వస్తువులను రాళ్ళుగా మార్చే బావి (మిస్టరీ)
ఇంగ్లాండ్ దేశంలోని నార్త్ యార్క్ షైర్లోని నారెస్ బరో పట్టణంలోని నిద్ నదీతీర సమీపాన ఉన్నది ఈ బావి. ఈ బావి నీరు వస్తువులను రాళ్ళుగా మారుస్తుందట. ఈ బావిలోని నీటిని ఏ వస్తువు తాకినా ఆకులు, కర్రలు, చనిపోయిన పక్షులు...ఇలా ఏది బావి నీటిని తాకినా అది కొన్ని నెలలో సహజ రాయిగా మారిపోతుందట!
అనేక శతాబ్దాలుగా అక్కడ నివసించే స్థానికులు ఆ బావి దయ్యం చేత శపించబడిన బావిగా నమ్ముతున్నారు. బావిలోని ఒకవైపు గోడ బ్రహ్మాండమైన ఒక మనిషి కపాలము రూపంలో ఉంటుంది.
కొంతమంది రోజువారీ వాడుకునే వస్తువులను ఆ నీటిలో పడేసి అవి కొన్ని రోజులకి రాళ్ళుగా రూపాంతరం చెందటాన్ని కళ్ళారా చూశారట. అలా రాళ్ళుగా మారిన కొన్ని 1800 శతాబ్దపు వస్తువులను...టోపి, ఆడవారి పర్సులు, చెప్పులు అవే రూపంలో రాళ్ళుగా మారి ఉండటం ఇప్పుడు కూడా చూడవచ్చు. ఈ మధ్య కొంతమంది ఆ బావిలోకి బొమ్మలు, కెటిల్స్, ఒక సైకిల్ పడేశారు. ఇవి కూడా రాళ్ళుగా మారి ఉండటాన్ని చూడవచ్చు.
ఈ ఆర్టికల్ ను పూర్తిగా చదవటానికి ఈ క్రింది లింకుపై క్లిక్ చేయండి:
వస్తువులను రాళ్ళుగా మార్చే బావి…(మిస్టరీ) @ కథా కాలక్షేపం
****************************************************************************************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి