కువ అయ్యిందే తప్ప తగ్గలేదు.

నువ్వు వెంటనే వచ్చి, దాన్ని ఇంటి నుండి బయటకు పంపే దారి చూడు. ఇప్పుడు నువ్వే ఇంటికి హెడ్. సంపాదించే వాళ్ళకే మాట్లాడే హక్కు...అణిచే అధికారం ఉంది. వెంటనే ఏదైనా చేసి దాని దగ్గర నుండి మాకు విడుదల ఇప్పించుఅని అమ్మ రాసింది.

ఎందుకు మాకు మాత్రం కష్టానికి పైన కష్టం? ఎంతోమంది వయసులో... బాధలూ లేకుండా...డబ్బు, బంగళా, కారు అంటూ హాయిగా రోజులు గడుపుతున్నారు! నేను డబ్బో, బంగళానో కూడ అడగటం లేదు. ఒకటి తరువాత  మరొక సమస్య రాకుండా ఉండకూడదా?”

ఆమె ఒక విధమైన నిట్టూర్పు విడిచి ఆపింది... మురళీ కొంచం సేపు మౌనంగా పెన్నును దొర్లిస్తూ ఉన్నాడు.

ఛీఛీ...మీకున్న కష్టాలు చాలవని మా కష్టాన్ని కూడా మీ దగ్గర చెప్పి కష్టపెడుతున్నాను కదా?”

పరవాలేదు...వంద కేజీల బరువు మోస్తున్న వాడి దగ్గర ఇంకో రెండు కిలోల బరువు పెట్టినందువలన అతనికేమీ కష్టముండదు. భారం మోసేవాడికి అదేమీ పెద్ద బరువు కాదు. భోజనం చేసి కంచం కూడా తీయనివాడి దగ్గర...నెమలి ఈక ఇచ్చినా కూడా  బరువుగా ఉన్నదే! అని చెబుతాడు" -- నవ్వాడు మురళీ.

నేనేం చేయను? మా అక్కయ్యను ఎదుర్కోటానికి ఒక దారి చెప్పండి

డబ్బు విషయంలో ఖఠినంగా ఉండు. డబ్బులివ్వటానికి వెళ్ళినప్పుడు...ఇంటికి కావలసిన సరకులన్నీ నువ్వే కొనిపడేయ్. కాయగూరల దగ్గర నుండి రోజూ కావలసిన సరకులకు ఏదైనా మంచి షాపులో అకౌంటులో తీసుకోమని చెప్పి, దాన్ని కూడా నువ్వు వెళ్ళినప్పుడు సెటిల్ చేసేయి. ఇది కాకుండా మీ అక్కయ్యకు తెలియకుండా మీ అమ్మ దగ్గర అర్జెంటు ఖర్చులకు కొంచంగా డబ్బులిచ్చిరా. తన ఖర్చులకు మీ అక్కయ్య డబ్బులు అడిగితే...నువ్వే సంపాదించుకుని ఖర్చు పెట్టుకో అని చెప్పు

అతను చెప్పిన ఆలొచన బాగానే వర్క్ అవుట్అవుతుందని అనిపించింది. కష్టపడి సంపాదిస్తున్న తాను ఎందుకు...కాలుమీద కాలు వేసుకుని, ఖలీగా కూర్చున్న అక్కయ్యకు భయపడాలి? సారి ఊరు వెళ్ళినప్పుడు ఆమెను ఒక పట్టు పట్టాలిఅని నిర్ణయించుకుంది.

ధైర్యం వచ్చిందా?”

చాలా ధైర్యం వచ్చింది! అవును...మీరేమిటి ఇన్నిరోజులు మనిషే కనబడలేదు...ఎక్కడికి వెళ్ళారు?”

చెల్లెలికి సడన్ గా పెళ్ళి ఫిక్స్ అయ్యింది. దాని కోసం లీవు పెట్టాను--తల్లి ఇచ్చిన స్వీటు,హాటు ప్యాకెట్టును ఆమె ముందు జాపాడు.

పెళ్ళి అయిపోయిందా! చాలా మోసం మీరు! నన్ను పిలవలేనే లేదు

పిలవ కూడదని కాదు. కానీ నిన్ను చూసి ఎవరు?’ అని అడిగితే ఏం చెప్పి పరిచయం చేయను? మా ఇల్లు పాత పంచాగం. గబుక్కున తప్పుగా మాట్లాడేస్తారు

ఆఫీసు స్టాఫ్ అని చెప్పేయాలి?”

ఇంతే సంగతులు! మా ఆఫీసులో ఉన్న బొద్దింక దగ్గర నుండి వాళ్ళకు అందరినీ తెలుసు. కొత్తగా ఎవరైనా ఉద్యోగంలో చేరినా నా కంటే ముందు వాళ్ళకు తెలిసిపోతుంది. ఒక ఆల్ ఇండియా రేడియో స్టాఫ్...మా ఇంటి దగ్గరే ఉన్నాడు

రేడియో గాడికి...నేను మీ ఆఫీసుకు వచ్చింది, మీరు నాతో బయలుదేరి బయటకు వచ్చింది తెలియదా? అది చెప్పి ఉండడా?”

మన అదృష్టం...వాడు రోజు లీవు. మనం బ్రతికిపోయాము

సరే వదిలేయండి... ఒక చెల్లికి పెళ్ళి చేసేసారు. ఇంకా ఒక చెల్లి చదువుకుంటోంది కదా?”

చదువుకుంటున్న చెల్లికే ఇప్పుడు పెళ్ళి జరిగింది

ఆమె ఆశ్చర్యంగా చూస్తూ అప్పుడు పెద్ద చెల్లెలు?”

అదొక పెద్ద కథ! -- జరిగింది అతను క్లుప్తంగా చెప్పాడు.

ఆమె మరింత ఆశ్చర్యపోయింది.

మీ ఇల్లు పాత పంచాంగాం అన్నారు. చెల్లి యొక్క ప్రేమను మాత్రం ఎలా ఒప్పుకున్నారు?”

భయం! మొదటే అణిచి ఉండాలి. అప్పుడు వదిలేసి...ఇప్పుడు పట్టుకుంటే? అదేమో లేచిపోతాననిధైర్యంగా చెబుతోంది? పరువు, మర్యాద అంతా దాంతో పాటూ లేచిపోతే? అలా కాకుండా బలవంతం చేసి వేరే ఇంకొకడికి ఇచ్చి పెళ్ళి చేస్తే...కట్టుకున్న వాడికి ద్రోహం చేసిందంటే అది ఎవరికి అసహ్యం? అందుకే వేరే దారిలేక ఆమె ఇష్టానికి ఒప్పుకున్నాం.

ఆమెను చూడటానికి వచ్చినతని దగ్గర నిజం చెప్పాను. ఆమె పోతే పోయింది! తరువాత దానిని ఇచ్చి పెళ్ళి చేయండి అన్నాడుఅది కూడా లవ్వు-గివ్వుఅని తిరగటానికి ముందే గౌరవంగా పెళ్ళి చేసి పంపేద్దామని అమ్మ చెప్పింది. అందుకని...వెంటనే పెళ్ళి జరిపించాసాము

అల్లుడు ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళుగా ఉన్నారే...సాకు,బోకు చెప్పకుండా చిన్నదాన్ని పెళ్ళి చేసుకుంటా నన్నారే! పరవాలేదు...దేవుడు అన్ని తలుపులూ మూయడుఅని కారణం లేకుండానా చెప్పారు?...ఏది ఏమైనా...విజయవంతమైన ఒక మంచి కార్యాన్ని చేసి వచ్చారు. కంగ్రాట్స్! అన్నయ్య అంటే ఇలాగే కదా ఉండాలి? నాకూ ఒక అన్నయ్య ఉన్నాడు? మమకారం అంటే కిలో ఎంత అని ఎంక్వయరీ చేసుకుంటూ...!

ఆమె విసుక్కోగా అతను చిరు నవ్వుతో లేచాడు.

ఇదే జీవితం అర్చనా. మనం అనుకున్నది జరగదు. మనకు కావలసింది దొరకదు. దేవుడు ఆడుకునే బొమ్మలమే కదా మనం!

ఏమిటీ...వేదాంతమా?”

వేరే దారి? సరే నేను వస్తాను...చాలా టైము అయ్యింది. సమస్య వస్తే పరిష్కరించటానికి దారి ఆలొచించు. ఇలా మొహం వాచేటట్టు ఏడిస్తే సమస్య తీరుతుందా?”

ఆమె సిగ్గు పడుతూ వరాండా వరకు వచ్చి అతన్ని సాగనంపింది.

అక్కడ్నుంచి ఇంటికి వచ్చిన అతను, అక్కడ కనబడ్డ పోట్లాట చూసి ఆందోళన చెందాడు.

ఏమ్మా...ఏమైందమ్మా?”

ఏం చెప్పనురా...పెళ్ళికి చేసిన స్వీట్లను మీ నాన్న పిల్లాడి ఎందురుకుండా పెట్టుకునే తినాలా? పిల్లాడి ఆరొగ్యం గురించి ఆయనకి తెలియదా? ఆయన దగ్గర స్వీటు అడిగాడు వాడు. పోరాఅని వాడ్ని తరిమేరు. వాడు వంట గదిలోపలకు వెళ్ళి ఆశతీరా స్వీట్లు తీసుకుని తిన్నాడు

మీరందరూ ఏం చేస్తున్నారు?”

అలసటతో కొట్టిపడేసినట్టు నిద్ర పోయామురా. పిల్లాడు కళ్ళు తిరిగి కింద పడ్డ శబ్ధంతో హడావిడిగా లేచాము. అక్కయ్య వాడ్ని ఎత్తుకుని హాస్పిటల్ కు పరిగెత్తింది. పిల్లాడికి ఏమైందో?’--ఇంకా వార్త రాలేదు. ఈయన్ని వెళ్ళమని చెబితే...దీంతో చచ్చిపోనీ!అని జాలి లేకుండా చెబుతున్నారు

తల్లి మళ్ళీ ఏడుపు మొదలుపెట్ట... మురళీ కూర్చోను కూడా లేదు. అలాగే హాస్పిటల్ కు పరిగెత్తాడు.

మంచికాలం...పెద్దగా ఆపద ఏదీ లేదు. వెంటనే తెలుసుకున్నారు కాబట్టి సుగర్  లెవల్స్ నార్మల్ కు వచ్చింది.

పిల్లాడి కళ్ళకు కనబడేటట్టు ఎవరైనా స్వీట్లు ఉంచుతారా?” -- డాక్టర్ తిట్టాడు. ఎక్కువ ఫీజు తీసుకున్నాడు.

మురళీ డబ్బులిచ్చి, వాళ్ళను పిలుచుకుని బయటకు వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు. మంచివి రెండు సెట్లుకొత్త బట్టలు కొనుక్కోవాలనుకున్నాడు.

నువ్వు...సంతోషంగా ఉండటమా?’ అని చిటిక వేసి భగవంతుడు ఇలాంటి ఖర్చు పెట్టించి నవ్వుతున్నాడు. ఎవర్ని తప్పు పట్టాలి...? అక్కయ్యనా...అయ్యో పాపం అని జాలి,దయ చూపకుండా పిల్లాడి ఎదుట స్వీటు తిని, వాడికి ఆశను రేకెత్తించిన నాన్ననా? లేక, తన తలరాతనా?’

నా వల్ల నీకు ఎన్ని కష్టాలురా మురళీ? ఉపకారం చేయకపోయినా బాధపెడుతున్నాను. భర్త సరిగ్గా లేడు అనుకుంటే...బిడ్డనైనా బాగా ఉంచకూడదా దేవుడు? చిన్న వయసులోనే ఇలా నోరు కట్టుకోవలసిన ఒక వ్యాధినా ఇవ్వాలి? నాకు భయంగా ఉందిరా మురళీ. జీవితాంతం వీడ్ని నేను ఎలా కాపాడగలను?”

కాస్త ఏడవకుండా వస్తావా?” -- చిన్న విసుగుతో చెప్పాడు. ఎవరితోనూ మాట్లాడటం ఇష్టం లేక మౌనంగా ఉన్నాడు. ఏవిట్రా జీవితం ఇది?’ అని చికాకు ఏర్పడింది. మిగిలిన వాళ్ళ సమస్యలని తీర్చటంతోనే అతని జీవితం అయిపోతుందా? అతనికని చిన్న చిన్న సంతోషాలు దొరకవే దొరకవా?

ఇల్లు వచ్చింది. తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లాడ్ని తీసుకుని లోపలకి వెళ్ళింది.

ఎక్కడ నీ మొగుడు?”

ఎక్కడికెళ్ళాడో? నేను అడగలేదు!

ఏమనుకుంటున్నాడు వాడు? జాగ్రత్తగా ఉండలేడా? తండ్రి అని కూడా చూడను. ఎక్కువగా ఆట ఆడితే...నరసింహ స్వామిని కూడా పిలవను. నేనే ఆయన్ని చీల్చి చెండాడతాను...చెప్పుంచు. రాస్కల్...వచ్చి చేరాడు చూడు నాకని ఒక నాన్నగా!

మురళీ అరవగా...ఇల్లు నీశ్శబ్ధంలో సైలెంటుగా ఉంది. రాత్రికి మనిషికి నీళ్ళూ-భోజనం అని ఏదైనా పెట్టావో...నేను రాక్షసుడ్ని అవుతాను...ఇప్పుడే చెబుతున్నా

లోపలకు వెళ్ళి తలనొప్పికి హాయిగా ఉంటుందని నుదిటికి ఒక తుండు కట్టుకుని పడుకున్నాడు.

రాత్రి పది గంటల తరువాత...తండ్రి వచ్చి తలుపు కొడుతున్న శబ్ధం వినబడింది. తల్లి భయంతో చూసింది. అతని ఆదేశం కొసం ఎదురు చూస్తున్నట్టు భయపడుతూ నిలబడ్డది.

కొడుకు కళ్ళు గట్టిగా మూసుకున్నా...చెవులు వాటి పని అవి చేయటంతో...కోపంతో కళ్ళు తెరిచాడు. తండ్రి ఇంకా గట్టిగా తలుపులు బాదాడు.

మురళీ గబుక్కన లేచాడు. వేగంగా వెళ్ళి తలుపులు తెరిచాడు. అతను తలుపులు తెరిచిన వేగానికి తండ్రి తూలుడుతో నిలబడలేక జారి పడి, లేచి నిలబడ్డాడు. సారా వాసన కడుపులో తిప్పుతోంది.

ఎర్రబడ్డ చూపులతో ఆయన్ని చూసాడు.

అప్పుడే...ఈయన్ని చంపేసి జైలుకు వెడితే ఏం?’ అని వేగంగా ఏర్పడ్డ భావనను శ్రమపడి అనుచుకున్నాడు.

నువ్వూ ఒక మనిషివేనా? వయసుకు ఇలా పరువు పోయేలాగా నడుచుకోవటానికి సిగ్గుగా లేదూ?”

సిగ్గా...అలా అంటే ఏమిటి?" -- తండ్రి గొణిగాడు.

అది సరి! పందికి ఎక్కడుంటుంది సిగ్గు...పరువు? ఇదిగో చూడు. ఇదే నీకు చివరి హెచ్చరిక. సరిగ్గా ఉండేటట్టైతే ఇక్కడ ఉండు. లేకపోతే ఎక్కడకన్నా వెళ్ళి తగలడు. పిల్లలు సరిగ్గా లేరని బాధపడే తండ్రులను చూసాను. నా పరిస్థితి చూడు! తండ్రి సరిగ్గాలేడని అవస్త పడుతున్నాను. నీకు మనశ్శాక్షే లేదా? పిల్లాడి కళ్ళ ముందు స్వీటుతినడానికి నీకు మనసెలా వచ్చింది? మానవత్వమే చచ్చిపోయిందా నీలో? నీకు చేతులెత్తి దన్నం పెడతాను. ఒక లేత ప్రాణంతో ఇలా ఆటలాడకు! సరిగ్గా ఉండలేకపోతే వెళ్ళిపో. ఇక్కడ ఉన్నా...ఇక తాగేసి రాకుడదు. వచ్చినా... ఇంటి తలుపులు తెరుచుకోవు. వీధిలోనే పడుకోవాలి. బిచ్చ మడుక్కునే తినాలి...జాగ్రత్త!

మురళీ వెనక్కి తిరిగి లోపలకు వెళ్ళాడు.

ఏయ్...సన్! ఒన్ మినిట్! -- తండ్రి తాగుడు స్వరం అతన్ని ఆపింది. విసుగుతో వెనక్కి తిరిగాడు మురళీ.

నేనెందుకు తాగుతున్నానో నీకు తెలుసా? ఇంటి నుండి పంపించేస్తావా నన్ను? పంపించి చూడు. రోడ్డు మీద నిలబడి న్యాయం అడుగుతాను. ఊరంతటినీ పిలిచి కోర్టునడుపుతాను. మీ అమ్మ...మిమ్మల్ని ఎవరినీ నా వల్ల కనలేదుఅని చెబుతా. అందువలనే నేను తాగుతున్నానని చెప్ప...

తండ్రి మాట ముగించేలోపు మురళీ చేయి మెరుపులాగా ఆయన చెంప మీద పడింది. యాసిడ్ పడినట్టు చోటు ఒక్క క్షణంలో ఎర్రబడగా, ఆయన వెనక్కి వాలిపోయాడు.

తల్లి తన మొహం కప్పుకుని ఏడ్చింది.

పడిన పొజిషన్ లోనే ఆయన్ని సరసరమని లాకొచ్చి ఇంటి బయటకు తోసాడు. ఇక ఇంట్లో కాలు పెట్టావా...నరికేస్తా దరిద్రుడా. పొద్దున తలుపు తెరుస్తున్నప్పుడు, నీ కాలి మట్టి కూడా ఇక్కడ ఉండకూడదు  -- తలుపు దబేల్ మని తోసి వేసేసి లోపలకు వచ్చాడు.

కొంచం విషం కొనివ్వరా. తాగి చచ్చిపోతాను -- అమ్మ చెప్పగా...కొడుకు కోపమయ్యాడు.

అదే అన్ని సమస్యలకూ పరిష్కారమైతే... దేశంలో ఒక్క ప్రాణం కూడా మిగిలేది కాదు. నీ భర్త ఎటువంటి వాడో నీకే తెలుసు. అతను ఏదైనా వాగితే ఊరు నమ్మేస్తుందా? కాలం అమ్మాయిగా ఉంటే... పాటికి అతన్ని ఛీల్చి చెండాడేది. నువ్వేమిట్రా అంటే...విషం అడుగుతున్నావు! చచ్చిపోవాలని అనిపిస్తే మొదట మమ్మల్నందరినీ చంపేసి తరువాత నువ్వు చావు...సరేనా?”

అతను లోపలకు వెళ్ళి పడుకున్నాడు. ఎవరూ డిన్నర్ చేయలేదు. తెల్లవారి వెలుతురు వచ్చిన తరువాత, కిటికీగుండా తొంగి చూసినప్పుడు...తండ్రి వాకిట్లో కనబడలేదు!

                                                                           ***********************

రోజంతా రాలేదు. మరుసటి రోజూ మనిషి కనబడలేదు.

చెడ్డవారు లేని ఇల్లూ, దేశమూ శుభిక్షంగా ఉంటుంది. నాన్న లేని ఇల్లు ప్రశాంతంగా ఉంది. ఇక శుభిక్షంగానూ అవచ్చు. ఆయన తిరిగి రానవసరం లేదు!అని వేడుకున్నాడు.

సారా వాసన లేకుండా ఉన్నది ఇల్లు.... మురళీ సెలవులు అయిపోవటంతో ఆఫీసుకు బయలుదేరాడు.

జాగ్రత్తమ్మా! స్వీట్లన్నీ ఎందుకు? అందరికీ ఇచ్చేసి ఖాలీ చేసేయచ్చు కదా?”

నువ్వు ఒక్క ముక్క కూడా తినలేదురా! టేస్టు అయినా చూడు...ఇవ్వనా?”

వద్దు! పిల్లాడు తినకూడనది...మనింట్లో ఎవరికీ వద్దనే వద్దు. అన్నీ ఇచ్చేసేయి. మనిషి వస్తే...లోపలకు రానివ్వకు! తలుపులు తెరవకు! ఏదైనా సమస్య అయితే నాకు ఫోను చెయ్యి

బయలుదేరాడు. బస్సు పుచ్చుకున్నాడు...ఆఫీసుకు వచ్చిన అరగంట తరువాత ఫోన్ వచ్చింది.

అవతల పక్క శాంతీ స్వరం.

ఏమ్మా...బాగున్నావా?”

బాగున్నా అన్నయ్యా! మాటల్లోని నిజం ఆమె స్వరంలో లేదు.

ఏం విషయమమ్మా? అల్లుడూ...అత్తయ్యగారూ అందరూ బాగున్నారా? బాగా నడుచుకుంటున్నారా?”

వాళ్ళందరూ బాగానే ఉన్నారు. కానీ సమస్య...ఇల్లు వెతుక్కుంటూ వచ్చిందన్నయ్యా

ఏమిటమ్మా?”

నాన్న ఇక్కడకు వచ్చారు అన్నయ్యా. రెండు రోజులుగా మా ఇంట్లోనే ఉన్నారు

శాంతీ చెప్పగా...అతని మొహం మాడింది. విడిచిపోలేదా? అక్కడకు వెళ్ళి కూర్చున్నారా? అయ్యో రామా! పెళ్ళి జరిగి ఇంకా ఒక వారం కూడా పూర్తి కాలేదు. అక్కడికి వెళ్ళి గుడారం వేసుకున్నాడా? అల్లుడింట్లో వాళ్ళు ఏమనుకుంటారు? మంచి నడవడిక ఉన్నా పరవాలేదు...తాగేసి అక్కడేమన్నా గొడవపడితే, అమ్మాయికే కదా మర్యాద పోయేది?’

ఆయనేదో బెదిరిస్తూ మాట్లాడుతున్నారు అన్నయ్యా. నాకు భయంగా ఉంది. నువ్వు ఇంటి నుండి తరిమేసావుట. కన్న తండ్రిని మీ అన్నయ్య తరిమేసాడు. అందుకే ఇక్కడికి వచ్చాసాను. కొడుకు తరిమేస్తే...కూతురి ఇంటికే కదా రావాలి? వెళ్ళటానికి నాకు ఇంకో చోటు ఎక్కడుంది. నేను ఇక్కడ్నుంచి వెళ్ళాలంటే...ఇక మీదట నన్ను బయటకు తరమను అని మీ అన్నయ్య నాకు ప్రామిస్ చేసి తీసుకు వెళ్ళమని చెప్పు. లేకపోతే ఇక్కడే ఉండి నీ గొంతు కోస్తాను. మీరందరూ నాకు పుట్టలేదని మీ అత్తగారి దగ్గర చెప్పి మీ అమ్మ పరువు తీసేస్తాను అలా...ఇలా అని ఏదేదో చెబుతున్నారు. నాకేమీ అర్ధం కావటం లేదు. రెండు రోజులుగా భయంతో నేను నిద్రపోలేదు. నువ్వు రోజే ఆఫీసుకు వస్తావని తెలుసు. అందుకే ఫోన్ చేసాను. ఆయన్ని ఇక్కడ్నుంచి తీసుకు వెళ్ళు అన్నయ్యా...ప్లీజ్ -- ఏడ్చేస్తుందేమో అనిపించింది!

నేను చూసుకుంటానమ్మా...నువ్వు బాధపడకు! ఆయనతో మాట్లాడకు. సాయంత్రం వరకు ఎలాగైనా గడుపు. నేను వచ్చేస్తాను

మురళీ ఫోన్ పెట్టేసి మొహానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు. ఏం పాపం చేసి ఇలాంటి తండ్రికి పుట్టేమో తెలియటం లేదు! ఎందుకని ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు...? దేవుడు ఆయన్ని నీచుడుగానే పుట్టించాడా? కలియుగంలో రాక్షసులకు కరువు వుండకూడదని ఇలా వీళ్ళను పుట్టించాడా?’ -- ఆవేదనతో సీటులో కూర్చున్నాడు.

బయటకు పోఅని తరిమేసిన నోటితో...ఇంటికి రా అని పిలిచే పరిస్థితి, ఇంత త్వరగా ఏర్పడుతుందని నేను ఎదురు చూడలేదు. పాపం శాంతీ...చిన్న పిల్ల. ఆమె ప్రశాంతత చెడిపోనివ్వకూడదు.  ఎలాగైనా అక్కడ్నుంచి ఆయన్ని తీసుకు వచ్చేయాలి!

పదిహేను రోజులు సెలవు పెట్టినందు వలన పూర్తి చెయ్యాల్సిన పని ఎక్కువగా ఉన్నది. కానీ, చెయ్యటమే కుదరటం లేదు. తండ్రి సమస్య వలన మనసూ, శరీరం అలసిపోయింది. కష్టపడి అతి ముఖ్యమైన ఫైళ్ళను పూర్తి చేసి, సరిగ్గా ఐదింటికి స్నేహితుడి దగ్గర చెప్పి బయలుదేరాడు. రెండు బస్సులు మారి, శాంతీ ఇంటికి వచ్చాడు. హాలులోమాట్లాడుతున్న తండ్రి స్వరం...వాకిలి వరకు వినబడింది.

నేను వెళ్ళి నిలబడితే...పోలీసు స్టేషన్లో ఉన్న అందరు పోలీసులూ లేచి నిలబడి సెల్యూట్కొడతారు. నా మీద అంత మర్యాద

డప్పు వాయించాడు! తెలియని వాళ్ళు తల ఊపుతూ ఉంటారు. తెలిసిన వాళ్ళు దగ్గరకే రారు. చిల్లు పడిన రేకు డబ్బా!

మురళీ రావటం చూసిన వెంటనే... శాంతీ, వాకిటికి పరిగెత్తుకురాగా...మాటలు ఆగినై. తండ్రి తమలపాకులు నములుతూ వాకిటికి వచ్చి మురళీని ఓరకంటితో చూసి తమలపాకు రసాన్ని ఉమ్మేరు.

రండి...రండి! అని మర్యాదతో స్వాగతించింది వియ్యపురాలు. నోటిలోని పళ్ళు చూపిస్తూ స్వీట్లు నిండిన ప్లేటును జాపింది.

ఏమిటి విశేషం?”-- అడిగాడు మురళీ.

న్యాయంగా స్వీట్లు మీరు ఇవ్వాలి. మనలో మనకేమిటని...నేనే మీకు ఇస్తున్నాను

నేనివ్వాలా...అర్ధం కాలేదే?”

మరి...మీ నాన్నకు లాటరీలో పది లక్షలు వచ్చినప్పుడు, నువ్వే కదా స్వీటు ఇవ్వాలి?”......వియ్యపురాలు చెప్పగా...ఆశ్చర్యంతో చెల్లెల్ని తిరిగి చూసాడు.

అన్నయ్యకు ఇంకా విషయం తెలియదు! అత్తయ్య చెప్పేది నిజమే అన్నయ్యా...నాన్నకు కేరళ లాటరీలో పదిలక్షలు వచ్చింది

మురళీ సంతోష పడలేదు. మారుగా భయపడ్డాడు. సముద్రంలో వర్షం కురిసినందు వలన ఎవరికి ప్రయోజనం? చంపాలనుకుని తిరుగుతున్నవాడికి తుపాకీ దొరికినట్టు!  ఇది నిజమా? లేక ఆయన చెప్పే అబద్దాలలో ఇదీ ఒకటా? డబ్బులుంటేనే మర్యాదతో చూస్తారు కాబట్టి ఇలాంటి ఒక సినిమా కథ చెప్పారా?

మురళీ  దొంగ నవ్వు నవ్వాడు. నేను ఆయన్ని పిలుచుకు వెళ్ళటానికే వచ్చాను. వెళ్దామా...?”

మురళీ అడిగిన తరువాత... మురళీ తండ్రి మళ్ళీ తమలపాకుల రసాన్ని మరొకసారి ఉమ్మేసి వచ్చి, నిర్లక్ష్య దోరణిలో కొడుకును చూసారు.

తెలుసు...నువ్వు వస్తావని తెలుసు! అన్న ఆయన, వియ్యపురాలును చూసారు. రొట్టె ముక్కను చూస్తే...కాకి రాకుండానా ఉంటుందా? మీరు చెప్పండి?” అన్నారు హేళనగా.

మురళీ ముఖం మాడ్చుకున్నాడు. శాంతీ దగ్గర ఆయన బెదిరించి మాట్లాడిందో...ఆమె ఫోన్ చేస్తేనే తాను వచ్చాననో, ఆయన ఇంట్లో చేసిన గొడవనో ఎలా చెప్పగలడు? అందువలన, ఓర్పుగానే తండ్రిని మళ్ళీ ఒకసారి చూసి...వెళ్దామా?” అన్నాడు.

భోజనం చేసి వెళ్ళచ్చే తమ్ముడూ! ఏమిటి...వచ్చీ రావటంతో, కాళ్ళ మీద వేడినీళ్ళు పోసుకున్నట్టు వెంటనే వెళ్తానంటున్నారు?”

లేదండి! అక్కయ్య కొడుక్కి కొంచం ఆరోగ్యం బాగుండలేదు. త్వరగా వెళ్ళాలి

కొంచం కాఫీ అయినా తాగు నాయనా -- వియ్యపురాలు లోపలకు వెళ్ళగా... మురళీ తండ్రిని కోపంగా చూసాడు.

త్వరగా బయలుదేరు

బెదిరిస్తే నేను రాను

పిల్లను ఇచ్చిన చోటుకి వచ్చి కూర్చుని అందరి పరువూ తీయాలా? ఇక మీదట నిన్ను ఇంట్లోంచి తరమను...చాలా? త్వరగా బయలుదేరు

ఎలా వెళ్ళగొడతావు? ఇప్పుడు నేను సాధారణ మనిషిని కాను? పది లక్షలు కలిగిన లక్షాదిపతిని. డబ్బుకోసం నన్ను చుట్టి చుట్టి రావలసిందే కదా! అప్పుడు చెబుతారా నీ పని

మన పోట్లాట ఇంటి దగ్గర పెట్టుకుందాం

వియ్యపురాలు కాఫీ గ్లాసుతో రావటంతో...మాటలు ఆగినై. పది నిమిషాల్లో వాళ్ళు బయలుదేరారు.

బస్సు నేను ఎక్కను. ఆటోలోనే వస్తాను

వీధి చివర మొండిగా నిలబడ్డాడు.

లాటరీ కొట్టింది నీకు...నాకు కాదు. కావాలంటే నువ్వు ఆటోలో రా...నేను బస్సులో వస్తాను

మురళీ కూడా పట్టుదల పట్టాడు.

అయితే సరే...నువ్వెళ్ళు! నేను నా కూతురింటికి వెడతాను. అక్కడ నాకు ఎంత ఉపచరణ అనుకున్నావ్?” ఆయన వెనక్కి తిరిగి నడవటంతో, అతను వేరే దారిలేక చెయ్యి చాపి ఆటోను నిలిపాడు.

                                                                                                   Continued...PART-6

****************************************************************************************************

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి